చెమటోడ్చి కూడబెట్టిన సొమ్ముతో డీడీఏ నిర్మించిన ఫ్లాట్లను ఒకవేళ కొనుగోలు చేసినప్పటికీ యాజమాన్యపు హక్కులు మాత్రం ఆ వెంటనే దక్కవు. ఇందుకోసం కనీసం ఐదు సంవత్సరాలపాటు ఎదురు చూడక తప్పదు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను సంబంధిత అధికారులు డీడీఏ చైర్‌పర్సన్ కూడా అయిన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌కు ఇటీవలపంపారు.
న్యూఢిల్లీ: ఈసారి ఫ్లాట్ల కొనుగోలు కోసం ఆసక్తిగా ఎదురుగా చూస్తున్నవారికి ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) కొత్తగా ఓ షరతు విధించనుంది. ఇప్పటిదాకా కొనుగోలుచేసిన వెంటనే యాజమాన్య హక్కులను బదిలీ చేసిన డీడీఏ ఇకమీదట ఐదేళ్లపాటు తన వద్దనే ఉంచుకోనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను సంబంధిత అధికారులు... డీడీఏ చైర్‌పర్సన్ కూడా అయిన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌కు ఇటీవలే పంపారు. డీడీఏ న్యాయవిభాగం ఈ సరికొత్త ఆలోచనకు తెరతీసింది. ఈ నిర్ణయం విషయంలో వెనక్కి తగ్గకూడదని డీడీఏ అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. కాగా ఈ నిర్ణయం సంగతి ఎలా ఉన్నప్పటికీ దీని ప్రభావం కారణంఆ ఆస్తుల ధరలు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉందని కొందరు ఆందోళన చెందుతున్నారు.
ఈ విషయమై డీడీఏ ఉపాధ్యక్షుడు బల్వీందర్‌కుమార్ మాట్లాడుతూ ‘డ్రా ఫలితాలు ప్రకటించిన తర్వాత యాజమాన్యపు హక్కుల విషయంలో మధ్యవర్తులు జోక్యం చేసుకుంటున్నారంటూ మాకు అనేక ఫిర్యాదులు అందాయి. ఇందుకు సంబంధించి ఎన్నో కఠినతరమైన నిబంధనలను విధించినప్పటికీ ఎటువంటి ఫలితమూ దక్కడం లేదు. ఇక కేటాయింపుల విషయంలోనూ మధ్యవర్తులు జోక్యం చేసుకుంటున్నారనే ఫిర్యాదులు కూడా మాకు అందుతున్నాయి. చవక ధరలకే ఫ్లాట్లను నగరవాసులకు అందించాలనేది మా సంస్థ లక్ష్యం. ప్రస్తుత మార్కెట్ ధరలతో పోలిస్తే మా ఫ్లాట్ల ధరలు ఎంతో తక్కువ అనే విషయాన్ని కొనుగోలుదారులకు తెలియజేసేవిధంగా ముందుకు సాగిపోవడమే మా లక్ష్యం. కేటాయింపు ప్రక్రియ కూడా పారదర్శకంగా ఉండాలనేది మా అభిమతం’ అని అన్నారు.
అన్ని అర్హతలు కలిగిన కొనుగోలుదారుడికి కేటాయింపుతోపాటు ఫ్లాట్ల అందజేయడం జరుగుతుందన్నారు. ఇందువల్ల లబ్ధిదారుడు తనకు కేటాయించిన ఫ్లాట్‌లోనే ఉంటాడన్నారు. హక్కులన్నీ దక్కించుకున్న తర్వాత సదరు యజమాని తన ఫ్లాట్ ను విక్రయించుకునేందుకు వీలవుతుందన్నారు. అయితే యాజమాన్యపు హక్కుల బదలాయింపు విషయంలో కొత్త షరతు విధించాలని యోచిస్తున్నామన్నారు. ఐదేళ్ల వరకూ ఎటువంటి క్రయవిక్రయాలు జరగకుండా యాజమాన్యపు హక్కులను తమ వద్దనే ఉంచుకోవాలనుకుంటున్నామని చెప్పారు. కేటాయింపు తదితర ప్రక్రియలు పారదర్శకంగా.
సజావుగా సాగాలనేది తమ అభిమతమన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను డీడీఏ చైర్‌పర్సన్ కూడా అయిన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌కు ఇటీవల పంపామని తెలిపారు. కాగావచ్చే నెల మొదటివారంలో డీడీఏ తన నూతన ప్రాజెక్టుకు సంబంధించి ఓ ప్రకటన చేయనుంది. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 26 వేల ఫ్లాట్లను నిర్మించనుంది. అందులో 24 వేల ఫ్లాట్‌లు ఏక పడక గదివి. దిగువ ఆదాయ వర్గాల వారికి కేటాయించనుంది. మరో ఏడు వందల ఫ్లాట్లకు డ్రా నిర్వహించాలని డీడీఏ యోచిస్తోంది. వీటి ఖరీదు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయల వరకూ ఉండనుంది.
కొత్త షరతు..!
Published Sat, Jul 26 2014 10:13 PM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM
Advertisement
Advertisement