సాక్షి, న్యూఢిల్లీ: పేదోడి సొంతింటి కలను సాకారం చేసేందుకు ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) ప్రారంభించిన హౌసింగ్ స్కీమ్ పథకం-2014లో ఇళ్లను పొందేందుకు దరఖాస్తు గడువు తేదీ మరింత పెరిగింది. ఈ పథకంలో ఇళ్లు పొందేందుకు దరఖాస్తుల జారీ, సమర్పణ ప్రక్రియ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తుల సమర్పణకు అక్టోబర్ 9వ తేదీని చివరి తేదీగా డీడీఏ ప్రకటించింది. అయితే ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో మరో ఆరురోజులు గడువును పొడిగిస్తున్నట్లు డీడీఏ ప్రకటించింది. పితృపక్షం, వరుసగా పండుగలు రావడంతో ప్రజలు దరఖాస్తులను సమర్పించలేకపోయామని, గడువు పెంచాల్సిందిగా కూడా చాలామంది నుంచి అభ్యర్థనలు అందాయని డీడీఏ అధికారి ఒకరు తెలిపారు.
దరఖాస్తుల సమర్పణకు గడువు పొడిగిస్తున్నట్లు డీడీఏ ప్రకటించడంతో సమర్పించే దరఖాస్తుల సంఖ్య భారీగా పెరుగుతుందన్నారు. ఈ పథకం కింద డీడీఏ 25 వేలకుపైగా ఫ్లాట్లు కేటాయించనుంది. అయితే ఈ ఫ్లాట్లలో రెండు లేదా మూడు బెడ్ రూమ్‌లున్న ఫ్లాట్ల సంఖ్య తక్కువగా ఉండడంలో గత డీడీఏ హౌజింగ్ స్కీములకు లభించినంత భారీ ప్రతిస్పం దన ఈ స్కీముకు లభించడంలేదని అంటున్నారు. దానికి తోడు రోహిణీ సెక్టార్ 34, 35లోని 11 వేల ఫ్లాట్ల విస్తీర్ణం చాలా తక్కువగా ఉండడం కూడా కూడా ఆసక్తిగలవారిని నిరుత్సాహపరిచిందని, బ్యాంకులు కూడా లక్ష రూపాయలు జమ చేసేం దుకు ఫైనాన్సింగ్ స్కీమును ఆలస్యంగా ప్రారంభిం చాయని, ఐదేళ్ల వరకు ఫ్లాటు విక్రయించరాదని విధించిన షరతు వల్ల కూడా దరఖాస్తు సమర్పించేవారి సంఖ్య తగ్గిందని చెబుతున్నారు.
డీడీఏ ఫ్లాట్ల కోసం 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
Published Wed, Oct 8 2014 10:11 PM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM
Advertisement
Advertisement