లక్కీ.. కిక్కు!
మద్యం దుకాణాలకు ‘లెసైన్స్’
9 షాపుల దక్కించుకున్న మహిళలు
ఎక్సైజ్‌శాఖకు రూ.67.90కోట్ల ఆదాయం
మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్:
కొత్తరాష్ట్రంలో కొత్త మద్యం లెసైన్స్‌లు ఖరారయ్యాయి. వచ్చే ఏడాదికి మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి సోమవారం స్థానిక అంబేద్కర్ కళాభవన్‌లో కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ఆధ్వర్యంలో లక్కీడిప్ ద్వారా కేటాయించారు. జిల్లాలో సింగిల్‌టెండర్ వేసిన 13 షాపులను మొదట కేటాయించారు. ఏజేసీ రాజారాం గెజిట్‌లో ఒకటో నం.1షాపును అమరేందర్‌రెడ్డికి కేటాయించారు. డిప్యూటీ కమిషనర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో మద్యంషాపుల కేటాయింపుకు లక్కీడిప్ నిర్వహించారు. గద్వాల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ ఎక్సైజ్ డివిజన్‌లకు వేర్వేరుగా కౌంటర్లను ఏర్పాటుచేశారు.
జిల్లా నలుమూలల నుంచి దరఖాస్తుదారులు, వారి మద్దతుదారులు పెద్దఎత్తున అంబేద్కర్ కళాభవన్‌కు తరలొచ్చారు. ఎ లాంటి అవాంఛనీ య సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టిభద్ర త ఏర్పాటుచేశారు. సుమారు 400 మం ది ఎక్సైజ్ సిబ్బంది, 80మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పోలీసులు పాస్‌లు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. డీపీఓ రవీందర్ నాగర్‌కర్నూల్ కౌంటర్ వద్ద, గద్వాల్ కౌంటర్ వద్ద డీఆర్‌ఓ రాంకిషన్, మహబూబ్‌నగర్ కౌంటర్ వద్ద ఏజేసీ రాజారాం, డిప్యూటీ కమిషనర్ గోపాలకృష్ణ లక్కీడిప్ నిర్వహించారు. ఈ ఏర్పాట్లను మహబూబ్‌నగర్ ఈఎస్ చంద్రయ్య, నాగర్‌కర్నూల్ ఈఎస్ శ్రీనివాస్‌రెడ్డి, గద్వాల ఈఎస్ జనార్ధన్‌రెడ్డిలతో పాటు సీఐలు సాగర్‌నందన్‌రెడ్డి, ఎస్‌ఐ భీంరెడ్డి రాంరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
సర్కారుకు రూ.22.63కోట్ల ఆదాయం
జిల్లాలో 1928 దరఖాస్తులకు రూ.4.82కోట్ల ఆదాయం ఎక్సైజ్‌శాఖకు వచ్చింది. షాపులు దక్కించుకున్నవారి నుంచి దరావత్తులో 3వ వంతు రూపేణా ఒకేరోజులో రూ.22.63కోట్ల ఫీజు వసూలైంది. జిల్లాలోని 194 మద్యం దుకాణాలకు 1928 దరఖాస్తులొచ్చాయి. మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలోని 68 షాపులకు 668, నాగర్‌కర్నూల్ డివిజన్ పరిధిలో 58 దుకాణాలకు 577, గద్వాల డివిజన్‌లోని 68 షాపులకు 663 దరఖాస్తు చేసుకున్నారు. లక్కీడిప్ ద్వారా ఎంపికైన వారికి దుకాణాలు కేటాయించారు.
స్లాబ్‌ల వారీగా ఆదాయం
మూడుస్లాబ్ విధానంలో లెసైన్స్‌ఫీజు నిర్ణయించారు. 10వేల జనాభా ఉన్న చోట రూ.32.50లక్షలుగా నిర్ణయించారు. దీనికింద 73షాపులకు రూ.23.72కోట్ల ఆదాయం సమకూరింది. 10వేల నుంచి 50వేల జనాభా ఉన్నచోట రూ.34లక్షలుగా నిర్ణయించారు. ఈ స్లాబ్‌లో 83 షాపులకు రూ.28.22కోట్లు వచ్చాయి. 50వేల నుంచి మూడులక్షల జనాభా ఉన్న చోట రూ.42లక్షలుగా నిర్ణయించారు. ఈ విధానంలో 38 షాపులకు రూ.15.96కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. స్లాబ్‌ల వారీగా మొత్తం రూ.67.97కోట్ల ఆదాయం ఎక్సైజ్‌శాఖకు అందనుంది.
మహిళలకు ఆ 9 దుకాణాలు
అన్నిరంగాల్లో దూసుకుపోతున్న మహిళలు పురుషులకు తామేమీ తీసిపోమని మద్యం దుకాణాలను సైతం దక్కించుకున్నారు. జిల్లాలో 9 మంది మహిళలు వీటిని చేజిక్కించుకున్నారు. వీరిలో కల్వకుర్తికి చెందిన రాజేశ్వరి, ప్రసాద్ దంపతులు రెండు మద్యం షాపులను దక్కించుకున్నారు. నాగర్‌కర్నూల్‌లో ఇద్దరు మహిళలకు, మహబూబ్‌నగర్‌లో ఒక్కరికి, గద్వాలలో ఆరుగురు మహిళలు మద్యం దుకాణాలను దక్కించుకున్న వారిలో ఉన్నారు.