
ఈఆర్‌పీ భవనం లోపల వసతులను పరిశీలించి వస్తున్న కలెక్టర్, జేసీ, సింగరేణి అధికారులు
కొత్తగూడెం అర్బన్: కొత్తగూడెం జిల్లా ఏర్పాటు కానున్న తరుణంలో జిల్లా కార్యాలయాల కోసం కలెక్టర్ లోకేష్‌కుమార్, జేసీ దివ్య సింగరేణి భవనాలను సోమవారం పరిశీలించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ఈఆర్‌పీ సింగరేణి భవనాన్ని కలెక్టర్ కార్యాలయానికి ఉపయోగించనున్న నేపథ్యంలో ఆ భవనం లోపల గదులు, సౌకర్యాలను పరిశీలించారు. సింగరేణి ప్రదానాస్పత్రి ఏరియాలోని సింగరేణి డిస్పెన్సరీని ఎస్పీ కార్యాలయానికి వినియోగించనున్న నేపథ్యంలో చిన్నాస్పత్రి భవనం, పక్కన ఉన్న రెసిడెన్సీ భవనాన్ని పరిశీలించారు. కలెక్టర్, జేసీ వెంట ఆర్డీఓ రవీంద్రనాథ్, తహశీల్దారు అశోక్‌చక్రవర్తి, సింగరేణి అధికారులు, సిబ్బంది ఉన్నారు.