ట్రిపుల్ తలాక్ చాలా సీరియస్ అంశం | CJI also observed that its a serious issue | Sakshi
Sakshi News home page

ట్రిపుల్ తలాక్ చాలా సీరియస్ అంశం

Published Wed, Jun 29 2016 4:56 PM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM

ట్రిపుల్ తలాక్ చాలా సీరియస్ అంశం

ట్రిపుల్ తలాక్ చాలా సీరియస్ అంశం

న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ అంశంపై సుప్రీంకోర్టు సీరియస్ గా  స్పందించింది. దీనికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను పరిశీలించాల్సిందిగా  అత్యున్నత న్యాయస్థానం  ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు.  తలాక్ పిటిషన్ పై   విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలోని   బెంచ్ బుధవారం ఈ వ్యాఖ్యలు చేసింది. 

ఇది చాలా తీవ్రమైన అంశంగా పేర్కొన్న బెంచ్ పెద్ద సంఖ్యలో ప్రజల జీవితాలకు సంబంధించినదిగా అభిప్రాయపడింది. మూడుసార్లు తలాక్ చెప్పే  అంశాన్ని రాజ్యాంగ ముసాయిదాలోని అంశాల గీటురాయిగా, గత తీర్పుల ఆధారంగా పరిశీలించాల్సి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. 
రాజ్యాంగం ఆమోదించిన  ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని  భావిస్తే ముస్లిం మతం వ్యక్తిగత చట్టాలు జోక్యం చేసుకుని వారిని  ఒప్పించాలని ధర్మాసనం  సూచించింది. అవసరమయితే అయిదుగురు న్యాయమూర్తులతో  సుదీర్ఘ బెంచ్ ను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపింది. అలాగే విచారణ సందర్భంగా మీడియాను నిరోధించాలంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేసిన  సుప్రీం తదుపరి విచారణకు సెప్టెంబర్ 6కు వాయిదా వేసింది.
 
కాగా ముస్లిం సంప్రదాయంలో వివాహ రద్దు (విడాకుల) కోసం ఆచరణలో ఉన్న తలాక్ (ట్రిపుల్ తలాక్) విధానాన్ని తీవ్రంగా  ముస్లిం మహిళలు ఆన్ లైన్ పోరాటానికి దిగారు. ఈ అనైతిక విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ యాభైవేల మంది ముస్లింలు సంతకాలు కూడా చేశారు. ఈ విధానానికి వ్యతిరేకంగా భారతీయ ముస్లిం మహిళా ఆందోళన సంస్థ  దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టింది. తమకు న్యాయం జరగాలంటే ముస్లిం పర్సనల్‌ లా బోర్డులో సంస్కరణలు తేవాలని,  తమకు న్యాయం చేయాలని కోరుతూ సుప్రీం గడప తొక్కారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement