Najib Jung
-
గ్రీన్ సిటీ కోసం సెస్
* సిగరెట్ ప్యాకెట్, మద్యం సీసాపై రూపాయి చొప్పున పన్ను * ఈ నిధులతో పట్టణ రవాణా నిధి ఏర్పాటుకు చర్యలు * 2017 నాటికి 8 కోచ్‌లతో 129 మెట్రో రైళ్ల ప్రవేశం * ఉన్నతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో పెరుగుతున్న కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తోంది. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి అధికారులతో శుక్రవారం జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మందుబాబులు, పొగరాయుళ్ల జేబులకు చిల్లు పెట్టి, తద్వారా వచ్చే సొమ్మతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి, కాలుష్య నియంత్రణ కోసం చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సూచించిన మరుసటి రోజే ఎల్జీ ఈ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. * ఢిల్లీ జాతీయ ప్రాదేశిక ప్రాంత పరిపాలన విభాగం(జీఎన్సీటీడీ) అధికారులతోపాటు ట్రాఫిక్, కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వివరాల్లోకెళ్తే... * పజారవాణ వ్యవస్థను ప్రోత్సహించడం కోసం జీఎన్సీటీడీ పట్టణ రవాణా నిధిని ఏర్పాటు చేస్తుంది. * నగరంలో విక్రయించే ప్రతి సిగరెట్ ప్యాకెట్, ప్రతి మద్యం సీసాపై ఒక రూపాయి సెస్ విధించడం ద్వారా వసూలయ్యే సొమ్ముతో ఈ నిధిని ఏర్పాటు చేస్తారు. * కాలుష్య నియంత్రణ నిబంధనలను పక్కాగా అమలు చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటారు. * పతి వాహనంపై వ్యాలిడ్ పీయూసీ స్టిక్కర్ ఉండేలా చూసేందుకు చర్యలు చేపడాతారు. * ఢిల్లీలో పెట్రోలు లేదా డీజిల్ పోయించుకునేందుకు వాహనం వ్యాలిడ్ పీయూసీ సర్టిఫికెట్ కలిగి ఉండాలన్న నిబంధనను విధించే విషయాన్ని పరిశీలిస్తారు. * ఢిల్లీ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహ నాల ప్రవేశాలను నియంత్రిస్తారు. * ఓవర్లోడింగ్ సమస్యను పరిష్కరించడం కోసం ఢిల్లీలోని అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద వెయ్ ఇన్ మోషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు జీఎన్సీటీడీ ప్రణాళికలు రూపొందిస్తుంది. * అనధికార పార్కింగ్‌లపై పోలీసులు కఠిన చర్యలు చేపడ్తారు. * రద్దీగా ఉండే ఇరుకు వీధులలో పార్కిగ్‌ను నిరుత్సాహపర్చి, మల్టీలెవల్ పార్కింగ్‌లలో పార్కింగ్‌ను ప్రోత్సహించడం కోసం వేర్వేరు రేట్లతో పార్కింగ్ విధానాన్ని రూపొందిస్తారు. * ఇరుకు రోడ్లపై ప్రీమియం పార్కింగ్ రేట్లను ప్రవేశపెట్టే విషయాన్ని కూడా పరిశీలిస్తారు. * మెట్రో, ప్రజారవాణాకు లాస్ట్ మైల్ కనెక్టివిటీని అందించడం కోసం బ్యాటరీతో నడిచే వాహనాలను రవాణా విభాగం, జీఎన్సీటీడీ ప్రవేశపెడాతాయి. * 2017 నాటికి 129 మెట్రో రైళ్లలో 8 కోచ్‌లను ప్రవేశపెడాతారు. * వాయు కాలుష్యం పట్ల ఢిల్లీ వాసుల్లో అవగాహన కల్పించడం కోసం రవాణా విభాగం, జీఎన్సీటీడీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వస్తాయి. -
కొత్త షరతు..!
చెమటోడ్చి కూడబెట్టిన సొమ్ముతో డీడీఏ నిర్మించిన ఫ్లాట్లను ఒకవేళ కొనుగోలు చేసినప్పటికీ యాజమాన్యపు హక్కులు మాత్రం ఆ వెంటనే దక్కవు. ఇందుకోసం కనీసం ఐదు సంవత్సరాలపాటు ఎదురు చూడక తప్పదు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను సంబంధిత అధికారులు డీడీఏ చైర్పర్సన్ కూడా అయిన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు ఇటీవలపంపారు. న్యూఢిల్లీ: ఈసారి ఫ్లాట్ల కొనుగోలు కోసం ఆసక్తిగా ఎదురుగా చూస్తున్నవారికి ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) కొత్తగా ఓ షరతు విధించనుంది. ఇప్పటిదాకా కొనుగోలుచేసిన వెంటనే యాజమాన్య హక్కులను బదిలీ చేసిన డీడీఏ ఇకమీదట ఐదేళ్లపాటు తన వద్దనే ఉంచుకోనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను సంబంధిత అధికారులు... డీడీఏ చైర్పర్సన్ కూడా అయిన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు ఇటీవలే పంపారు. డీడీఏ న్యాయవిభాగం ఈ సరికొత్త ఆలోచనకు తెరతీసింది. ఈ నిర్ణయం విషయంలో వెనక్కి తగ్గకూడదని డీడీఏ అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. కాగా ఈ నిర్ణయం సంగతి ఎలా ఉన్నప్పటికీ దీని ప్రభావం కారణంఆ ఆస్తుల ధరలు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉందని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై డీడీఏ ఉపాధ్యక్షుడు బల్వీందర్‌కుమార్ మాట్లాడుతూ ‘డ్రా ఫలితాలు ప్రకటించిన తర్వాత యాజమాన్యపు హక్కుల విషయంలో మధ్యవర్తులు జోక్యం చేసుకుంటున్నారంటూ మాకు అనేక ఫిర్యాదులు అందాయి. ఇందుకు సంబంధించి ఎన్నో కఠినతరమైన నిబంధనలను విధించినప్పటికీ ఎటువంటి ఫలితమూ దక్కడం లేదు. ఇక కేటాయింపుల విషయంలోనూ మధ్యవర్తులు జోక్యం చేసుకుంటున్నారనే ఫిర్యాదులు కూడా మాకు అందుతున్నాయి. చవక ధరలకే ఫ్లాట్లను నగరవాసులకు అందించాలనేది మా సంస్థ లక్ష్యం. ప్రస్తుత మార్కెట్ ధరలతో పోలిస్తే మా ఫ్లాట్ల ధరలు ఎంతో తక్కువ అనే విషయాన్ని కొనుగోలుదారులకు తెలియజేసేవిధంగా ముందుకు సాగిపోవడమే మా లక్ష్యం. కేటాయింపు ప్రక్రియ కూడా పారదర్శకంగా ఉండాలనేది మా అభిమతం’ అని అన్నారు. అన్ని అర్హతలు కలిగిన కొనుగోలుదారుడికి కేటాయింపుతోపాటు ఫ్లాట్ల అందజేయడం జరుగుతుందన్నారు. ఇందువల్ల లబ్ధిదారుడు తనకు కేటాయించిన ఫ్లాట్‌లోనే ఉంటాడన్నారు. హక్కులన్నీ దక్కించుకున్న తర్వాత సదరు యజమాని తన ఫ్లాట్ ను విక్రయించుకునేందుకు వీలవుతుందన్నారు. అయితే యాజమాన్యపు హక్కుల బదలాయింపు విషయంలో కొత్త షరతు విధించాలని యోచిస్తున్నామన్నారు. ఐదేళ్ల వరకూ ఎటువంటి క్రయవిక్రయాలు జరగకుండా యాజమాన్యపు హక్కులను తమ వద్దనే ఉంచుకోవాలనుకుంటున్నామని చెప్పారు. కేటాయింపు తదితర ప్రక్రియలు పారదర్శకంగా. సజావుగా సాగాలనేది తమ అభిమతమన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను డీడీఏ చైర్పర్సన్ కూడా అయిన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు ఇటీవల పంపామని తెలిపారు. కాగావచ్చే నెల మొదటివారంలో డీడీఏ తన నూతన ప్రాజెక్టుకు సంబంధించి ఓ ప్రకటన చేయనుంది. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 26 వేల ఫ్లాట్లను నిర్మించనుంది. అందులో 24 వేల ఫ్లాట్లు ఏక పడక గదివి. దిగువ ఆదాయ వర్గాల వారికి కేటాయించనుంది. మరో ఏడు వందల ఫ్లాట్లకు డ్రా నిర్వహించాలని డీడీఏ యోచిస్తోంది. వీటి ఖరీదు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయల వరకూ ఉండనుంది. -
ఈరోజైనా తేలేనా?
న్యూఢిల్లీ: ఢిల్లీలో రాజకీయ స్థితిపై అనుసరించే వ్యూహాన్ని వారం రోజులలో నిర్ణయిస్తారని ఢిల్లీ బీజేపీ ఇన్చార్జ్ ప్రభాత్ ఝా ప్రకటించడంతో నగరంలో జరుగుతోన్న బీజేపీ అగ్రనేతల సమావేశాలన్నింటినీ ఢిల్లీ బీజేపీ నేతలతో పాటు రాజకీయ పరిశీలకులు ఆసక్తితో గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం నితిన్ గడ్కరీ నివాసంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు మధ్య జరిగిన సమావేశం, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ల మధ్య జరిగిన సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీ- ఆర్ఎస్ఎస్నేతల సమావేశం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నివాసంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, మాజీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, ఆర్ఎస్ఎస్ నేతలు, రామ్ గోపాల్, భయ్యాజీ జోషీ, సురేష్ సోనీలు బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశాన్ని ఢిల్లీ బీజేపీ నేతలు వేయికళ్లతో గమనించారు. అయితే ఈ సమావేశంలో ఢిల్లీ ప్రస్తావన వచ్చినట్లు తేలకపోవడంతో వారి దృష్టి శుక్రవారం జరగనున్న పార్లమెంటరీ బోర్డు సమావేశంపైకి మళ్లింది. నాలుగు రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనుసరించే వ్యూహాల గురించి చర్చించనున్న ఈ సమావేశంలో ఢిల్లీ రాజకీయ పరిస్థితిపై అనుసరించవలసిన వ్యూహం గురించి కూడా బీజేపీ నాయకత్వం ఒక నిర్ణయానికి రావచ్చని వారు ఆశిస్తున్నారు. రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన ఎల్జీ.. లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను గురువారం సాయంత్రం హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కలిశారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై నెలకొన్న అనిశ్చితి దృష్ట్యా ఈ సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఎల్జీ ఆహ్వానిస్తే ప్రభుత్వం ఏర్పాటుకు సుముఖమేనని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఇటీవల వెల్లడించినప్పటి నుంచి ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యా బలం లేదని, ప్రభుత్వం ఏర్పాటుకు ఆ పార్టీని ఆహ్వానించినట్లయితే ఎమ్మెల్యేల బేరసారాలను ప్రోత్సహించినట్లవుతుందని అరవింద్ కేజ్రీవాల్ నేత ృత్వంలోని ఆప్ బృందం ఎల్జీని కలిసి హెచ్చరించింది. దీనిపై ఎల్జీ స్పందిస్తూ.. ఇతరులను కూడా సంప్రదించి రాష్ట్రపతికి నివేదిక సమర్పిస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో నజీబ్ జంగ్ హోం మంత్రిని కలవడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ నిర్ణయం శిరోధార్యం: ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుపై ఎమ్మెల్యేలతో పాటు ఏడుగురు పార్లమెంటు సభ్యుల అభిప్రాయాలను జాతీయ నాయకత్వానికి తెలియచేశామని, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఢిల్లీ బీజేపీ నేతలకు శిరోధార్యమని ఢిల్లీ బీజేపీ ఇన్చార్జ్ ప్రభాత్ ఝా తెలిపారు. ఎన్నికలతో సహా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ఢిల్లీ బీజేపీ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటుచేయడం కోసం తమ పార్టీ అనైతిక పద్ధతులకు పాల్పడబోదని తెలిపారు. ఎన్నికలకే వెళ్దామంటున్న కార్యకర్తలు.. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామా? ఎన్నికలకు వెళ్దామా? అనే విషయంలో ఎటూ తేల్చుకోలేక పోతున్న పార్టీ అధిష్టానం పార్టీలో కిందిస్థాయి కార్యకర్తల నుంచి అభిప్రాయాన్ని కూడా సేకరించిం దని సమాచారం. ఉత్తర, దక్షిణ, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లలో అభిప్రాయాన్ని సేకరిం చగా వచ్చిన నివేదికల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయానికి వచ్చినట్లు పార్టీ నేత ఒకరు తెలిపారు. అయితే కిందిస్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకు అందరి నుంచి ఎన్నికలకు వెళ్దా మనే అభిప్రాయమే వ్యక్తమైందని, నివేదికలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. దీంతో శుక్రవారం జరగనున్న పార్లమెం టరీ బోర్డు సమావేశంలో కార్యకర్తల అభిప్రాయాల ను కూడా పరిగణనలోకి తీసుకొని, నిర్ణయం తీసు కోవాలని పార్టీ భావిస్తోందని చెబుతున్నారు. అదే నిజమైతే కమలనాథులు ప్రభుత్వ ఏర్పాటుపై కాకుండా ఎన్నికలకు వెళ్లేందుకే సిద్ధమవుతారంటు న్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు వెళ్లడమే పార్టీకి ప్రయోజనకరమంటున్నారు.