ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి (ఫైల్), ఇన్‌సెట్‌లో శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్
సాక్షి, కొత్తపేట: వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయ రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ట్రిపుల్ ఐటీ) ప్రముఖ జాతీయ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్ శిల్పకళా ప్రతిభను ప్రశంసించింది. శిల్పి రాజ్‌కుమార్ తయారు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఈ నెల 8న ఆయన జయంతి సందర్భంగా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. చాన్సలర్ కేసీ రెడ్డి శిల్పి రాజ్‌కుమార్‌ను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రత్యేకంగా సన్మానించేందుకు ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు.
అయితే కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో శిల్పి ఆ కార్యక్రమానికి హాజరుకాలేదు. దానితో ట్రిపుల్ ఐటీ తరఫున చాన్సలర్ డాక్టర్ కేసీ రెడ్డి శిల్పి రాజ్‌కుమార్ ప్రతిభను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ లేఖ పంపారు. చిరునవ్వుతో జీవకళ ఉట్టిపడేలా విగ్రహాన్ని రూపొందించారని, మీరు ఎన్నో వైఎస్ విగ్రహాలు తయారుచేసి ఉండవచ్చు గానీ మీరు ఇచ్చిన విగ్రహం మా ట్రిపుల్ ఐటీకి మరింత శోభను తెచ్చిందని పేర్కొన్నారు. శిల్ప కళలో మీ ప్రతిభను విన్నాం.. ఈ విగ్రహం ద్వారా స్వయంగా చూశాం.. మీ ప్రతిభ ఎంతో ప్రశంసనీయం.. మీకు ఇంకా ఎంతో గొప్ప భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం.. అని ఆ లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment