DDA
-
రెండున్నరేళ్లుగా లైంగిక దాడి
సాక్షి,న్యూఢిల్లీ: ‘రెండున్నరేళ్లు లైంగిక దాడికి తెగబడ్డారు..ఘాతుకాన్ని వీడియోలో రికార్డు చేశారు..ఇప్పుడు నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు’ ఇదీ ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ(డీడీఏ)లో పనిచేసే బాధిత ఉద్యోగిని ఆవేదన. సీనియర్ అధికారి సహా నలుగురు సహోద్యోగులు తనపై పలు సందర్భాల్లో అత్యాచారానికి ఒడిగట్టారని చెబుతున్నారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా వాటిని వీడియో తీసి బెదిరిస్తున్నారని వాపోయారు. తనకు రావాల్సిన బకాయిలు చెల్లించకుండా తనను హతమారుస్తామని హెచ్చరిస్తున్నారని చెప్పారు. తనకు జరిగిన అన్యాయాన్ని బాధిత ఉద్యోగిని సీనియర్ డీడీఏ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. బాధిత మహిళకు 2014లో భర్త మరణించిన క్రమంలో డీడీఏలో ఉద్యోగం లభించింది. కాగా, బాధితురాలి ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని డీసీపీ రొమిల్ బనియా చెప్పారు. ఉద్యోగిని ఫిర్యాదుపై శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశించామని సీనియర్ డీడీఏ అధికారి వెల్లడించారు. -
ఎఫ్‌టీసీ డీడీఏగా సురేంద్ర బెనర్జీ
అనంతపురం అగ్రికల్చర్ : వ్యవసాయశాఖకు అనుబంధంగా ఉన్న రైతు శిక్షణా కేంద్రం (ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్–ఎఫ్‌టీసీ) డీడీఏగా సురేంద్ర బెనర్జీ బాధ్యతలు తీసుకున్నారు. బుధవారం స్థానిక వ్యవసాయశాఖ జేడీ కార్యాలయంలో ఎఫ్‌టీసీ ఇన్చార్జ్ డీడీఏ స్వయంప్రభ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా సురేంద్రబెనర్జీ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా వాయిల్పాడు ఏడీఏగా పనిచేస్తున్న తనకు డీడీఏగా పదోన్నతి కల్పించి ఇక్కడికి బదిలీ చేశారన్నారు. రైతు శిక్షణా కేంద్రం ద్వారా రైతులు, అధికారులకు శిక్షణ కార్యక్రమాలు, క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. జేడీఏ పీవీ శ్రీరామమూర్తి, డీడీఏ (అగ్రానమీ) శ్రీనివాసులు, ఏడీఏ (పీపీ) జి.విద్యావతి, ఇతర అధికారులు సురేంద్ర బెనర్జీకి శుభాకాంక్షలు తెలియజేశారు. -
డీడీఏగా శ్రీనివాసులు బాధ్యతల స్వీకరణ
అనంతపురం అగ్రికల్చర్ : వ్యవసాయశాఖ జేడీ కార్యాలయంలో డీడీఏగా శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఆయన కర్నూలు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చారు. అగ్రానమీ డీడీఏగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులకు ఆశాఖ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జేడీఏ పీవీ శ్రీరామమూర్తిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. -
పంట చేలను పరిశీలించిన డీడీఏ
చౌటుప్పల్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట చేలను వ్యవసాయ శాఖ డీడీఏ వై.మాధవి సోమవారం పరిశీలించారు. మండలంలోని అంకిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని జిల్లేడుచెల్క, మందోళ్లగూడెం శివారులో వర్షపు నీళ్లలో ఉన్న పత్తి, వరి, కంది చేలను పరిశీలించారు. పంటనష్టం అంచనా వేసేందుకు వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి నివేదించనున్నట్లు పేర్కొన్నారు. ఆమె వెంట ఏడీఏలు శైలజ, వినోద్‌కుమార్, సర్పంచ్ సుర్వి మల్లేష్‌గౌడ్, ఏవో సీహెచ్.అనురాధ, ఏఈవో ప్రకాష్‌గౌడ్, శశాంక్ తదితరులున్నారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
అనుమతిలేని దుకాణాల్లో విత్తనాల విక్రయాలు నేరం డీడీఏ బొబ్బిలి సింగారెడ్డి హెచ్చరిక హన్వాడ: ఫర్టిలైజర్ దుకాణాల్లో రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని మహబూబ్‌నగర్ వ్యవసాయశాఖ డీడీ(పీపీ) బొబ్బిలి సింగారెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయా దుకాణాల్లో నిల్వ ఉన్న విత్తనాలు, రికార్డులను పరిశీలించారు. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తప్పకుండా రశీదు తీసుకోవాలని సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో లైసెన్స్ లేని దుకాణాల్లో ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు విక్రయిస్తున్నట్లు తమ దష్టికి వచ్చిందని, అలాంటి వారు ముందుకు వస్తే వారికి షాపు నిర్వహణకు అనుమతులు జారీ చేస్తామన్నారు. లేనిచో మరో 15రోజుల్లో వారిపై ఆకస్మిక దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈమేరకు ఆయన మండల వ్యవసాయాధికారి చంద్రమౌళికి ఆదేశాలు జారీ చేశారు. దానిమ్మ తోట పరిశీలన.. మండలంలోని మునిమోక్షం శివారులో సేంద్రియ పద్ధతిలో సాగవుతున్న దానిమ్మతోటను డీడీ బొబ్బిలి సింగారెడ్డి బుధవారం పరిశీలించారు. అదేవిధంగా గచ్చిబౌళి త్రిపుల్‌ఐటి ప్రొపేసర్ శ్యామ్సుందర్రెడ్డితో కలిసి సాగుపద్ధతులను పర్యవేక్షించారు. ఆత్మషీల్డ్ ద్వారా త్వరలో జిల్లాలో రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించనున్నామని ఆయన వెల్లడించారు. మండలంలో అత్యధికంగా 2వేల ఎకరాల్లో సాగవుతున్న మొక్కజొన్న పాలిపోయినట్లుగా అయితే రైతులు 2శాతం యూరియాను పిచికారీ చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుందని సూచించారు. జిల్లాకు 34,600 క్వింటాళ్ల యూరియా అందుబాటులో ఉందని, అవసరమున్న డీలర్లు సంప్రదించినట్లయితే సరఫరా చేయనున్నామన్నారు. ఆయా మండలాల్లోని సొసైటీలకు సైతం సరఫరా చేస్తామని, యూరియాకు లోటు లేదని ఆయన వెల్లడించారు. -
నెల రోజుల్లో 1,500 ఫ్లాట్ల వాపసు
సాక్షి, న్యూఢిల్లీ: లక్కీ డ్రాలో డీడీఏ ఫ్లాటు పొందడమంటే లాటరీ తగిలినట్లే అనుకునే రోజులు పోయాయి. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన హౌజింగ్ స్కీమ్ -2014 కింద ఫ్లాట్లు అలాటైనవారిలో 1500 మంది తమ ఫ్లాట్లను వెనక్కి ఇచ్చేశారు. నెలరోజుల్లో ఫ్లాట్లు నిరాకరించినవారి సంఖ్య వెయిటింగ్ లిస్టులో ఉన్నవారి సంఖ్య క ంటే ఎక్కువగా ఉండడం విశేషం. వెయిటింగ్ లిస్టులో 1200 మంది ఉన్నారు. డిమాండ్ లెటర్లు జారీ అయ్యేలోగా ప్లాట్లను నిరాకరించేవారి సంఖ్య మరింత పెరుగవచ్చని కూడా అంటున్నారు. వాపసు చేసిన ఫ్లాట్లు ద్వారకా, రోహిణీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతాలు పూర్తిగా అభివృద్ధి చెందలేదని, ఇక్కడున్న డీడీఏ ఫ్లాట్లకు రాకపోకలు సాగించడం కష్టమని ఫ్లాట్లు వాపసు చేసినవారు అంటున్నారు. ప్రజారవాణా వ్యవస్థ కూడా బాగాలేదని అంటున్నారు. నరేలాకు ప్రజారవాణా వ్యవస్థ సరిగాలేదని, రోహిణీ సెక్టార్ 34, 35లలో మరో ఆరువేల ప్లాట్లు నిర్మించవలసిఉందని అంటున్నారు. కర్వాలా గ్రామ వాసులతో జరిగిన గొడవ కారణంగా రోహిణీలో ఫ్లాట్ల నిర్మాణం ఆలస్యమైంది. ద్వారకాలో నిర్మించిన ఫ్లాట్లు చాలా చిన్నగా ఉన్నాయని కూడా అంటున్నారు. ఈడబ్ల్యుఎస్ కేటగిరీ కోసం నిర్మించిన ఫ్లాట్లను డీడీఏ ఆఖరి నిమిషంలో సాధారణ కేటగిరీ కింద నుండే డీడీఏ వన్ బీహెచ్‌కే ఫ్లాట్ల కేటగిరిలో చేర్చించిందని అంటున్నారు. ఫ్లాట్లు అలాటైనవారు ఐదేళ్ల వరకు వాటిని విక్రయించరాదని డీడీఏ విధించిన షరతు కూడా కొందరిని ఫ్లాట్లను వాపసుచేసేలా చే సిందని చెబుతున్నారు. -
