పంట చేలను పరిశీలించిన డీడీఏ
చౌటుప్పల్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట చేలను వ్యవసాయ శాఖ డీడీఏ వై.మాధవి సోమవారం పరిశీలించారు. మండలంలోని అంకిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని జిల్లేడుచెల్క, మందోళ్లగూడెం శివారులో వర్షపు నీళ్లలో ఉన్న పత్తి, వరి, కంది చేలను పరిశీలించారు. పంటనష్టం అంచనా వేసేందుకు వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి నివేదించనున్నట్లు పేర్కొన్నారు. ఆమె వెంట ఏడీఏలు శైలజ, వినోద్‌కుమార్, సర్పంచ్ సుర్వి మల్లేష్‌గౌడ్, ఏవో సీహెచ్.అనురాధ, ఏఈవో ప్రకాష్‌గౌడ్, శశాంక్ తదితరులున్నారు.