ఫేస్‌బుక్‌కు మరో భారీ షాక్‌ | Facebook faces 'record-setting' fine over privacy violations: Report  | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌కు మరో భారీ షాక్‌

Published Sat, Jan 19 2019 11:44 AM | Last Updated on Sat, Jan 19 2019 5:08 PM

Facebook faces 'record-setting' fine over privacy violations: Report  - Sakshi

వాషింగ్టన్‌ : గోప్యతా ఉల్లంఘన ఆరోపణలతో ఇబ‍్బందుల్లో పడిన సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు మరో షాక్‌ తగలనుంది. భారీగా వినియోగదారుల వ్యక్తిగత వివరాలను వారి అనుమతి లేకుండా విక్రయించిందన్న ఆరోపణలపై విచారణ చేస్తున్న సంస్థ  ఫేస్‌బుక్‌కు అత్యధిక జరిమానా విధించే దిశగా కదులుతోంది. పలుమార్లు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున వినియోగదారుల డేటా బ్రీచ్‌ ఆరోపణల నేపథ్యంలో ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) రికార్డు స్థాయిలో జరిమానా విధించాలని భావిస్తోందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

శుక్రవారం న్యూయార్క్ టైమ్స్ వెల్లడించిన నివేదిక ప్రకారం.. ఫేస్‌బుక్‌పై సుమారు 16 వందల కోట్ల రూపాయలకు మించి పెనాల్టీ విధించాలని ఎఫ్‌టీసీ యోచిస్తోంది. 2012లో గోప్యతా ఉల్లంఘనలకు గాను గూగుల్‌పై ఎఫ్‌టీసీ విధించిన అత‍్యధిక జరిమానా 22.5 మిలియన్‌ డాలర్లు. దీనికి మించి ఫేస్‌బుక్‌కు పెనాల్టీ సెగ తాకనుందని వాషింగ్టన్‌ పోస్ట్‌ రిపోర్టు చేసింది. అయితే ఈ వార్తలపై ఎఫ్‌టీసీ, ఫేస్‌బుక్‌ ఇంకా స్పందించలేదు.

కాగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8.7 కోట్ల మంది యూజర్ల డేటాను ఫేస్‌బుక్ విక్రయించిదనే ఆరోపణలు ప్రకంపనలు రేపాయి. మరోవైపు తమ యూజర్ల డేటా లీకైందనే విషయాన్ని ఒప్పుకున్న ఫేస్‌బుక్ సీఈఓ జుకర్ బర్గ్ అమెరికన్ పార్లమెంటరీ కమిటీ ముందు హాజరయి భవిష్యత్తులో ఇలా జరగకుండా చూస్తామని హమీ ఇచ్చారు. అంతేకాదు పత్రికా ప్రకటనల ద్వారా క్షమాపణలు కోరారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement