విజయవాడ: తమ గోడు ఆలకించాలంటూ గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏలు) విజయవాడలో బుధవారం చంద్రన్నయాగం నిర్వహించారు. లెనిన్ సెంటర్‌లో డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ వీఆర్‌ఏల అసోసియేషన్ ఆధ్వర్యంలో వేతనాలు పెంచాలని కోరుతూ 31 రోజులుగా ఆందోళన సాగిస్తున్నారు.
బుధవారం ‘చంద్రన్నయాగం’ పేరుతో శాస్త్రోక్తంగా క్రతువు నిర్వహించారు. రెవెన్యూ శాఖలో అట్టడుగు స్థాయిలో చాలీచాలనీ వేతనంతో పనిచేస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్ కోరారు. కార్యక్రమంలో వీఆర్‌ఏ అసోసియేషన్ జిల్లా అద్యక్షుడు పి.నాగరాజు, ప్రధాన కార్యదర్శి బి.శ్రీనివాసరావుతో పాటు పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు.