new building construction
-
ఇలలో ఇంద్రభవనం: నూతన పార్లమెంట్ భవన విశేషాలు
కొత్త పార్లమెంటు ఇంద్రభవనాన్ని తలపిస్తోంది. మిర్జాపూర్ కార్పెట్లు, నాగపూర్ టేక్ వుడ్, త్రిపుర వెదురు ఫ్లోరింగ్, రాజస్తాన్ శిల్పకళాకృతులతో మన దేశ ప్రత్యేకత అయిన భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ధగధగలాడిపోతోంది. ఏక్ భారత్ శ్రేష్టభారత్ అన్న ప్రధాని మోదీ నినాదం అడుగడుగునా కనిపించేలా వివిధ రాష్ట్రాల్లో పేరు పొందిన సామగ్రితో భవన నిర్మాణం జరిగింది. కలర్స్ ఆఫ్ ఇండియాను తలపించేలా కలర్ ఫుల్ గా ఉన్న పార్లమెంట్ భవన విశేషాలు.. ► పార్లమెంటు భవన నిర్మాణంలో వినియోగించిన ఎరుపు, తెలుపు శాండ్ స్టోన్‌ను రాజస్థాన్‌లోని సర్‌మథుర నుంచి తెచ్చారు. ఢిల్లీలోని ఎర్రకోట, హుమాయూన్ సమాధి ఈ రాతితో చేసిన నిర్మాణాలే. ► భవన నిర్మాణంలో తలుపులు, కిటికీలకు వాడిన టేకు చెక్కని మహారాష్ట్ర నాగపూర్ నుంచి తెప్పించారు. ► రాజస్తాన్ ఉదయపూర్ నుంచి కెషారియా గ్రీన్ స్టోన్, అజ్మీర్ సమీపంలోని లఖ నుంచి రెడ్ గ్రానైట్, అంబాజీ నుంచి తెల్ల పాలరాయిని వాడారు ► పార్లమెంటులో అమర్చిన కళ్లు చెదిరే ఫర్నిచర్‌ను ముంబైలో చేయించారు. ► లోక్‌సభ, రాజ్యసభ ఫాల్స్ సీలింగ్‌లో వాడిన ఉక్కుని కేంద్ర పాలిత ప్రాంతమైన డామన్, డయ్యూ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. ► భవనంలోకి సహజంగా గాలి వెలుతురు వచ్చేలా ఉత్తరప్రదేశ్ లోని నోయిడా, రాజస్థాన్ రాజ్ నగర్ నుంచి జాలీల రాయిని తెప్పించి వేయించారు ► లోక్‌సభ, రాజ్యసభ చాంబర్లలో అశోక చక్రం డిజైన్ ఆకృతి అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, రాజస్తాన్ జైపూర్ నుంచి ఈ డిజైన్ రూపొందించడానికి కావాల్సిన సామాగ్రిని తీసుకువచ్చారు. ► శిల్ప కళాకృతుల్ని రూపొందించడానికి ఉదయ్‌పూర్ నుంచి వచ్చిన శిల్పులు రేయింబవళ్లు శ్రమించారు. ► అహ్మదాబాద్ ఇత్తడిని వాడారు. ► త్రిపుర రాష్ట్రంలో లభించే అరుదైన వెదురుతో తయారు చేసిన ఫ్లోరింగ్‌పై యూపీలోని మిర్జాపూర్‌లో తయారు చేసిన కార్పెట్లను పరిచారు. ► సనాతన సంప్రదాయాలు ఉట్టిపడేలా, వాస్తు శాస్త్రాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని దేశంలో వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన 5 వేల కళాకృతులైన బొమ్మలు, పెయింటింగ్‌లు, కొన్ని ఫోటోలను ఏర్పాటుచేశారు. రెండు భవనాలకి ఎంత తేడా..! 1- పాత భవనంలో లోక్‌సభ సభ్యులు 543 మంది రాజ్యసభలో 250 మంది కూర్చొనే సదుపాయం ఉంది. అదే కొత్త భవనంలో సామర్థ్యాన్ని బాగా పెంచారు. లోక్‌సభలో 888 మందికి రాజ్యసభలో 300 మందికి సీట్లు ఏర్పాటు చేశారు. 2- బ్రిటిష్ ఆర్కిటెక్ట్ సర్ ఎడ్విన్ ల్యుటెన్స్, హెర్బర్ట్ బేకర్ పాత భవనం డిజైన్ చేస్తే, కొత్త పార్లమెంటు భవనాన్ని అహ్మదాబాద్‌కు చెందిన హెచ్సీపీ డిజైన్ ఆధునికంగా రూపొందించింది. ప్రముఖ ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్ పర్యవేక్షణలో డిజైన్ రూపొందించారు. 3- పాత భవనం గుండ్రంగా ఉంటూ 24, 281 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తే, కొత్త భవనాన్ని త్రిభుజాకారంలో 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. 4- పాత భవనం నిర్మాణం రెండు అంతస్తుల్లో ఉంటే, కొత్తది 4 అంతస్తుల్లో నిర్మించారు. 5- పాత నిర్మాణానికి ఆరేళ్లు పడితే కొత్త భవనాన్ని రెండున్నర ఏళ్లలో నిర్మించారు. 6- 1927లో ప్రారంభోత్సవం జరుపుకున్న పాత భవనానికి అప్పట్లోనే రూ.85 లక్షలైతే , కొత్త భవనానికి వెయ్యి కోట్ల వరకు ఖర్చు అయింది. 7- పాత భవనంలో ఉభయ సభల సంయుక్త సమావేశాల కోసం సెంట్రల్ హాలులో నిర్మిస్తే, కొత్త భవనంలో లోక్‌సభ చాంబర్‌నే ఉభయ సభల సభ్యులు ఒకేసారి కూర్చొనేలా ఎక్కువ సీట్లతో సిద్ధంచేశారు. 8- పార్లమెంటు పాత భవనంలో అగ్ని ప్రమాద నిరోధక వ్యవస్థ అత్యంత ఆందోళనకరంగా ఉండేది. కొత్త భవనంలో అత్యంత ఆధునిక వ్యవస్థలన్నీ ఒక ప్రణాళిక ప్రకారం అమర్చారు. అందుబాటులో ఉన్న డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి సీసీటీవీ, ఆడియో వీడియో వ్యవస్థ, ఓటింగ్‌కు బయోమెట్రిక్ వ్యవస్థ, ట్రాన్స్లేషన్ వ్యవస్థలు, ప్రోగ్రామబుల్ మైక్రోఫోన్స్, రీసౌండ్లు వినిపించకుండా వర్చువల్ సౌండ్ సిస్టమ్ వంటివన్నీ ఏర్పాటు చేశారు. భూకంపాలు వస్తే తట్టుకునే వ్యవస్థ ఏర్పాటు చేశారు. 150 ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా భవన నిర్మాణం సాగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పార్లమెంటు 2.0.. సర్వాంగ సుందరంగా కొత్త భవనం
ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు కొత్త భవనం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. త్రిభుజాకృతిలో నిర్మించిన ఈ భవనం దేశ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పడుతూనే ఆధునిక హంగుల కలబోతగా కూడా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 28 ఆదివారం కొత్త భవనాన్ని ప్రారంభించనున్నారు. వందేళ్ల నాటి పాత పార్లమెంటు భవనం నేటి అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో కొత్త భవన నిర్మాణం అవసరమైంది. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా కొత్త భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కేవలం రెండున్నరేళ్లలో నిర్మించింది. ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్ నేతృత్వంలో నిర్మాణం సాగింది. ప్రస్తుతం పార్లమెంటు పక్కనే నిర్మించిన కొత్త భవనంలో అతి పెద్ద హాళ్లు, కమిటీ రూములు, సెంట్రల్ హాలు, అతి పెద్ద లైబ్రరీ, విశాలమైన పార్కింగ్ వంటి సదుపాయాలన్నీ ఉన్నాయి. ► రూ.20 వేల కోట్లతో కూడిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా రూ.970 కోట్లతో పార్లమెంటు భవనాన్ని నిర్మించారు. ► లోక్‌సభ హాలును జాతీయ పక్షి నెమలి థీమ్‌తో నిర్మించారు. 888 మంది సభ్యులు కూర్చోవచ్చు. సభ్యుల సంఖ్య పెరిగినా ఇబ్బంది లేకుండా ప్రస్తుత లోక్‌సభ హాలు కంటే మూడు రెట్లు పెద్దగా రూపొందించారు. పార్లమెంటు సంయుక్త సమావేశాలకు కూడా చక్కగా సరిపోతుంది. 1,272 మంది సందర్శకులు సమావేశాలను తిలకించవచ్చు. ► రాజ్యసభ హాలును జాతీయ పుష్పం తామర థీమ్‌తో నిర్మించారు. 384 మంది సభ్యులు కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లున్నాయి. ► పార్లమెంటు భవన మూడు ప్రధాన ద్వారాలకు జ్ఞాన, శక్తి, కర్మ ద్వారాలని పేర్లు పెట్టారు. వీఐపీలు, ఎంపీలు, సందర్శకులకు మరో మూడు ప్రవేశ ద్వారాలున్నాయి. ► అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో 150 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా భవన డిజైన్‌ను అహ్మదాబాద్‌కు చెందిన హెచ్సీపీ డిజైన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ రూపొందించింది. ఇది భూకంపాల్ని కూడా తట్టుకుంటుంది. ► రాజస్తాన్‌కు చెందిన ధోల్పూర్ రాళ్లతో భవనానికి అద్భుతమైన లుక్ వచ్చింది. ► పార్లమెంటు భవనంలోని ఇంటీరియర్స్ భారత సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా, భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తుకు తెచ్చేలా పలు ప్రాంతీయ కళారూపాలతో రూపొందాయి. ► భవన నిర్మాణంలో అడుగడుగునా పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేశారు. గ్రీన్ ఎనర్జీతో 30% దాకా విద్యుత్ ఆదా అవుతుంది. అత్యాధునిక టెక్నాలజీ వాడటంతో భవన నిర్వహణ ఖర్చులో ఏడాదికి రూ.1,000 కోట్లకు పైగా ఆదా అవుతుందట. ► పార్లమెంటు భవనం పైకప్పు మీద కాంస్యంతో తయారు చేసిన మన జాతీయ చిహ్నం నాలుగు సింహాలను ఏర్పాటు చేశారు. ఇది 9,500 కిలోల బరువుతో 6.5 మీటర్ల ఎత్తుంది. ► భవన నిర్మాణంలో ప్రత్యక్షంగా 2 వేల మంది కార్మికులు, పరోక్షంగా 9 వేల మంది, వివిధ రాష్ట్రాలకు చెందిన 200 మంది కళాకారులు పాలుపంచుకున్నారు. ► ఆవరణలో రెండు మర్రి చెట్లు నాటారు. ► దివ్యాంగులకు అనుకూలంగా, వారు స్వేచ్ఛగా తిరిగేలా నిర్మాణం జరిగింది. ► భవనం గోడలపై పలు శ్లోకాలను రాశారు. చరిత్రలోకి తొంగి చూస్తే.. ప్రస్తుత పార్లమెంటు భవనం బ్రిటిష్ కాలం నాటిది. న్యూఢిల్లీ నగర రూపకర్తలైన ఎడ్విన్ ల్యూటెన్స్, హెర్బర్ట్ బేకర్ దీన్ని డిజైన్ చేశారు. 1921 నుంచి ఆరేళ్ల పాటు భవన నిర్మాణం సాగింది. ఈ వృత్తాకార భవనానికి 83 లక్షలు ఖర్చు అయింది. 1927 జనవరి 18న గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ దీన్ని ప్రారంభించారు. దీన్ని మ్యూజియంగా మార్చనున్నారు. ఎందుకీ నిర్మాణం? ప్రస్తుత పార్లమెంటు భవనం అవసరాలు తీర్చేలా లేదు. నియోజకవర్గాల పునర్విభజన జరిగి సభ్యుల సంఖ్య పెరిగితే సరిపోదు. మంత్రులు, మీటింగ్ హాల్స్ కొరత ఉంది. భవనంలో మార్పులు చేర్పులు చేస్తే నిర్మాణం దెబ్బ తినే ప్రమాదముంది. దానికి భూకంపాల్ని తట్టుకునే సామర్థ్యం లేదు. ఢిల్లీ ఏమో అత్యంత ప్రమాదకరమైన భూకంప జోన్–4లో ఉంది. అగ్నిప్రమాదాలను ఎదుర్కొనే ఆధునిక సౌకర్యాలూ లేవు. రాష్ట్రపతి ప్రారంభించాలి: రాహుల్ న్యూఢిల్లీ: పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ మొదలైంది. భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలే తప్ప ప్రధాని కాదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ప్రధాని ప్రారంభించడం రాజ్యాంగపరంగా సరైంది కాదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ కూడా ట్వీట్లు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 ప్రకారం లోక్‌సభ, రాజ్యసభలతో కూడిన పార్లమెంటుకు రాష్ట్రపతే అధిపతి గనుక నూతన భవనాన్ని ఆయనే ప్రారంభించాలన్నారు. ఆర్జేడీ, ఎంఐఎం కూడా ప్రధాని ప్రారంభించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక హిందూత్వవాది వి.డి. సావర్కర్ జయంతి నాడే (ఈ నెల 28న) ప్రారంభోత్సవం జరపనుండటాన్నీ విపక్షాలు తీవ్రంఆక్షేపిస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
10 అంతస్తుల భవనం.. 28 గంటల్లో నిర్మాణం
బీజింగ్: మాములుగా ఓ చిన్న గది నిర్మణానికే రోజుల సమయం పడుతుంది. అలాంటిది ఇల్లు, బహుళ అంతస్తుల నిర్మాణానికి ఎంత లేదన్న నెలలు, సంవత్సరాల సమయం పడుతుంది. చేతిలో డబ్బు, మెటిరీయల్ అన్ని సిద్ధంగా ఉన్నప్పటికి నిర్మాణం పూర్తి కావడానికి నెలల సమయం పడుతుంది. అలాంటిది ఓ చోట మాత్రం 10 అంతస్తుల నిర్మాణాన్ని కేవలం 28 గంటల వ్యవధిలో పూర్తి చేశారు. అయితే అదేదో సినిమా సెట్టు లాంటి నిర్మాణం అనుకుంటే పొరపడినట్లే. మనుషులు నివసించే అపార్ట్‌మెంట్‌ను కేవలం 28 గంటల్లో నిర్మించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆ వివరాలు.. చైనా చాంగ్షాకు చెందిన బ్రాడ్ గ్రూప్ కంపెనీ ఈ రికార్డును సృష్టించింది. ఈ పది అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం కోసం బ్రాడ్ కంపెనీ ప్రీ ఫ్యాబ్రికేటెడ్(ముందుగా నిర్మించిన) కన్స్ట్రక్షన్ టెక్నాలజీని ఉపయోగించి కేవలం 28 గంటల వ్యవధిలో 10 అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేశారు. దీనిలో భాగంగా ఫ్యాక్టరీలో ముందుగానే నిర్మించిన చిన్న విభాగాలను సమీకరించడం ద్వారా నిర్మాణం పూర్తి చేస్తారు. ఇక ఈ 10 అంతస్తుల భవనం నిర్మాణం కోసం ముందుగానే నిర్మించించిన కంటైనర్ సైజ్ బ్లాక్స్‌ను తీసుకువచ్చి.. వాటన్నింటిని ఒకదాని మీద ఒకటి పేర్చి.. బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేశారు. ఆ తర్వాత బోల్ట్స్ బిగించి.. వాటర్, కరెంట్ కనెక్షన్ ఇచ్చారు. ఇక ఈ మొత్తం నిర్మాణం పూర్తి కావడానికి 28 గంటల 45 నిమిషాల సమయం పట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో ఉంది. వీరిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: 5 రోజుల్లో 1,500 పడకల ఆస్పత్రి -
5 రోజుల్లో 1,500 పడకల ఆస్పత్రి
బీజింగ్: బీజింగ్ దక్షిణ ప్రాంతంలో కరోనా కేసులు తిరిగి నమోదవుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం కేవలం 5 రోజుల్లోనే 1,500 పడకలుగల ఆస్పత్రిని శనివారానికి నిర్మించిందని జిన్హువా న్యూస్ ఏజన్సీ వెల్లడించింది. హెబెయ్ ప్రావిన్సుల్లో మొత్తం ఆరు ఆస్పత్రులను నిర్మించేందుకు సిద్ధం కాగా అందులో ఇది మొదటిది. మొత్తం 6,500 పడకలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 130 కొత్త కేసులు రాగా, వాటిలో 90 కేసులు హెబెయ్ ప్రావిన్సులోనే వచ్చాయి. గత శుక్రవారం నాటికి షిజాఝంనంగ్ నగరంలో కోటి కరోనా వైరస్ టెస్టులు చేసినట్లు అక్కడి మీడియా తెలిపింది. -
ఆవిష్కారం.. ఆత్మ నిర్భర్ భారతం
సాక్షి, న్యూఢిల్లీ : నూతన పార్లమెంటు భవనం దేశ ప్రజాస్వామ్య చరిత్రలో కీలక మైలురాయని ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు గురువారం ప్రధాని శంకుస్థాపన చేశారు. నూతన భవనం ఆత్మ నిర్భర్ భారత్ దార్శనికతలో అంతర్భాగమని, స్వాతంత్య్ర అనంతర కాలంలో మొదటిసారిగా ఓ ప్రజా పార్లమెంటు నిర్మించేందుకు చరిత్రాత్మక అవకాశం వచ్చిందని అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ(2022) సమయానికి పూర్తయ్యే ఈ భవనం దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుందన్నారు. ప్రతి పార్లమెంటు సభ్యుడు ప్రజలకు, రాజ్యాంగానికి జవాబుదారీగా ఉండాలని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘2014లో పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంటు భవనంలో మొదటిసారి అడుగుపెట్టిన క్షణం ఇంకా గుర్తుంది. ఆ సమయంలో ప్రజాస్వామ్యానికి ఆలయం అయిన ఈ భవనానికి శిరసు వంచి ప్రణామం చేశా. పాత పార్లమెంటు భవనం స్వాతంత్య్రం అనంతర కాలంలో దేశానికి ఒక దిశను అందిస్తే కొత్త భవనం ఆత్మ నిర్భర్ భారత్ ఆవిష్కారానికి సాక్షిగా మారనుంది. 21వ శతాబ్దపు ఆకాంక్షలను నెరవేరుస్తుంది.’’ అన్నారు. ప్రజాస్వామ్యమే బలం భారత ప్రజాస్వామ్య మూలాలు 13వ శతాబ్దికి చెందిన మాగ్నాకార్టాలో ఉన్నాయని మోదీ గుర్తు చేశారు. ‘‘భారతదేశంలో ప్రజాస్వామ్యం అంటే జీవన విలువలు, జీవన మార్గం దేశ ప్రజల ఆత్మ. భారత్‌లో ప్రజాస్వామ్యం విఫలమవుతుందని మొదట్లో చాలామంది భావించారు, కానీ అది తప్పని ప్రస్తుత తరం గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఒక జీవన క్షమానుగత వ్యవస్థ ఉన్నాయి.’’ అన్నారు. కొత్త బిల్డింగ్ భవిష్యత్ రాజ్యాంగ అవసరాలు తీరుస్తుందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అభిప్రాయపడ్డారు. పలువురు కేంద్రమంత్రులు, విదేశీ రాయబారులు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, ఏఐడీఎంకే, బీజేడీ, టీఆర్ఎస్ తదితర పార్టీల ప్రతినిధులు, రతన్‌టాటా వంటి వ్యాపారవేత్తలు కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా తమ సందేశాలు పంపారు. భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆచార్య శివకుమార్ శర్మ, కేఎస్ లక్ష్మీనారాయణ సోమయాజి తదితరులు పూజలు నిర్వహించారు. శృంగేరి పీఠం నుం చి శంఖం, నవరత్న పీఠాలను శృంగేరి శారద పీఠం జగద్గురు భారతీ తీర్థ ఆశీర్వదించి పంపారు. ఈ కార్యక్రమంలో సర్వమత ప్రార్థనలు చేశారు. కాంగ్రెస్ విమర్శలు: ప్రజాస్వామ్యాన్ని ఛిన్నాభిన్నం చేసిన అనంతరం నిర్మించే కొత్త భవనం దేన్ని ప్రతిబింబిస్తుందని కాంగ్రెస్ విమర్శించింది. హక్కుల కోసం రైతులు పోరాటం చేస్తున్న తరుణంలో ప్రధాని భవనాలకు శంకుస్థాపనలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రతినిధి సూర్జేవాలా దుయ్యబట్టారు. పార్లమెంట్ బిల్డింగంటే ఇసుక, ఇటుకలు కాదని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించేదని చెప్పారు. విశేషాలు.. ► నూతన భవన నిర్మాణ కాంట్రాక్టును టాటా ప్రాజెక్ట్స్ గెలుచుకుంది. ► 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నారు. ► ప్రాజెక్టు అంచనా దాదాపు రూ.971 కోట్లు. 2022కి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ► నిర్మాణం పూర్తయితే లోక్‌సభ సీటింగ్ సామ ర్థ్యం 888 మంది సభ్యులకు పెరుగుతుంది. ► సంయుక్త సమావేశాలప్పుడు 1224 మందివరకు సామర్ధ్యం పెంచుకునే వీలుంది. ► రాజ్యసభ సీటింగ్ సామర్ధ్యం 384 సీట్లు. ► ప్రాజెక్టులో భాగంగా నిర్మించే శ్రమ్శక్తి భవన్లో ఒక్కో ఎంపీకి 40 చదరపు మీటర్ల ఆఫీసు ఇస్తారు. ఈ భవనం నిర్మాణం 2024లో పూర్తవుతుంది. ► ప్రస్తుత పార్లమెంట్ భవన నిర్మాణం 1921లో ప్రారంభమై 1927 జనవరి 18న ముగిసింది. ► ప్రస్తుత నిర్మాణంపై సుప్రీంకోర్టులో పలు దావాలున్నాయి. అందుకే కోర్టు కేవలం పేపర్ వర్క్ పూర్తి చేసేందుకు మాత్రమే అనుమతినిచ్చింది. తీర్పు వచ్చేవరకు కొత్త కట్టడాలు నిర్మించడం, కూల్చడం, చెట్లు నరకడం చేయవద్దని ఆదేశించింది. -
10న పార్లమెంటు కొత్త భవనానికి భూమి పూజ
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు భవనానికి ఈ నెల 10న ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ జరగనుంది. రూ.971 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ కొత్త భవనం నిర్మాణం 2022 నాటికి పూర్తి అయ్యే అవకాశాలున్నాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం తెలిపారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్న ప్రజాస్వామ్య దేవాలయం వందేళ్లు పూర్తి చేసుకుందని, ఆత్మనిర్భర్‌లో భాగంగా మనమే కొత్త భవనాన్ని నిర్మించుకోవడం దేశానికి గర్వకారణమని బిర్లా అన్నారు. కోవిడ్ నిబంధనల మ«ధ్య డిసెంబర్ 10 మధ్యాహ్నం ఒంటిగంటకి భూమి పూజ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించామని కొందరు స్వయంగా హాజరైతే, మరికొందరు ఆన్లైన్ ద్వారా తిలకిస్తారని బిర్లా చెప్పారు. 2022లో జరిగే దేశ 75వ స్వాతంత్య్ర దిన వేడుకల నాటికి కొత్త భవనంలోనే పార్లమెంటు సమావేశాలు జరుగుతాయని బిర్లా ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించే ఈ భవనాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ పేపర్‌లెస్ కార్యాలయాలను నిర్మించనున్నారు. భవిష్యత్‌లో పార్లమెంటు నియోజకవర్గాలను పెంచే ఉద్దేశం ఉన్న కేంద్రం అందుకు అనుగుణంగా లోక్‌సభ కార్యక్రమాలు నిర్వహించే హాలుని 888 మంది సభ్యులు కూర్చోవడానికి వీలుగా, రాజ్యసభ సమావేశ మందిరాన్ని 384 సీట్ల సామర్థ్యంతో నిర్మించనున్నారు. లోక్‌సభలో 1,224 మంది (ఉభయ సభలు సమావేశమైనప్పుడు) కూర్చునేందుకు వీలుగా సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశముంటుంది. ఈ భవన నిర్మాణంలో 2 వేల మంది ప్రత్యక్షంగా 9 వేల మంది పరోక్షంగా పాల్గొననున్నారు. 64.500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే ఈ భవనం బయట నుంచి చూడడానికి ప్రస్తుతమున్న పార్లమెంటు మాదిరిగానే ఉంటుందని బిర్లా వివరించారు. -
త్వరలో పార్లమెంటు కొత్త భవనం పనులు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు నూతన భవన నిర్మాణం ఈ డిసెంబర్లో ప్రారంభం కానుంది. అలాగే, 2022 అక్టోబర్ నాటికి నిర్మాణం పూర్తి అయ్యే అవకాశముంది. ఈ కాలంలో పార్లమెంటు సమావేశాలు ప్రస్తుత భవనంలోనే జరుగుతాయని లోక్‌సభ సెక్రటేరియట్ శుక్రవారం తెలిపింది. నిర్మాణ సమయంలో వాయు, శబ్ధ కాలుష్యాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. పార్లమెంటు భవన నిర్మాణంలో నాణ్యత, సకాలంలో పూర్తి చేయడంపై రాజీ పడబోమని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. భవన నిర్మాణ పనుల పర్యవేక్షణకు లోక్‌సభ సచివాలయ అధికారులు, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ, సీపీడబ్ల్యూడీ, ఎన్డీఎంసీ, అర్కిటెక్ట్‌లు సభ్యులుగా ఆయన ఒక కమిటీని నియమించారు. పార్లమెంటు భవన నిర్మాణానికి సంబంధించి స్పీకర్ అధ్యక్షతన శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ సమావేశానికి హాజరయ్యారు. నూతన భవనంలో సభ్యులకు ప్రత్యేక కార్యాలయాలు ఉంటాయని తెలిపారు. లోక్‌సభ, రాజ్యసభ చాంబర్ల పక్కనే విశాలమైన ’కాన్స్టిట్యూషన్ హాల్’ ఉంటుందన్నారు. -
కొత్త సచివాలయం.. కిటికీలే కీలకం
సాక్షి, హైదరాబాద్: సెంట్రలైజ్డ్ ఏసీ.. అద్దాలు.. అధునాతన నిర్మాణశైలీ.. ఇవీ భవంతుల నిర్మాణాల్లో సర్వసాధారణంగా కనిపించే డిజైన్లు. కానీ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కోవిడ్ ప్రభావంతో ఇప్పుడు ఆలోచన పూర్తిగా మారుతోంది. భవనాల డిజైన్లూ మారుతున్నాయి. కొత్తగా నిర్మించబోతున్న తెలంగాణ సచివాలయ భవనం కూడా దీనికి అతీతంకాదు. తెలంగాణ రాష్ట్ర ఘనతను సమున్నతంగా చాటే రీతిలో హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్‌సాగర్ తీరంలో సాక్షాత్కరించబోతున్న కొత్త సచివాలయ భవనం సంప్రదాయపద్ధతిలో, వీలైనన్ని ఎక్కువ కిటికీలతో రూపుదిద్దుకోనున్నది. అత్యున్నత స్థాయి సమావేశమందిరాలకు కూడా కిటికీలను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ కొత్త సచివాలయ భవనాన్ని సెంట్రలైజ్డ్ ఏసీ వసతితో నిర్మించాలని తొలుత భావించారు. అయితే, ఈ తరహా డిజైన్లపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు నుంచీ పెద్దగా ఆసక్తి చూపడంలేదు. భవనం అంతా ఏసీపై ఆధారపడేటట్లు ఉండే డిజైన్‌పట్ల సీఎం వ్యతిరేకంగానే ఉన్నారు. ముఖ్యమైన సమావేశ మందిరాలు, కొన్ని గదులు ఏసీతో ఉండేలా నిర్మించాలనుకున్నారు. ఈ మేరకు ఇటీవల ఆర్కిటెక్ట్ సంస్థ, ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో చర్చ జరిగింది. ఎంత ఆధునికంగా నిర్మిస్తున్నప్పటికీ, దీనికి సెంట్రలైజ్డ్ ఏసీ వద్దని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సూచించినట్టు సమాచారం. ఆ సమావేశం జరుగుతున్న వేళ దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు ఉధృతంగా పెరుగుతున్నాయి. మన దేశంలో కోవిడ్ మృతుల సంఖ్య తక్కువగా ఉండటానికి సెంట్రలైజ్డ్ ఏసీ భవనాలు తక్కువగా ఉండటం, ఏసీల్లో ఎక్కువ సమయం గడిపేవారి సంఖ్య తక్కువగా ఉండటమే ప్రధాన కారణమని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో రెండు పర్యాయాలు సీఎం అధికారులతో భేటీ అయి డిజైన్లపై ప్రత్యేక సూచనలు చేశారు. తాజాగా భవనంలో ఎక్కడా కిటికీలు లేకుండా పూర్తిగా ఏసీపై ఆధారపడే గది ఒక్కటి కూడా ఉండొద్దని నిర్ణయించారు. అన్ని సమావేశ మందిరాలకూ సహజరీతిలో గాలి, వెలుతురు ప్రసరించేలా విశాలమైన కిటికీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏసీ వసతితోపాటు ప్రతి గదిలో సీలింగ్ ఫ్యాన్లు కూడా ఉండేలా చూస్తున్నారు. ఇక్కడి చెట్లు సంజీవయ్య పార్కుకు.. సచివాలయ ప్రాంగణంలో చిన్నా, పెద్దా కలిపి 630 చెట్లున్నాయి. వీటిల్లో పెద్దవి దాదాపు వంద వరకు ఉంటాయి. ప్రధాన భవనాలు నిర్మించే ప్రాంతంలో 30 వరకు ఉన్నాయి. వీటిని కచ్చితంగా తొలగించాల్సి ఉంటుంది. కొత్త సచివాలయ ప్రాంగణంలోనే మరో చోటకు వాటిని ట్రాన్స్‌లొకేట్ చేయాలని భావిస్తున్నారు. అనుకూల పరిస్థితులు లేని పక్షంలో వాటిని సంజీవయ్య పార్కుకు తరలించాలని నిర్ణయించారు. కానీ, కొన్ని మాత్రమే ఆ పద్ధతిలో జీవించి ఉంటాయి. కొన్ని చనిపోతాయి. త్వరలో నిపుణులతో ఆ విషయంలో పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. -
‘సెంట్రల్ విస్టా’పై మాదే తుది నిర్ణయం: సుప్రీం
న్యూఢిల్లీ: కేంద్ర పార్లమెంటు సమీపంలో కొత్తగా చేపట్టదలచిన భవన నిర్మాణాల ప్రాజెక్టు ‘సెంట్రల్ విస్టా’పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు క్షేత్రస్థాయి మార్పులేవైనా చేస్తే అందుకు వారిదే బాధ్యత అని హెచ్చరించింది. ప్రాజెక్టు భవితవ్యం తమ నిర్ణయంపై మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. ఢిల్లీ నగర మాస్టర్ ప్లాన్‌లో మార్పుల విషయాన్ని ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీకి తెలియజేయాల్సిన అవసరం లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్ నేతృత్వంలోని బెంచ్ శుక్రవారం విచారించింది. పలు చారిత్రక స్మారకాలు ఉన్న ప్రాంతంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టును చేపట్టడం వల్ల అవి ఇంకోచోటికి తరలిపోయే అవకాశముందని పిటిషనర్ పేర్కొనగా ప్రాజెక్టు ఒక్క వారంలోనే పూర్తి కాబోవడం లేదని బెంచ్ స్పష్టం చేసింది. -
అధికార పీఠాల్లో మార్పులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా పునః అభివృద్ధి ప్రణాళిక వివరాలు ఒక్కటొక్కటిగా వెల్లడవుతున్నాయి. శతాబ్దాల చరిత్రగల ల్యూటెన్స్ ఢిల్లీలో సరికొత్త పార్లమెంటు భవనంతోపాటు సెంట్రల్ సెక్రటేరియట్, మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గత ఏడాది డిజైన్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. హెచ్సీపీ డిజైన్స్ అనే గుజరాతీ సంస్థ డిజైన్, కన్సల్టెన్సీ, ఇంజినీరింగ్ ప్లానింగ్ హక్కులు సాధించుకుంది. మొత్తం ప్రాజెక్టు ఫీజు రూ. 229.75 కోట్లు కాగా.. నిర్మాణ వ్యయం రూ. 12,879 కోట్లు అని అంచనా. హెచ్సీపీ సంస్థ మాస్టర్ ప్లాన్‌తోపాటు డిజైన్లు, నిర్మాణ వ్యయం, ల్యాండ్‌స్కేపింగ్, ట్రాఫిక్, పార్కింగ్ వంటి అంశాలపై నివేదిక ఇవ్వనుంది. ఈ మెగా ప్రాజెక్టుకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు...సెంట్రల్ విస్టా అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రధానమంత్రి నివాసాన్ని, కార్యాలయాన్ని సౌత్‌బ్లాక్‌కు దగ్గరగా మార్చనున్నారు. అలాగే ఉపరాష్ట్రపతి కోసం నార్త్ బ్లాక్ పరిసరాల్లో కొత్తగా ఒక ఇంటిని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి నివాసం ఉన్న భవనాన్ని కూల్చి వేయనున్నారు. రాష్ట్రపతి భవన్, ఇండియాగేట్‌ల మధ్య ఉన్న మూడు కిలోమీటర్ల పొడవైన రాజ్‌పథ్‌లో కొత్త నిర్మాణాలు జరపాలన్నది హెచ్సీపీ ప్రణాళిక. ప్రస్తుత పార్లమెంటు భవనం పక్కనే త్రికోణాకారంలో ఉండే సరికొత్త పార్లమెంటు భవనం, సెంట్రల్ సెక్రటేరియట్లు ఇక్కడ నిర్మాణమవుతాయి. స్వాతంత్య్రం 75వ వార్షికోత్సవాల సందర్భంగా అంటే 2022 ఆగస్టు నాటికి కొత్త పార్లమెంటు భవనాన్ని సిద్ధం చేయాలన్నది లక్ష్యం. కామన్ సెక్రటేరియట్‌ను 2024 నాటికల్లా అందుబాటులోకి తెస్తారు. ప్రధాని, ఉప రాష్ట్రపతి ఇళ్లను సౌత్, నార్త్ బ్లాక్‌లకు దగ్గరగా మార్చడం వల్ల వీఐపీల కోసం ట్రాఫిక్‌ను ఆపాల్సిన అవసరం తగ్గనుంది. పైగా ప్రధాని ఇల్లు, కార్యాలయం దగ్గరగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధాని ఇంటి నుంచి కార్యాలయానికి నడిచి వెళ్లేందుకూ అవకాశం ఉంటుంది. 8 భవనాలుగా సెంట్రల్ సెక్రటేరియట్.. కొత్త సెంట్రల్ సెక్రటేరియట్లో.. సెంట్రల్ విస్టాకు ఇరువైపులా నాలుగు భవనాల చొప్పున మొత్తం ఎనిమిది భవనాలు ఉంటాయి. ఒక్కో భవనంలో ఎనిమిది అంతస్తుల్లో వేర్వేరు మంత్రిత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటవుతాయి. మంత్రిత్వశాఖల్లో సుమారు 25 నుంచి 32 వేల మంది ఉద్యోగులు ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాల్లో పని చేస్తున్నారు. ఆయా శాఖల కార్యాలయాల కోసం ఏటా రూ.వెయ్యి కోట్లు అద్దెల కోసమే చెల్లిస్తున్నట్లు అంచనా. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం పూర్తయితే అద్దె ఆదా అవడమే కాకుండా ఉద్యోగులందరూ ఒకే చోట పనిచేస్తారు. -
2022కల్లా కొత్త పార్లమెంట్!
న్యూఢిల్లీ: 2022 పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్తగా నిర్మించిన లేదా ఉన్న భవనాలకే ఆధునిక హంగులద్దిన పార్లమెంట్లో జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు గురువారం తెలిపాయి. రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్‌కు మధ్య ఉత్తర, దక్షిణ బ్లాకుల వద్ద 3 కిలోమీటర్ల విశాలమైన సెంట్రల్ విస్తాను ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించనున్నారు. దీని కోసం ప్రభుత్వం దేశ విదేశాల నుంచి డిజైన్, ఆర్కిటెక్ట్ సంస్థలను పిలిచింది. కొత్తగా నిర్మించనున్న ఈ భవనాలు కనీసం 150 నుంచి 200 ఏళ్లపాటు సేవలు అందించనున్నాయి. ఫ్లోటింగ్ ఆఫ్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)లోని నిర్దేశిత నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఇంకా నిర్ణయం తీసుకోలేదా ! ఇప్పుడున్న భవన సముదాయం 1927లో నిర్మితమైందని, ప్రస్తుతం కావాల్సిన అవసరాలను అది అందుకోలేకపోతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే కొత్త భవనం నిర్మించాలా లేక పాతదాన్నే పునర్నిర్మించాలా ? అనే అంశంపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. వివిధ మంత్రిత్వ శాఖల కింద ఉన్న ఆఫీసు కార్యాలయాలను నిర్వహించేందుకు ఏటా రూ. 1,000 కోట్లు ఖర్చువుతోంది. కొత్తవాటిని నిర్మించడం ద్వారా ఈ వ్యయాన్ని ఆదా చేయ వచ్చని ప్రభుత్వం భావిస్తోంది. -
డిసెంబర్‌లోగా కొత్త కలెక్టరేట్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కొంగరకలాన్‌లో చేపట్టిన నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.30 కోట్ల వ్యయంతో చేపట్టిన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తిచేసేందుకు యంత్రాంగం దృష్టిసారింది. పరిపాలనా సౌలభ్యం కోసం నూతన కలెక్టరేట్ నిర్మాణానికి 2017 అక్టోబర్ 12న పునాదిరాయి వేశారు. అగ్రిమెంట్ చేసుకున్న తేదీ నుంచి 11 నెలల్లోనే భవన నిర్మాణాన్ని పూర్తిచేయాల్సి ఉంది. అయితే, వివిధ కారణాల వల్ల జాప్యం జరుగుతూ వస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్‌లోగా పనులు పూర్తిచేయాలన్న లక్ష్యాన్ని యంత్రాంగం నిర్దేశించుకుంది. కొలువుదీరనున్న 36 శాఖలు అత్యాధునికి హంగులతో సువిశాలంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ భవనంలో 36 శాఖల కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకోసం లక్ష చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించారు. ఆయా శాఖలు, వాటిలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా ఇప్పటికే స్థలాల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. 500 మంది కూర్చునే సామర్థ్యం గల ఆడిటోరియాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పోస్టాఫీస్, బ్యాంకు, డిస్పెన్సరీ తదిత సౌకర్యాలు కల్పించనున్నారు. నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులను ఈఏడాది డిసెంబర్‌లోగా పూర్తిచేస్తామని కలెక్టర్ లోకేష్‌కుమార్ చెప్పారు. దీని నిర్మాణ పనులపై ఆయన మంగళవారం కలెక్టరేట్లోని కోర్టు హాలులో అధికారులతో సమీక్షించారు. ఇప్పటివరకు 90 శాతం నిర్మాణం పూర్తయిందని, మిగిలిన పది శాతం పనులను నాలుగు నెలల్లో ముగిస్తామన్నారు. సమీక్షలో జెడ్పీ సీఈఓ జితేందర్‌రెడ్డి, డీఆర్ఓ ఉషారాణి పాల్గొన్నారు. -
కొత్త సచివాలయ నిర్మాణానికి భూమిపూజ
-
చట్టసభలకూ కొత్త భవనాలు!
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ధనిక రాష్ట్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన తెలంగాణలో ఆ ఖ్యాతికి తగ్గట్టుగా ప్రధాన పరిపాలన భవనాలు ఉండాలన్న దిశలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా హుస్సేన్‌సాగర్ తీరంలో సచివాలయం కోసం భారీ భవన సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సచివాలయం ఉన్న 24 ఎకరాల స్థలంలోనే తెలంగాణ సంస్కృతికి దర్పణం పడుతూ ఆధునిక హంగులతో కొత్త సెక్రటేరియట్ నిర్మించబోతోంది. అలాగే రాష్ట్రానికి కీలకమైన శాసనసభ, శాసన మండలిలకు కూడా అదే స్థాయిలో సమీకృత భవన సముదాయాన్ని నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్‌ను ఆనుకుని శాసనసభ, శాసన మండలి భవనాలున్నాయి. నిజాం కాలంలో నిర్మితమైన అసెంబ్లీ భవన సముదాయం చూడటానికి ఘనంగా కనిపించినా, అవి పురాతనమైపోవటంతో అంత వసతిగా లేవని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. ఇందులో పాత అసెంబ్లీ భవనం సరిగా లేకపోవటంతో దివంగత మాజీ సీఎం ఎన్టీ రామారావు హయాంలో ఓ భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఇందులోనే తెలంగాణ అసెంబ్లీ కొనసాగుతోంది. శాసన మండలికి ప్రత్యేక భవనం లేకపోవటంతో జూబ్లీహాల్‌ను మండలి భవనంగా మార్చారు. ఈ నేపథ్యంలో సరైన వసతులు లేని భవనాల్లో చట్టసభలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. సచివాలయానికి ఘనంగా భవనాన్ని నిర్మించబోతున్నందున, చట్టసభలకు కూడా అదే స్థాయిలో భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు అనువైన స్థలాలు గుర్తించి నివేదిక ఇవ్వాల్సిందిగా రోడ్లు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో ప్రస్తుతానికి మూడు ప్రాంతాలకు సంబంధించి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. వీటిలో ఓ స్థలాన్ని చట్టసభల భవనాల కోసం ఖరారు చేయనున్నట్టు సమాచారం. పబ్లిక్ గార్డెన్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించిన పబ్లిక్ గార్డెన్‌ను ఓ స్థలంగా గుర్తించారు. దాదాపు 35 ఎకరాల్లో విస్తరించిన పబ్లిక్ గార్డెన్ నిజాం కాలంలో హైదరాబాద్ కీ షాన్‌గా రూపుదిద్దుకున్న ఉద్యానవనం. ఇందులో జూబ్లీహాల్తోపాటు డాక్టర్ వైఎస్‌రాజశేఖరరెడ్డి తెలంగాణ స్టేట్ మ్యూజియం, జవహర్ బాలభవన్, హెల్త్ మ్యూజియం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, తెలుగు లలిత కళాతోరణం, ఉద్యానవన విభాగ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. గతంలో అద్భుతంగా ఉండి నగరవాసులకు ప్రధాన విహార విడిదిగా ఉన్న ఉద్యానవనాలు ప్రస్తుతం నిర్వహణ సరిగా లేక మురికికూపాలుగా మారాయి. దీంతో జనం కూడా పెద్దగా రావడంలేదు. దీంతో పోకిరీలు, ఆకతాయిలకు ఇది అడ్డాగా మారిపోయింది. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించి నగరవాసులను ఆకట్టుకున్న లలిత కళాతోరణం కూడా కళ తప్పింది. ఇందులోని ఓపెన్ థియేటర్ ఎంతో అలరించేది. ఇప్పుడు అందులో సినిమా ప్రదర్శనలు లేక వెలవెలబోతోంది. ఈ మొత్తం గార్డెన్‌ను పునరుద్ధరించి మెరుగుపరచాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. దీనిని ఆనుకునే ప్రస్తుత అసెంబ్లీ భవన సముదాయం ఉంది. ఈ ఉద్యానవనంలో కొత్త అసెంబ్లీ భవనాలు నిర్మిస్తే ఎలా ఉంటుందనే కోణంలో ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. దీంతో ఇందులో ఉన్న ఖాళీ స్థలం ఎంత, భవనాల విస్తీర్ణం ఎంత అనే వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. ఛాతీ వ్యాధుల ఆసుపత్రి ప్రాంగణం ఎర్రగడ్డలో ఉన్న ఛాతీ వ్యాధుల ఆసుపత్రి ప్రాంగణాన్ని కూడా పరిశీలనలో ఉంది. దాదాపు 60 ఎకరాల్లో విస్తరించిన ఆ స్థలంలో కొంత భాగాన్ని చట్టసభల భవనాల కోసం వినియోగించుకోవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో ఇక్కడే సచివాలయాన్ని నిర్మించాలని భావించింది. కానీ వాస్తు ప్రకారం అది సరిగా ఉండదన్న అభిప్రాయంతోపాటు తీవ్ర ట్రాఫిక్ చిక్కులుండే ఏరియా కావటంతో ఆ ఆలోచనను విరమించుకుంది. ఇక్కడి ఆసుపత్రిని మరో ప్రాంతానికి తరలించి అక్కడ అసెంబ్లీ భవన సముదాయం నిర్మిస్తే బాగుంటుందా అన్న కోణంలో ప్రస్తుతం ఆలోచిస్తోంది. దీంతో ఇక్కడి ఆసుపత్రి తరలింపు, అందులో ఉన్న స్థలం తదితర వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇర్రమ్ మంజిల్ ప్రస్తుతం నీటి పారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ ప్రధాన భవనాలున్న ఇర్రమ్ మంజిల్ (ఎర్రమంజిల్) ప్రాంగణాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందులో నిజాంకాలం నాటి పురాతన ఇర్రమ్ మంజిల్ ప్యాలెస్ ఉంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ ప్రధాన భవనంగా ఇది కొనసాగింది. రెండేళ్ల క్రితమే ప్రభుత్వం దీని వెనక కొత్త భవనాన్ని నిర్మించటంతో ఆ శాఖ కార్యాలయాన్ని అందులోకి తరలించారు. అప్పటి నుంచి ఈ పురాతన ప్యాలెస్ ఖాళీగా ఉంది. దాన్ని కూల్చి ఆ స్థలంలో అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తే ఎలా ఉంటుందో అని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే అది హెరిటేజ్ భవనం కావటంతో దాన్ని కూల్చాలంటే ముందుగా హెరిటేజ్ జాబితాలోంచి ఆ పేరును చట్టబద్ధ ప్రక్రియ ద్వారా తొలగించాల్సి ఉంది. దీనికి తోడు ఆ ప్రాంతం గుట్ట భాగం కావటంతో కొంత ఎత్తుగా, కొంత పల్లంగా ఉంటుంది. ఇది కూడా అంత యోగ్యం కాదన్న అభిప్రాయం ఉంది. అయినా అధికారులు దాని వివరాలు సేకరించి ముఖ్యమంత్రికి అందించనున్నారు. ఈ మూడు స్థలాలతోపాటు నగరం వెలుపల అసెంబ్లీ నిర్మిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా ఉన్నట్టు సమాచారం. చట్ట సభలు నిరంతరం కొనసాగవు. సంవత్సరం మొత్తంలో 50 రోజులకు మించి కార్యకలాపాలు ఉండవు. మిగతా సమయం ఖాళీగానే ఉంటుంది. అందువల్ల నగర శివారులో నిర్మించినా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చన్న అభిప్రాయం ఉంది. దీనికి వీలుగా కూడా కొన్ని ప్రాంతాలను అధికారులు ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీ భవనం అలాగే... ప్రస్తుతం చట్టసభలు కొనసాగుతున్న అసెంబ్లీ భవనం హెరిటేజ్ జాబితాలో ఉంది. నిజాం హయాంలో నిర్మితమైనవాటిలో ఇదీ ప్రధానమైందే. ఈ నేపథ్యంలో దాన్ని తొలగించటం సాధ్యం కాదు. అందుకు జనం కూడా ఆమోదించే అవకాశం లేదు. దీంతో ఆ భవనాన్ని అలాగే ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఈ భవనాలను హైదరాబాద్ మ్యూజియంగా మార్చాలన్న ప్రతిపాదన కూడా ఉంది. స్టేట్ మ్యూజియం భవనం ఇరుకుగా ఉంది. దీంతో చాలా పురాతన వస్తువులను గదుల్లో పెట్టి తాళం వేశారు. అసెంబ్లీ భవనాన్ని మ్యూజియంకు అప్పగిస్తే వాటన్నింటిని ప్రదర్శనలో ఉంచే వీలుంటుంది. అందుకే దీన్ని మ్యూజియంగా మార్చాలన్న ప్రతిపాదన ఉంది. అసెంబ్లీకి కొత్త భవనం నిర్మిస్తే ప్రస్తుత భవనం మ్యూజియంగా మారే అవకాశం ఉంది. -
వీవీ.పాలెంలోనే ఖమ్మం కలెక్టరేట్
సాక్షిప్రతినిధి, ఖమ్మం : ఖమ్మం కలెక్టరేట్ నూతన భవన సముదాయ నిర్మాణం ఎట్టకేలకు ఖరారైంది. దాదాపు పది నెలల క్రితం రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలో ఆధునిక వసతులతో కలెక్టర్ కార్యాలయ భవన సముదాయం నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం 26.24 ఎకరాల స్థలం సేకరించింది. అయితే నగరానికి దూరంగా.. ప్రజలకు అసౌకర్యంగా ఉండే ప్రాంతంలో కలెక్టరేట్ భవన సముదాయం నిర్మించడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, ప్రస్తుతం ఉన్న కలెక్టర్ కార్యాలయం పాలనా వ్యవహారాలు నిర్వహించేందుకు సరిపోతుందని, మళ్లీ కలెక్టర్ కార్యాలయాన్ని మరోచోట నిర్మించడాన్ని సవాల్ చేస్తూ ఎం.విజయభాస్కర్ అనే న్యాయవాది వేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పునిచ్చింది. పిటిషనర్ వ్యక్తం చేసిన పలు అభ్యంతరాలను ధర్మాసనం తోసిపుచ్చినట్లు సమాచారం. దీంతో వి.వెంకటాయపాలెంలో కొత్త కలెక్టర్ కార్యాలయ భవన సముదాయానికి పాలనాపరంగా, న్యాయపరంగా ఏర్పడిన అవాంతరాలు ఒక్కొక్కటిగా తొలగినట్లయింది. గత ఏడాది సెప్టెంబర్‌లో వి.వెంకటాయపాలెంలో కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం 26.24 ఎకరాల స్థలం సేకరించాలని సంకల్పించి.. యుద్ధప్రాతిపదికన స్థల సేకరణ కూడా పూర్తి చేసింది. ఎకరానికి రూ.కోటి చొప్పున రైతులకు పరిహారంగా చెల్లించి.. భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసింది. కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని అధికారులు సంకల్పించిన తరుణంలో కొత్తగా నిర్మించే ప్రాంతం జిల్లా ప్రజలకు అందుబాటులో లేదని, బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్ వంటి వాటికి దూరంగా ఉందని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని జిల్లాకు చెందిన న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో నిర్మాణ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే భవన సముదాయ నిర్మాణం వి.వెంకటాయపాలెంలో నిర్మించడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రభుత్వం తరఫున రెవెన్యూ అధికారులు హైకోర్టుకు నివేదించారు. దీంతో హైకోర్టు.. కలెక్టర్ కార్యాలయ భవన సముదాయ నిర్మాణానికి సంబంధించి దాఖలైన అభ్యంతరాలను తోసిపుచ్చడంతో ఇక నిర్మాణ పనులు మొదలుకానున్నాయి. కలెక్టరేట్లోని 53 శాఖలు విధులు నిర్వహించే అవకాశం ఉండగా, అందులో తొలి విడతగా ఆయా శాఖల నుంచి ఎన్ని గదులు అవసరం ఉన్నాయి.. ఎంత వైశాల్యం అవసరం ఉంటుందనే అంశాలపై ప్రతిపాదనలు శాఖలవారీగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కలెక్టరేట్ ప్రాంగణంలోనే ఓ హోటల్ నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు సమాచారం. కాగా.. భవన నిర్మాణం బాధ్యతలను రోడ్లు, భవనాల శాఖ చేపట్టనున్నట్లు సమాచారం. -
‘ఉస్మానియా’ పనులు 4 ఏళ్లు పెండింగా?
ఎంఎస్ఐడీసీ అధికారులపై డిప్యూటీ సీఎం ఆగ్రహం హైదరాబాద్: రాష్ట్ర వైద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఎంఎస్ఐడీసీ) పనితీరుపై ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణం కోసం నిధులు మంజూరై నాలుగేళ్లు గడిచినా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడాన్ని తప్పుపట్టారు. సోమవారం సచివాలయంలో వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా, ఎంఎస్ఐడీసీ ఎండీ రవిచంద్ర, వైద్యవిద్య సంచాలకుడు పుట్టా శ్రీనివాస్ తదితరులతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి నాలుగేళ్ల క్రితం 200 కోట్లు మంజూరైనా నేటికీ పైసా కూడా ఖర్చు చేయని అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. స్థలం సమస్య సాకు చూపి మంజూరైన నిధులు ఖర్చు చేయకపోతే ఎలా అని రాజయ్య ప్రశ్నించారు. ఏటా 50 కోట్లు ఖర్చు చేసినా ఈపాటికే ఉస్మానియా నూతన భవన నిర్మాణం పూర్తయి కార్యకలాపాలు ప్రారంభమయ్యేవని అభిప్రాయపడ్డారు. ఆంధ్రపాలకుల నిర్లక్ష్యం, సంస్థలోని కొందరు అధికారుల అవినీతి, అలసత్వంవల్ల పనులు ఆగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఎంఎస్ఐడీసీ పనులేవీ పెండింగ్‌లో ఉండడానికి వీల్లేదని, ఉన్న నిధులన్నీ కచ్చితంగా వాడుకోవాలని ఆదేశించారు. చంచల్‌గూడ వద్దనున్న స్థలంలో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనాన్ని సాధ్యమైనంత తొందర్లో నిర్మించేలా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అవినీతి, వసూళ్ల కేంద్రంగా ఎంఎస్ఐడీసీ మారుతున్నాయనే ఆరోపణలను సమావేశంలో ప్రస్తావించారు. ఒక ఉన్నతాధికారి, ఫార్మాసిస్టు కలసి సంస్థను అవినీతి కూపంగా మార్చారని ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఎంఎస్ఐడీసీని విభజించినప్పటికీ సాంకేతిక కారణాలవల్ల అధికారులను నియమించలేదు. తొందర్లోనే తెలంగాణ ఎంఎస్‌ఐడీసీకి పూర్తిస్థాయి యంత్రాంగాన్ని సమకూర్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.