observed
-
మొగల్తూరు ఆక్వా ప్లాంట్ ఘటనపై విచారణ
మొగల్తూరు : మొగల్తూరు ఆనంద రొయ్యల పరిశ్రమలో ఐదుగురి మృతికి కారణమైన ఘటనపై విచారణ నివేదికను ప్రభుత్వానికి అందచేస్తామని చీఫ్ ఎన్విరా న్ మెంటల్ ఇంజినీర్ రామచంద్ తెలిపారు. గత నెల 30న మొగల్తూరు నల్లంవారితోటలోని ఆనంద రొయ్యల పరిశ్రమలో విషరసాయనాలు పీల్చి ఐదుగురు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. మంగళవారం హైదరాబాద్, ఏలూరుకు చెందిన ఎన్విరా న్ మెంటల్, పొల్యూష న్ బోర్డు, మత్య్సశాఖ, పరిశ్రమల శాఖ అధికారులు ప్రమాదానికి కారణమైన విష రసాయనాల ట్యాంక్‌ను పరిశీలించారు. ట్యాంక్ నుంచి గొంతేరు డ్రెయి న్ లోకి వేసిన పైప్‌లను, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. సీజ్ చేసిన పరిశ్రమ ఆవరణలోనూ కలియతిరిగారు. అనంతరం ఎన్విరా న్ మెంటల్ చీఫ్ ఇంజినీర్ రామచంద్ మాట్లాడుతూ ప్రమాదానికి జరిగిన కారణాలను పరిశీలించేందుకు వచ్చామని, తాము సమర్పించే నివేదికలోని విషయాలను బహిరంగ పర్చకూడదన్నారు. నివేదికను త్వరలో ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఆయన వెంట ఎన్విరా న్ మెంటల్ శాఖ జేడీ భాస్కర్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ రామ్మోహనరావు, మత్య్సశాఖ డీడీ భాస్కరరావు, ఏడీ నాగలింగాచార్యులు, బాషా, మేరీ, డీఎస్పీ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. -
పరడలో పంటపొలాలు పరిశీలన
కట్టంగూర్ మండలంలోని పరడ గ్రామంలో బుధవారం వ్యవసాయ అధికారి బి. సన్నిరాజ్ పంటపొలాలను, పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తి ఆకు ఎరుపురంగులోకి మారితే మెగ్నిషియం లోపనివారణగా గుర్తించి ఒక లీటరు నీటి రెండు గ్రాముల మెగ్నిషియం సల్ఫేట్‌ను పిచికారీ చేయాలని సూచించారు. వరి ఆకులు ముదురు గోధుమ రంగులోకి మారటంతో పాటు వడ్ల గింజలపై నల్ల మచ్చలు ఏర్పడితే దీని నివారణకు ఒక లీటరు నీటిలో 2.5 మిల్లీలీటర్ల ఫ్రొఫెనోపాస్ కలిపి పిచికారీ చేసుకోవాలని రైతులకు సూచించారు. ఆయన వెంట రైతులు ప్రభాకర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, శశిపాల్‌రెడ్డి, మాండ్ర వీరయ్య ఉన్నారు. -
పంట చేలను పరిశీలించిన డీడీఏ
చౌటుప్పల్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట చేలను వ్యవసాయ శాఖ డీడీఏ వై.మాధవి సోమవారం పరిశీలించారు. మండలంలోని అంకిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని జిల్లేడుచెల్క, మందోళ్లగూడెం శివారులో వర్షపు నీళ్లలో ఉన్న పత్తి, వరి, కంది చేలను పరిశీలించారు. పంటనష్టం అంచనా వేసేందుకు వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి నివేదించనున్నట్లు పేర్కొన్నారు. ఆమె వెంట ఏడీఏలు శైలజ, వినోద్‌కుమార్, సర్పంచ్ సుర్వి మల్లేష్‌గౌడ్, ఏవో సీహెచ్.అనురాధ, ఏఈవో ప్రకాష్‌గౌడ్, శశాంక్ తదితరులున్నారు. -
సింగరేణి భవనాలను పరిశీలించిన కలెక్టర్, జేసీ
కొత్తగూడెం అర్బన్: కొత్తగూడెం జిల్లా ఏర్పాటు కానున్న తరుణంలో జిల్లా కార్యాలయాల కోసం కలెక్టర్ లోకేష్‌కుమార్, జేసీ దివ్య సింగరేణి భవనాలను సోమవారం పరిశీలించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ఈఆర్పీ సింగరేణి భవనాన్ని కలెక్టర్ కార్యాలయానికి ఉపయోగించనున్న నేపథ్యంలో ఆ భవనం లోపల గదులు, సౌకర్యాలను పరిశీలించారు. సింగరేణి ప్రదానాస్పత్రి ఏరియాలోని సింగరేణి డిస్పెన్సరీని ఎస్పీ కార్యాలయానికి వినియోగించనున్న నేపథ్యంలో చిన్నాస్పత్రి భవనం, పక్కన ఉన్న రెసిడెన్సీ భవనాన్ని పరిశీలించారు. కలెక్టర్, జేసీ వెంట ఆర్డీఓ రవీంద్రనాథ్, తహశీల్దారు అశోక్‌చక్రవర్తి, సింగరేణి అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
పోలీస్ కార్యాలయ భవనాలను పరిశీలించిన డీఎస్పీ
కోదాడఅర్బన్: త్వరలో కోదాడ పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు కానున్నందున నూతనంగా మండల పరిధిలోని కొమరబండలో ఏర్పాటు చేసే డీఎస్పీ కార్యాలయంతో పాటు అనంతగిరిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న పోలీస్‌స్టేషన్ భవనాలను శుక్రవారం సూర్యాపేట డీఎస్పీ సునితామోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా భవనాల్లోని వసతులు, కార్యాలయం చేపట్టాల్సిన అంశాలను ఆమె పరిశీలించారు. అయితే అనంతగిరి పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు ఎంపిక చేసిన పాత గ్రామపంచాయతీ కార్యాలయం చిన్నదిగా ఉండడంతో అక్కడ ఉన్న మరో ఇంటిని పరిశీలించారు. ఈ కార్యకక్రమంలో ఆమె వెంట కోదాడ పట్టణ సీఐ రజితారెడ్డి, రూరల్ ఎస్ఐ విజయప్రకాశ్లున్నారు. -
మేడారం పెద్ద చెరువును పరిశీలించిన ఆర్డీఓ
పెద్దఅడిశర్లపల్లి మండల పరిధిలోని మేడారం పెద్దచెరువును బుధవారం దేవరకొండ ఆర్డీఓ గంగాధర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మేడారం పెద్ద చెరువు నిండడం శుభపరిణామమన్నారు. చెరువు కింద ఉన్న గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణశాఖ సూచన మేరకు మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ ధర్మయ్య, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
ఆర్–9 ఎత్తిపోతల పథకం కాల్వల పరిశీలన
ఎక్లాస్‌ఖాన్‌పేట(నడిగూడెం): మండల పరిధిలోని ఎక్లాస్‌ఖాన్‌పేట తండా వద్ద జరుగుతున్న ఆర్.9 ఎత్తిపోతల పథకం నిర్మాణపు పనులను ఆదివారం టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి పరిశీలించారు. మేజరు కాల్వ, మైనరు కాల్వల గురించి అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మండల అధ్యక్షుడు బూత్కూరి వెంకటరెడ్డి, నాయకులు కొల్లు శ్రీనివాస్, రౌతు రవీందర్రావు, తదితరులున్నారు. -
పుష్కరపనులు పరిశీలించిన జేసీ
బుగ్గమాధవరం(మేళ్లచెర్వు) మండలంలో కృష్ణాపుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన బగ్గుమాధవరం,వజినేపల్లి ,కిష్టాపురం గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన స్నానపు ఘాట్లను జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పుష్కర ఘాట్ల నిర్మాణ పనులు, అక్కడ ఏర్పాటు చేసిన మౌలిక సదు పాయాలను పరిశీలించారు. ఇంకా మిగిలి ఉన్న పనులను నేటితో పూర్తి చేయాలన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన 28 ఘాట్ల పరిధిలో 1400 మంది ప్రభుత్వ అధికారులు, 8000 మంది ప్రైవేట్ ఉద్యోగులను నియమించినట్లు తెలిపారు. వారికి 9,10 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆయన వెంట డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి,ఆర్డీఓ నారాయణరెడ్డి,తహసీల్దార్ శ్రీదేవి,ఐబీ డీఈ స్వామి, ఎంపీడీఓ శాంతకుమారి పాల్గొన్నారు. -
విద్యుత్ పనుల పరిశీలన
నాగార్జునసాగర్ : సాగర్‌లోని పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న విద్యుదీకరణ పనులను శనివారం ట్రాన్స్‌కో ఎస్ఈ భిక్షపతి పరిశీలించారు. ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు, లైట్ల ఏర్పాట్లు ఏ మేరకు జరిగాయనే విషయాలపై కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈయన వెంట డీఈ సత్యనారాయణ, ఏడీఈ శ్రీకాంత్, ఏఈశ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. -
పుష్కర ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ
ఇర్కిగూడెం(దామరచర్ల) : మండలంలో కృష్ణా పుష్కరాలు జరిగే ప్రాంతాలను ఆదివారం ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి సందర్శించారు. ఇర్కిగూడెం, అడవిదేవులపల్లి, ముదిమాణిఖ్యంలో నిర్మిస్తున్న స్నాన ఘాట్ల పనులతో పాటు పార్కింగ్ స్థలాలు, హోల్డింగ్ పాయింట్ల ఏర్పాట్లను పరిశీలించారు. ఇక్కడకు ఎంత మంది భక్తులు వచ్చే వీలుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట రూరల్ సీఐ రవీందర్, ఎస్ఐ చరమంద రాజు, పీఆర్ ఏఈ ఆదినారాయణ తదితరులు ఉన్నారు. -
పుష్కరఘాట్లను పరిశీలించిన ఎస్పీ
కనగల్ : మండల కేంద్రంలోని వాగులో, దర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో నిర్మిస్తున్న పుష్కరఘాట్ పనులను గురువారం ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య తెల్తెకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ ఎంట నల్లగొండ డీఎస్సీ సుధాకర్, చండూర్ సీఐ రమేశ్‌కుమార్, కనగల్ ఎస్ఐ గుత్తా వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సభా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
మిర్యాలగూడ : హరితహారం కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడలో నిర్వహించే బహిరంగ సభ స్థలాన్ని గురువారం స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో నిర్వహించే హరితహారానికి మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి హాజరుకానున్నారని తెలిపారు. ఇందు కోసం స్థానిక ఎన్ఎస్పీ క్యాంపులో సభను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈనెల 24 లేదా 25న ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఒక్క రోజే లక్ష మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట ఆర్డీఓ కిషన్‌రావు, మున్సిపల్ కమిషనర్ సత్యబాబు, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, కౌన్సిలర్ తిరునగరు భార్గవ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి రమేశ్, చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, చిట్టు బాబునాయక్ పాల్గొన్నారు. -
పుష్కరఘాట్లను పరిశీలించిన అధికారులు
కనగల్ : మండలకేంద్రంతోపాటు దర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం సమీపంలో నిర్మిస్తున్న కృష్ణా పుష్కరఘాట్లను ఎండోమెంట్ డీసీ దుర్గాప్రసాద్ మంగళవారం పరిశీలించారు. కనగల్ వాగు సమీపంలో నిర్మిసున్న శ్రీ తిరుమలనాథస్వామి ఆల యంతోపాటు దర్వేశిపురంలో నూతనంగా నిర్మిస్తున్న హనుమాన్ ఆలయ నిర్మాణం పనులను సైతం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాల నేపథ్యంలో మండలంలోని రెండు చోట్ల రూ. 12 లక్షల ఎండోమెంట్ నిధులతో తిరుమలనాథస్వామి ఆలయంతోపాటు హనుమాన్ ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు వివరించారు. సకాలంలో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్, ఈఓలు అన్నెపర్తి సులోచన, రంగాచారి, జేఏ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ పరిధిలో పరిశీలించాలి
