selection list
-
త్వరలో గ్రూప్–4 ఎంపిక జాబితా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) అతి త్వరలో గ్రూప్–4 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను ప్రకటించనుంది. ఈ కేటగిరీలో 8,180 ఉద్యోగాలకు గాను 9,51,321 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది జూలై 1వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఓఎంఆర్ ఆధారిత అర్హత పరీక్షలను టీఎస్పీఎస్సీ నిర్వహించింది. ఉదయం జరిగిన పేపర్–1 పరీక్షకు 7,62,872 మంది, మధ్యాహ్నం జరిగిన పేపర్–2 పరీక్షకు 7,61,198 మంది హాజరయ్యారు. జవాబు పత్రాలను మూల్యాంకనం చేసిన టీఎస్పీఎస్సీ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అభ్యర్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల జాబితాతో కూడిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను (జీఆర్ఎల్) వెబ్సైట్లో ఉంచింది.ఈ నేపథ్యంలోనే వీలైనంత త్వరగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను విడుదల చేసేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. అయితే డిజేబుల్డ్ (దివ్యాంగులు) కేటగిరీలో మాత్రం 1:5 నిష్పత్తిలో ఎంపిక చేపట్టనుంది. ప్రాథమిక ఎంపిక జాబితా విడుదల చేసిన వెంటనే ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేలా టీఎస్పీఎస్సీ కార్యాచరణ రూపొందించింది. అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేసింది.ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 2021–22 సంవత్సరం తర్వాత తీసుకున్న సర్టిఫికెట్‌ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. అదే విధంగా రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు, వివిధ కమ్యూనిటీలకు చెందిన అభ్యర్థులు కమిషన్ నిర్దేశించిన తేదీలతో కూడిన ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఏ క్షణంలోనైనా సర్టిఫికెట్ల పరిశీలన తేదీలు ఖరారు కావచ్చునని టీఎస్పీఎస్సీ తెలిపింది. -
బాసర ట్రిపుల్ ఐటీ రెండో జాబితా విడుదల
బాసర (ముధోల్): బాసర ట్రిపుల్ ఐటీలో 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండో జాబితాను ఆదివారం యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. మొదటి విడతలో 1,404 మంది విద్యార్థుల జాబితాలో గైర్హాజరైన 125 మందికి సంబంధించిన సీట్ల జాబితాను కళాశాల వెబ్సైట్లో పొందుపర్చారు. ఈనెల 7న ఉదయం 9 గంటల నుంచి విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభమవుతుందని ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో పాటు రాష్ట్రేతర (గ్లోబల్ సీట్లు), దివ్యాంగులకు కేటాయించిన సీట్లతో పాటు స్పోర్ట్స్, కాప్ కేటగిరీకి చెందిన 95 సీట్లకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నట్లు వెల్లడించారు. 125 సీట్లకు సంబంధించి 7న, మిగిలిన కేటగిరీలకు సంబంధించిన 95 సీట్లకు ఈనెల 12 నుంచి 14 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, మొదటి విడతలో 1,279 మంది విద్యార్థులు ప్రవేశం పొందార -
డీఎస్సీ ప్రొవిజినల్ సెలక్షన్ అభ్యర్థుల జాబితా
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2018 ప్రొవిజినల్ సెలక్షన్ జాబితాలో ఉన్న పోస్టు గ్రాడ్యుయేషన్ టీచర్లు, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అభ్యర్థుల వివరాలను పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. వీటిని https://schooledu.ap.gov.in/ వెబ్సైట్లో పొందుపరిచినట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కె.సంధ్యారాణి తెలిపారు. ప్రొవిజనల్ సెలక్షన్ జాబితాలో ఉన్న అభ్యర్థులు ఈనెల 21, 22 తేదీల్లో తమ సర్టిఫికెట్లను వెబ్సైట్లో తప్పకుండా అప్లోడ్ చేయాలని సూచించారు. సెప్టెంబర్ 23న పోస్టు గ్రాడ్యుయేషన్ టీచర్ అభ్యర్థుల సర్టిఫికెట్లను, సెప్టెంబర్ 24, 25 తేదీల్లో ట్రయిన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్ అభ్యర్థుల సర్టిఫికేట్లను వెరిఫికేషన్ చేస్తామని చెప్పారు. మొదటి ప్రోవిజినల్ సెలక్షన్ లిస్ట్ ప్రకారం ఉద్యోగ అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను వెబ్సైట్లో పొందుపరిచినట్లు వివరించారు. -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి ఎంపిక జాబితా విడుదల
వేంపల్లె : రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం పరిధిలలోని నూజివీడు, శ్రీకా కుళం, ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్ ఐటీలకు 2018–19 విద్యా సంవత్సరానికి సంబం ధించి ప్రవేశానికి ఎంపిక జాబితా విడుదలైంది. ఈ మేరకు శుక్రవారం విశాఖపట్టణంలోని ఆం ధ్రా యూనివర్సిటీలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ రామచంద్రరాజు, కన్వీనర్ గోపాల్‌రాజుల ఆధ్వర్యంలో ఎంపిక జాబితాను విడుదల చేశారు. నాలుగు ట్రిపుల్ ఐటీలకు 4వేలు సీట్లు ఉండగా.. 50850 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 257 సీట్లు స్పెషల్ కేటగిరీకి పోగా.. 3743 సీట్లు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని 8 జిల్లాలకు, వెంకటేశ్వర యూనివర్శిటీ పరిధిలోని 5 జిల్లాలకు సమానంగా కేటాయించారు. ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని 8జిల్లాలకు 1956సీట్లు, వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని 5జిల్లాలకు 1224 సీట్లు.. మిగిలిన 561సీట్లు ఇతర రాష్ట్రాలకు (నాన్ లోకల్) కేటాయించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 27,988 దరఖాస్తు చేసుకోగా.. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 22,862మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ప్రభుత్వ పాఠశాలలోని 2915 మంది విద్యార్థులు పదికి 10జీపీఏ పాయింట్లు సాధించగా.. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 7505 మంది పదికి 10 పాయింట్లు సాధించారు. వీరికి జులై 4, 5 తేదీలలో నూజివీడు, ఆర్కే వ్యాలీ(ఇడుపులపాయ) క్యాంపస్‌లలో అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుంది. అలాగే 6, 7 తేదీలలో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి సంబంధించి నూజివీడులో, ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఆర్కే వ్యాలీ ఇడుపులపాయలలో అడ్మిషన్లు జరుగుతాయి. మొత్తం 3743 సీట్లకుగానూ 1358 మంది బాలురు, 2385 మంది బాలికలు ఉన్నారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు ఆరేళ్ల సమీకృత సాంకేతిక విద్యను అందించేందుకు ట్రిపుల్ ఐటీలను నెలకొల్పారని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి డైరెక్టర్ అమరేంద్రకుమార్ తెలిపారు. అందులో భాగంగా ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి 936 సీట్లకు జులై 4, 5 తేదీలలో అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందని తెలిపారు. అందులో బాలురు 339 మంది, బాలికలు 597 మంది ఉన్నారని తెలిపారు. అదేవిధంగా ఇడుపులపాయ క్యాంపస్‌లో నిర్వహించే ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించి 936 సీట్లకు 6, 7 తేదీలలో అడ్మిషన్లు జరుగుతాయి. అందులో 320 మంది బాలురకు, 616 మంది బాలికలకు అడ్మిషన్లు జరుగుతాయి. జులై 16న ప్రత్యేక కేటగిరి విద్యార్థులకు అడ్మిషన్లు ఉంటాయి. 20వ తేదీన రెండవ జాబితా ఉంటుందని.. 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సూపర్ న్యూమరీ అడ్మిషన్లతో పూర్తవుతాయని తెలిపారు. ఆగస్ట్ 1వ తేదీనుంచి తగరతులు ప్రారంభమవుతాయన్నారు. విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు విద్యార్హత సర్టిఫికెట్లతోపాటు స్టడీ, ఇన్‌కం, రెసిడెన్షియల్, రేషన్‌కార్డు ఆధార్ కార్డు, ఆరు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ఎస్బీఐ అకౌంటు పాసు పుస్తకం తీసుకుని రావాలని ఆయన తెలిపారు. -
ఆర్టీసీ అప్రెంటిషిప్ ఎంపిక ఫలితాలు విడుదల
కర్నూలు(రాజ్‌విహార్): రోడ్డు రవాణా సంస్థలో అప్రెంటిషిప్ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న ఐటీఐ అభ్యర్థుల్లో అర్హులైన వారి జాబితాను విడుదల చేసినట్లు జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్. రజియా సుల్తానా శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ సారి అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం అమల్లోకి రావడంతో ఐటీఐలో వచ్చిన మార్కులు, సీనియారిటీ ఆధారంగా అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను తమ ట్రైనింగ్ కళాశాలతోపాటు జిల్లాలోని అన్ని డిపో మేనేజరు కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో అతికిస్తామని వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులు ఐటీఐ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు జిరాక్స్, రిజిస్ట్రేషన్ నంబరు, ప్రొఫైల్, కుల ధ్రువీకరణ పత్రాలు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో ఈనెల 12వ తేదీన ఉదయం 10:30 గంటలకు తమ కళాశాలకు హాజరు కావాలని సూచించారు.