ట్రిపుల్ ఐటీముఖద్వారం
వేంపల్లె : రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం పరిధిలలోని నూజివీడు, శ్రీకా కుళం, ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్ ఐటీలకు 2018–19 విద్యా సంవత్సరానికి సంబం ధించి ప్రవేశానికి ఎంపిక జాబితా విడుదలైంది. ఈ మేరకు శుక్రవారం విశాఖపట్టణంలోని ఆం ధ్రా యూనివర్సిటీలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ రామచంద్రరాజు, కన్వీనర్ గోపాల్‌రాజుల ఆధ్వర్యంలో ఎంపిక జాబితాను విడుదల చేశారు. నాలుగు ట్రిపుల్ ఐటీలకు 4వేలు సీట్లు ఉండగా.. 50850 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 257 సీట్లు స్పెషల్ కేటగిరీకి పోగా.. 3743 సీట్లు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని 8 జిల్లాలకు, వెంకటేశ్వర యూనివర్శిటీ పరిధిలోని 5 జిల్లాలకు సమానంగా కేటాయించారు. ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని 8జిల్లాలకు 1956సీట్లు, వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని 5జిల్లాలకు 1224 సీట్లు.. మిగిలిన 561సీట్లు ఇతర రాష్ట్రాలకు (నాన్ లోకల్) కేటాయించారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 27,988 దరఖాస్తు చేసుకోగా.. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 22,862మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ప్రభుత్వ పాఠశాలలోని 2915 మంది విద్యార్థులు పదికి 10జీపీఏ పాయింట్లు సాధించగా.. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 7505 మంది పదికి 10 పాయింట్లు సాధించారు. వీరికి జులై 4, 5 తేదీలలో నూజివీడు, ఆర్‌కే వ్యాలీ(ఇడుపులపాయ) క్యాంపస్‌లలో అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుంది. అలాగే 6, 7 తేదీలలో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి సంబంధించి నూజివీడులో, ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఆర్‌కే వ్యాలీ ఇడుపులపాయలలో అడ్మిషన్లు జరుగుతాయి. మొత్తం 3743 సీట్లకుగానూ 1358 మంది బాలురు, 2385 మంది బాలికలు ఉన్నారు.
గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు ఆరేళ్ల సమీకృత సాంకేతిక విద్యను అందించేందుకు ట్రిపుల్ ఐటీలను నెలకొల్పారని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జి డైరెక్టర్ అమరేంద్రకుమార్ తెలిపారు. అందులో భాగంగా ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి 936 సీట్లకు జులై 4, 5 తేదీలలో అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందని తెలిపారు. అందులో బాలురు 339 మంది, బాలికలు 597 మంది ఉన్నారని తెలిపారు. అదేవిధంగా ఇడుపులపాయ క్యాంపస్‌లో నిర్వహించే ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించి 936 సీట్లకు 6, 7 తేదీలలో అడ్మిషన్లు జరుగుతాయి.
అందులో 320 మంది బాలురకు, 616 మంది బాలికలకు అడ్మిషన్లు జరుగుతాయి. జులై 16న ప్రత్యేక కేటగిరి విద్యార్థులకు అడ్మిషన్లు ఉంటాయి. 20వ తేదీన రెండవ జాబితా ఉంటుందని.. 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సూపర్ న్యూమరీ అడ్మిషన్లతో పూర్తవుతాయని తెలిపారు. ఆగస్ట్ 1వ తేదీనుంచి తగరతులు ప్రారంభమవుతాయన్నారు. విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు విద్యార్హత సర్టిఫికెట్లతోపాటు స్టడీ, ఇన్‌కం, రెసిడెన్షియల్, రేషన్‌కార్డు ఆధార్ కార్డు, ఆరు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ఎస్‌బీఐ అకౌంటు పాసు పుస్తకం తీసుకుని రావాలని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment