
సాక్షి, గుంటూరు: వీఆర్‌ఏ సంఘం నాయకులు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిశారు. రద్దైన డీఏను పెంచి మరీ అందిస్తుండడంపై వాళ్లు ఆయనకు కృతజ్ఙతలు తెలిపారు.
టీడీపీ ప్రభుత్వం గతంలో వీఆర్‌ఏలకు ఇస్తున్న రూ. 300 డీఏను రద్దు చేసింది. అయితే.. ఈ విషయం సీఎం జగన్ దృష్టికి వెళ్లింది. దానిని కొనసాగించాలంటూ ఏపీజీఎఫ్ ప్రతినిధులు ఆయనకు విజ్ఞప్తి చేశారు.
సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం రూ. 300కు బదులుగా డీఏని రూ. 500 కు పెంచి మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో.. ఏపీజీఎఫ్ ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో వీఆర్‌ఏ సంఘ నాయకులు ధైర్యం, సత్యరాజ్, సుధాకర్, వెంకటేశ్వర్ల బృందం సీఎం జగన్‌ను సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment