VRA Association
-
సీఎం జగన్‌కు వీఆర్ఏ సంఘం నేతల కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: వీఆర్ఏ సంఘం నేతలు శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వం వీఆర్ఏలకు ఇస్తున్న రూ.300 డీఏను రద్దు చేసింది. ఈ విషయాన్ని ఏపీజీఎఫ్ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎం.. డీఏను పునరుద్ధరించడమే కాకుండా డీఏను రూ.500కు పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వీఆర్ఏ సంఘం నేతలు సీఎంను కలిసి సన్మానించారు. ఏపీజీఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి, వీఆర్ఏ సంఘం నేతలు ధైర్యం, సత్యరాజ్, సుధాకర్, వెంకటేశ్వర్లు ఉన్నారు. -
సీఎం జగన్‌ను సత్కరించిన వీఆర్ఏ సంఘం నాయకులు
సాక్షి, గుంటూరు: వీఆర్ఏ సంఘం నాయకులు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిశారు. రద్దైన డీఏను పెంచి మరీ అందిస్తుండడంపై వాళ్లు ఆయనకు కృతజ్ఙతలు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం గతంలో వీఆర్ఏలకు ఇస్తున్న రూ. 300 డీఏను రద్దు చేసింది. అయితే.. ఈ విషయం సీఎం జగన్ దృష్టికి వెళ్లింది. దానిని కొనసాగించాలంటూ ఏపీజీఎఫ్ ప్రతినిధులు ఆయనకు విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం రూ. 300కు బదులుగా డీఏని రూ. 500 కు పెంచి మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో.. ఏపీజీఎఫ్ ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో వీఆర్ఏ సంఘ నాయకులు ధైర్యం, సత్యరాజ్, సుధాకర్, వెంకటేశ్వర్ల బృందం సీఎం జగన్‌ను సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. -
మంచిర్యాల: కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ హత్య
-
కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ దారుణ హత్య
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో కొత్తపల్లి వీఆర్ఏ దుర్గం బాబును దుండగులు కత్తితో గొంతు కోసి హత్య చేశారు. సోమవారం ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న దుర్గంబాబును గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వ్యక్తిగత కక్షలతో వీఆర్ఏ హత్య జరిగిందా లేదా రెవెన్యూ అధికారుల మధ్య విబేధాలతో హత్య చోటుచేసుకుందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కాగా దుర్గం బాబు కొత్తపల్లి వీఆర్ఏగా పనిచేస్తున్నాడు, కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రాత్రిపూట విధులు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చదవండి: ఫస్ట్ టైం క్రిమినల్స్: సినిమాలు, యూట్యూబ్ చూసి నేర్చుకుంటున్నారు అయితే కొత్తపల్లి గ్రామంలో ఓ వ్యక్తి గత కొన్ని రోజులుగా చంపేస్తామని బెదరిస్తున్నారని, అదే విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని దుర్గంబాబు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అతనే బాబును హత్య చేసి ఉంటాడని ఆరోపణలు చేస్తున్నారు. చదవండి: Banjara Hills: సీఎం శిలాఫలకానికే దిక్కులేదు.. ఇప్పటికైనా సాధ్యమేనా..? -
ఐకమత్యంతోనే హక్కుల సాధన
అనంతపురం : వీఆర్ఏలు, రెవెన్యూ సిబ్బంది ఐకమత్యంతోనే హక్కులు సాధించు కోవాలని వీఆర్ఏ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కైకాల గోపాలరావు పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని క్రిష్ణకళా మందిరంలో వీఆర్ఏల కార్యవర్గ సమావేశం జరిగింది. వీఆర్ఏలు చాలీచాలని జీతాలతో పని చేస్తున్నారనీ.. వెంటనే వారి జీతాలను ప్రభుత్వం పెంచాలని కైకాల గోపాలరావు డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. తహశీల్దార్ కార్యాలయాలలో వాచ్మెన్లు లేరని వారి డ్యూటీ కూడా వీఆర్ఏలు చేయాల్సిన దుస్థితి నెలకొందని విమర్శించారు. వాచ్మెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరామప్ప మాట్లాడుతూ ప్రభుత్వం వీఆర్ఏలకు 010 కింద జీతాలు ఇవ్వాలన్నారు. వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి అన్ని వేళలా రెవెన్యూ ఉద్యోగులు కూడా ముందుంటారని స్పష్టం చేశారు. ప్రభుత్వం వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత, పెన్షన్, ప్రమాద బీమా గుర్తింపు కార్డులు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం గౌరవ సలహాదారుడు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు నీలకంఠారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు రామంజినేయులు, కోశాధికారి సుంకన్న, ప్రధాన కార్యదర్శి పుష్పరాజు, జిల్లా కార్యదర్శి రంగయ్య కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. -
‘చంద్రన్న యాగం’ దేనికంటే....
విజయవాడ: తమ గోడు ఆలకించాలంటూ గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) విజయవాడలో బుధవారం చంద్రన్నయాగం నిర్వహించారు. లెనిన్ సెంటర్లో డెరైక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏల అసోసియేషన్ ఆధ్వర్యంలో వేతనాలు పెంచాలని కోరుతూ 31 రోజులుగా ఆందోళన సాగిస్తున్నారు. బుధవారం ‘చంద్రన్నయాగం’ పేరుతో శాస్త్రోక్తంగా క్రతువు నిర్వహించారు. రెవెన్యూ శాఖలో అట్టడుగు స్థాయిలో చాలీచాలనీ వేతనంతో పనిచేస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్ కోరారు. కార్యక్రమంలో వీఆర్ఏ అసోసియేషన్ జిల్లా అద్యక్షుడు పి.నాగరాజు, ప్రధాన కార్యదర్శి బి.శ్రీనివాసరావుతో పాటు పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు.