సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు అనంతపురం జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ లోకేష్‌కుమార్ తెలిపారు.
అనంతపురం: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు అనంతపురం జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ లోకేష్‌కుమార్ తెలిపారు. రాప్తాడు, మడకశిర, పుట్టపర్తి అసెంబ్లీ స్థానాలకు 16 రౌండ్ల కౌంటింగ్ ఉంటుందన్నారు. ఉరవకొండ, అనంతపురం, కల్యాణదుర్గం, హిందూపురం అసెంబ్లీ స్థానాలకు 7 రౌండ్ల కౌంటింగ్ ఉంటుందని వెల్లడించారు.
రాయదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి, పెనుకొండ స్థానాలకు 18 రౌండ్ల కౌంటింగ్ ఉంటుందన్నారు. సింగనమల, ధర్మవరం, కదిరి అసెంబ్లీ స్థానాలకు 19 రౌండ్ల కౌంటింగ్ ఉంటుందని లోకేష్‌కుమార్ తెలిపారు.