ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్, సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.చిరంజీవులు కోరారు. ఈ నెల 12న మున్సిపల్, 16న పార్లమెంటు అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్ మీటింగ్‌హాల్‌లో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు, ము న్సిపల్ కమిషనర్లకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. మూడు దశల్లో సిబ్బంది శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసి కౌంటింగ్‌కు ముందు రోజు ర్యాండమైజేషన్ ద్వారా ఓట్ల లెక్కింపు విధులు కేటాయించాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు.
ఓట్ల లెక్కింపు విషయం లో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు తు.చ. తప్పక పాటించాలని, ఒక రోజు ముందుగా మాక్ కౌంటింగ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. రిట ర్నింగ్ అధికారులందరూ ఎవ్వరి నియోజకవర్గ కౌంటింగ్ ఏర్పాట్లను వారే స్వయంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. జనరేటర్, సమర్థులైన కంప్యూటర్ ఆపరేటర్లు, జీరాక్సు ఇతర మౌలిక సౌకర్యాలను, వారి ఏజెంట్లకు ఫారం 43ఎలో కౌంటింగ్ తేదీ ఇతర వివరాలు తెలుపుతూ రిటర్నింగ్ అధికారులు నోటీసు జారీ చేయాలని సూచించారు.
క్రిమినల్ నేర చరిత్ర లేని వారికి మాత్రమే పోలీసు శాఖ నుంచి నివేదికలు పొంది కౌంటింగ్ ఏజెంట్లకు పాసులు జారీ చేయాలని కోరారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు రిట ర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులకు తప్ప ఇతరులకు సెల్‌ఫోను అనుమతి లేదన్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి 12, పార్లమెంటు నియోజకవర్గానికి 12 టేబుల్స్‌తో పాటు రిటర్నింగ్ అధికారి వద్ద పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు ఒక టేబుల్ ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారని తెలిపారు.
తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, ఉయదం 8 గంటలకు ఓట్ల లెక్కింపు విధిగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కిం పులో రహస్యానికి భంగం కలుగకుండా నిబంధనల మేరకు స్క్రూటినీ చేసిన పిదపనే లెక్కింపు ప్రారంభించాలని రిటర్నింగ్ అధికారులకు సూచిం చారు.
రిసోర్సు పర్సన్, భునవగిరి ఆర్‌డీఓ భాస్కర్‌రావు ఓట్ల లెక్కింపుపై అధికారులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు. కార్యక్రమంలో జేసీ హరిజవహర్‌లాల్, ట్రైనీ ఐఎఎస్ సత్యనారాయణ, అదనపు జాయింట్ కలెక్టర్ వెంకట్రావు, ఆర్‌డీఓలు నాగన్న, శ్రీనివాస్‌రెడ్డి, రవినాయక్, జహీర్ పాల్గొన్నారు.