సాక్షి, న్యూఢిల్లీ: లక్కీ డ్రాలో డీడీఏ ఫ్లాటు పొందడమంటే లాటరీ తగిలినట్లే అనుకునే రోజులు పోయాయి. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీకి చెందిన హౌజింగ్ స్కీమ్ -2014 కింద ఫ్లాట్లు అలాటైనవారిలో 1500 మంది తమ ఫ్లాట్లను వెనక్కి ఇచ్చేశారు. నెలరోజుల్లో ఫ్లాట్లు నిరాకరించినవారి సంఖ్య వెయిటింగ్ లిస్టులో ఉన్నవారి సంఖ్య క ంటే ఎక్కువగా ఉండడం విశేషం. వెయిటింగ్ లిస్టులో 1200 మంది ఉన్నారు. డిమాండ్ లెటర్లు జారీ అయ్యేలోగా ప్లాట్లను నిరాకరించేవారి సంఖ్య మరింత పెరుగవచ్చని కూడా అంటున్నారు. వాపసు చేసిన ఫ్లాట్లు ద్వారకా, రోహిణీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతాలు పూర్తిగా అభివృద్ధి చెందలేదని, ఇక్కడున్న డీడీఏ ఫ్లాట్లకు రాకపోకలు సాగించడం కష్టమని ఫ్లాట్లు వాపసు చేసినవారు అంటున్నారు. ప్రజారవాణా వ్యవస్థ కూడా బాగాలేదని అంటున్నారు.
నరేలాకు ప్రజారవాణా వ్యవస్థ సరిగాలేదని, రోహిణీ సెక్టార్ 34, 35లలో మరో ఆరువేల ప్లాట్లు నిర్మించవలసిఉందని అంటున్నారు. కర్వాలా గ్రామ వాసులతో జరిగిన గొడవ కారణంగా రోహిణీలో ఫ్లాట్ల నిర్మాణం ఆలస్యమైంది. ద్వారకాలో నిర్మించిన ఫ్లాట్లు చాలా చిన్నగా ఉన్నాయని కూడా అంటున్నారు. ఈడబ్ల్యుఎస్ కేటగిరీ కోసం నిర్మించిన ఫ్లాట్లను డీడీఏ ఆఖరి నిమిషంలో సాధారణ కేటగిరీ కింద నుండే డీడీఏ వన్ బీహెచ్‌కే ఫ్లాట్ల కేటగిరిలో చేర్చించిందని అంటున్నారు. ఫ్లాట్లు అలాటైనవారు ఐదేళ్ల వరకు వాటిని విక్రయించరాదని డీడీఏ విధించిన షరతు కూడా కొందరిని ఫ్లాట్లను వాపసుచేసేలా చే సిందని చెబుతున్నారు.
నెల రోజుల్లో 1,500 ఫ్లాట్ల వాపసు
Published Mon, Jan 12 2015 10:10 PM | Last Updated on Sat, Sep 2 2017 7:36 PM
Advertisement
Advertisement