మూడుసార్ల తలాక్‌పై సుప్రీం కోర్టు న్యూఢిల్లీ: ముస్లిం సమాజంలో మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా విడాకులిచ్చే పద్ధతి ఎంతో కీలకమైనదని, పెద్ద సంఖ్యలో ప్రజల జీవితాలపై ప్రభావం చూపే అంశమని సుప్రీంకోర్టు పేర్కొంది. దీన్ని రాజ్యాంగ పరిధిలోని ప్రమాణాల ఆధారంగా పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఈ విషయంలో పర్సనల్ లా చట్టబద్ధత అంశాన్ని పరిశీలించేందుకు కూడా అంగీకరించింది. ట్రిపుల్ తలాక్ అంశంపై వ్యతిరేక, అనుకూల వర్గాల వైపు నుంచి బలమైన కారణాలు ఉన్నాయని, కాబట్టి ఈ విషయంలో తాము తక్షణమే ఒక నిర్ణయానికి రాలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకుర్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్లతో కూడిన ధర్మాసనం బుధవారం పేర్కొంది. ఈ అంశంలో గతంలో ఇచ్చిన తీర్పుల్లో ఏవైనా తప్పులున్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలించి.. అవసరమైతే ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించడంపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపింది. ట్రిపుల్ తలాక్ అంశంపై గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులను న్యాయపరంగా సమీక్షించడంపై తమ అభిప్రాయాలను తెలిపేందుకు సంబంధిత పక్షాలు సిద్ధపడాలని ఈ సందర్భంగా కోరింది. తదుపరి విచారణను సెప్టెంబర్ ఆరవ తేదీకి వాయిదా వేసింది. ముస్లిం సమాజంలో వివాహ రద్దు(విడాకుల) కోసం మూడుసార్లు తలాక్ చెప్పే విధానాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన నాలుగు పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. వీరందర్నీ ఈ కేసులో కక్షిదారులుగా చేరేందుకు అనుమతించింది. అదే సమయంలో ట్రిపుల్ తలాక్ అంశంపై తన విధానమేంటో తెలపాలని కేంద్రాన్ని కోరింది. ఇందుకోసం ఆరువారాల గడువు ఇచ్చింది. -
ట్రిపుల్ తలాక్ చాలా సీరియస్ అంశం
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ అంశంపై సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. దీనికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను పరిశీలించాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. తలాక్ పిటిషన్ పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ బుధవారం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశంగా పేర్కొన్న బెంచ్ పెద్ద సంఖ్యలో ప్రజల జీవితాలకు సంబంధించినదిగా అభిప్రాయపడింది. మూడుసార్లు తలాక్ చెప్పే అంశాన్ని రాజ్యాంగ ముసాయిదాలోని అంశాల గీటురాయిగా, గత తీర్పుల ఆధారంగా పరిశీలించాల్సి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజ్యాంగం ఆమోదించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని భావిస్తే ముస్లిం మతం వ్యక్తిగత చట్టాలు జోక్యం చేసుకుని వారిని ఒప్పించాలని ధర్మాసనం సూచించింది. అవసరమయితే అయిదుగురు న్యాయమూర్తులతో సుదీర్ఘ బెంచ్ ను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపింది. అలాగే విచారణ సందర్భంగా మీడియాను నిరోధించాలంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేసిన సుప్రీం తదుపరి విచారణకు సెప్టెంబర్ 6కు వాయిదా వేసింది. కాగా ముస్లిం సంప్రదాయంలో వివాహ రద్దు (విడాకుల) కోసం ఆచరణలో ఉన్న తలాక్ (ట్రిపుల్ తలాక్) విధానాన్ని తీవ్రంగా ముస్లిం మహిళలు ఆన్ లైన్ పోరాటానికి దిగారు. ఈ అనైతిక విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ యాభైవేల మంది ముస్లింలు సంతకాలు కూడా చేశారు. ఈ విధానానికి వ్యతిరేకంగా భారతీయ ముస్లిం మహిళా ఆందోళన సంస్థ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టింది. తమకు న్యాయం జరగాలంటే ముస్లిం పర్సనల్ లా బోర్డులో సంస్కరణలు తేవాలని, తమకు న్యాయం చేయాలని కోరుతూ సుప్రీం గడప తొక్కారు.