balwinder kumar
-
డీడీఏ గృహ పథకం రేపటి నుంచి ఫారాలు అందుబాటులో
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) హౌసింగ్ పథకం- 2014 సోమవారం నుంచి ఆరం భం కానుంది. ఇందుకు సంబంధించి సంబంధిత అధికారులు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారు. సోమవారం ఉద యం తొమ్మిదిన్నర గం టలకు వికాస్ సదన్‌లోని నాగరిక్ సువి ధా సెంటర్లో డీడీఏ ఉపాధ్యక్షుడు బల్వీందర్ కుమార్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆసక్తి కలిగినవారికి దరఖాస్తు ఫారాలను బ్యాంకుల ద్వా రా అందజేయడానికి డీడీఏ అన్ని ఏర్పాట్లు చేసింది. తొలి దశలో 15 లక్షల బ్రోచర్లు ముద్రిస్తున్నారు. వీటి ఖరీదును రూ. 150గా నిర్ణయించారు. బ్రోచర్లు సరళంగా ఉంటాయని, దరఖాస్తు ఫారాల పూర్తి ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. బ్రోచర్లు 13 బ్యాంకుల అన్ని శాఖలలో లభిస్తాయి. పూర్తిచేసినదరఖాస్తు ఫారాలను కూడా బ్యాంకులకు సమర్పించాల్సి ఉం టుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్, సిండికేట్, కార్పొరేషన్, యూనియన్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఐడీబీఐ, ఇండస్ఇండ్, కోటక్ మహీ ంద్రా, యస్, యాక్సిస్ తదితర బ్యాంకులు దరఖాస్తు ఫారాలను అందజేేయడంతో పాటు రిజిస్ట్రేషన్ సొమ్మును చెల్లించడం కోసం తమ తమ శాఖలలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తారు. డీడీఏ కోరిన రిజిస్ట్రేషన్ సొమ్మును దరఖాస్తుదారులకు రుణం రూపంలో అందజేయడానికి బ్యాం కులు పలు పథకాలను రూపొందించాయి. 2014 హౌసింగ్ పథకంకింద డిడిఏ నగరంలో 25 వేలకు పైగా ఫ్లాట్లను కేటాయించనుంది. దరఖాస్తు పత్రాలు వచ్చే నెల ఒకటో తేదీనుంచి అక్టోబర్ తొమ్మిది వరకు లభిస్తాయి. అక్టోబర్ నెలాఖరులో ఇందుకు సంబ ంధించి డ్రా తీయనున్నారు. -
కొత్త షరతు..!
చెమటోడ్చి కూడబెట్టిన సొమ్ముతో డీడీఏ నిర్మించిన ఫ్లాట్లను ఒకవేళ కొనుగోలు చేసినప్పటికీ యాజమాన్యపు హక్కులు మాత్రం ఆ వెంటనే దక్కవు. ఇందుకోసం కనీసం ఐదు సంవత్సరాలపాటు ఎదురు చూడక తప్పదు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను సంబంధిత అధికారులు డీడీఏ చైర్పర్సన్ కూడా అయిన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు ఇటీవలపంపారు. న్యూఢిల్లీ: ఈసారి ఫ్లాట్ల కొనుగోలు కోసం ఆసక్తిగా ఎదురుగా చూస్తున్నవారికి ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) కొత్తగా ఓ షరతు విధించనుంది. ఇప్పటిదాకా కొనుగోలుచేసిన వెంటనే యాజమాన్య హక్కులను బదిలీ చేసిన డీడీఏ ఇకమీదట ఐదేళ్లపాటు తన వద్దనే ఉంచుకోనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను సంబంధిత అధికారులు... డీడీఏ చైర్పర్సన్ కూడా అయిన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు ఇటీవలే పంపారు. డీడీఏ న్యాయవిభాగం ఈ సరికొత్త ఆలోచనకు తెరతీసింది. ఈ నిర్ణయం విషయంలో వెనక్కి తగ్గకూడదని డీడీఏ అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. కాగా ఈ నిర్ణయం సంగతి ఎలా ఉన్నప్పటికీ దీని ప్రభావం కారణంఆ ఆస్తుల ధరలు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉందని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై డీడీఏ ఉపాధ్యక్షుడు బల్వీందర్‌కుమార్ మాట్లాడుతూ ‘డ్రా ఫలితాలు ప్రకటించిన తర్వాత యాజమాన్యపు హక్కుల విషయంలో మధ్యవర్తులు జోక్యం చేసుకుంటున్నారంటూ మాకు అనేక ఫిర్యాదులు అందాయి. ఇందుకు సంబంధించి ఎన్నో కఠినతరమైన నిబంధనలను విధించినప్పటికీ ఎటువంటి ఫలితమూ దక్కడం లేదు. ఇక కేటాయింపుల విషయంలోనూ మధ్యవర్తులు జోక్యం చేసుకుంటున్నారనే ఫిర్యాదులు కూడా మాకు అందుతున్నాయి. చవక ధరలకే ఫ్లాట్లను నగరవాసులకు అందించాలనేది మా సంస్థ లక్ష్యం. ప్రస్తుత మార్కెట్ ధరలతో పోలిస్తే మా ఫ్లాట్ల ధరలు ఎంతో తక్కువ అనే విషయాన్ని కొనుగోలుదారులకు తెలియజేసేవిధంగా ముందుకు సాగిపోవడమే మా లక్ష్యం. కేటాయింపు ప్రక్రియ కూడా పారదర్శకంగా ఉండాలనేది మా అభిమతం’ అని అన్నారు. అన్ని అర్హతలు కలిగిన కొనుగోలుదారుడికి కేటాయింపుతోపాటు ఫ్లాట్ల అందజేయడం జరుగుతుందన్నారు. ఇందువల్ల లబ్ధిదారుడు తనకు కేటాయించిన ఫ్లాట్‌లోనే ఉంటాడన్నారు. హక్కులన్నీ దక్కించుకున్న తర్వాత సదరు యజమాని తన ఫ్లాట్ ను విక్రయించుకునేందుకు వీలవుతుందన్నారు. అయితే యాజమాన్యపు హక్కుల బదలాయింపు విషయంలో కొత్త షరతు విధించాలని యోచిస్తున్నామన్నారు. ఐదేళ్ల వరకూ ఎటువంటి క్రయవిక్రయాలు జరగకుండా యాజమాన్యపు హక్కులను తమ వద్దనే ఉంచుకోవాలనుకుంటున్నామని చెప్పారు. కేటాయింపు తదితర ప్రక్రియలు పారదర్శకంగా. సజావుగా సాగాలనేది తమ అభిమతమన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను డీడీఏ చైర్పర్సన్ కూడా అయిన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు ఇటీవల పంపామని తెలిపారు. కాగావచ్చే నెల మొదటివారంలో డీడీఏ తన నూతన ప్రాజెక్టుకు సంబంధించి ఓ ప్రకటన చేయనుంది. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 26 వేల ఫ్లాట్లను నిర్మించనుంది. అందులో 24 వేల ఫ్లాట్లు ఏక పడక గదివి. దిగువ ఆదాయ వర్గాల వారికి కేటాయించనుంది. మరో ఏడు వందల ఫ్లాట్లకు డ్రా నిర్వహించాలని డీడీఏ యోచిస్తోంది. వీటి ఖరీదు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయల వరకూ ఉండనుంది. -
జూలైలో గృహనిర్మాణ పథకం
న్యూఢిల్లీ: నగరవాసులకు శుభవార్త. ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) వచ్చే నెలలో భారీ గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించనుంది. మొత్తం 26 వేల ఫ్లాట్ల నిర్మాణం చేపట్టింది. ఈ విషయాన్ని డీడీఏ ఉపాధ్యక్షుడు బల్వీందర్‌కుమార్ వెల్లడించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఒక పడక గది ఉండే 24 వేల ఫ్లాట్లతోపాటు మరో రెండు వేల ఫ్లాట్లను నిర్మిస్తున్నామన్నారు. ఈ పథకం జూలైలో అందుబాటులోకి వస్తుందన్నారు. డీడీఏ, 2014లో భాగంగా దీనిని చేపట్టామన్నారు. ద్వారకా, నరేలా, రోహిణి ప్రాంతాల్లో వీటిని నిర్మిస్తున్నామన్నారు. వీటి ధరలు రూ. 14 లక్షల నుంచి మొదలుకుని రూ. కోటిదాకా ఉంటాయన్నారు. కాగా ఈ పథకం నాలుగు ఏళ్ల విరామం తరువాత ప్రారంభమవనుంది. 2010లో డీడీఏ 16 వేల ఫ్లాట్లను నిర్మించిన సంగతి విదితమే. తాజా పథకంలో భాగంగా 24 వేల ఫ్లాట్లను చవక ధరలకు విక్రయించనుంది. మిగతా ఫ్లాట్లను ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీలుగా విభజించింది. సింగిల్ బెడ్రూం ఫ్లాట్లను ఆర్థికంగా వెనుకబడినవారికి కేటాయించాలా లేక మరెవరికి కేటాయించాలనే విషయమై త ్వరలో సమావేశమై ఓ నిర్ణయం తీసుకుంటామని బల్వీందర్‌కుమార్ తెలిపారు. ఈ ఫ్లాట్లలో అత్యధిక శాతం ప్రీ-ఫ్యాబ్రికేటెడ్‌గా నిర్మించామన్నారు. ఇవి హరిత లక్షణాలను కలిగి ఉంటాయన్నారు. 2021, ఢిల్లీ మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా నిర్మించామన్నారు. ద్వారకా, నరేలా, రోహిణి ప్రాంతాల్లో నాలుగు అంతస్తులు లేదా ఆపైన నిర్మించామన్నారు. జూలై చివరినాటికల్లా 15 వేల ఫ్లాట్లను సిద్ధం చేస్తామన్నారు. మిగతా వాటి నిర్మాణం వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా పూర్తవుతుందన్నారు. ఆ తర్వాత ఆయా లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.