సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో నీటి సరఫరా. విద్యుత్ తదితర సమస్యల పరిష్కారం కోసం లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ గురువారం రాజ్‌నివాస్‌లో వేర్వేరుగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ), జల్ బోర్డు అధికారులతో జరిగిన తొలి సమావేశంలో ఆయన ద్వారకాకు నీటిసరఫరాలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించా రు. ద్వారకాకు నీటిసరఫరాను కొనసాగిస్తూనే ఇత ర వనరుల నుంచి అదనంగా నీరందించే మార్గాలను అన్వేషించాల్సిందిగా ఎల్జీ వారికి సూచించా రు. ద్వారకా ప్రాంతానికి నీరందించాల్సిందిగా డీడీఏని ఆదేశించారు. ఈ సందర్భంగా డీడీఏ అధికారులు మాట్లాడుతూ ఈ నెల 20 నాటికి ద్వారకాకు అదనపు నీటిని అందుబాటులోకి తేనున్నట్లు ఎల్జీకి తెలియజేశారు. వేసవిలో నీటి ఎద్దడి సమస్య పరిష్కారం కోసం రానున్న మూడు నెలల పాటు ద్వారకాకు ఉచితంగా నీటి ట్యాంకర్లను సరఫరా చేసే మార్గాన్ని అన్వేషించాల్సిందిగా ఎల్జీ... డీడీఏకి సూచించారు.
డీజేబీ, డిస్కం అధికారులతోనూ సమీక్ష
ఢిల్లీ జల్‌బోర్డు (డీజేబీ) అధికారులతో పాటు డిస్కం అధికారులతో జరిపిన మరో సమావేశంలో
నూ నజీబ్ జంగ్ నగరంలో నీటి సరఫరాతో పాటువిద్యుత్ సరఫరాను సమీక్షించారు. ఏప్రిల్ 23న జరిగిన సమావేశంలో జారీ చేసిన ఆదేశాలను డీజేబీ, డిస్కంలు ఏ మేరకు అమలుచేస్తున్నాయనే విషయాన్ని ఆయన ఈ సమావేశంలో సమీక్షించారు. నజీబ్ జంగ్ సూచన మేరకు నీటి ట్యాంకర్ల నుంచి నీరు వృథాగా పోకుండా చేయడంకోసం స్టీలు ట్యాంకర్లను వినియోగిస్తున్నట్టు డీజేబీ తెలిపింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల మేరకు ప్రజల ఫిర్యాదులను స్వీకరించడం కోసం అనేక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయడంతోపాటు, మూడు కాల్ సెంటర్లు, 24 వాటర్ ఎమర్జెన్సీ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు డీజేబీ అధికారులు తెలిపారు.ఈ కంట్రోల్ రూముల పనితీరును నజీబ్ జంగ్ స్వయంగా ఫోన్ చేసి పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. డీజేబీ నీటి శుద్ధి ప్లాంట్ ఉన్న ప్రాంతాలలో కోతలు లేకుండా చూడాలంటూ నజీబ్ జంగ్.. విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు. విద్యుత్ కోతలకు సంబంధించిన నివేదిక తనకు సమర్పించాల్సిందిగా ఎల్జీ... డిస్కంలను ఆదేశించారు.
మొబైల్ యాప్‌ను ఆవిష్కరించిన ఎల్జీ
ట్రాఫిక్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు నగరవాసులకు చేరవేసేందుకు వీలుగా రూపొందించిన మొబైల్ అప్లికేషన్‌ను ఎల్జీ నజీబ్ జంగ్ గురువారం ఆవిష్కరించారు. దీంతోపాటు నవీకరించిన ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ వెబ్‌సైట్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు. కాగా ట్రాఫిక్ మొబైల్ అప్లికేషన్‌ను ఢిల్లీ ట్రాఫిక్ విభాగం అభివృద్ధి చేసింది. దీనిని తమ తమ సెల్‌ఫోన్లలో వాడుకునే నగరవాసులు ఎక్కడైనా ట్రాఫిక్ సిగ్నళ్లు పనిచేయకపోతే తక్షణమే ఫిర్యాదు చేసేందుకు వీలవుతుంది.
అదనపు వనరులను అన్వేషించండి
Published Thu, May 8 2014 11:11 PM | Last Updated on Sat, Sep 2 2017 7:05 AM
Advertisement
Advertisement