M. Girijasankar
-
లక్కీ.. కిక్కు!
మద్యం దుకాణాలకు ‘లెసైన్స్’ 9 షాపుల దక్కించుకున్న మహిళలు ఎక్సైజ్‌శాఖకు రూ.67.90కోట్ల ఆదాయం మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: కొత్తరాష్ట్రంలో కొత్త మద్యం లెసైన్స్‌లు ఖరారయ్యాయి. వచ్చే ఏడాదికి మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి సోమవారం స్థానిక అంబేద్కర్ కళాభవన్‌లో కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ఆధ్వర్యంలో లక్కీడిప్ ద్వారా కేటాయించారు. జిల్లాలో సింగిల్‌టెండర్ వేసిన 13 షాపులను మొదట కేటాయించారు. ఏజేసీ రాజారాం గెజిట్‌లో ఒకటో నం.1షాపును అమరేందర్‌రెడ్డికి కేటాయించారు. డిప్యూటీ కమిషనర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో మద్యంషాపుల కేటాయింపుకు లక్కీడిప్ నిర్వహించారు. గద్వాల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ ఎక్సైజ్ డివిజన్లకు వేర్వేరుగా కౌంటర్లను ఏర్పాటుచేశారు. జిల్లా నలుమూలల నుంచి దరఖాస్తుదారులు, వారి మద్దతుదారులు పెద్దఎత్తున అంబేద్కర్ కళాభవన్‌కు తరలొచ్చారు. ఎ లాంటి అవాంఛనీ య సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టిభద్ర త ఏర్పాటుచేశారు. సుమారు 400 మం ది ఎక్సైజ్ సిబ్బంది, 80మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పోలీసులు పాస్‌లు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. డీపీఓ రవీందర్ నాగర్‌కర్నూల్ కౌంటర్ వద్ద, గద్వాల్ కౌంటర్ వద్ద డీఆర్ఓ రాంకిషన్, మహబూబ్‌నగర్ కౌంటర్ వద్ద ఏజేసీ రాజారాం, డిప్యూటీ కమిషనర్ గోపాలకృష్ణ లక్కీడిప్ నిర్వహించారు. ఈ ఏర్పాట్లను మహబూబ్‌నగర్ ఈఎస్ చంద్రయ్య, నాగర్‌కర్నూల్ ఈఎస్ శ్రీనివాస్‌రెడ్డి, గద్వాల ఈఎస్ జనార్ధన్‌రెడ్డిలతో పాటు సీఐలు సాగర్నందన్రెడ్డి, ఎస్ఐ భీంరెడ్డి రాంరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సర్కారుకు రూ.22.63కోట్ల ఆదాయం జిల్లాలో 1928 దరఖాస్తులకు రూ.4.82కోట్ల ఆదాయం ఎక్సైజ్‌శాఖకు వచ్చింది. షాపులు దక్కించుకున్నవారి నుంచి దరావత్తులో 3వ వంతు రూపేణా ఒకేరోజులో రూ.22.63కోట్ల ఫీజు వసూలైంది. జిల్లాలోని 194 మద్యం దుకాణాలకు 1928 దరఖాస్తులొచ్చాయి. మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలోని 68 షాపులకు 668, నాగర్‌కర్నూల్ డివిజన్ పరిధిలో 58 దుకాణాలకు 577, గద్వాల డివిజన్లోని 68 షాపులకు 663 దరఖాస్తు చేసుకున్నారు. లక్కీడిప్ ద్వారా ఎంపికైన వారికి దుకాణాలు కేటాయించారు. స్లాబ్‌ల వారీగా ఆదాయం మూడుస్లాబ్ విధానంలో లెసైన్స్‌ఫీజు నిర్ణయించారు. 10వేల జనాభా ఉన్న చోట రూ.32.50లక్షలుగా నిర్ణయించారు. దీనికింద 73షాపులకు రూ.23.72కోట్ల ఆదాయం సమకూరింది. 10వేల నుంచి 50వేల జనాభా ఉన్నచోట రూ.34లక్షలుగా నిర్ణయించారు. ఈ స్లాబ్‌లో 83 షాపులకు రూ.28.22కోట్లు వచ్చాయి. 50వేల నుంచి మూడులక్షల జనాభా ఉన్న చోట రూ.42లక్షలుగా నిర్ణయించారు. ఈ విధానంలో 38 షాపులకు రూ.15.96కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. స్లాబ్‌ల వారీగా మొత్తం రూ.67.97కోట్ల ఆదాయం ఎక్సైజ్‌శాఖకు అందనుంది. మహిళలకు ఆ 9 దుకాణాలు అన్నిరంగాల్లో దూసుకుపోతున్న మహిళలు పురుషులకు తామేమీ తీసిపోమని మద్యం దుకాణాలను సైతం దక్కించుకున్నారు. జిల్లాలో 9 మంది మహిళలు వీటిని చేజిక్కించుకున్నారు. వీరిలో కల్వకుర్తికి చెందిన రాజేశ్వరి, ప్రసాద్ దంపతులు రెండు మద్యం షాపులను దక్కించుకున్నారు. నాగర్‌కర్నూల్‌లో ఇద్దరు మహిళలకు, మహబూబ్‌నగర్‌లో ఒక్కరికి, గద్వాలలో ఆరుగురు మహిళలు మద్యం దుకాణాలను దక్కించుకున్న వారిలో ఉన్నారు. -
జూపల్లి 119 కేంద్రంలో రేపు రీ పోలింగ్
మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ పాలమూరు, మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం జూపల్లి గ్రామంలోని 119వ పోలింగ్ కేంద్రంలో ఈనెల 19న రీ పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశించిందని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ శనివారం వెల్లడించారు. ఈవీఎంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఓట్ల లెక్కింపు ఆగిపోయిది. ఇందుకుగాను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 19న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 119వ పోలింగ్ కేంద్రం పరిధిలో రీ పోలింగ్ నిర్వహించనున్నారు. మొరాయించిన ఈవీఎంను పరిశీలించి తగిన చర్యలు చేపట్టేందుకు ఈసీఐఎల్‌కు చెందిన సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ జెడ్.ఎ.ఖాన్, సీనియర్ ఇంజనీర్లు జైశ్వాల్ జిల్లా కేంద్రానికి వచ్చి కేంద్ర ఎన్నికల పరిశీలకుడు ప్రవీణ్‌కుమార్ టోపో, కల్వకుర్తి నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్థులు వంశీచందర్‌రెడ్డి, టి.ఆచారి సమక్షంలో ఈవీఎంను పరిశీలించారు. ఈ విషయంలో పోలైన ఓట్లకు బదులు ఎర్రర్ చూపిస్తున్నందున విషయాన్ని ఎన్నికల సంఘానికి నివేదించారు. దాన్ని పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం రీపోలింగ్ జరపాలని నిర్ణయించింది. కాగా, ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు నుండి అక్కడ ఎలాంటి ప్రచారం చేయకూడదు. దీంతో ఆ పోలింగ్ కేంద్రం పరిధిలో స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలను, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను, కేంద్ర ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పోలింగు కేంద్ర వివరాలు స్టేషన్ నెం: 119, జూపల్లి గ్రామం పోలింగు నిర్వహించాల్సిన ఓట్లు : 633 ప్రస్తుత ఆధిక్యం: వంశీచందర్ రెడ్డి (కాంగ్రెస్) -వచ్చిన ఓట్లు 42,229 - ఆధిక్యం 32 ఓట్లు ద్వితీయ స్థానం: టి.ఆచారి (బీజేపీ) - 42,197 తృతీయ స్థానం: జైపాల్‌యాదవ్ ( టీఆర్ఎస్)- 29,687 -
నేరుగా ఓటర్‌కే స్లిప్పులు
కలెక్టరేట్, న్యూస్‌లైన్: కొత్తగా జారీచేసిన స్లిప్పులను బూత్లెవల్లో నేరుగా ఓటర్ ఇంటికెళ్లి వారికే అందజేయాలని, లేనిపక్షంలో సంబంధిత వారిపై కఠినచర్యలు తప్పవని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ హెచ్చరించారు. సోమవారం రాత్రి ఆయన సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన మునిసిపల్, స్థానిక ఎన్నికల్లో మీ నిర్లక్ష్యం కారణంగా 50 శాతం కూడా ఓటర్ స్లిప్పులు అందలేదన్నారు. పైగా బూత్ పరిధిలోని ఓ నాయకుడికి వాటిని అప్పగించడంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయని, ఈ సందర్భంగా వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓటింగ్‌శాతం పెంచేందుకే.. ప్రతిసారి ఎన్నికల్లో గుర్తింపు కార్డుల్లేని కారణంగా ఓటింగ్‌శాతం తగ్గుతుందనే కారణంతో ఈసారి ఓటర్‌స్లిప్పులను గుర్తింపుకార్డులుగా పరిగణించారని అన్నారు. పంపిణీ కాని ఓటరు చీటీల కోసం ఈనెల 29, 30న సంబంధిత పోలింగ్ కేంద్రం వద్ద హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటుచేసి పంపిణీ చేయాలని సూచించారు. గైర్హాజరైతే క్షమించం మొదటిరోజు అన్ని నియోజకవర్గాల్లో ఇచ్చిన శిక్షణకు 10శాతం సిబ్బంది గైర్హాజరయ్యారని, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించబోమన్నారు. ఎన్నికల సిబ్బంది డిఆర్వో అనుమతితోనే వెళ్లాలని, అలా కాకుండా గైర్హాజరైతే ఎన్నికల నిబంధనల ప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేసీ ఎల్.శర్మన్, డీఆర్వో రాంకిషన్, డ్వామా పీడీ హరితతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సార్వత్రికానికి’ రెడీ