నిర్మాణ నిబంధనలు మరింత సరళతరం
సాక్షి, న్యూఢిల్లీ: నగరవాసులకు శుభవార్త. భవన నిర్మాణ ప్లాన్లకు ఆమోదం ఇక సులభతరంగా మారింది. ఇందుకు కారణం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు 1983నాటి బిల్డింగ్ బె లాస్‌ను సరళీకరించి, క్రమబద్ధీకరించడంతో పాటు నవీకరించడమే. ఢిల్లీ అర్బన్ ఆర్ట్స్ కమిషన్ (డీయూఏసీ) డీడీఏ, మున్సిపల్ సంస్థలతో కలిసి బైలాస్‌ను సరళీకరించి, సరళీకృత బైలాస్ ముసాయిదాను పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖకు సమర్పించింది. బిల్డింగ్ బైలాస్‌ను వీలైనంత త్వరగా నోటిఫై చేయాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు... ఢిల్లీ అభివృద్థి సంస్థను ఆదేశించారు. తాజా బైలాస్ ప్రకారం 100 చదరపు మీటర్ల వరకు ఉండే చిన్న సైజు నివాస ప్లాట్ల అనుమతి ప్రక్రియ నుంచి మినహాయింపు లభించింది. ఈ ప్లాట్లలో భవనం నిర్మించే వారు అవసరమైన సమాచారాన్ని ఒక పేజీలో పొందుపరచి సంబంధిత పట్టణ సంస్థకు సమర్పించి నిర్మాణం జరుపుకోవచ్చు. ఇది మూడేళ్లపాటు చెల్లుబాటులో ఉంటుంది. 100 నుంచి 20 వేల చదరపు మీటర్ల వరకు ఉండే ప్లాట్లు సంబంధిత సంస్థల నుంచి ఆమోదం పొందడం కోసం నిర్దిష్ట సమయాన్ని నిర్ధారించారు. 20 వేల చదరపు మీటర్ల కన్నా ఎక్కువ విస్తీర్ణం ఉండే ప్లాట్ల అనుమతుల కోసం సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను ప్రతిపాదించారు. అనుమతుల మంజూరు కోసం సంబంధిత సంస్థల ప్రతినిధులతో కూడిన ఉన్నతాధికారుల కమిటీ దరఖాస్తులను పరిశీలిస్తుంది. ఢిల్లీవాసులు, వృత్తినిపుణులు అత్యంత సులువుగా తమ భవనాల ప్లాన్లకు ఆమోదం పొందే వీలును తాజాగా రూపొందించిన బిల్డింగ్ బైలాస్ కల్పించాయి. హరిత నిర్మాణాలు, ఇంకా జల సంరక్షణ, యాజమాన్యం వంటి తదితర సవాళ్లను కొత్త నిబంధనలు పరిష్కరించనున్నాయి. -
డీడీఏ గృహనిర్మాణ పథకం డ్రా వాయిదా
న్యూఢిల్లీ: సాంకేతిక అవరోధాల కారణంగా ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) సోమవారం నిర్వహించతలపెట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన గృహనిర్మాణ పథకం -2014 వాయిదాపడింది. ప్రధాన కార్యాలయం వికాస్ సదన్‌లో సంబంధిత అధికారులు ఆదివారం ఉదయం ట్రయల్ డ్రా నిర్వహించారు. అయితే తాజా డ్రా తేదీని అధికారులు ఇంకా ప్రకటించాల్సి ఉంది. కాగా 2014-గృహ పథకం కింద వివిధ కేటగిరీల్లో డీడీఏ మొత్తం 25 వేల ఫ్లాట్లను నిర్మిస్తోంది. వీటి ఖరీదు రూ. ఏడు లక్షలు మొదలుకుని రూ. 1.2 కోట్లవరకూ ఉంటుంది. ఇందుకోసం డీడీఏ అప్పట్లో మొత్తం 17 లక్షల బ్రోచర్లను ప్రచురించిన సంగతి విదితమే. -
గృహ పథకానికి నేడు ట్రయల్ డ్రా
న్యూఢిల్లీ: ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) ఇటీవల ప్రకటించిన గృహనిర్మాణ పథకం-2014కు పదిలక్షలమందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకానికి సంబంధించి సోమవారం ట్రయల్ డ్రా తీయనున్నారు. వాస్తవానికి ఈ నెల పదో తేదీనాడే డ్రా నిర్వహించాల్సి ఉంది. అయితే సోమవారం నాటి ట్రయల్ డ్రాకి వచ్చే స్పందననుబట్టి డ్రా తేదీని ప్రకటించాలని డీడీఏ నిర్ణయించిన సంగతి విదితమే. ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ ‘సోమవారం నాటి ఫలితాల,నుబట్టి డ్రా వాస్తవ తేదీని నిర్ణయిస్తాం. సోమవారం డ్రై (ట్రయల్ డ్రా) రన్ నిర్వహించనున్నాం. డ్రా నిర్వహణ విషయంలో మా సన్నద్ధత ఏవిధంగా ఉందనే విషయం తెలుసుకునేందుకే ఈ డ్రై రన్. డ్రై రన్లో ఎదురయ్యే ఇబ్బందులను గమనించి నిజమైన డ్రా నిర్వహించే సమయంలో ఆ పరిస్థితి పునరావృతం కాకుండా జాగ్రత్తపడతాం’అని అన్నారు. యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం కాగా సోమవారంనాటి డ్రై రన్‌ను డీడీఏ... యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇలా డ్రైరన్నుప్రత్యక్ష ప్రసారం చేయనుండడం ఇదే తొలిసారి. డ్రైరన్‌ను నిర్వహిస్తే ఆ సమయంలో తలెత్తిన సమస్యలు రియల్ డ్రా సమయంలో పునరావృతం కాకుండా చూడొచ్చనేదే డీడీఏ ఆలోచన. యూట్యూబ్ వెసులుబాటు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించవచ్చు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించిన ఈ పథకానికి అనూహ్యరీతిలో స్పందన లభిస్తోంది. అటు ఆన్‌లైన్‌లోనూ, ఇటు ఆఫ్లైన్లోనూ అనేకమంది ఔత్సాహికులు ఈ పథకం గురించి తెలుసుకున్నారు. దరఖాస్తు కూడా చేసుకున్నారు. వాస్తవానికి ఈ పథకానికి తుది గడువును అక్టోబర్ తొమ్మిదో తేదీగా డీడీఏ తొలుత ప్రకటించింది. అయితే అనూహ్య రీతిలో స్పందన రావడంతో దానిని మరలా అదే నెల 15వ తేదీకి పొడిగించింది. తొలిసారి ప్రకటించిన తుది గడువునాటికి డీడీఏకి 7.5 లక్షల దరఖాస్తులు అందాయి. గడువు ముగిసేనాటికి మొత్తం మొత్తం పది లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ ‘దరఖాస్తుదారులు ఈ పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో తెలుసుకుంటున్నారు. తమ దరఖాస్తు ఏ దశలో ఉందనే విషయాన్ని నిర్థారించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డ్రా ఎలా జరుగుతుందనే విషయాన్ని కూడా మా వెబ్సైట్లో పొందుపరచనున్నాం’ అని అన్నారు. కాగా 2014-గృహ పథకం కింద వివిధ కేటగిరీల్లో డీడీఏ మొత్తం 25 వేల ఫ్లాట్లను నిర్మిస్తోంది. వీటి ఖరీదు రూ. ఏడు లక్షలు మొదలుకుని రూ. 1.2 కోట్లవరకూ ఉంటుంది. ఇందుకోసం డీడీఏ అప్పట్లో మొత్తం 17 లక్షల బ్రోచర్లను ప్రచురించింది. డ్రా కోసం ప్రత్యేక సర్వర్ 2014 గృహనిర్మాణ పథకం డ్రా కోసం ప్రత్యేకంగా ఓ సర్వర్‌ను సిద్ధం చేయాలని ఢిల్లీ అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఈ బాధ్యతను సీ-డాక్ (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్) సంస్థకు అప్పగించింది. అయితే ఈ డ్రాను ఎక్కడ నిర్వహించాలనే విషయానికి సంబంధించి డీడీఏ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. నోయిడాలోగానీ లేదా డీడీఏ ప్రధాన కార్యాలయమైన వికాస్ సదన్లోగానీ డ్రాని నిర్వహించే అవకాశముందని ఆ సంస్థ సంచాలకుడు వీఎస్ తొమర్ తెలిపారు. 2010లో నిర్వహించిన డ్రాకి కూడా సీడాక్ సంస్థ తనవంతు సహకారం అందించిన సంగతి విదితమే. ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ అంతా సవ్యంగా సాగితే 250 సీట్ల సామర్థ్యం కలిగిన హాలులో డ్రాను నిర్వహిస్తాన్నారు. డ్రా కార్యక్రమాన్ని అధికారిక వెబ్సైట్లో ప్రసారం చేయబోమని అన్నారు. ఇందుకు కారణం తమ వెబ్‌సైట్‌ను తిలకించే వారి సంఖ్య అధికంగా ఉండడమేనని, ఇందువల్ల ఈ వెబ్సైట్ మరోసారి కుప్పకూలిపోయే ప్రమాదం ఉందన్నారు. అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చేయడమే తమ ఉద్దేశమన్నారు. -
ఎంసీడీసీ ‘డిమాండ్’పై కోర్టుకెక్కిన డీడీఏ
న్యూఢిల్లీ: నగర పరిధిలోని నజుల్ భూముల నుంచి రూ. 530 కోట్ల ఆస్తి పన్ను చెల్లించాలని మున్సిపల్ కార్పొరేషన్ డిమాండ్ నోటీసు జారీ చేయడంపై ఢిల్లీ అభివృద్ధి అథారిటీ(డీడీఏ) హైకోర్టును ఆశ్రయించింది. యూనియన్ ప్రభుత్వానికి చెందిన నజుల్ భూములను వివిధ అభివృద్ధి పనుల కోసం అప్పగిస్తారని పిటిషన్లో పేర్కొంది. దీనిపై జస్టిస్ బీడీ అహ్మద్, సిద్ధార్థ మ్రిదుల్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. న్యాయవాది గిరిరాజు సుబ్రమణ్యం ద్వారా డీడీఏ హైకోర్టుకు పిటిషన్‌ను దాఖలు చేసింది. వివిధ ప్రాంతాల్లో అభివృద్ధికి అప్పగించిన నజుల్ భూములపై రూ. 530 కోట్ల ఆస్తిపన్ను చెల్లించాలని అక్టోబర్ 20 వ తేదీన డీడీఏకు డిమాండ్ నోటీసు అందజేసినట్లు పేర్కొన్నారు. యూనియన్‌కు చెందిన నజుల్ భూములకు డీడీఏ రక్షణకు మాత్రమే పరిమితమని, యాజమాన్యహక్కులేవీ బదిలీ కాలేదని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 285 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ఆస్తిపన్నులో నజల్ భూములకు మినహాయింపు ఉందని, భారత ప్రభుత్వానికి చెందిన నజల్ భూములకు డీడీఏ ఏజెంట్ మాత్రమేనని తెలిపారు. రాజ్యాంగంలోని 285 ఆర్టికల్ ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ విధించే ఆస్తిపన్నులో మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్డీఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్లు జారీ చేసిన డిమాండ్ నోటీసు ఏకపక్షంగా ఉన్నదని, దీనిపై తాత్కాలికంగా నిషేధించాలిన డీడీఏ న్యాయవాది పిటిషన్లో పేర్కొన్నారు. నజల్ భూములకు డీడీఏనే యజమాని అని మున్సిపల్ కార్పొరేషన్ దురభిప్రాయానికి వచ్చి డిమాండ్ నోటీసును జారీ చేసినట్లు డీడీఏ పిటిషన్లో పేర్కొన్నారు. -
డీడీఏ ఫ్లాట్ల కోసం 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
సాక్షి, న్యూఢిల్లీ: పేదోడి సొంతింటి కలను సాకారం చేసేందుకు ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) ప్రారంభించిన హౌసింగ్ స్కీమ్ పథకం-2014లో ఇళ్లను పొందేందుకు దరఖాస్తు గడువు తేదీ మరింత పెరిగింది. ఈ పథకంలో ఇళ్లు పొందేందుకు దరఖాస్తుల జారీ, సమర్పణ ప్రక్రియ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తుల సమర్పణకు అక్టోబర్ 9వ తేదీని చివరి తేదీగా డీడీఏ ప్రకటించింది. అయితే ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో మరో ఆరురోజులు గడువును పొడిగిస్తున్నట్లు డీడీఏ ప్రకటించింది. పితృపక్షం, వరుసగా పండుగలు రావడంతో ప్రజలు దరఖాస్తులను సమర్పించలేకపోయామని, గడువు పెంచాల్సిందిగా కూడా చాలామంది నుంచి అభ్యర్థనలు అందాయని డీడీఏ అధికారి ఒకరు తెలిపారు. దరఖాస్తుల సమర్పణకు గడువు పొడిగిస్తున్నట్లు డీడీఏ ప్రకటించడంతో సమర్పించే దరఖాస్తుల సంఖ్య భారీగా పెరుగుతుందన్నారు. ఈ పథకం కింద డీడీఏ 25 వేలకుపైగా ఫ్లాట్లు కేటాయించనుంది. అయితే ఈ ఫ్లాట్లలో రెండు లేదా మూడు బెడ్ రూమ్‌లున్న ఫ్లాట్ల సంఖ్య తక్కువగా ఉండడంలో గత డీడీఏ హౌజింగ్ స్కీములకు లభించినంత భారీ ప్రతిస్పం దన ఈ స్కీముకు లభించడంలేదని అంటున్నారు. దానికి తోడు రోహిణీ సెక్టార్ 34, 35లోని 11 వేల ఫ్లాట్ల విస్తీర్ణం చాలా తక్కువగా ఉండడం కూడా కూడా ఆసక్తిగలవారిని నిరుత్సాహపరిచిందని, బ్యాంకులు కూడా లక్ష రూపాయలు జమ చేసేం దుకు ఫైనాన్సింగ్ స్కీమును ఆలస్యంగా ప్రారంభిం చాయని, ఐదేళ్ల వరకు ఫ్లాటు విక్రయించరాదని విధించిన షరతు వల్ల కూడా దరఖాస్తు సమర్పించేవారి సంఖ్య తగ్గిందని చెబుతున్నారు. -
సత్వరమే నోటిఫికేషన్
సాక్షి, న్యూఢిల్లీ: ఏకీకృత భవన నిర్మాణ నిబంధనల ముసాయిదాను ప్రభుత్వ వెబ్సైట్లలో ఉంచి భాగస్వాముల అభిప్రాయాలను కోరాలని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్ణయించింది.వినియోగదారులకు అత్యంత అనుకూలంగా ఉండే ఈ నోటిఫికేషన్‌ను త్వరగా విడుదల చేయాలని మంత్రి వెంకయ్యనాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతమున్న భవన నిర్మాణ నిబంధనలు 1983 నుంచి అమల్లో ఉన్నాయి. అయితే అవి ఎవరికీ అనుకూలంగా లేవని భావిస్తున్నారు. కాగా మంత్రి ఆదేశాల నేపథ్యంలో సంబంధిత శాఖ కార్యదర్శి శంకర్ అగర్వాల్ మంగళవారం ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) వైస్‌చైర్మన్, కార్యదర్శితో పాటు ఢిల్లీ అర్బన్ ఆర్ట్స్ కమిషన్ (డీయూఏసీ) అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్లకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. డీయూఏసీ... 2013 జన వరిలో రూపొంది ంచిన ఏకీకృత భవన నిర్మాణ నిబంధనల ముసాయిదాను పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ, డీడీఏ, డీయూఏసీ వెబ్సైట్లలో రెండువారాలపాటు ఉంచి అందరి సూచనలు, సలహాలతోపాటు వారి వ్యాఖ్యలను కూడా కోరాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఆ తరువాత నిపుణులు, ఆర్కిటెక్టులు, పౌరసంస్థలతోపాటు వాటాదారులందరితో ఓ వర్క్‌షాపును నిర్వహిస్తారు. ఆవిధంగా అందిన సూచనలు, సలహాలను ఏకీకృత భవన నిర్మాణ నిబంధనల ముసాయిదాలో చేరుస్తారు, దానిని పరిశీలనకోసం నిపుణుల కమిటీకి పంపుతారు. భవన నిర్మాణ నిబంధనలపై పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రతిపాదించిన నోటిఫికేషన్ మూడు నెలల్లోగా వెలువడుతుందని భావిస్తున్నారు. ప్రతి పాదిత నిబంధనలు భవన నిర్మాణాలకు అనుమతులను పొందే పద్ధతిని సరళీకరించడంతో పాటు వాటిని వినియోగదారులకు సన్నిహితంగా మారుస్తాయని అంటున్నారు. దీంతోపాటు పర్యావరణ అనుకూల భవనాల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తాయని అంటున్నారు. ఇంధన పొదుపును కూడా ప్రోత్సహిస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న 60 రోజుల్లోగా భవన నిర్మాణానికి అనుమతించాల్సి ఉంది. అయితే కఠినమైన నియమనిబంధనల కారణంగా ఆశించినంత సులువుగా జరగడం లేదు. కాగా ఢిల్లీ అర్బన్ ఆర్ట్స్ కమిషన్ (డీయూఏసీ) ఈ నిబంధనలను రూపొందించిన సంగతి విదితమే. -
స్వాధీనమయ్యేదెన్నడో?
తనకూ ఓ ఇల్లు కానీ, కనీసం స్థలంకానీ ఉండాలని సామాన్యులు ఆశిస్తారు. తక్కువ ధరలో కొనగలిగితే బాగుంటుందని భావిస్తారు. ప్రైవేటు బిల్డర్లు నిర్మించే ఫ్లాట్ల ధరలు అందుబాటులో ఉండవు కనుక ప్రభుత్వ ప్రాజెక్టులకు దరఖాస్తు చేసుకుంటారు. అందులో కొంతమందికే ఫ్లాట్లు దక్కుతాయి. మిగిలినవారికి మిగిలేది నిరాశే. అయితే అసలు కేటాయింపే జరగక పోతే ఇక వారు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి. రోహిణీ ప్రాంతంలో 32 ఏళ్ల క్రితం డీడీఏ ప్లాట్లు దక్కినా అవి ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో బాధితులకు ఎదురుచూపులే మిగిలాయి. న్యూఢిల్లీ: ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) ఇటీవల ప్రకటించిన నూతన గృహనిర్మాణ ప్రాజెక్టుకు రిజిస్ట్రేషన్లు జోరుగా జరుగుతున్నాయి. అనేకమంది నగరవాసులతోపాటు ఇతర ప్రాంతాలవారు వీటికోసం పెద్దసంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇదిలాఉంచితే 1982లో నగరంలోని రోహిణీ ప్రాంతంలో డీడీఏ నిర్మించిన స్థలాల కేటాయింపు ప్రక్రియ ఏనాడో పూర్తయినప్పటికీ వాటి దరఖాస్తుదారులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అక్కడ విద్యుత్, రహదారులు, మురుగుకాల్వలు వంటి మౌలిక వసతులను డీడీఏ ఇప్పటిదాకా కల్పించలేదు. దీంతో అనేకమంది బాధితులు ఈ ఏడాది జూన్‌లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం నాలుగు నెలల్లోగా దరఖాస్తుదారులకు అందజేయాలంటూ ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్పందించిన డీడీఏ అధికారులు విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఢిల్లీ విద్యుత్ నియంత్రణ సంస్థ (డీఈఆర్సీ)ని ఆదేశించారు. ఈ మేరకు ఇటీవల ఓ లేఖ రాశారు. పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని కోరారు. అంతేకాకుండా విద్యుత్ నెట్‌వర్క్‌కు సంబంధించి కనీస మౌలిక వసతులను కల్పించాల్సిందిగా టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ (టీపీడీడీఎల్)ను కూడా ఆదేశించారు. విద్యుత్‌కు సంబంధించిన పనులు పూర్తయితే తమ బడ్జెట్‌కు లోబడి గృహాలను నిర్మించుకునేందుకు లబ్ధిదారులు సిద్ధంగా ఉన్నారని సదరు లేఖలో అధికారులు పేర్కొన్నారు. ఈ విషయమై సంబంధిత అధికారి ఒక రు మీడియాతో మాట్లాడుతూ 1982లో దరఖాస్తు చేసినవారిలో కొంతమంది ఏడు సంవత్సరాల క్రితం స్థలాలు ఇచ్చామని అంగీకరించారు. త్వరలో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తాం వివిధ కారణాలవల్ల 1982 నాటి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నవారికి నిర్దిష్ట కాలవ్యవధిలోగా ప్లాట్లను కేటాయించడం సాధ్యం కాకపోవచ్చని తెలియజేస్తూ త్వరలో అత్యున్నత న్యాయస్థానంలో ఓ రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసేయోచనలో ఉన్నట్టు డీడీఏ అధికారి ఒకరు తెలియజేశారు. మాట నిలబెట్టుకోలేకపోయింది డీడీఏ తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిందని 1982లో ప్లాట్‌కోసం దరఖాస్తు చేసుకున్న రాహుల్ గుప్తా అనే నగరవాసి వాపోయాడు. అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారిలో అనేకమందికి ప్లాట్లు ఇవ్వలేకపోయిన ఈ సంస్థ మళ్లీ తాజాగా గృహ పథకాన్ని ఎలా ప్రారంభిస్తుందని ఆయన ప్రశ్నించారు. 2003-07 మధ్యకాలంలో కేటాయింపులు జరిపిన ప్లాట్లకు సంబంధించి అంతర్గత మురుగుకాల్వల నిర్మాణం కోసం డీడీఏ అధికారులు ఇటీవల టెండర్లను ఆహ్వానించారు. -
దరఖాస్తు పూర్తి ఇంకా సులువు
సాక్షి, న్యూఢిల్లీ: తాము నిర్మించిన ఇళ్లను కొనుగోలు చేయదలుచుకున్నవారికి ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) ఓ వెసులుబాటు కల్పించింది. తమ ఫారాన్ని ఎలా పూర్తిచేయాలో తెలియజేయడం కోసం ఆన్లైన్ వీడియోగైడ్ను తన వెబ్సైట్లో ఉంచిం ది. ఫారాన్ని నింపేటప్పుడు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఈ వీడియో వివరిస్తుంది. ఆరు నిమిషాల నిడివికలిగిన ఈ వీడియో డిడిఏ హౌసింగ్ స్కీమ్-2014 పేజీలో అందుబాటులో ఉంటుంది. ఫార ంను ఎలా పూర్తిచేయాలనే విషయాన్ని ఈ వీడియోలో కాలం వారీగా వివరించారు. దరఖాస్తుఫారాల పూర్తికి సంబంధించి పలువురు సందేహాలను వెలిబుచ్చుతుండడం,సలహాలు కోరుతున్నందువల్ల ఈ వీడియోను తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు డీడీఏ తెలియజేసింది. 25 వేలకు పైగా ఫ్లాట్ల కేటాయింపుకోసం డీడీఏ ప్రకటించిన హౌసింగ్ పథకాన్కి విశేష స్పందన లభిస్తోంది. ఈ నెల ఒకటో తేదీన ప్రారంభించిన ఈ పథకానికి అదే రోజునే 11 లక్షల హిట్లు రావడంతో వెబ్సైట్ కుప్పకూలిన సంగతి విదితమే. దీంతో ఆన్లైన్ ట్రాఫిక్ అవసరాలకు తగ్గట్టుగా డీడీఏ తన సర్వర్‌ను నవీకరించక తప్పలేదు. ఈ పథకం కోసం డీడీఏమొదట 15 లక్షల బ్రోచర్లను ముద్రించింది.అయితే డిమాండ్ విపరీతంగా ఉండడంతో మరో ఐదు లక్షల ప్రతులకు ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటి వరకు 14 లక్షలకు పైగా ఫారాలు అమ్ముడుపోయాయి. దాదాపు 20 వేల దరఖాస్తులు డీడీఏకి అందాయి. ద రఖాస్తుల సమర్పణకు ఆఖరి రోజు వచ్చే నెల తొమ్మిది. -
ఇంతకీ వాళ్లేమైనట్టు?
న్యూఢిల్లీ: ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ)లో నకిలీ ఉద్యోగులు ఉన్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 1,600 మంది ఉద్యోగులు మస్టర్ రోల్లోకే రాకపోవడంతో ఈ అనుమానం నానాటికీ బలపడుతోంది. గత ఏడాది అధికారికంగా ఉత్తర్వులు జారీచేసినప్పటికీ వేలిముద్రలు ఇచ్చేందుకు 2,200 మంది ఉద్యోగులు రానేలేదు. 14 వేలమంది మాత్రమే ఇచ్చారు. దీంతో ఈ విషయమై ఆరా తీసింది. దీంతో నాలుగు వందలమంది ఉద్యోగుల ఆచూకీ దొరికింది. దీంతో కనిపించని ఉద్యోగుల సంఖ్య 1,600లకు చేరుకుంది. కాగా ఈ సంస్థలో దాదాపు 15,600 మంది ఉద్యోగులు విధులను నిర్వర్తిస్తున్నారు. ఈ విషయమై డీడీఏ ఉపాధ్యక్షుడు బల్వీందర్‌కుమార్ మాట్లాడుతూ దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. నకిలీ ఉద్యోగుల విషయమై ఆరా తీస్తున్నామన్నారు. ఏ అంశాన్ని కొట్టిపారేయలేమన్నారు. అసలేమి జరిగిందనేది అర్ధం కావడం లేదన్నారు. కాగా డీడీఏ తన సిబ్బందికి సంబంధించిన డాటాబేస్‌ను ఈ ఏడాది మేలో సరళం చేసింది. అంతేకాకుండా బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతోపాటు వారికి ఏడు అంకెలతో కూడిన గుర్తింపుకార్డులను కూడా జారీచేసింది. ఆ సమయంలోనే ఉద్యోగులు తమ తమ వేలిముద్రలను ఇవ్వాలని కోరింది. దీంతో అసలు విషయం బయటపడింది. ఈ విషయమై బల్వీందర్ మాట్లాడుతూ సిబ్బంది వేలిముద్రలను గతంలో వికేంద్రీకరించామని, ఇప్పుడు ఒక్కచోటికే తీసుకొస్తున్నామన్నారు. నగరంలోని వికాస్ మినార్ ఐటీఓ, ద్వారక, రోహిణి, కీర్తినగర్, జనక్‌పురి తదితర ప్రాంతాల్లోనూ తమకు కార్యాలయాలు ఉన్నాయన్నారు. వీటితోపాటు స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్దకూడా రెండు కార్యాలయాలు ఉన్నాయన్నారు. అందువల్ల కొంతమంది తమ వివరాలను నమోదు చేసుకోలేకపోయి ఉండొచ్చన్నారు. వీటిల్లో నాలుగుచోట్ల బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేశామన్నారు. త్వరలో మొత్తం 125 బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. -
పరిశుభ్ర రాజధాని కోసం ప్రత్యేక కార్యక్రమం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ సుందరీకరణకు త్వరలోనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని కేంద్ర పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూళన శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వివిధ శాఖల అధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. పచ్చదనం-పరిశుభ్రతకు సమగ్ర కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వశాఖల మధ్య సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవచ్చన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి, డీడీఏ ముఖ్యకార్యనిర్వహణ అధికారి, ఎన్డీఎమ్సీ, మూడు ఎమ్సీడీలు, ఢిల్లీ జల్‌బోర్డు అధికారులతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గురువారం ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యచరణ ప్రణాళికపై చర్చించారు. నగర ప్రజలకు నాణ్యమైన జీవనాన్ని అందించడానికి పచ్చదనం, పరిశుభ్రతపై దృష్టిని కేంద్రీకరిస్తూ తగు చర్యలు చేపట్టాలన్నారు. తక్షణ చర్యల కింద చేపట్టాల్సిన అంశాలను సూచించారు. రోడ్డుపక్కల, ఫుట్‌పాత్‌ల పక్కల ఉండే బురద (మల్బా)ను తొలిగించాలన్నారు. రోడ్లు, ఫుట్‌పాత్‌లకు మరమ్మతులు పేయింటింగులు చేయాలని సూచించారు. రహదారులు, ఫుట్‌పాత్ ఆక్రమణలు, అక్రమ పార్కింగ్‌లను సత్వరమే తొలిగించాలన్నారు. నీటి నిల్వలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజా మూత్రశాలలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాల్వల్లో మురుగుపేరుకుపోకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో వృథా సామాగ్రిని ఎత్తివేయాలని ఆదేశించారు. పార్కులను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. బస్సు టెర్మినళ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో పరిశుభత్రకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటను వికేంద్రీకరించాలని సూచించారు. పారిశుధ్య కార్యక్రమాల్లో ప్రజలు, వ్యాపారసంఘాలు, వర్తక సంఘాలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, విద్యాసంస్థలు, ఎన్సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌లను భాగస్వాములు చేయాలని పిలుపునిచ్చారు. పారిశుద్ధ నిబంధనలు ఉల్లఘించేవారిపై చర్యలు తీసుకోవడం, చలాన్లు కట్టించడానికి సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. ఆరు నెలల్లో తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ.. పారిశుద్ధ్య నిబంధనలపై ప్రకటనలు జారీ చేయలని, ప్రజామరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణను ‘నిర్మించు, నిర్వహించు బదలాయించు’ (బీఓటీ) పద్దతిలో ప్రైవేటు వ్యక్తులకు కేటాయించాలని, ఇంటింటి నుంచి చెత్త సేకరించాలని, గాజీపుర్, నరేలా, బవానాలో చెత్త నుంచి ఇంధనం ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. దీర్ఘకాలిక ప్రణాళికలో చేయాల్సిన పనులను వివరిస్తూ... జీరో వేస్ట్ మేనేజ్మెంట్, గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్, జీపీఎస్, వేస్ట్ కలెక్షన్, డిస్పోజల్ విధానాన్ని ఐటీ ఆధారితంగా పర్యవేక్షణ జరిపించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. -
జంగ్ వార్నింగ్!
న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్.. ఢిల్లీ అభివృద్ధి సంస్థ(డీడీఏ) పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంస్థలో పారదర్శకత లోపించిందని, బాధ్యతారాహిత్యం పెరిగిందని, సంస్థ పని సామర్థ్యం తగ్గిందని, అవినీతి, పనుల్లో జాప్యం వంటివి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థ పనితీరును మెరుగు పర్చుకునేందుకు, పాదర్శక విధానాలను అమలు చేసేందుకు అవసరమైన పునర్నిర్మాణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. అందుకు రెండువారాల గడువునిస్తున్నట్లు హెచ్చరించారు. ఇటీవలి కాలంలో డీడీఏ పనితీరుపై, సంస్థలో జరుగుతున్న అవినీతిపై మీడియాలో రకరకాల కథనాలు వస్తున్న నేపథ్యంలో జంగ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. డీడీఏ సీనియర్ అధికారులతోపాటు ముఖ్యమైన అధికారులు పాల్గొన్న ఈ సమీక్ష సమావేశంలో జంగ్ అధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాలో కథనాలు వస్తున్నా కూడా అధికారులు తమ పనితీరును మార్చుకోవడం లేదని, ముఖ్యమైన ప్రాజెక్టులు పూర్తి చేయడంలో జాప్యం చేస్తున్నారెందుకని ప్రశ్నించారు. సంస్థ పనితీరు మెరుగుపడాలంటే పునర్నిర్మాణ ప్రణాళిక అవసరమని తాను భావిస్తున్నానని, రెండువారాల్లో ఈ ప్రణాళికను సిద్ధం చేయాలని డీడీఏ పరిపాలనా విభాగం అధికారిని ఆదేశించారు. రెండు వారాల్లో నివేదిక తన టేబుల్‌పై లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సంస్థ చేస్తున్న ప్రతి పనిని, అందిస్తున్న సేవల వివరాలను కంప్యూటరీకరించాలని ఆదేశించారు. డీడీఏ పని సామర్థ్యాన్ని కూడా పెంచాలని, చేపట్టే ప్రతి పనికి సంస్థలోని ఎవరో ఒక అధికారి బాధ్యత వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. తీసుకున్న నిర్ణయాల్లో ఎటువంటి గందరగోళం లేకుండా ఉండాలని, ప్రతి పని పూర్తి పారదర్శకంగా ఉండేలా చూడాలన్నారు. పై అధికారుల పర్యవేక్షన నిరంతరం కొనసాగేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రణాళిక సిద్ధం... డీడీఏ పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేశామని, తుది మెరుగులు దిద్ది రెండు వారాల్లో సమర్పిస్తామని జంగ్కు డీడీఏ అధికారులు హామీ ఇచ్చారు. డీడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు ప్రాజెక్టుల వివరాలను కూడా జంగ్కు వివరించారు. భూసేకరణ విభాగం ఇప్పటికే అవసరమైన భూమిని సేకరించిందని, దీంతో పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే ఇళ్లను నిర్మించి ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. డీడీఏ పనితీరు మెరుగుపడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఇచ్చిన సూచనల మేరకే పునర్నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేశామని, ఏప్రిల్ నాటికి ప్రణాళికలు పూర్తిగా అమలయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కౌన్సిల్ ఇచ్చిన సూచనల ప్రకారం... సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పనుల్లో కొన్నింటిని ఔట్ సోర్సింగ్ చేయాలి. ఈ విషయమై ఔట్ సోర్సింగ్ సంస్థల కోసం అన్వేషిస్తున్నామన్నారు. పంటలను ఎక్కడైనా అమ్ముకోండి: జంగ్ న్యూఢిల్లీ: వ్యవసాయ ఉత్పత్తులను రైతులు మండీలోనే కాకుండా బయట ఎక్కడైనా అమ్ముకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రకటించారు. ఆజాద్‌పూర్, కిషోర్‌పూర్, షహదరా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలోని వ్యవసాయ ఉత్పత్తుల జాబితా నుంచి కూరగాలు, పండ్లను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో రైతులు తాము పండించిన పండ్లను, కూరగాయలను ఇకపై తప్పనిసరిగా ఏపీఎంసీలోనే అమ్ముకోవాలనే నిబంధన ఏమీ లేదన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఓ నోటీసు కూడా విడుదల చేసింది. ఢిల్లీ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్(క్రమబద్ధీకరణ) చట్టం, 1998 ప్రకారం.. రైతులు తాము పండించిన పంటలను మార్కెట్ యార్డుల్లోనే అమ్ముకోవాల్సి ఉన్నా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని నోటీసులో పేర్కొంది. 6 గోడల మీద పోస్టర్లు అతికించినవారిపై కఠిన చర్యలు తీసుకోండి న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారం పేరుతో పోస్టర్లను అతికిస్తూ గోడలను పాడు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ విశ్వవిద్యాలయం పోలీసులను కోరింది. పోస్టర్లను అతికించుకునేందుకు, బ్యానర్లు కట్టుకునేందుకు విశ్వవిద్యాలయం పరిసరాల్లో ప్రత్యేకంగా స్థలం కేటాయించామని, అయినా ప్రభుత్వ, ప్రైవేటు భవనాలపై, బస్సులు, రైళ్లల్లో కూడా పోస్టర్లు అతికిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని, ఇటువంటివారిపై చర్యలు తీసుకోవాలని డీయూ కోరింది. ఢిల్లీ ప్రజా ఆస్తుల రక్షణ చట్టం ప్రకారం పోస్టర్లు అతికించేవారిపై కేసు నమోదు చేయాలని, దర్యాప్తు జరిపి, నేరం రుజువైతే కఠినంగా శిక్షించాలని డీయూ అధ్యాపకుడు, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఎన్నికల(డూసూ) కమిషనర్ డీఎస్ రావత్ పోలీసులను కోరారు. పోలీసులు చర్యలు తీసుకోకుండా చూస్తూ ఊరుకుంటే ప్రజా ఆస్తుల రక్షణ చట్టం నిరుపయోగంగా మారుతుందన్నారు. చట్టం సరిగ్గా అమలు కావాలంటే కఠిన చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని కోరారు. డూసూ ఎన్నికలు ఈ నెల 12న జరగనున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ, బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీతోపాటు పలు పలు పార్టీల విద్యార్థి విభాగాలు పోటీ చేస్తున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రింటింగ్ పోస్టర్లను ప్రచారం కోసం వినియోగించరాదనే నిబంధన ఉన్నప్పటికీ పోటీదారులు యథేచ్ఛగా పోస్టర్లను అతికిస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, ఈ విషయమై ఢిల్లీ పోలీసులతో పలుమార్లు సమావేశమయ్యామని, కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరామని రావత్ తెలిపారు. ఎన్నికల బరిలో కొత్త విద్యార్థి విభాగం ఈసారి జరగనున్న డూసూ ఎన్నికల్లో కొత్త విద్యార్థి విభాగం పోటీ చేయనుంది. ఇప్పటిదాకా ప్రధానంగా పోటీ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ, బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం బీజేపీ మధ్య జరుగుతుండగా సీపీఐ, సీపీఎంకు చెందిన విద్యార్థి విభాగాలు ఎస్ఎఫ్ఐ వంటివి కూడా పోటీ చేస్తున్నాయి. కాగా ఈ ఏడాది ‘చాణక్య పరిషద్’ పేరుతో ఏర్పాటైన కొత్త విద్యార్థి విభాగం కూడా ఎన్నికల్లో పోటీ చేయనుంది. ‘ఇప్పటిదాకా ఎన్ఎస్యూఐ, ఏబీవీపీల మధ్యే పోటీ జరిగింది. ఈ రెండు విభాగాలు కూడా కండబలం, ధనబలాన్ని ఉపయోగించి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నించాయి. ఈ సంస్కృతికి చరమగీతం పాడాలని నిర్ణయించుకున్నాం. ఈ రెండింటికి ప్రత్యామ్నాయంగా కొత్త విద్యార్థి విభాగాన్ని తీసుకురావాలనుకున్నాం. కొత్తగా వ చ్చే విద్యార్థి విభాగం విద్యార్థుల్లో సాధికారత పెంచేదిగా ఉండాలని నిర్ణయించాం. ఈ అవసరాన్ని గుర్తించిన ఎంతోమంది మాతో కలిసి వచ్చారు. అలా ఏర్పాటైందే చాణక్య పరిషద్’ అని అధ్యక్షుడు మంతోశ్ శర్మ తెలిపారు. తాము పోటీ చేయనుండడంతో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల స్వరూపం మారిపోవడం ఖాయమన్నారు. -
డీడీఏ వెబ్‌సైట్‌కు విశేష స్పందన
న్యూఢిల్లీ: హౌసింగ్ స్కీమ్-2014 కోసం ఢిల్లీ అభివృద్ధి సంస్థ(డీడీఏ) ప్రారంభించిన వెబ్‌సైట్‌కు నగరవాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కేవలం 48 గంటల్లో 18.25 లక్షల మంది ఈ హౌసింగ్ స్కీమ్ వివరాల కోసం డీడీఏ వెబ్‌సైట్‌ను సందర్శించారు. పేరుతో ప్రారంభించిన వెబ్సైట్ సోమవారం క్రాష్ కావడంతో దానిని మళ్లీ పునరుద్ధరించామని, వెబ్సైట్ ద్వారా అందిస్తున్న అన్ని ఆన్లైన్ సేవలు ఇకపై కూడా అందుతాయని డీడీఏ అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. ప్రారంభించిన రోజే 11 లక్షల మంది వెబ్‌సైట్‌ను సందర్శించగా రెండో రోజు పునరుద్ధరించిన తర్వాత 7.25 లక్షల మంది వెబ్‌సైట్‌ను సందర్శించారని డీడీఏ సిస్టమ్స్ డెరైక్టర్ వి.ఎస్. తోమర్ తెలిపారు. వెబ్సైట్ క్రాష్ అయిన తర్వాత తమ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు శ్రమించి మరింత మెరుగ్గా వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దారని, దీంతో ఆన్లైన్ సేవలు అందించడం ఇకపై మరింత సులువుతుందని తోమర్ అభిప్రాయపడ్డారు. -
డీడీఏ గృహ పథకం రేపటి నుంచి ఫారాలు అందుబాటులో
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) హౌసింగ్ పథకం- 2014 సోమవారం నుంచి ఆరం భం కానుంది. ఇందుకు సంబంధించి సంబంధిత అధికారులు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారు. సోమవారం ఉద యం తొమ్మిదిన్నర గం టలకు వికాస్ సదన్‌లోని నాగరిక్ సువి ధా సెంటర్లో డీడీఏ ఉపాధ్యక్షుడు బల్వీందర్ కుమార్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆసక్తి కలిగినవారికి దరఖాస్తు ఫారాలను బ్యాంకుల ద్వా రా అందజేయడానికి డీడీఏ అన్ని ఏర్పాట్లు చేసింది. తొలి దశలో 15 లక్షల బ్రోచర్లు ముద్రిస్తున్నారు. వీటి ఖరీదును రూ. 150గా నిర్ణయించారు. బ్రోచర్లు సరళంగా ఉంటాయని, దరఖాస్తు ఫారాల పూర్తి ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. బ్రోచర్లు 13 బ్యాంకుల అన్ని శాఖలలో లభిస్తాయి. పూర్తిచేసినదరఖాస్తు ఫారాలను కూడా బ్యాంకులకు సమర్పించాల్సి ఉం టుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్, సిండికేట్, కార్పొరేషన్, యూనియన్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఐడీబీఐ, ఇండస్ఇండ్, కోటక్ మహీ ంద్రా, యస్, యాక్సిస్ తదితర బ్యాంకులు దరఖాస్తు ఫారాలను అందజేేయడంతో పాటు రిజిస్ట్రేషన్ సొమ్మును చెల్లించడం కోసం తమ తమ శాఖలలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తారు. డీడీఏ కోరిన రిజిస్ట్రేషన్ సొమ్మును దరఖాస్తుదారులకు రుణం రూపంలో అందజేయడానికి బ్యాం కులు పలు పథకాలను రూపొందించాయి. 2014 హౌసింగ్ పథకంకింద డిడిఏ నగరంలో 25 వేలకు పైగా ఫ్లాట్లను కేటాయించనుంది. దరఖాస్తు పత్రాలు వచ్చే నెల ఒకటో తేదీనుంచి అక్టోబర్ తొమ్మిది వరకు లభిస్తాయి. అక్టోబర్ నెలాఖరులో ఇందుకు సంబ ంధించి డ్రా తీయనున్నారు. -
పేదలకు ఎన్ని ఫ్లాట్లు కేటాయించారు?
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునర్ నిర్మాణ పథకం (జేఎన్ఎన్యూఆర్ఎం) కింద నగరంలోని నిరుపేదలకు కేటాయించిన ఫ్లాట్ల వివరాలను అందజేయాలని కేంద్ర ప్రభుత్వం... ఢిల్లీ సర్కారును కోరింది. ఆర్థికంగా వెనుకబడిన వారికి (ఈడబ్ల్యూఎస్) కేటాయించిన ఫ్లాట్ల సంఖ్యను తెలియజేయాలంటూ కేంద్ర గృహ, పట్టణ దారిద్య్ర నిర్మూలన మంత్రిత్వ శాఖ ... ఢిల్లీ ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. ఈ పథకం కింద పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలకు మొత్తం 67,784 ఫ్లాట్లను కేటాయించాల్సి ఉంది. ఇదిలాఉంచితే ఈ పథకం కింద ఇప్పటిదాకా నాలుగు వేలమందికే ఫ్లాట్లను కేటాయించామని ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లాంఛనంగా పంపించామన్నారు. అయితే నిరుపేదలకు కేటాయించిన ఫ్లాట్ల సంఖ్యను నిర్ధారించుకున్న తరువాతే కేంద్ర ప్రభుత్వానికి పంపుతామన్నారు. కేటాయింపుల సంఖ్య ఇంత స్వల్పంగా ఉండడానికిగల కారణమేమిటని ప్రశ్నించగా గుర్తింపే ప్రధాన సమస్య అని ఆయన వివరించారు. అనేకమందిని గుర్తించామని అన్నారు. కాగా జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద ఢిల్లీ ప్రభుత్వం మొత్తం 67,784 ఫ్లాట్లను నిర్మించాల్సి ఉంది. అయితే అందులో తొమ్మిది వేల ఫ్లాట్ల నిర్మాణాన్ని నిలిపివేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. సకాలంలో కేటాయింపు కష్టమే ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) నగర పరిధిలోని రోహిణి ప్రాంతంలో చేపట్టిన ఫ్లాట్ల నిర్మాణ పనులు ఇంకా పూర్తికాలేదు. దీంతో లబ్ధిదారులకు ఫ్లాట్లను సకాలంలో కేటాయించే అవకాశాలు అంతంతగానే ఉన్నాయి. దీంతో వీరంతా మరికొంతకాలం ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది. స్థానికుల అభ్యంతరాల కారణంగా పనులు నిలిచిపోయాయి. నిర్మాణ పనులపై విధించిన స్టేని అత్యున్నత న్యాయస్థానం ఎత్తివేసినప్పటికీ స్థానికులు పనులను అనేక పర్యాయాలు అడ్డుకున్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 18 వేల ఫ్లాట్లను డీడీఏ నిర్మించాల్సి ఉంది. ఈ విషయమై సంబంధిత అధికారి ఒక రు మాట్లాడుతూ స్థానికులు దాడులకు పాల్పడుతున్నారని, వారి నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులకు విన్నవించామన్నారు. -
బస్ డిపోకు స్థలం
న్యూఢిల్లీ: మిలీనియం బస్ డిపోకు స్థల సేకరణలో మొదటి అడుగు పడింది. డీటీసికి రోహిణిలో 20 ఎకరాల స్థలాన్ని డీడీఏ అందజేసింది. డిపోను యమునానదీ తీర ప్రాంతం నుంచి తొలగించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో దానికోసం కొత్త స్థలాన్ని వెతకడం మొదలుపెట్టారు. అయితే స్థల సేకరణలో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తోంది. డిపోకు సుమారు 60 ఎకరాల స్థలం అవసరం కాగా, ఒకే దగ్గర అంత స్థలాన్ని కేటాయించడం కష్టమని ఢిల్లీ అభివృద్ధి మండలి(డీడీఏ) తేల్చి చెప్పింది. దానికి బదులు మూడు ప్రాంతాల్లో స్థలాన్ని సేకరించి ఇస్తామని తెలిపింది. ఆ మేరకు ఉత్తర ఢిల్లీని రాణి ఖెరా ప్రాంత సమీపంలో 20 ఎకరాల స్థలాన్ని డీటీసీకి అప్పగించింది. ఈ మేరకు డీడీఏ ల్యాండ్ మేనేజ్మెంట్ శాఖ అధికారులు ఆదివారం డీటీసీ అధికారులను కలిసి సంబంధిత పత్రాలను అందజేశారు. కాగా, 2010లో కామన్వెల్త్ క్రీడలు జరిగిన సమయంలో యమునా నదీ తీరాన సుమారు 60 ఎకరాల స్థలంలో మిలీనియం డిపోను తాత్కాలిక పద్ధతిని అప్పటి ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ప్రారంభించారు. అయితే ఈ డిపో వల్ల యమునా పరీవాహక ప్రాంతం దెబ్బతింటోందని, వెంటనే దాన్ని అక్కడ నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ పలువురు పర్యావరణవేత్తలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీలో అధికారంలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం మరో తొమ్మిది నెలల్లో మిలీనియం బస్ డిపోను అక్కడ నుంచి వేరేచోటికి మారుస్తామని కోర్టుకు విన్నవించారు. అనంతరం డిపోకు మూడు వేర్వేరు ప్రాంతాల్లో స్థలాన్ని కేటాయించగలుగుతామని కోర్టుకు డీడీఏ సమాధానమిచ్చింది. వాటిలో రోహిణి ప్రాంతమొకటి. సరాయ్ కాలే ఖాన్‌లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (ఐడీటీఆర్) సంస్థ సమీపంలో, తూర్పు ఢిల్లీలోని కార్కారి మోరే వద్ద మిగిలిన స్థలాన్ని కేటాయిస్తామని తెలిపింది. కాగా, రాజ్ నివాస్‌లో ఇటీవల జరిగిన సమావేశంలో డీటీసీకి స్థలం కేటాయింపుపై చర్చించినట్లు డీడీఏ వైస్ చైర్మన్ బల్వీందర్ కుమార్ మీడియాకు తెలిపారు. కాగా, రోహిణిలో 20 ఎకరాల స్థలాన్ని తమకు డీడీఏ అప్పగించినట్లు డీటీసీ ప్రజా సంబంధాల అధికారి ఆర్.ఎస్. మిన్హాస్ తెలిపారు. మిగిలిన రెండు ప్రాంతాల్లోనూ స్థల కేటాయింపునకు ఏర్పాట్లు జరుగుతున్నాని డీడీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఐడీటీఆర్‌ను వేరే స్థలానికి తరలించిన తర్వాత ఆ స్థలం ఆధీనంలో ఉన్న స్థలాన్ని డీటీసీకి అప్పగించనున్నట్లు ఆయన వివరించారు. అలాగే కార్కారీ మోరె ప్రాంతంలో స్థల సేకరణపైనా త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా, మెట్రో, మోనోరైలు వంటి ప్రత్యామ్నాయ వ్యవస్థలు ఎన్ని వచ్చినా డీటీసీ బస్సులు ఢిల్లీవాసుల జీవితంలో కీలకపాత్ర పోషిస్తాయి. అంతేగాక నగరంలో వాయు, ధ్వని కాలుష్యం తగ్గించాలంటే ప్రభుత్వ రవాణా వ్యవస్థను విస్తరించడం అత్యవసరం. అయితే ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్ ఉన్నా, డీటీసీ కొత్త బస్సులను కొనుగోలు చేయలేకపోతోంది. డిపోల్లో తగిన స్థలం లేకపోవడం, కొత్తవి నిర్మించేందుకు భూమి లభించకపోవడమే ఈ పరిస్థితికి కారణం. 800 బస్సులను నిలిపే వీలున్న మిలీనియం పార్క్ బస్సు డిపో యమునానది తీరంలో ఉన్నందున, వేరే చోటికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది. యమునాదినది తీరాన్ని రక్షించేందుకు ఈ డిపోను తరలించాలని ఆప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉంటే, ఢిల్లీ సమగ్ర బహుళ రవాణా వ్యవస్థ (డిమ్టస్) వద్ద ఉన్న వెయ్యి బస్సులను ఎక్కడ నిలపాలో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే డిపో తరలింపుపై పర్యావరణవేత్తల్లోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నదీ పరివాహక ప్రాంతాన్ని రక్షించేందుకు దీనిని తరలించడం తప్పనిసరని అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రముఖ పర్యావరణవేత్త సునీతా నారాయణ్ మాట్లాడుతూ మిలీనియం బస్సు డిపోను తరలించాల్సిన అవసరం లేదన్నారు. దీనివల్ల నదీతీరానికి కలిగే నష్టాన్ని చాలా వరకు తగ్గించి, డిపోను ఇక్కడే కొనసాగించవచ్చని చెప్పారు. అయితే డిపో తరలింపు అంత సులువుకాదని డీటీసీ అధికారులు అంటున్నారు. డిపోల స్థాపనకు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి చాలా పెట్టుబడి, సమయం అవసరం అవుతుందని తెలిపారు. డిమ్టస్కు కూడా ఇప్పటికీ డిపోల నిర్మాణానికి స్థలం దొరకడం లేదు. సెంటర్ ఫర్ సైన్స్ ఎన్విరాన్మెంట్కు చెందిన అనుమితా రాయ్ మాట్లాడుతూ డిపోల నిర్మాణం కీలకం కాబట్టి ఇందుకు బెంగళూరు విధానాన్ని అనుసరించడం మేలని అభిప్రాయపడ్డారు. తక్కువస్థలంలో ఎక్కువ బస్సులను నిలిపి ఉంచగలిగే డిజైన్లను అన్వేషించాలని సూచించారు. ఇదిలా ఉండగా, యమునా నదీ తీరం నుంచి మిలీనియం బస్ డిపోను తరలించిన తర్వాత అక్కడ ఒక పార్క్‌ను ఏర్పాటుచేయనున్నట్లు తెలిసింది. అక్కడ ఇప్పటికే ఉన్న నిర్మాణాలను అలాగే ఉంచి వాటిని ప్రజల కోసం వినియోగించాలని గత జనవరిలో కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయించింది. అలాగే అక్కడ కొత్త కట్టడాలను వేటిని అనుమతించరాదని ప్రతిపాదించింది. అక్కడ ప్రజల కోసం ఒక పార్క్‌ను ఏర్పాటుచేస్తామని కేజ్రీవాల్ అప్పట్లో ప్రకటించారు. -
మన ఫ్లాట్లు మనకే
ఢిల్లీవాసులకే 80 శాతం కేటాయించాలని డీడీఏ యోచన సాక్షి, న్యూఢిల్లీ: నగరవాసులకు శుభవార్త. ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) త్వరలో ప్రకటించనున్న 26,300 ఫ్లాట్ల హౌసింగ్ స్కీంలో 80 శాతం ఫ్లాట్లను నగరవాసులకే కేటాయించాలనుకుంటోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను సంబంధిత అధికారులు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు పంపారు. ఇందుకు ఎల్జీ ఆమోదం లభించినట్లయితే పలువురు ఢిల్లీవాసుల సొంతింటి కల సాకారమయ్యే అవకాశముంది. ఇందువల్ల 80 శాతం ఫ్లాట్లు ఢిల్లీవాసులకు లభిస్తాయి. గతంలో డీడీఏ అనేక పథకాలద్వారా దాదాపు నాలుగు లక్షల ఫ్లాట్లను స్థానికులకు అందుబాటులోకి తెచ్చింది. డీడీఏ విధానం ప్రకారం ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధానం వల్ల ఢిల్లీవాసులకు, దేశంలోని మిగతా ప్రాంతాలలో నివసించేవారితో సమంగా ఫ్లాట్లు లభించేవి. పైగా ఈ నగరంలో సొంత ఇంటి అవసరమున్న వారి కంటే దేశంలో ఎక్కడో నివసించేవారికి ఇళ్లు దక్కేవి. ఈ నేపథ్యంలో డీడీఏ పథకంలో ఢిల్లీవాసులకు కొంత శాతం ఇళ్లను రిజర్వ్ చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇన్నాళ్లూ ఈ డిమాండ్‌ను డీడీఏ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ప్రస్తుతం డీడీఏ వైఖరిలో మార్పు వచ్చింది త్వరలో ప్రకటించనున్న హౌసింగ్ స్కీంలో 80 శాతం ఫ్లాట్లు డిల్లీవాలాల కోసం కేటాయించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఎల్జీ వద్ద ఉంది. ఎల్జీ దీనిని ఆమోదించవచ్చని భావిస్తున్నారు. ఈ పథకాన్ని డీడీఏ వచ్చే నెలలో ప్రకటించే అవకాశముంది. -
కొత్త షరతు..!
చెమటోడ్చి కూడబెట్టిన సొమ్ముతో డీడీఏ నిర్మించిన ఫ్లాట్లను ఒకవేళ కొనుగోలు చేసినప్పటికీ యాజమాన్యపు హక్కులు మాత్రం ఆ వెంటనే దక్కవు. ఇందుకోసం కనీసం ఐదు సంవత్సరాలపాటు ఎదురు చూడక తప్పదు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను సంబంధిత అధికారులు డీడీఏ చైర్పర్సన్ కూడా అయిన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు ఇటీవలపంపారు. న్యూఢిల్లీ: ఈసారి ఫ్లాట్ల కొనుగోలు కోసం ఆసక్తిగా ఎదురుగా చూస్తున్నవారికి ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) కొత్తగా ఓ షరతు విధించనుంది. ఇప్పటిదాకా కొనుగోలుచేసిన వెంటనే యాజమాన్య హక్కులను బదిలీ చేసిన డీడీఏ ఇకమీదట ఐదేళ్లపాటు తన వద్దనే ఉంచుకోనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను సంబంధిత అధికారులు... డీడీఏ చైర్పర్సన్ కూడా అయిన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు ఇటీవలే పంపారు. డీడీఏ న్యాయవిభాగం ఈ సరికొత్త ఆలోచనకు తెరతీసింది. ఈ నిర్ణయం విషయంలో వెనక్కి తగ్గకూడదని డీడీఏ అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. కాగా ఈ నిర్ణయం సంగతి ఎలా ఉన్నప్పటికీ దీని ప్రభావం కారణంఆ ఆస్తుల ధరలు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉందని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై డీడీఏ ఉపాధ్యక్షుడు బల్వీందర్‌కుమార్ మాట్లాడుతూ ‘డ్రా ఫలితాలు ప్రకటించిన తర్వాత యాజమాన్యపు హక్కుల విషయంలో మధ్యవర్తులు జోక్యం చేసుకుంటున్నారంటూ మాకు అనేక ఫిర్యాదులు అందాయి. ఇందుకు సంబంధించి ఎన్నో కఠినతరమైన నిబంధనలను విధించినప్పటికీ ఎటువంటి ఫలితమూ దక్కడం లేదు. ఇక కేటాయింపుల విషయంలోనూ మధ్యవర్తులు జోక్యం చేసుకుంటున్నారనే ఫిర్యాదులు కూడా మాకు అందుతున్నాయి. చవక ధరలకే ఫ్లాట్లను నగరవాసులకు అందించాలనేది మా సంస్థ లక్ష్యం. ప్రస్తుత మార్కెట్ ధరలతో పోలిస్తే మా ఫ్లాట్ల ధరలు ఎంతో తక్కువ అనే విషయాన్ని కొనుగోలుదారులకు తెలియజేసేవిధంగా ముందుకు సాగిపోవడమే మా లక్ష్యం. కేటాయింపు ప్రక్రియ కూడా పారదర్శకంగా ఉండాలనేది మా అభిమతం’ అని అన్నారు. అన్ని అర్హతలు కలిగిన కొనుగోలుదారుడికి కేటాయింపుతోపాటు ఫ్లాట్ల అందజేయడం జరుగుతుందన్నారు. ఇందువల్ల లబ్ధిదారుడు తనకు కేటాయించిన ఫ్లాట్‌లోనే ఉంటాడన్నారు. హక్కులన్నీ దక్కించుకున్న తర్వాత సదరు యజమాని తన ఫ్లాట్ ను విక్రయించుకునేందుకు వీలవుతుందన్నారు. అయితే యాజమాన్యపు హక్కుల బదలాయింపు విషయంలో కొత్త షరతు విధించాలని యోచిస్తున్నామన్నారు. ఐదేళ్ల వరకూ ఎటువంటి క్రయవిక్రయాలు జరగకుండా యాజమాన్యపు హక్కులను తమ వద్దనే ఉంచుకోవాలనుకుంటున్నామని చెప్పారు. కేటాయింపు తదితర ప్రక్రియలు పారదర్శకంగా. సజావుగా సాగాలనేది తమ అభిమతమన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను డీడీఏ చైర్పర్సన్ కూడా అయిన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు ఇటీవల పంపామని తెలిపారు. కాగావచ్చే నెల మొదటివారంలో డీడీఏ తన నూతన ప్రాజెక్టుకు సంబంధించి ఓ ప్రకటన చేయనుంది. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 26 వేల ఫ్లాట్లను నిర్మించనుంది. అందులో 24 వేల ఫ్లాట్లు ఏక పడక గదివి. దిగువ ఆదాయ వర్గాల వారికి కేటాయించనుంది. మరో ఏడు వందల ఫ్లాట్లకు డ్రా నిర్వహించాలని డీడీఏ యోచిస్తోంది. వీటి ఖరీదు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయల వరకూ ఉండనుంది. -
జూలైలో గృహనిర్మాణ పథకం
న్యూఢిల్లీ: నగరవాసులకు శుభవార్త. ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) వచ్చే నెలలో భారీ గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించనుంది. మొత్తం 26 వేల ఫ్లాట్ల నిర్మాణం చేపట్టింది. ఈ విషయాన్ని డీడీఏ ఉపాధ్యక్షుడు బల్వీందర్‌కుమార్ వెల్లడించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఒక పడక గది ఉండే 24 వేల ఫ్లాట్లతోపాటు మరో రెండు వేల ఫ్లాట్లను నిర్మిస్తున్నామన్నారు. ఈ పథకం జూలైలో అందుబాటులోకి వస్తుందన్నారు. డీడీఏ, 2014లో భాగంగా దీనిని చేపట్టామన్నారు. ద్వారకా, నరేలా, రోహిణి ప్రాంతాల్లో వీటిని నిర్మిస్తున్నామన్నారు. వీటి ధరలు రూ. 14 లక్షల నుంచి మొదలుకుని రూ. కోటిదాకా ఉంటాయన్నారు. కాగా ఈ పథకం నాలుగు ఏళ్ల విరామం తరువాత ప్రారంభమవనుంది. 2010లో డీడీఏ 16 వేల ఫ్లాట్లను నిర్మించిన సంగతి విదితమే. తాజా పథకంలో భాగంగా 24 వేల ఫ్లాట్లను చవక ధరలకు విక్రయించనుంది. మిగతా ఫ్లాట్లను ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీలుగా విభజించింది. సింగిల్ బెడ్రూం ఫ్లాట్లను ఆర్థికంగా వెనుకబడినవారికి కేటాయించాలా లేక మరెవరికి కేటాయించాలనే విషయమై త ్వరలో సమావేశమై ఓ నిర్ణయం తీసుకుంటామని బల్వీందర్‌కుమార్ తెలిపారు. ఈ ఫ్లాట్లలో అత్యధిక శాతం ప్రీ-ఫ్యాబ్రికేటెడ్‌గా నిర్మించామన్నారు. ఇవి హరిత లక్షణాలను కలిగి ఉంటాయన్నారు. 2021, ఢిల్లీ మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా నిర్మించామన్నారు. ద్వారకా, నరేలా, రోహిణి ప్రాంతాల్లో నాలుగు అంతస్తులు లేదా ఆపైన నిర్మించామన్నారు. జూలై చివరినాటికల్లా 15 వేల ఫ్లాట్లను సిద్ధం చేస్తామన్నారు. మిగతా వాటి నిర్మాణం వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా పూర్తవుతుందన్నారు. ఆ తర్వాత ఆయా లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. -
హెల్ప్ డెస్కులు ప్రారంభం
న్యూఢిల్లీ: ‘ఎజెండా ఫర్ 100’లో భాగంగా ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) నాలుగు నాగరిక్ సువిధ కేంద్రాలను ప్రారంభించింది. ఐఎన్ఏ, రోహిణి, లక్ష్మీనగర్, ద్వారక ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ వీటిని ప్రారంభించారు. ఆస్తుల మార్పిడిపత్రాల అందజేత ఈ కేంద్రాల ప్రాథమిక బాధ్యత. ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ డీ డీఏ ఫ్లాట్లు పొందినవారితోపాటు అందులో నివసిస్తున్నవారి సౌకర్యార్ధం వీటిని ప్రారంభించామన్నారు. ఇదిలాఉంచితే ‘ఎజెండా ఫర్ 100’లో భాగంగా డీడీఏ తన రికార్డులనన్నింటినీ డిజిటలీకరించనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను పట్టణాభివృద్ధి శాఖకు పంపింది. తన పరిధిలోని అన్ని సేవలను ఆన్‌లైన్‌ద్వారా వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురానుంది.