జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎన్నికల పరిశీలకులకు విధుల్లో సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ లైజన్ అధికారులకు సూచించారు. శనివారం రెవెన్యూ సమావేశ హాల్‌లో లైజన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల పరిశీలకులు షెడ్యూల్ ఆధారంగా లైజన్ అధికారులు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఇక పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు లెజైన్ అధికారులు సిబ్బంది వెంట ఉండి విధులు నిర్వర్తించాలని సూచించారు.
అలాగే నియోజకవర్గాల సమాచారం, ఓటర్ల సమాచారంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇక ఎన్నికల అధికారుల సెల్‌ఫోన్ నెంబర్లను తమ వద్ద ఉంచుకోవాలని, దీంతోపాటు, నిబంధనలను, ప్రవర్తనా నియమావళిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలన్నారు. పరిశీలకుల టూర్ ప్రోగ్రాంను ఎలాంటి గందరగోళం లేకుండా పారదర్శకంగా నిర్వహించుకొనేలా చూడాలన్నారు. ఇక నుంచి పరిశీలకుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు చేరవేయాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించకుండా, మెలకువలు పాటించాలని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జేసీ శర్మన్, డీఆర్‌ఓ రాంకిషన్, ట్రైనీ కలెక్టర్ విజయరామరాజులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించండి
ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించే మున్సిపల్ ఎన్నిక ల్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నిక ల సందర్బంగా శనివారం మున్సిపల్ కార్యాలయంలో ఈ వీఎంలు, ఇతర సామగ్రిని అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికలను నిర్వహించి, సజావుగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్క రూ కృషి చేయాలన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 8 మున్సిపాలిటీల్లో ఎన్నికలు పూర్తయ్యాక ఈవీఎంలను భద్రం పరిచేందుకు స్ట్రాంగ్ రూంలు పకడ్బందీగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఇక వాటిని చేరవేసే టప్పుడు, కట్టుదిట్టమైన భద్రతల మధ్య చేర్చాల్సిందిగా కలెక్టర్ వారికి సూచించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో రెండు వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, ఎవరైనా విధులకు గైర్జాజరైతే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, శిక్షణా కలెక్టర్ విజయ రామరాజు, తదితరులు పాల్గొన్నారు.