పార్లమెంట్, అసెంబ్లీ సాధారణ ఎన్నికల్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎం.గిరిజాశంకర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం స్థానిక రెవెన్యూ సమావేశపు మందిరంలో సాధారణ ఎన్నికలపై అఖిల పక్ష నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికల్ని సమర్థంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లనూ సిద్దం చేసుకొని ఎన్నికలకు రెడీగా ఉన్నట్లు వెల్లండించారు. ఇక రాజకీయ పార్టీలు కానీ అభ్యర్థులు ర్యాలీలు, సమావేశాలు నిర్వహించుకోవాలంటే ముందస్తు అనుమతు తప్పనిసరన్నారు. లేకుంటే ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తప్పవన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థి వెంట మూడు వాహనాలకే అనుమతిస్తామనీ, కాన్వాయ్ పది వాహనాలకు మించరాదన్నారు. నామినేషన్ కేంద్రానికి వంద మీటర్ల దూరంలోనే ర్యాలీలు నిలిపి లోపలికి అభ్యర్థి వెంట ఐదుగురిని మాత్రమే అనుమతిస్తామన్నారు. నేడు నోటిఫికేషన్.. పార్లమెంట్, సాధారణ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 2న నోటిఫికేషన్‌ను విడుదలవుతుందనీ, అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ చేపడతామన్నారు. ఇది ఈనెల 9వరకు ఉంటుందన్నారు. అయితే మధ్యలో 5, 6, 8 తేదీల్లో ప్రభుత్వ సెలవు దినాలైనా, నామినేషన్లను స్వీకరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇక 10న నామినేషన్ల పరిశీలన, 11, 12 ఉపసంహరణకు గడువుతోపాటు, అదే రోజు బరిలో ఉండే అభ్యర్థుల జాబితా, వారికి గుర్తుల కేటాయింపు ఉంటుందన్నారు. ఇక నామినేషన్ల విషయానికొస్తే మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థులు తన గదిలో, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థులు జేసీ గదిలో దాఖలు చేయాలన్నారు. అసెంబ్లీ విషయానికొస్తే నియోజకవర్గ తహశీల్దార్ కార్యాలయాలు, డివిజన్ అయితే ఆర్డీఓ కార్యాలయాల్లో దాఖలు చేయాలన్నారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు అఫిడవిట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఏమైనా ఖాళీలను భర్తీ చేయకుంటే వాటిని పరిశీలనలో తిరస్కరిస్తామన్నారు. జిల్లాతోపాటు, దేశం, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఆస్తులున్నా వాటిని పేర్కొనాలన్నారు. నామినేషను పత్రాలను అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామని, వాటిని పూర్తి చేసేందుకు ఏమైనా సందేహాలుంటే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అభ్యర్థులంతా ఒక్కరోజు ముందుగా వచ్చి వాటిని తీసుకెళ్లి అన్ని కాలమ్స్ని భర్తీ చేసుకొని రావాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇబ్బందులు సృష్టిస్తే.. కఠిన చర్యలు : జిల్లా ఎస్పీ పోటీచేసే అభ్యర్థులు ఒక దానికి అనుమతి తీసుకొని ఇంకోలా ప్రవర్తించి ఇబ్బంది వాతావరణాన్ని సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాలీలు, మైక్ అనుమతులకు నేరుగా డీఎస్పీ కార్యాలయానికి వెళ్లాల్సిన పని లేదని, సంబంధిత పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేసుకొని రశీదు తీసుకొంటే చాలన్నారు. అక్కడ్నుంచి ఆ ప్రాంత ఎస్సై ఫ్యాక్స్‌లో డీఎస్పీకి సమాచారం పంపితే ఒక్కరోజులో అనుమతుల్ని జారీ చేస్తామన్నారు. డీజే సౌండ్‌కు అనుమతి లేదని, వాటిని వినియోగించినట్లు ఫిర్యాదులొస్తే చర్యలు తప్పవన్నారు. ఈ సందర్భంగా సీపీఐ పట్టణ అధ్యక్షుడు నల్లవల్లి కురుమూర్తి మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ గూర్చి నేరుగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఈసారి అలా కాకుండా, అప్రమత్తంగా ఉండేలా చూడాలని కోరారు. బీజేపీ నేత నాగురావు నామాజీ మాట్లాడుతూ, ప్రతి సారీ అనుమతుల విషయంలో కొంత అలస్యమవుతోందని దాన్ని సరిదిద్దాలన్నారు. ఈ సమావేశంలో అన్ని డివిజన్ల డీఎస్పీలు, రిటర్నింగ్ అధికారులతోపాటు, కాంగ్రెస్ తరుపున సత్తూర్ రాములు గౌడ్, రంగారావు, బిజెపి తరుపున రతంగ్ పాండురెడ్డి, సిపిఐ తరుపున కిల్లెగోపాల్, టీఆర్ఎస్ తరుపున బెక్కెం జనార్ధన్, వైఎస్సార్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు రవిప్రకాష్, టీడీపీ తరపున జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల పరిశీలకులకు సహకరించాలి
జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎన్నికల పరిశీలకులకు విధుల్లో సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ లైజన్ అధికారులకు సూచించారు. శనివారం రెవెన్యూ సమావేశ హాల్లో లైజన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల పరిశీలకులు షెడ్యూల్ ఆధారంగా లైజన్ అధికారులు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఇక పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు లెజైన్ అధికారులు సిబ్బంది వెంట ఉండి విధులు నిర్వర్తించాలని సూచించారు. అలాగే నియోజకవర్గాల సమాచారం, ఓటర్ల సమాచారంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇక ఎన్నికల అధికారుల సెల్‌ఫోన్ నెంబర్లను తమ వద్ద ఉంచుకోవాలని, దీంతోపాటు, నిబంధనలను, ప్రవర్తనా నియమావళిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలన్నారు. పరిశీలకుల టూర్ ప్రోగ్రాంను ఎలాంటి గందరగోళం లేకుండా పారదర్శకంగా నిర్వహించుకొనేలా చూడాలన్నారు. ఇక నుంచి పరిశీలకుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు చేరవేయాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించకుండా, మెలకువలు పాటించాలని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జేసీ శర్మన్, డీఆర్ఓ రాంకిషన్, ట్రైనీ కలెక్టర్ విజయరామరాజులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించండి ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించే మున్సిపల్ ఎన్నిక ల్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నిక ల సందర్బంగా శనివారం మున్సిపల్ కార్యాలయంలో ఈ వీఎంలు, ఇతర సామగ్రిని అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికలను నిర్వహించి, సజావుగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్క రూ కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 8 మున్సిపాలిటీల్లో ఎన్నికలు పూర్తయ్యాక ఈవీఎంలను భద్రం పరిచేందుకు స్ట్రాంగ్ రూంలు పకడ్బందీగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఇక వాటిని చేరవేసే టప్పుడు, కట్టుదిట్టమైన భద్రతల మధ్య చేర్చాల్సిందిగా కలెక్టర్ వారికి సూచించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో రెండు వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, ఎవరైనా విధులకు గైర్జాజరైతే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, శిక్షణా కలెక్టర్ విజయ రామరాజు, తదితరులు పాల్గొన్నారు.