ఎఫ్‌టీసీ డీడీఏగా సురేంద్ర బెనర్జీ | Surendra Banerjee as FTA DDA | Sakshi
Sakshi News home page

ఎఫ్‌టీసీ డీడీఏగా సురేంద్ర బెనర్జీ

Published Wed, Jun 14 2017 10:26 PM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM

ఎఫ్‌టీసీ డీడీఏగా సురేంద్ర బెనర్జీ - Sakshi

ఎఫ్‌టీసీ డీడీఏగా సురేంద్ర బెనర్జీ

అనంతపురం అగ్రికల్చర్‌ : వ్యవసాయశాఖకు అనుబంధంగా ఉన్న రైతు శిక్షణా కేంద్రం (ఫార్మర్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌–ఎఫ్‌టీసీ) డీడీఏగా సురేంద్ర బెనర్జీ బాధ్యతలు తీసుకున్నారు. బుధవారం స్థానిక వ్యవసాయశాఖ జేడీ కార్యాలయంలో ఎఫ్‌టీసీ ఇన్‌చార్జ్‌ డీడీఏ స్వయంప్రభ ఆయనకు బాధ్యతలు అప్పగించారు.

ఈ సందర్భంగా సురేంద్రబెనర్జీ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా వాయిల్పాడు ఏడీఏగా పనిచేస్తున్న తనకు డీడీఏగా పదోన్నతి కల్పించి ఇక్కడికి బదిలీ చేశారన్నారు. రైతు శిక్షణా కేంద్రం ద్వారా రైతులు, అధికారులకు శిక్షణ కార్యక్రమాలు, క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. జేడీఏ పీవీ శ్రీరామమూర్తి, డీడీఏ (అగ్రానమీ) శ్రీనివాసులు, ఏడీఏ (పీపీ) జి.విద్యావతి, ఇతర అధికారులు సురేంద్ర బెనర్జీకి శుభాకాంక్షలు తెలియజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement