district election officer
-
తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్.. ఎన్నికల అధికారుల నియామకం
న్యూఢిల్లీ: తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. అదే విధంగా 33 జిల్లాలకు డిస్ట్రిక్ ఎలక్టోరల్ అధికారులను సైతం నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం హైదరాబాద్ ఎన్నికల అధికారిగా జీహెచ్ఎంసీ కమిషనర్ నియామకమయ్యారు. మిగతా 32 జిల్లాలకు కలెక్టర్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరించనున్నారు. 119 నియోజకవర్గాలకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులుగా అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, ఐటీడీఏ పీవోలు, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు, డిప్యూటీ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు వ్యవహరిస్తారని ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల్లో పేర్కొంది. చదవండి: ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ కూటమి వైపు కేజ్రీవాల్.. ఆమ్ అద్మీ వ్యూహమేంటీ? -
ఎన్నికలకు మేం రెడీ
సాక్షి, సంగారెడ్డి టౌన్: ఈ నెల 11న జరగనున్న లోక్ సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా తగిన చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ఎన్నికల విధులకు హాజరుకానున్న సిబ్బందికి శిక్షణ పూర్తయిందన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 1943 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, 202 సెక్టార్లకు గాను 202 మంది అధికారులను నియమించామని తెలిపారు. అధికారులు ఆయా సెక్టార్లలో ఉన్న పోలింగ్ స్టేషన్లను పరిశీలించారని, వారికి పూర్తి స్థాయిలో విషయ పరిజ్ఞానం ఉన్నదన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 129 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, అందుకు పకడ్బందీగా పోలీస్ సిబ్బందిని నియమించామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఏడు మోడల్ పోలింగ్ స్టేషన్లను, కేవలం మహిళలతో నడపబడే 7 సఖి పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, వీఎస్టీ, వీవీటి,ఏ ఈఓ బృందాలను నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏడు నియమించామని తెలిపారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలకు 8471 సిబ్బందిని ఏర్పాటు చేశామని అన్నారు. కావాల్సిన సిబ్బంది కంటే అదనంగా పదిశాతం ఉన్నారని తెలిపారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఏడు సెంటర్లను పోలింగ్ మెటీరియల్ పంపిణీ, స్వీకరణకు గాను ఏర్పాటుచేశామన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో... జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 14 లక్షల 97వేల 996 మంది ఓటర్లు ఉండగా 7 లక్షల 37వేల 479మంది పురుషులు, 7 లక్షల 60 వేల456 మంది మహిళలు, 61 మంది ఇతరుల ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. ఇందులో అందోల్ నియోజకవర్గం పరిధిలో ఎక్కువ ఓటర్లు, అతితక్కువగా బాన్స్వాడ ఓటర్లు ఉన్నారని అన్నారు. మొత్తంగా 23 వేలమంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. 12 మంది అభ్యర్థులు ఎన్నికల బారిలో ఉండగా 13వ స్థానంలో నోటా ఉన్నట్లు తెలిపారు సంగారెడ్డి జిల్లాలో మొత్తం 12 లక్షల 7 వేల 118 మంది ఓటర్లు ఉండగా 6 లక్షల 11 వేల 4 మంది పురుషులు, 5 లక్షల 96 వేల79 మంది మహిళలు, 35 మంది ఇతరులు ఓటర్లుగా ఉన్నట్లు చెప్పారు. నూతనంగా వీవీప్యాట్ల స్థితిగతులను తెలిపే దృశ్య పరికరం (వీఎస్‌డీయూ)ను పోలింగ్ బూత్‌లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ‘నా ఓటు’ యాప్ ఫ్రెండ్లీగా ఉందని దీనిలో ఓటరు హెల్ప్ లైన్, ఎన్నికల షెడ్యూల్ తదితర అన్ని వివరాలు ఉంటాయని ఏ యాప్‌ను ఓటర్లు వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ అయ్యాక జహీరాబాద్ పార్లమెంట్ కు చెందిన ఈవీఎంలు గీతం క్యాంపస్ కు చేరుతాయని, మే 23న జరిగే ఓట్ల లెక్కింపు కూడా అక్కడే ఉంటుందని అన్నారు. ఇప్పటివరకు మెదక్ పార్లమెంటులోని పటాన్చెరు, సంగారెడ్డి నియోజవర్గాలలో రూ.2,97,700 నగదును సీజ్ చేశామని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 11 న జరగబోయే పోలింగ్ సందర్భంగా రెండు కంపెనీల సీఐఎస్ఎఫ్, మూడు కంపెనీల గోవా పోలీస్, కర్ణాటక నుండి 300 హోమ్ గార్డులు రానున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ఇతర విభగాల ఫోర్స్ రానున్నదని, అవసరమైతే మాజీ సైనిక ఉద్యోగులను, ఎన్సీసీ విద్యార్థుల సేవలను తీసుకోవడానికి అనుమతి ఉన్నందున ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఎవరైనా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘుస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదుకాలేదన్నారు. -
కోడ్ ఉల్లంఘనపై విచారణకు ఈసీ ఆదేశం
సాక్షి, కామారెడ్డి: ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఈసీ విచారణకు ఆదేశించింది. డ్వాక్రా సంఘాలకు రూ.5 లక్షలు ఇస్తానంటూ రవీందర్‌రెడ్డి మాట్లాడిన వీడియో ఫుటేజీల ఆధారంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరిపి నివేదిక పంపిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యనారాయణ ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. కాగా, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డ్వాక్రా సంఘాలకు రూ. 5 లక్షలు ఇస్తానంటూ వాగ్దానం చేయడంపై కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి సురేందర్ తదితరులు శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. వీడియో ఫుటేజీని జతచేశారు. -
ఆన్‌లైన్‌లోనూ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు
* డిసెంబర్ 16 వరకు అవకాశం * ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు హన్మకొండ అర్బన్ : వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి కొత్తగా ఓటరుగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కిషన్ తెలిపారు. అర్హులైన పట్టభద్రులు డిసెంబర్ 16వ తేదీలోగా ఓట ర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయొచ్చని ఆయన తెలిపారు. కాగా, 2008 ఎమ్మెల్సీ ఓటర్ల జా బితాలో పేరు ఉన్నవారు ప్రస్తుతం తమ ఓటరు గుర్తింపు కార్డు వివరాలు అందజేస్తే సరిపోతుందని కలెక్టర్ కిషన్ వివరించారు. ఆన్లైన్ దరఖాస్తు ఇలా.. http://ceotelangana.nic.in వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. అక్కడ ఈ-రిజిస్ట్రేషన్‌ను క్లిక్ చేయాలి. అందులో ఫారం-18ని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత వరంగల్, ఖమ్మం, నల్ల గొండ నియోజకవర్గం.. ఆపై జిల్లాను ఎంపిక చేసుకోవాలి. ఫారంలోని అన్ని వివరాలను ఇంగ్లిష్‌లో పూర్తి చేయాలి. అయితే, స్టార్ గుర్తు ఉన్న కాలమ్స్ తప్పనిసరిగా నింపాలి. వివరాలు నింపడం పూర్తయ్యాక ట్రాన్స్‌లేట్ బటన్ నొక్కితే తెలుగులో సమాచారం కనిపిస్తుంది. అప్పుడు అక్షరదోషాలు ఏమైనా ఉంటే సరిచేసుకోవచ్చు. ఇక స్కాన్ చేసిన, 100కేబీ సైజ్ కంటే తక్కువగా ఉన్న కలర్ పాస్‌పోర్టు సైజ్ ఫొటోతో పాటు అటెస్టెడ్ చేయించిన అర్హత పత్రాలను అప్లోడ్ చేసి సేవ్ బటన్ నొక్కాలి. అప్పుడు కనిపించిన అప్లికేషన్ ఐడీ నంబర్‌ను తదుపరి అవసరాల కోసం గుర్తుం చుకోవాలి. కాగా, ఇప్పటికే పట్టభద్ర ఓటరుగా నమోదై ఉంటే http//: ceoaperms.ap. gov.in వెబ్సైట్లోకి వెళ్లి వివరాలు చూసుకోవచ్చు. ఇక ఆన్లైన్లో కాకుండా మండల తహసీల్దార్ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాల్లో కూ డా ఓటరు నమోదు ఫారం పొంది పూర్తి చేసి జిరాక్స్ ప్రతులు, ఫొటో జతచేసి అందజేయవ చ్చు. అలాగే, జాబితాలో సవరణలు, తొల గింపు కోసం ఫారం-7, ఫారం-8, 8(ఏ) అం దజేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఓటరు జాబి తాలో పేరు ఉన్న వారు ఓటరు గుర్తింపు కార్డు వివరాలను అందజేస్తే సరిపోతుంది. కా ర్డు లేకపోతే ఫొటో, నివాస ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. అర్హతలివే... పట్టభద్రుల ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు కోసం ఉండాల్సిన అర్హతలను ఎన్నికల కమిషన్ వెల్లడించారు. పేరు నమోదుకు 31-10-2011కు ముందు దేశంలోని ఏదైనా విశ్వ విద్యాలయంలో పట్టభద్రులై ఉండాలి. డిగ్రీకి తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన ఉన్న వారు కూడా అర్హులే. అయితే, ఏ నియోజకవర్గంలో పేరు నమోదు చేసుకోవాలంటున్నారో ఆ పరిధిలో నివాసి అయి ఉండాలి. ఈ మేరకు అర్హతలు ఉన్న వారు ఫారం-18 పూర్తి చేసి పట్టభద్ర ధ్రువీకరణ పత్రాలు, సాధారణ ఓటర్ల గుర్తిం పు కార్డు జత చేసిన దరఖాస్తులను ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాయాల్లో అందజేయాలి. ఫొటో గుర్తింపు కార్డు లేని వారు పాస్‌పోర్టు సైజ్ ఫొటోతో పాటు నివాస ధ్రువీకరణ పత్రం అందజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు పట్ట భద్రులు ఓటర్ల జాబితాలో తమ పేరు నమో దు చేసుకుని రానున్న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. -
ఓట్ల లెక్కింపునకు 1320 మంది
- 14న సిబ్బందికి శిక్షణ చిత్తూరు(జిల్లాపరిషత్)న్యూస్‌లైన్: జిల్లాలో ఈనెల 7వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా కేంద్రం చిత్తూరులో మూడు కాలేజీల్లో ఓట్లను లెక్కిస్తారు. ఇందుకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కే.రాంగోపాల్ సారథ్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, మూడు (రాజంపేట, చిత్తూరు, తిరుపతి) లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల లెక్కింపునకు అవసరమైన సిబ్బంది ఎంపికను పూర్తి చేశారు. దీనికి గాను జిల్లాలో 1320 మంది సిబ్బందిని ఓట్ల లెక్కింపు విధులకు ఎంపిక చేశారు. మూడు లోక్‌సభ స్థానాల పరిధిలో పోలైన అసెంబ్లీ, లోక్‌సభ ఓట్ల లెక్కింపునకు మొత్తం 364 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మూడు చోట్ల ఓట్ల లెక్కింపు జిల్లాలోని చిత్తూరు, రాజంపేట, తిరుపతి లోక్‌సభ పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును చిత్తూరులోని శ్రీనివాస ఇన్స్టిట్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీటమ్స్), ఒకే క్యాంపస్‌లో ఉన్న ఎస్వీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ, ఆర్కేఎం లా కాలేజీలో నిర్వహించనున్నారు. శ్రీవేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టె క్నాలజీలో తంబళ్లపల్లె, శ్రీకాళహస్తి, సత్యవేడు, చిత్తూ రు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను లెక్కిస్తారు. ఆర్కేఎం లా కాలేజ్ క్యాంపస్‌లో పీలేరు, మదనపల్లె, పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్లు లెక్కిస్తారు. ఇందుకు గాను అసెంబ్లీకి 86 టేబుళ్లు, లోక్‌సభకు పోలైన ఓట్ల లెక్కింపునకు 86 టేబుళ్లు ఏర్పాటు చేశారు.చిత్తూరులోని శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల జీ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ (సీటమ్స్)లో చిత్తూరు, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని చంద్రగిరి, నగరి, జీడీనెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పంతో పాటు, తిరుపతి అసెంబ్లీ ఓట్లను లెక్కిస్తారు. ఈ కేంద్రంలో అసెంబ్లీ కౌంటింగ్‌కు 98 టేబుళ్లు, లోక్‌సభకు 94 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 1320 మంది ఉద్యోగులను ఉపయోగించనున్నారు. 14న శిక్షణ జిల్లాలో 16వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎంపిక చేసిన కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ సహాయకులు, సూక్ష్మపరిశీలకులకు బుధవారం చిత్తూరులోని మహతి ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కే.రాంగోపాల్ తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియకు ఎంపికైన సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, సిబ్బంది అందరూ సకాలంలో ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన కోరారు -
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్, సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.చిరంజీవులు కోరారు. ఈ నెల 12న మున్సిపల్, 16న పార్లమెంటు అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్ మీటింగ్‌హాల్‌లో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు, ము న్సిపల్ కమిషనర్లకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. మూడు దశల్లో సిబ్బంది శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసి కౌంటింగ్‌కు ముందు రోజు ర్యాండమైజేషన్ ద్వారా ఓట్ల లెక్కింపు విధులు కేటాయించాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ఓట్ల లెక్కింపు విషయం లో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు తు.చ. తప్పక పాటించాలని, ఒక రోజు ముందుగా మాక్ కౌంటింగ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. రిట ర్నింగ్ అధికారులందరూ ఎవ్వరి నియోజకవర్గ కౌంటింగ్ ఏర్పాట్లను వారే స్వయంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. జనరేటర్, సమర్థులైన కంప్యూటర్ ఆపరేటర్లు, జీరాక్సు ఇతర మౌలిక సౌకర్యాలను, వారి ఏజెంట్లకు ఫారం 43ఎలో కౌంటింగ్ తేదీ ఇతర వివరాలు తెలుపుతూ రిటర్నింగ్ అధికారులు నోటీసు జారీ చేయాలని సూచించారు. క్రిమినల్ నేర చరిత్ర లేని వారికి మాత్రమే పోలీసు శాఖ నుంచి నివేదికలు పొంది కౌంటింగ్ ఏజెంట్లకు పాసులు జారీ చేయాలని కోరారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు రిట ర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులకు తప్ప ఇతరులకు సెల్‌ఫోను అనుమతి లేదన్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి 12, పార్లమెంటు నియోజకవర్గానికి 12 టేబుల్స్‌తో పాటు రిటర్నింగ్ అధికారి వద్ద పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు ఒక టేబుల్ ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారని తెలిపారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, ఉయదం 8 గంటలకు ఓట్ల లెక్కింపు విధిగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కిం పులో రహస్యానికి భంగం కలుగకుండా నిబంధనల మేరకు స్క్రూటినీ చేసిన పిదపనే లెక్కింపు ప్రారంభించాలని రిటర్నింగ్ అధికారులకు సూచిం చారు. రిసోర్సు పర్సన్, భునవగిరి ఆర్డీఓ భాస్కర్‌రావు ఓట్ల లెక్కింపుపై అధికారులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు. కార్యక్రమంలో జేసీ హరిజవహర్‌లాల్, ట్రైనీ ఐఎఎస్ సత్యనారాయణ, అదనపు జాయింట్ కలెక్టర్ వెంకట్రావు, ఆర్డీఓలు నాగన్న, శ్రీనివాస్‌రెడ్డి, రవినాయక్, జహీర్ పాల్గొన్నారు.