ఖాళీ అవుతున్న కట్‌పుత్లీ
న్యూఢిల్లీ: పునరావాసం కల్పిస్తామంటూ అధికారులు ఇచ్చిన హామీతో కట్‌పుత్లీ కాలనీవాసులు తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలుతున్నా రు.
తమ కాలనీని ప్రైవేటు బిల్డర్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ ఇక్కడి నుంచి కదిలేదిలేదంటూ భీష్మించుకు కూర్చున్న విషయం తెలి సిందే. దీంతో అటువంటి అనుమానాలు అక్కరలేదని, పునరావాసం కల్పిస్తామంటూ ఢిల్లీ అభివృద్ధి సంస్థ(డీడీఏ) అధికారులు ఇచ్చిన హామీతో ఖాళీ చేసేందుకు ఎట్టకేలకు అంగీకరించారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు శుక్రవారం ఉదయం నుంచి కొందరు కొందరుగా తరలివెళ్తున్నారు.
ఎక్కడో దూరంగా తమకు తాత్కాలిక పునరావాసాన్ని కల్పిస్తే పిల్లల చదువులకు అంతరాయం కలుగుతుందన్న స్థానికుల వాదనను కూడా డీడీఏ అధికారులు పరిగణనలోకి తీసుకొని కాలనీకి సమీపంలోనేగల ఆనంద్‌ప్రభాత్‌లో తాత్కాలిక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి తరలి వెళ్లేందుకు కట్‌పుత్లీ కాలనీవాసులు అంగీకరించారు.
పశ్చిమ ఢిల్లీలోని షాదీపూర్ ప్రాంతంలోగల కట్‌పుత్లీ కాలనీలో కళాకారులకు చెందిన 3,000 కుటుంబాలు నివసిస్తున్నాయి. బొమ్మలను తయా రు చేసేకళాకారుల నుంచి బొమ్మలను ఆడించే కళాకారులు, జానపద కళాకారులు తదితర కుటుం బాలు ఇక్కడ నివసిస్తున్నాయి. కాగా మురికివాడగా ఉన్న ఈ రంగుల ప్రపంచాన్ని అభివృద్ధి చేయాలని భావించిన డీడీఏ రహేజా సంస్థతో కలిసి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఓ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.
ఇందులో కళాకారుల కుటుంబాలకు కూడా ఫ్లాట్లను కేటాయించనున్నారు. కాగా ఎక్కడ తమకు ఫ్లాట్లు కేటాయించరేమోననే భయం తో ఈ కాలనీవాసులు ఖాళీ చేసేందుకు నిరాకరించారు. చివరకు అధికారులు హామీ ఇవ్వడంతో ఇక్కడి నుంచి తాత్కాలిక పునరావాస కేంద్రానికి తరలివెళ్తున్నారు.