వివరాలు వెల్లడిస్తున్న ట్రిపుల్‌ఐటీ ఏఓ మోహన్‌కృష్ణ చౌదరి
సాక్షి, వేంపల్లె(కడప) : ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న సెక్యూరిటీ ఆఫీసర్ అర్జున్ నాయక్ సేవలు మాకొద్దంటూ ఆర్జీయూకేటీ చాన్స్‌లర్ కె.చెంచురెడ్డి, ట్రిపుల్ ఐటీ పరిపాలనా అధికారి మోహన్‌కృష్ణ చౌదరిలు పేర్కొన్నారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీలో అర్జున్ నాయక్ (సీఐ) మహిళా సెక్యూరిటీ గార్డులను లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు అందాయన్నారు. గత రెండేళ్లుగా సెక్యూరిటీ ఆఫీసర్‌గా సీఐ కేడర్‌లో ఆయన విధులు నిర్వహిస్తున్నారన్నారు. అయితే ఇక్కడి అధికారులకు తెలియకుండానే బయోమెట్రిక్ యంత్రాలు ఒక్కరోజు రాత్రి ట్రిపుల్ ఐటీలోని తన గెస్ట్‌హౌస్‌కు షిప్టు చేశారని తెలిసింది. ఈ విషయం సెక్యూరిటీ ద్వారా తమ దృష్టికి వచ్చిందన్నారు.
అంతేకాకుండా మహిళా సెక్యూరిటీ గార్డులపట్ల ఆయన అసభ్యకరంగా మాట్లాడుతున్నారని గత కొద్దిరోజుల నుంచి ఆరోపణలు రావడంతో బాధితులను పిలిపించి మాట్లాడామన్నారు. రెండు నెలల నుంచి ఆయన ఆరాచకాలు భరించలేకపోతున్నామని చెబితే తమ ఉద్యోగాలు ఎక్కడపోతాయోనని బాధితులు అధికారుల ముందు కన్నీరుమున్నీరు పెట్టుకున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం అర్జున్ నాయక్ ఆరోపణలు నిజమేనని నిర్ధారణ కావదతడంతో విధుల నుంచి తొలగించినట్లు వారు తెలిపారు. అలాగే జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కు ట్రిపుల్ ఐటీ అధికారులు లేఖ పంపనున్నట్లు వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment