
పరడలో పంటపొలాలు పరిశీలన
కట్టంగూర్
మండలంలోని పరడ గ్రామంలో బుధవారం వ్యవసాయ అధికారి బి. సన్నిరాజ్ పంటపొలాలను, పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తి ఆకు ఎరుపురంగులోకి మారితే మెగ్నిషియం లోపనివారణగా గుర్తించి ఒక లీటరు నీటి రెండు గ్రాముల మెగ్నిషియం సల్ఫేట్‌ను పిచికారీ చేయాలని సూచించారు. వరి ఆకులు ముదురు గోధుమ రంగులోకి మారటంతో పాటు వడ్ల గింజలపై నల్ల మచ్చలు ఏర్పడితే దీని నివారణకు ఒక లీటరు నీటిలో 2.5 మిల్లీలీటర్ల ఫ్రొఫెనోపాస్ కలిపి పిచికారీ చేసుకోవాలని రైతులకు సూచించారు. ఆయన వెంట రైతులు ప్రభాకర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, శశిపాల్‌రెడ్డి, మాండ్ర వీరయ్య ఉన్నారు.