గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: వచ్చే నెల 7వ తేదీన జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను గురువారం ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు సారధ్యంలో యూటీఎఫ్ ప్రతినిధి బృందం కలెక్టరేట్‌లో కలెక్టర్ సురేశ్‌కుమార్ వివరించింది.
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడంలో ఉపాధ్యాయులకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించింది. వికలాంగులు, బాలింతలు, అనారోగ్యంతో ఉన్నవారికి ఎన్నికల విధుల నుంచి వెసులుబాటు కల్పించాలని కోరింది. 7వ తేదీ రాత్రి పోలింగ్ కేంద్రం నుంచి ఇళ్లకు వెళ్లేందుకు ప్రత్యేక ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేసింది.
స్పందించిన కలెక్టర్ ఎన్నికల శిక్షణ కేంద్రంతో పాటు, ఓటరుగా ఉన్న నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నుంచి పోస్టల్ బ్యాలెట్ పొంది ఓటు హక్కు వినియోగించుకోవచ్చని సూచించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎన్.తాండవకృష్ణ, జిల్లా అధ్యక్షుడు జి.ప్రభుదాసు, ప్రధాన కార్యదర్శి ఎం. హనుమంతరావు తదితరులున్నారు.
కలెక్టర్ దృష్టికి ఎన్నికల సిబ్బంది సమస్యలు
Published Fri, Apr 25 2014 1:41 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement