సాక్షి, న్యూఢిల్లీ: తాము నిర్మించిన ఇళ్లను కొనుగోలు చేయదలుచుకున్నవారికి ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) ఓ వెసులుబాటు కల్పించింది. తమ ఫారాన్ని ఎలా పూర్తిచేయాలో తెలియజేయడం కోసం ఆన్‌లైన్ వీడియోగైడ్‌ను తన వెబ్‌సైట్‌లో ఉంచిం ది. ఫారాన్ని నింపేటప్పుడు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఈ వీడియో వివరిస్తుంది. ఆరు నిమిషాల నిడివికలిగిన ఈ వీడియో డిడిఏ హౌసింగ్ స్కీమ్-2014 పేజీలో అందుబాటులో ఉంటుంది. ఫార ంను ఎలా పూర్తిచేయాలనే విషయాన్ని ఈ వీడియోలో కాలం వారీగా వివరించారు. దరఖాస్తుఫారాల పూర్తికి సంబంధించి పలువురు సందేహాలను వెలిబుచ్చుతుండడం,సలహాలు కోరుతున్నందువల్ల ఈ వీడియోను తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు డీడీఏ తెలియజేసింది.
25 వేలకు పైగా ఫ్లాట్ల కేటాయింపుకోసం డీడీఏ ప్రకటించిన హౌసింగ్ పథకాన్కి విశేష స్పందన లభిస్తోంది. ఈ నెల ఒకటో తేదీన ప్రారంభించిన ఈ పథకానికి అదే రోజునే 11 లక్షల హిట్‌లు రావడంతో వెబ్‌సైట్ కుప్పకూలిన సంగతి విదితమే. దీంతో ఆన్‌లైన్ ట్రాఫిక్ అవసరాలకు తగ్గట్టుగా డీడీఏ తన సర్వర్‌ను నవీకరించక తప్పలేదు. ఈ పథకం కోసం డీడీఏమొదట 15 లక్షల బ్రోచర్లను ముద్రించింది.అయితే డిమాండ్ విపరీతంగా ఉండడంతో మరో ఐదు లక్షల ప్రతులకు ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటి వరకు 14 లక్షలకు పైగా ఫారాలు అమ్ముడుపోయాయి. దాదాపు 20 వేల దరఖాస్తులు డీడీఏకి అందాయి. ద రఖాస్తుల సమర్పణకు ఆఖరి రోజు వచ్చే నెల తొమ్మిది.
దరఖాస్తు పూర్తి ఇంకా సులువు
Published Sat, Sep 27 2014 10:46 PM | Last Updated on Sat, Sep 2 2017 2:01 PM
Advertisement