
మేడారం పెద్ద చెరువును పరిశీలించిన ఆర్డీఓ
పెద్దఅడిశర్లపల్లి
మండల పరిధిలోని మేడారం పెద్దచెరువును బుధవారం దేవరకొండ ఆర్డీఓ గంగాధర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మేడారం పెద్ద చెరువు నిండడం శుభపరిణామమన్నారు. చెరువు కింద ఉన్న గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణశాఖ సూచన మేరకు మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ ధర్మయ్య, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.