న్యూఢిల్లీ: కేంద్ర పార్లమెంటు సమీపంలో కొత్తగా చేపట్టదలచిన భవన నిర్మాణాల ప్రాజెక్టు ‘సెంట్రల్ విస్టా’పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు క్షేత్రస్థాయి మార్పులేవైనా చేస్తే అందుకు వారిదే బాధ్యత అని హెచ్చరించింది. ప్రాజెక్టు భవితవ్యం తమ నిర్ణయంపై మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. ఢిల్లీ నగర మాస్టర్ ప్లాన్‌లో మార్పుల విషయాన్ని ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీకి తెలియజేయాల్సిన అవసరం లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్ నేతృత్వంలోని బెంచ్ శుక్రవారం విచారించింది. పలు చారిత్రక స్మారకాలు ఉన్న ప్రాంతంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టును చేపట్టడం వల్ల అవి ఇంకోచోటికి తరలిపోయే అవకాశముందని పిటిషనర్ పేర్కొనగా ప్రాజెక్టు ఒక్క వారంలోనే పూర్తి కాబోవడం లేదని బెంచ్ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment