
ఎన్నికల నేరాలు.. శిక్షలు
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఫలితాలు వెలువడే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించే వారిపై చర్యలు తప్పవు.
మందస, న్యూస్‌లైన్:
ఎన్నికల సమయంలో కోడ్ అమలులో ఉంటుంది. దీనిని ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు. ప్రస్తుతం అమలులో ఉన్న కొన్ని చట్టాలు, సెక్షన్‌లు, శిక్షల గురించి తెలుసుకుందాం.పోలీస్ యాక్ట్-30: డీఎస్పీ స్థాయి అధికారి పోలీస్ యాక్ట్-30 అమలుకు ఆదేశాలు జారీ చేస్తారు. ఈ యాక్ట్ అమలులో ఉన్నపుడు అనుమతి లేకుండా ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదు. లేకుంటా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఫలితాలు వెలువడే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించే వారిపై చర్యలు తప్పవు.
సెక్షన్ 144: అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్తగా తహశీల్దార్, ఆర్డీవో స్థారుు అధికారులు సెక్షన్ 144ను అమలు చేస్తారు. ఈ సెక్షన్ అమలులో ఉన్నపుడు ఒకరు లేదా ఇద్దరు కంటే ఎక్కువ గుమిగూడి ఉండరాదు.
తప్పు చేస్తే శిక్ష తప్పదు
ఓటర్లకు డబ్బులు ఇస్తే ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1951లోని సెక్షన్ 123 ప్రకారం ఏడాది జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఒక్కో సందర్భంలో రెండూ అమలు కావచ్చు. ఓటరును ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తే ఏడాది జైలు లేదా జరిమానా, రెండు శిక్షలు అమలుచేయవచ్చు.
ఒకరి ఓటు మరొకరు వేస్తే ఏడాది జైలు లేదా జరిమానా ఉంటుంది. ఎన్నికలకు సంబంధించిన పద్దులు సక్రమంగా నిర్వహించనట్లయితే రూ.500 జరిమానా వేయవచ్చు. ఎన్నికల వేళ ఎవరైనా సమస్యలు సృష్టిస్తే ఆరు నెలల జైలు లేదా రూ.2000 జరిమానా విధిస్తారు.
రహస్య ఓటును బహిర్గతం చేస్తే మూడు నెలల జైలు, ప్రభుత్వ ఆస్తుల ప్రచారానికి వినియోగిస్తే మూడు నెలల జైలు, రూ.2 వేలు జరిమానా, భద్రతా సిబ్బంది మినహా ఇతరులు ఆయుధాలతో పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తే రెండేళ్ల జైలు, రూ.500 జరిమానా విధిస్తారు.