సాక్షి,న్యూఢిల్లీ: ‘రెండున్నరేళ్లు లైంగిక దాడికి తెగబడ్డారు..ఘాతుకాన్ని వీడియోలో రికార్డు చేశారు..ఇప్పుడు నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు’ ఇదీ ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ(డీడీఏ)లో పనిచేసే బాధిత ఉద్యోగిని ఆవేదన. సీనియర్ అధికారి సహా నలుగురు సహోద్యోగులు తనపై పలు సందర్భాల్లో అత్యాచారానికి ఒడిగట్టారని చెబుతున్నారు.
తనపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా వాటిని వీడియో తీసి బెదిరిస్తున్నారని వాపోయారు. తనకు రావాల్సిన బకాయిలు చెల్లించకుండా తనను హతమారుస్తామని హెచ్చరిస్తున్నారని చెప్పారు. తనకు జరిగిన అన్యాయాన్ని బాధిత ఉద్యోగిని సీనియర్ డీడీఏ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
బాధిత మహిళకు 2014లో భర్త మరణించిన క్రమంలో డీడీఏలో ఉద్యోగం లభించింది. కాగా, బాధితురాలి ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని డీసీపీ రొమిల్ బనియా చెప్పారు. ఉద్యోగిని ఫిర్యాదుపై శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశించామని సీనియర్ డీడీఏ అధికారి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment