* డిసెంబర్ 16 వరకు అవకాశం
* ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు
హన్మకొండ అర్బన్ : వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి కొత్తగా ఓటరుగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కిషన్ తెలిపారు. అర్హులైన పట్టభద్రులు డిసెంబర్ 16వ తేదీలోగా ఓట ర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయొచ్చని ఆయన తెలిపారు. కాగా, 2008 ఎమ్మెల్సీ ఓటర్ల జా బితాలో పేరు ఉన్నవారు ప్రస్తుతం తమ ఓటరు గుర్తింపు కార్డు వివరాలు అందజేస్తే సరిపోతుందని కలెక్టర్ కిషన్ వివరించారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ఇలా..
http://ceotelangana.nic.in వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. అక్కడ ఈ-రిజిస్ట్రేషన్‌ను క్లిక్ చేయాలి. అందులో ఫారం-18ని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత వరంగల్, ఖమ్మం, నల్ల గొండ నియోజకవర్గం.. ఆపై జిల్లాను ఎంపిక చేసుకోవాలి. ఫారంలోని అన్ని వివరాలను ఇంగ్లిష్‌లో పూర్తి చేయాలి. అయితే, స్టార్ గుర్తు ఉన్న కాలమ్స్ తప్పనిసరిగా నింపాలి. వివరాలు నింపడం పూర్తయ్యాక ట్రాన్స్‌లేట్ బటన్ నొక్కితే తెలుగులో సమాచారం కనిపిస్తుంది. అప్పుడు అక్షరదోషాలు ఏమైనా ఉంటే సరిచేసుకోవచ్చు. ఇక స్కాన్ చేసిన, 100కేబీ సైజ్ కంటే తక్కువగా ఉన్న కలర్ పాస్‌పోర్టు సైజ్ ఫొటోతో పాటు అటెస్టెడ్ చేయించిన అర్హత పత్రాలను అప్‌లోడ్ చేసి సేవ్ బటన్ నొక్కాలి.
అప్పుడు కనిపించిన అప్లికేషన్ ఐడీ నంబర్‌ను తదుపరి అవసరాల కోసం గుర్తుం చుకోవాలి. కాగా, ఇప్పటికే పట్టభద్ర ఓటరుగా నమోదై ఉంటే http//: ceoaperms.ap. gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి వివరాలు చూసుకోవచ్చు. ఇక ఆన్‌లైన్‌లో కాకుండా మండల తహసీల్దార్ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాల్లో కూ డా ఓటరు నమోదు ఫారం పొంది పూర్తి చేసి జిరాక్స్ ప్రతులు, ఫొటో జతచేసి అందజేయవ చ్చు. అలాగే, జాబితాలో సవరణలు, తొల గింపు కోసం ఫారం-7, ఫారం-8, 8(ఏ) అం దజేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఓటరు జాబి తాలో పేరు ఉన్న వారు ఓటరు గుర్తింపు కార్డు వివరాలను అందజేస్తే సరిపోతుంది. కా ర్డు లేకపోతే ఫొటో, నివాస ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది.
అర్హతలివే...
పట్టభద్రుల ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు కోసం ఉండాల్సిన అర్హతలను ఎన్నికల కమిషన్ వెల్లడించారు. పేరు నమోదుకు 31-10-2011కు ముందు దేశంలోని ఏదైనా విశ్వ విద్యాలయంలో పట్టభద్రులై ఉండాలి. డిగ్రీకి తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన ఉన్న వారు కూడా అర్హులే. అయితే, ఏ నియోజకవర్గంలో పేరు నమోదు చేసుకోవాలంటున్నారో ఆ పరిధిలో నివాసి అయి ఉండాలి.
ఈ మేరకు అర్హతలు ఉన్న వారు ఫారం-18 పూర్తి చేసి పట్టభద్ర ధ్రువీకరణ పత్రాలు, సాధారణ ఓటర్ల గుర్తిం పు కార్డు జత చేసిన దరఖాస్తులను ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాయాల్లో అందజేయాలి. ఫొటో గుర్తింపు కార్డు లేని వారు పాస్‌పోర్టు సైజ్ ఫొటోతో పాటు నివాస ధ్రువీకరణ పత్రం అందజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు పట్ట భద్రులు ఓటర్ల జాబితాలో తమ పేరు నమో దు చేసుకుని రానున్న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
ఆన్‌లైన్‌లోనూ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు
Published Thu, Nov 27 2014 2:07 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement