FTC
-
గూగుల్ చీకటి ‘గేమ్’! రూ.260 కోట్ల భారీ జరిమానా..
టెక్ దిగ్గజం గూగుల్‌కు దక్షిణ కొరియాకు చెందిన యాంటీట్రస్ట్ రెగ్యులేటర్ రూ.260 కోట్ల భారీ జరిమానా విధించింది. కొరియన్ మొబైల్ గేమింగ్ యాప్ మార్కెట్లో ఆధిపత్యం కోసం గూగుల్, దాని ప్రాంతీయ అనుబంధ సంస్థలు అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించిన నియంత్రణ సంస్థ 42.1 బిలియన్ల వాన్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.260 కోట్లకు పైగా జరిమానా విధించింది. (ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్.. స్టోరేజ్ సమస్యకు పరిష్కారం) ఫెయిర్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) ప్రకారం.. గూగుల్ 2016 జూన్, 2018 ఏప్రిల్ మధ్య కాలంలో దక్షిణ కొరియా మొబైల్ గేమ్ కంపెనీలతో చీకటి ఒప్పందాలను కుదుర్చుకుంది. ఆ మేరకు వన్ స్టోర్‌లో వారి కంటెంట్‌ను విడుదల చేయకుండా అడ్డకుంది. వన్ స్టోర్ అనేది నేవర్ కార్ప్‌తో పాటు దక్షిణ కొరియాకు చెందిన మరో రెండు మొబైల్ క్యారియర్లు 2016 జనవరిలో ప్రారంభించిన ఆ దేశ ప్రధాన స్వదేశీ యాప్ మార్కెట్. ఈ వన్ స్టోర్ ఏర్పాటు దక్షిణ కొరియాలో తమ మార్కెట్‌పై ప్రభావం చూపుతుందని భావించిన గూగుల్ యూఎస్ బెహెమోత్ గేమ్ కంపెనీలను తమ గూగుల్ ప్లే (Google Play)లో ప్రత్యేకంగా విడుదల చేసేలా ఒప్పందం చేసుకుంది. దీనికి బదులుగా వారి కంటెంట్ మార్కెట్లో ‘ఫీచర్డ్’గా కనిపించేలా చేయడంతో పాటు ఆ కంపెనీలకు ఇతర మార్కెటింగ్ ప్రయోజనాలనూ గూగుల్ అందించినట్లు ఎఫ్‌టీసీ పేర్కొంది. న్యాయమైన చిక్కుల నుంచి తప్పించుకునేందుకు గూగుల్ ఆ ఒప్పందానికి సంబంధించిన ఈమెయిల్‌లను ఉద్యోగుల చేత తొలగింపజేసింది. ఆ విషయాలను ఆఫ్‌లైన్‌లోనే చర్చించాలని కూడా కోరిందని ఎఫ్‌టీసీ తెలిపింది. ఎఫ్‌టీసీ గణాంకాల ప్రకారం.. 2016లో ఖర్చు చేసిన మొత్తంలో స్థానిక యాప్ మార్కెట్లో దాదాపు 80 నుంచి 85 శాతం వాటాను కలిగి ఉన్న గూగుల్ 2018లో 90 నుంచి 95 శాతానికి విస్తరించగలిగింది. మరోవైపు ఈ కాలంలో వన్ స్టోర్ 15 - 20 శాతం నుంచి 5 - 10 శాతానికి మాత్రమే పడిపోయిందని ఎఫ్‌టీసీ పేర్కొంది. కాగా కొరియన్ ఎఫ్‌టీసీ నిర్ణయంతో తాము ఏకీభవించడం లేదని గూగుల్ తెలిపింది. తాము స్థానిక పోటీ చట్టాలను ఉల్లంఘించలేదని పేర్కొంది. రాతపూర్వక నిర్ణయాన్ని సమీక్షించిన తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తామని వివరించింది. -
ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు, ‘ట్విటర్ దివాలా తీయొచ్చు..నేడో..రేపో’!
సీఈవో ఎలాన్ మస్క్ అనాలోచిత నిర్ణయాల వల్ల ట్విటర్ చిక్కుల్లో పడనుందా? మస్క్ కొనుగోలు తర్వాత ఉద్యోగుల తొలగింపు, బ్లూటిక్ పెయిడ్ వెరిఫికేషన్, ట్విటర్లో అడ్వటైజ్మెంట్స్ నిలిపివేసే సంస్థల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోవడం వంటి నిర్ణయాలతో ఆ సంస్థ దివాలా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ఉద్యోగులతో మస్క్ చర్చించినట్లు సమాచారం. ఉద్యోగులతో మాట్లాడే సమయంలో ట్విటర్ సంస్థ దివాళా తీసే అవకాశం ఉందనే అంశాన్ని ఎలాన్ మస్క్ సైతం తోసిపుచ్చలేదంటూ బ్లూమ్‌బెర్గ్ సైతం నివేదించింది. అయితే అందుకు కారణం..మస్క్ 44 బిలియన్ డాలర్ల కొనుగోలు చేసిన రెండు వారాల తర్వాత ట్విటర్లో ఆర్ధిక అనిశ్చితి నెలకొందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సంస్థ ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు మస్క్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు రాయిటర్స్ తెలిపింది. బుధవారం ట్విటర్ ఎక్జిగ్యూటీవ్‌లు యోయెల్ రోత్ , రాబిన్ వీలర్‌తో నిర్వహించిన ట్విటర్ స్పేస్ చాట్‌లో మస్క్ ప్రకటనదారుల ఆందోళనలను తగ్గించడానికి ప్రయత్నించారని రాయిటర్స్ హైలెట్ చేసింది. దీనికి తోడు సంస్థ ఎదుగుదలలో ప్రముఖ పాత్ర పోషించే ట్విటర్ సీనియర్ ఉద్యోగులు ఒక్కొక్కరిగా వైదొలగడం చర్చాంశనీయంగా మారింది. ట్విటర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ లీ కిస్నర్, చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ డామియన్ కీరన్, చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ మరియాన్ ఫోగార్టీలు రాజీనామా చేయడంతో ట్విటర్ యాజమాన్యం ఆందోళనకు గురైందని, ఇలా ఉద్యోగుల రాజీనామాలతో ట్విటర్ దివాలా తీయడం ఖాయమంటూ మస్క్ ఉద్యోగులతో హెచ్చరించారు. ట్విటర్ నిబంధనల్ని ఉల్లంఘిస్తే మరింత ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ తెలిపింది. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది ఇటీవల కాలంలో ట్విటర్లో జరుగుతున్న వరుస పరిణామాలపై అమెరికా ప్రభుత్వ ఫెడరల్ ట్రేడ్ ఏజెన్సీ కమిషన్ (ఎఫ్‌టీసీ) స్పందించింది. ప్రభుత్వ న్యాయ చట్టాలను ధిక్కరిస్తూ కార్యకలాపాలు నిర్వహించే సంస్థల విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని’ఎఫ్‌టీసీ స్పష్టం చేసింది. ట్విటర్లో జరుగుతున్న పరిణామాల్ని ఎప్పటికపప్పుడు ట్రాక్ చేస్తున్నాం.‘ సీఈవోలు లేదా సంస్థలు చట్టానికి అతీతం కాదు. ఎఫ్‌టీసీ నిబంధనలు లోబడి పనిచేయాలి. లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని’ ఎఫ్‌టీసీ పబ్లిక్ అఫైర్స్ డైరెక్టర్ డగ్లస్ ఫర్రార్ రాయిటర్స్‌తో అన్నారు. మస్క్‌కి బయపడం మే నెలలో ట్విటర్ యూజర్ల ఫోన్నెంబర్లను దుర్వినియోగం చేసింది. భద్రతా కారణాల కోసం మాత్రమే సమాచారాన్ని సేకరించినట్లు వినియోగదారులకు తెలిపింది.అదే అంశంపై ఎఫ్‌టీసీ ట్విటర్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. నిబంధనల్ని ఉల్లంఘించినందుకు గాను ట్విటర్ 150 మిలియన్ డాలర్లను ఎఫ్‌టీసీకి చెల్లించడానికి అంగీకరించింది. 150 మిలియన్ డాలర్ల చెల్లించేందుకు కొంత సమయం, సంస్థలోని పరిణామాలపై ఎఫ్‌టీసీ- ట్విటర్ మధ్య జరిగిన ఇంటర్నల్ మెయిల్స్ సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాల ప్రకారం.. ఎలాన్ మస్క్ భారీ ఎత్తున నష్టపోయేందుకు సిద్ధంగా ఉన్నారని ట్విటర్ లీగల్ చీఫ్ అలెక్స్ స్పిరో ఎఫ్‌టీసీ అటార్నీ జర్నల్ ఆల్డెన్ ఎఫ్ అబాట్ అన్నారు. అందుకు అటార్నీ ఎలాన్ మస్క్ అంతరిక్షంలోకి పంపియొచ్చు. కానీ అతనికి ఎఫ్‌టీసీ బయపడదు’ అని ఘాటుగా సమాధానం ఇచ్చినట్లు సమాచారం. స్పందించని ట్విటర్ గురువారం మధ్యాహ్నం ట్విట్టర్లో ఉద్యోగులందరితో నిర్వహించిన సమావేశంలో.. వచ్చే ఏడాది కంపెనీ బిలియన్ల డాలర్లను కోల్పోవచ్చని మస్క్ హెచ్చరించినట్లు సమాచారం. కాగా, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ట్విటర్ దివాలా తీసే అవకాశం, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ హెచ్చరికలు, ఉద్యోగుల రాజీనామాలపై ట్విటర్ స్పందించలేదని పలు నివేదికలు చెబుతున్నాయి. చదవండి👉 మాయదారి ట్విటర్..మంచులా కరిగిపోతున్న ఎలాన్ మస్క్ సంపద! -
టిక్‌టాక్‌కు అమెరికాలో మరోదెబ్బ..!
వాషింగ్టన్: క్రేజీ యాప్‌గా వెలుగొందుతున్న చైనా సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌కు అమెరికాలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ చిన్నారుల భద్రతా చట్టాన్ని ఉల్లంఘించారంటూ బెర్కెర్లీ మీడియా స్టడీస్ గ్రూప్, కన్జూమర్ యాక్షన్, కన్జూమర్ ఫెడరేషన్ ఆఫ్ అమెరికా తదితర అడ్వైకసీ గ్రూపులు టిక్‌టాక్ యాజమాన్యంపై మండిపడ్డాయి. నిబంధనలు అతిక్రమించి.. అక్రమంగా సేకరించిన పదమూడేళ్ల లోపు పిల్లల డేటాను ఇంతవరకు తన ప్లాట్‌ఫాం నుంచి తొలగించలేదని ఆరోపించాయి. తద్వారా 2019 ఫిబ్రవరిలో ఫెడరల్ ట్రేడ్ కమిషన్(ఎఫ్‌టీసీ)తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని(కన్సెంట్ డిక్రీ) ఉల్లంఘించిందని పేర్కొన్నాయి. ఈ మేరకు టిక్‌టాక్‌పై గురువారం ఎఫ్‌టీసీకి ఫిర్యాదు చేశాయి. కాగా సినిమా డైలాగులు, పాటలకు, భావోద్వేగాలకు అనుగుణంగా వీడియోలు అప్లోడ్ చేయడం ద్వారా తమ టాలెంట్‌ను నిరూపించుకునే అవకాశం ఉన్న టిక్‌టాక్ పట్ల... చిన్నా, పెద్దా అంతా ఆసక్తి కనబరుస్తున్న సంగతి తెలిసిందే.(‘పిచ్చి యాప్.. టిక్‌టాక్‌ను నిషేధించండి’) ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాకు చెందిన మ్యూజికల్.ఎల్వై(Musical.ly) అనే మరో యాప్ గ్రూపు టిక్‌టాక్‌తో 2018లో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో ఎవరైనా సులభంగా అకౌంట్ క్రియేట్ చేసుకునే వీలు కల్పించింది. ఈ క్రమంలో తల్లిదండ్రుల అనుమతి లేకుండా పదమూడేళ్ల లోపు చిన్నారుల పేర్లు, ఫొటోలు తదితర వ్యక్తిగత వివరాలను బహిర్గత పరచిందంటూ ఎఫ్‌టీసీకి ఫిర్యాదులు అందాయి. దీంతో టిక్‌టాక్.. అమెరికా జాతీయ చిన్నారుల భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిందని పేర్కొంటూ ఎఫ్‌టీసీ.. సంస్థ యాజమాన్యానికి 5.7 మిలియన్ డాలర్ల(దాదాపు 40. 60 కోట్ల రూపాయలు) భారీ జరిమానా విధించింది. ఈ విషయంపై స్పందించిన టిక్‌టాక్.. పిల్లలకు పూర్తి స్థాయిలో యాక్సెస్ కల్పించలేదని, తమ యూజర్ల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరణ ఇస్తూ జరిమానా చెల్లించింది. ఈ సందర్భంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాబోవని పేర్కొంటూ ఒప్పందంపై 2019లో సంతకం చేసింది.(‘చైనా యాప్ టిక్‌టాక్‌ను బహిష్కరించాలి’) అయితే టిక్‌టాక్ ఎఫ్‌టీసీతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా పనిచేయడం లేదని అడ్వకసీ గ్రూపులు తాజాగా మరోసారి ఆరోపణలు చేశాయి. పిల్లలకు సంబంధించిన వీడియోలు ఇంకా ఆ యాప్‌లోనే ఉన్నాయని.. ఇది నిబంధనల ఉల్లంఘన అంటూ మరోసారి ఎఫ్‌టీసీని ఆశ్రయించాయి. అంతేకాకుండా యూజర్ల గోప్యత కోసం ఎటువంటి ప్రైవసీ పాలసీ అవలంబిస్తున్నామో తన హోం పేజ్‌లో పేర్కొనడంలో విఫలమైందని ఆరోపించాయి. ఇక ఇందుకు స్పందించిన టిక్‌టాక్ అధికార ప్రతినిధి హిలరీ మెక్‌క్వాడ్.. తాము నిబంధనలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. యూజర్ల గోప్యతకు భంగం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వారికి భద్రతతో కూడిన వినోదాన్ని అందిస్తున్నామని తెలిపారు. గతంలో టిక్‌టాక్‌కు భారీ జరిమానా విధించిన ఎఫ్‌టీసీ ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న విషయం ఆసక్తికరంగా మారింది. (సోషల్ మీడియా మార్గాన్వేషణ) -
డేటా చోరీ: యూ ట్యూబ్‌కు భారీ జరిమానా
వాషింగ్టన్: చిన్నారుల వ్యక్తిగత డేటాను వారి తల్లిదండ్రుల అనుమతి లేకుండా చోరి చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో గూగుల్ కుచెందిన వీడియో సైట్ యూ ట్యూబ్‌కు భారీ షాక్ తక్‌గిలింది. ప్రకటనల కోసం 13 ఏళ్లలోపు పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించారనే ఆరోపణతో గూగుల్ సంస్థ రూ.1200 కోట్లకు పైగా జరిమానా చెల్లించాలని యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ న్యూయార్క్ కోర్టులో కేసు వేసింది. ఈ ఆరోపణలపై న్యూయార్క్ స్టేట్ అటార్నీ జనరల్, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ విచారణ అనంతరం వ్యాపార ప్రయోజనాల కోసం వీటిని వినియోగించిందనే వాదనపై సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు గూగుల్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌కు 136 మిలియన్ డాలర్లు, న్యూయార్క్ స్టేట్‌కు 34 మిలియన్ డాలర్లు మొత్తం 170 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఎఫ్‌టీసీ చైర్మన్ జో సైమన్స్ ప్రకటించారు. గోప్యత ఉల్లంఘనల ఆరోపణపై ఫేస్‌బుక్‌పై ఈ ఏడాది ఎఫ్‌టీసీ విధించిన 5 బిలియన్ డాలర్ల జరిమానాతో పోల్చితే ఇది అతిపెద్ద జరిమానా. అయితే యూట్యూబ్‌కు ఎఫ్‌టీసీ విధించిన జరిమానాను వాషింగ్టన్‌లోని ఫెడరల్ కోర్టు ఆమోదించాల్సివుంది. మరోవైపు గోప్యతా ఉల్లంఘనల ఆరోపణలతో గూగుల్‌ను జరిమానా విధించడం 2011 నుండి మూడవసారి అని, తాజా ఉల్లంఘన చాలా తీవ్రమైందని డెమొక్రాట్ కమిషనర్ రోహిత్ చోప్రా పేర్కొన్నారు. కాగా గూగుల్ సంస్థపై అనేక సందర్భాల్లో వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అపహరించినట్టు ఆరోపణలున్నాయి. తాజాగా వ్యవహారంలో కూడా గోప్యతకు సంబంధించిన విషయంలో గూగుల్ సంస్థ విఫలమైందని యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఆరోపించింది. గతేడాది గూగుల్ సంస్థ డిజిటల్ ప్రకటనల ద్వారా రూ.8 లక్షల కోట్లకు పైగా అర్జించిందనే ఆరోపణలూ ఉన్న సంగతి తెలిసిందే. -
ఫేస్‌బుక్‌కు రూ.34 వేల కోట్ల జరిమానా!
వాషింగ్టన్: వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్‌కు అమెరికా నియంత్రణ సంస్థలు భారీ జరిమానా విధించనున్నాయి. సోషల్ నెట్‌వర్క్‌ల గోప్యత, సమాచార రక్షణలో లోపాలు వంటి కారణాలకు గానూ ఫేస్‌బుక్‌పై జరిమానా విధించేందుకు ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) సిద్ధమవుతోంది. దర్యాప్తు సెటిల్మెంట్లో భాగంగా ఎఫ్‌టీసీ ఫేస్‌బుక్‌పై రూ.34,280 కోట్ల (5 బిలియన్ డాలర్లు) జరిమానా విధించనుంది. దీనికి సంబంధించిన వివరాలను వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో ప్రచురించింది. వ్యక్తిగత భద్రతా వైఫల్యాలకు ఓ సంస్థపై ఎఫ్‌టీసీ ఇంత భారీజరిమానా విధించడం ఇదే తొలిసారి. దీనికి అమెరికా న్యాయశాఖ ఇంకా ఆమోదించలేదు. సెటిల్మెంట్లో భాగంగా వినియోగదారుల వ్యక్తిగత భద్రతకు సంబంధించి ఫేస్‌బుక్‌కు కొన్ని కఠిన ఆంక్షలు విధించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు 2011లో ఎఫ్‌టీసీ ఫేస్‌బుక్‌తో ప్రైవసీ సెటిల్మెంట్ చేసుకుంది. దీని ప్రకారం వినియోగదారుల సమాచారాన్ని తమ వ్యాపార భాగస్వామ్య సంస్థలకు అందించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అలా చేయని పక్షంలో జరిమానా విధించే హక్కు ఉంటుంది. -
టిక్‌టాక్‌కు అమెరికా భారీ షాక్..!
వాషింగ్టన్ : యువతలో బాగా క్రేజ్ సంపాదించుకున్న చైనా సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌కు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. పదమూడేళ్ల లోపు చిన్నారుల డేటాను అక్రమంగా సేకరిస్తోందన్న కారణంగా టిక్‌టాక్ యాజమాన్యానికి ఫెడరల్ ట్రేడ్ కమిషన్(ఎఫ్‌టీసీ).. 5.7 మిలియన్ డాలర్ల(దాదాపు 40. 60 కోట్ల రూపాయలు) భారీ జరిమానా విధించింది. సినిమా డైలాగులు, పాటలకు, భావోద్వేగాలకు అనుగుణంగా వీడియోలు అప్లోడ్ ద్వారా తమ టాలెంట్‌ను బయటపెట్టేందుకు అవకాశం ఉన్న ఈ యాప్ పట్ల... యువతతో పాటు చిన్నారులు, పెద్దలు కూడా ఆసక్తి కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2018లో కాలిఫోర్నియాకు చెందిన మ్యూజికల్.ఎల్వై(Musical.ly) అనే మరో యాప్ గ్రూపు టిక్‌టాక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే తల్లిదండ్రుల అనుమతి లేకుండా పదమూడేళ్ల లోపు చిన్నారుల ఫొటోలు, పేర్లు తదితర వ్యక్తిగత వివరాలను బహిర్గత పరచడం ద్వారా... టిక్‌టాక్ జాతీయ చిన్నారుల భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిందని ఎఫ్‌టీసీ పేర్కొంది. ఈ మేరకు బుధవారం భారీ జరిమానా విధించింది. వారికి కూడా కనువిప్పు కలగాలి.. ‘అమెరికాలో దాదాపు 65 మిలియన్ల మంది టిక్‌టాక్ యూజర్లు ఉన్నారు. మోస్ట్ పాపులర్ యాప్ విభాగంలో గూగుల్, ఆపిల్ డివైస్‌లలో వరుసగా నాలుగు, 25వ స్థానాల్లో ఉందంటే టిక్‌టాక్ ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. musical.lyతో ఒప్పందం కుదుర్చుకున్న టిక్‌టాక్‌ను చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో పదమూడేళ్ల లోపు చిన్నారుల వ్యక్తిగత విషయాలు బహిర్గమవుతున్నాయి. ఇది అమెరికా చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుంది. అందుకే 5.7 మిలియన్ డాలర్ల జరిమానా విధించాం. చిన్నారుల భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టిక్‌టాక్ వంటి మరెన్నో సోషల్ మీడియా యాప్‌లకు, సైట్లకు ఈ జరిమానా కనువిప్పు కలిగిస్తుందని ఆశిస్తున్నాం’ అని ఎఫ్‌టీసీ చైర్మన్ జో సైమన్స్ పేర్కొన్నారు. నిబంధనల మేరకే.. ఎఫ్‌టీసీ నిర్ణయం పట్ల టిక్‌టాక్ యాజమాన్యం స్పందించింది. అమెరికా చట్టాలకు అనుగుణంగానే తమ యాప్ పనిచేస్తోందని, ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని పేర్కొంది. 13 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు పూర్తి స్థాయిలో యాక్సెస్ కల్పించలేదని, తమ యూజర్ల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరణ ఇచ్చింది. -
ఫేస్‌బుక్‌కు మరో భారీ షాక్
వాషింగ్టన్ : గోప్యతా ఉల్లంఘన ఆరోపణలతో ఇబ్బందుల్లో పడిన సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు మరో షాక్ తగలనుంది. భారీగా వినియోగదారుల వ్యక్తిగత వివరాలను వారి అనుమతి లేకుండా విక్రయించిందన్న ఆరోపణలపై విచారణ చేస్తున్న సంస్థ ఫేస్‌బుక్‌కు అత్యధిక జరిమానా విధించే దిశగా కదులుతోంది. పలుమార్లు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున వినియోగదారుల డేటా బ్రీచ్ ఆరోపణల నేపథ్యంలో ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) రికార్డు స్థాయిలో జరిమానా విధించాలని భావిస్తోందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. శుక్రవారం న్యూయార్క్ టైమ్స్ వెల్లడించిన నివేదిక ప్రకారం.. ఫేస్‌బుక్‌పై సుమారు 16 వందల కోట్ల రూపాయలకు మించి పెనాల్టీ విధించాలని ఎఫ్‌టీసీ యోచిస్తోంది. 2012లో గోప్యతా ఉల్లంఘనలకు గాను గూగుల్‌పై ఎఫ్‌టీసీ విధించిన అత్యధిక జరిమానా 22.5 మిలియన్ డాలర్లు. దీనికి మించి ఫేస్‌బుక్‌కు పెనాల్టీ సెగ తాకనుందని వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టు చేసింది. అయితే ఈ వార్తలపై ఎఫ్‌టీసీ, ఫేస్బుక్ ఇంకా స్పందించలేదు. కాగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8.7 కోట్ల మంది యూజర్ల డేటాను ఫేస్బుక్ విక్రయించిదనే ఆరోపణలు ప్రకంపనలు రేపాయి. మరోవైపు తమ యూజర్ల డేటా లీకైందనే విషయాన్ని ఒప్పుకున్న ఫేస్బుక్ సీఈఓ జుకర్ బర్గ్ అమెరికన్ పార్లమెంటరీ కమిటీ ముందు హాజరయి భవిష్యత్తులో ఇలా జరగకుండా చూస్తామని హమీ ఇచ్చారు. అంతేకాదు పత్రికా ప్రకటనల ద్వారా క్షమాపణలు కోరారు. -
రోజూ మాత్ర
టీబీ వ్యాధికి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా క్షయ నివారణ శాఖ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు రోగులకు వారానికి మూడు రోజులపాటు (సోమ, బుధ, శుక్రవారాలు) మాత్రలు ఇచ్చేవారు. దీనికి స్వస్తిచెప్పి..ఇకనుంచి రోజూ మాత్రలు అందించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఏఎన్ఎంలు, ఫార్మసిస్టులు, సూపర్వైజర్లు, ఆశవర్కర్లకు శిక్షణ ఇచ్చారు. నల్లగొండ టౌన్ : టీబీ వ్యాధికి అడ్డుకట్ట వేయాలన్న సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫిక్సిడ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌టీసీ) మందుల కంపెనీ విధానంలో మార్పులు చేశాయి. గతంలో వారానికి మూడు రోజులే వ్యాధిగ్రస్తులకు మందులిస్తుండగా ఇక నుంచి వ్యాధిగ్రస్తుల బరువును బట్టి మందులను అందించే విధానికి శ్రీకారం చుట్టింది. ఈ విధా నం ఇప్పటికే జిల్లా క్షయనివారణ శాఖ అమల్లో పెట్టింది. నూతన విధానం అమల్లోకి రావడం పట్ల జిల్లాలోని 1327 మంది టీబీ వ్యాధిగ్రస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాత విధానంలో పలు లోపాలున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి నూతన విధానంపై అమలుకు మొగ్గు చూపింది. రోగి బరువును రోజుకు రెండు మాత్రల నుంచి 5మాత్రలు వేసుకునేలా అందజేస్తున్నారు. 70కిలోల బరువు కలిగిన రోగికి ఒకరోజు 5మాత్రలు, వారానికి 5మాత్రలు వేసుకోవాల్సి వుంటుందని, గతంలో ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో వాధిగ్రస్తులకు మాత్రలను ఇచ్చేవారు. లేకుంటే వైద్యారోగ్యశాఖ సిబ్బంది గుర్తించిన వ్యాధిగ్రస్తుల ఇళ్లకు వెళ్లి మాత్రలను సరఫరా చేసేవారు. మాత్రలను వేసుకోవడంలో ఏఒక్క రోజు మరిచిపోయిన మందుల కోర్సు ను మళ్లీ వేసుకోవాల్సి వుండేది. దీని కారణంగా వ్యాదిగ్రస్తుల సంఖ్య తగ్గకపోగా ఏటేటా కొత్త వ్యాధిగ్రస్తులను గుర్తించాల్సివచ్చేది. ప్రస్తుతం నూతన విధానం వలన వ్యాధిగ్రస్తులు మాత్రలను వేసుకోవడం మరిచిపోయే అవకాశం ఉండదు. నూతన విధానం వలన జిల్లాలో వ్యాధిగ్రస్తుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు. సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ టీబీ మందుల సరఫరా విధానంలో నూతనంగా అమలు చేస్తున్న పద్ధతిపై జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రా థమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఏ ఎన్ఎంలు, ఫార్మసిస్టులు, సూపర్వైజ ర్లు, ఆశవర్కర్లకు శిక్షణ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో వ్యాధిగ్రస్తులకు మందుల పంపిణీపై అవగాహన కల్పిం చడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మందుల పంపిణీ చేస్తున్నారు. వాధ్యిగ్రస్తులకు లాభం నూతన విధానం వలన వ్యాధిగ్రస్తులు మందులను వేసుకోవడం మరిచిపోయే అవకాశం ఉండదు. ఈ విధానం వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. మందులను అన్ని ప్రాథమిక కేంద్రాల్లో అందుబాటులో ఉంచడడం జరిగింది. అవకాశాన్ని రోగులు సద్వినియోగం చేసుకుని వ్యాధి నుంచి విముక్తులు కావాలి. – డాక్టర్ అరుంధతి, జిల్లా క్షయ నివారాణాధికారి -
ఎఫ్‌టీసీ డీడీఏగా సురేంద్ర బెనర్జీ
అనంతపురం అగ్రికల్చర్ : వ్యవసాయశాఖకు అనుబంధంగా ఉన్న రైతు శిక్షణా కేంద్రం (ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్–ఎఫ్‌టీసీ) డీడీఏగా సురేంద్ర బెనర్జీ బాధ్యతలు తీసుకున్నారు. బుధవారం స్థానిక వ్యవసాయశాఖ జేడీ కార్యాలయంలో ఎఫ్‌టీసీ ఇన్చార్జ్ డీడీఏ స్వయంప్రభ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా సురేంద్రబెనర్జీ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా వాయిల్పాడు ఏడీఏగా పనిచేస్తున్న తనకు డీడీఏగా పదోన్నతి కల్పించి ఇక్కడికి బదిలీ చేశారన్నారు. రైతు శిక్షణా కేంద్రం ద్వారా రైతులు, అధికారులకు శిక్షణ కార్యక్రమాలు, క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. జేడీఏ పీవీ శ్రీరామమూర్తి, డీడీఏ (అగ్రానమీ) శ్రీనివాసులు, ఏడీఏ (పీపీ) జి.విద్యావతి, ఇతర అధికారులు సురేంద్ర బెనర్జీకి శుభాకాంక్షలు తెలియజేశారు.