
వీఆర్‌ఏ దుర్గం బాబు (ఇన్‌సెట్‌లో)
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో కొత్తపల్లి వీఆర్‌ఏ దుర్గం బాబును దుండగులు కత్తితో గొంతు కోసి హత్య చేశారు. సోమవారం ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న దుర్గంబాబును గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
వ్యక్తిగత కక్షలతో వీఆర్‌ఏ హత్య జరిగిందా లేదా రెవెన్యూ అధికారుల మధ్య విబేధాలతో హత్య చోటుచేసుకుందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కాగా దుర్గం బాబు కొత్తపల్లి వీఆర్‌ఏగా పనిచేస్తున్నాడు, కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రాత్రిపూట విధులు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
చదవండి: ఫస్ట్ టైం క్రిమినల్స్: సినిమాలు, యూట్యూబ్ చూసి నేర్చుకుంటున్నారు
అయితే కొత్తపల్లి గ్రామంలో ఓ వ్యక్తి గత కొన్ని రోజులుగా చంపేస్తామని బెదరిస్తున్నారని, అదే విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని దుర్గంబాబు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అతనే బాబును హత్య చేసి ఉంటాడని ఆరోపణలు చేస్తున్నారు.
చదవండి: Banjara Hills: సీఎం శిలాఫలకానికే దిక్కులేదు.. ఇప్పటికైనా సాధ్యమేనా..?
Comments
Please login to add a commentAdd a comment