ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్‌లో ఓ హిందూ యువతి సత్తా చాటింది. ఆ దేశంలోని అత్యున్నత పదవిని అధిష‍్టించనుంది. ఆ దేశ అత్యున్నత ఉద్యోగానికి ఎంపికై అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనుంది. ఆ దేశంలో ఓ హిందూ యువతి ఆ బాధ్యత చేపట్టడం ఇది తొలిసారి. ఆమెనే పాక్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని షికార్‌పూర్ జిల్లాకు సనా రామ్‌చంద్.
మన దేశంలో సివిల్స్ మాదిరి పాకిస్తాన్‌లో పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (పాస్). సెంట్రల్ సుపీరియర్ సర్వీస్ (సీఎస్‌ఎస్)లో హిందూ యువతి సనా రామ్‌చంద్ ఉత్తీర్ణత సాధించి పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (పాస్)కు ఎంపికైంది. అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనుంది. ఈ సీఎస్‌ఎస్ పరీక్షను 18,553 మంది రాయగా వారిలో 221 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల్లో సనా రామ్‌చంద్ ప్రతిభ కనబర్చడంతో ఆమె పాక్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌కు ఎంపికైంది. అంటే మనదేశంలో ఐఏఎస్ మాదిరి. సనా వృత్తిరీత్యాఆ వైద్యురాలు కూడా. సింధ్ ప్రావిన్స్‌లోని చంద్కా వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం సింధ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూరాలజీలో ఎఫ్‌సీపీఎస్ చదువుతున్నది. సర్జన్ కావాలని ప్రయత్నాలు చేస్తోంది.
చదవండి: మేకను తప్పించి సింహానికి బలైన యువకుడు
చదవండి: కరోనా కల్లోలం: 14 రాష్ట్రాల్లో లాక్‌డౌన్
Comments
Please login to add a commentAdd a comment