సీఎం జగన్‌కు వీఆర్‌ఏ సంఘం నేతల కృతజ్ఞతలు  | Village Revenue Assistants Association leaders call on Andhra CM Jagan Reddy | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌కు వీఆర్‌ఏ సంఘం నేతల కృతజ్ఞతలు 

Published Sat, Oct 14 2023 4:42 AM | Last Updated on Sat, Oct 14 2023 10:18 AM

Village Revenue Assistants Association leaders call on Andhra CM Jagan Reddy - Sakshi

సాక్షి, అమరావతి: వీఆర్‌ఏ సంఘం నేతలు శుక్రవారం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వం వీఆర్‌ఏలకు ఇస్తున్న రూ.300 డీఏను రద్దు చేసింది. ఈ విషయాన్ని ఏపీజీఎఫ్‌ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో సీఎం.. డీఏను పునరుద్ధరించడమే కాకుండా డీఏను రూ.500కు పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వీఆర్‌ఏ సంఘం నేతలు సీఎంను కలిసి సన్మానించారు.   ఏపీజీఎఫ్‌ చైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డి, వీఆర్‌ఏ సంఘం నేతలు ధైర్యం, సత్యరాజ్, సుధాకర్, వెంకటేశ్వర్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement