tripple talaq
-
ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
-
ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష పార్టీలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. నాలుగు గంటల చర్చ అనంతరం లోక్‌సభలో బిల్లుపై ఓటింగ్ నిర్వహించగా 245 ఓట్లు అనుకూలంగా, 11 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. కాంగ్రెస్, అన్నాడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి. లోక్‌సభలో ఓటింగ్ సందర్భంగా బీజేపీ ఎంపీలు ‘భారత్ మాతాకి జై’ అంటూ నినాదాలు చేశాయి. ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించగానే బల్లలు చరిచి హర్షద్వానాలు చేశారు. మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అంతకుముందు బిల్లుపై అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం జరిగింది. బిల్లును సంయుక్త పార్లమెంటరీ సంఘానికి నివేదించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా బిల్లు ఉందని వాదించాయి. అయితే ముస్లిం మహిళల గౌరవానికి కాపాడేందుకే బిల్లు తెచ్చామని ప్రభుత్వం పేర్కొంది. దీనిపై చర్చకు సిద్ధమని, విపక్షాల వాదన వినేందుకు అభ్యంతరం లేదని ప్రకటించింది. మరోవైపు బిల్లుపై ఓటింగ్ నేపథ్యంలో సభలో ఉండాలని బీజేపీ, కాంగ్రెస్ తమ సభ్యులకు విప్ జారీచేశాయి. -
వారికి ముస్లిం మహిళల బాధలు పట్టవు
-
రాజ్యాంగ పరిధిలో పరిశీలించాలి
మూడుసార్ల తలాక్‌పై సుప్రీం కోర్టు న్యూఢిల్లీ: ముస్లిం సమాజంలో మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా విడాకులిచ్చే పద్ధతి ఎంతో కీలకమైనదని, పెద్ద సంఖ్యలో ప్రజల జీవితాలపై ప్రభావం చూపే అంశమని సుప్రీంకోర్టు పేర్కొంది. దీన్ని రాజ్యాంగ పరిధిలోని ప్రమాణాల ఆధారంగా పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఈ విషయంలో పర్సనల్ లా చట్టబద్ధత అంశాన్ని పరిశీలించేందుకు కూడా అంగీకరించింది. ట్రిపుల్ తలాక్ అంశంపై వ్యతిరేక, అనుకూల వర్గాల వైపు నుంచి బలమైన కారణాలు ఉన్నాయని, కాబట్టి ఈ విషయంలో తాము తక్షణమే ఒక నిర్ణయానికి రాలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకుర్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్లతో కూడిన ధర్మాసనం బుధవారం పేర్కొంది. ఈ అంశంలో గతంలో ఇచ్చిన తీర్పుల్లో ఏవైనా తప్పులున్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలించి.. అవసరమైతే ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించడంపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపింది. ట్రిపుల్ తలాక్ అంశంపై గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులను న్యాయపరంగా సమీక్షించడంపై తమ అభిప్రాయాలను తెలిపేందుకు సంబంధిత పక్షాలు సిద్ధపడాలని ఈ సందర్భంగా కోరింది. తదుపరి విచారణను సెప్టెంబర్ ఆరవ తేదీకి వాయిదా వేసింది. ముస్లిం సమాజంలో వివాహ రద్దు(విడాకుల) కోసం మూడుసార్లు తలాక్ చెప్పే విధానాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన నాలుగు పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. వీరందర్నీ ఈ కేసులో కక్షిదారులుగా చేరేందుకు అనుమతించింది. అదే సమయంలో ట్రిపుల్ తలాక్ అంశంపై తన విధానమేంటో తెలపాలని కేంద్రాన్ని కోరింది. ఇందుకోసం ఆరువారాల గడువు ఇచ్చింది. -
ట్రిపుల్ తలాక్ చాలా సీరియస్ అంశం
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ అంశంపై సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. దీనికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను పరిశీలించాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. తలాక్ పిటిషన్ పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ బుధవారం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశంగా పేర్కొన్న బెంచ్ పెద్ద సంఖ్యలో ప్రజల జీవితాలకు సంబంధించినదిగా అభిప్రాయపడింది. మూడుసార్లు తలాక్ చెప్పే అంశాన్ని రాజ్యాంగ ముసాయిదాలోని అంశాల గీటురాయిగా, గత తీర్పుల ఆధారంగా పరిశీలించాల్సి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజ్యాంగం ఆమోదించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని భావిస్తే ముస్లిం మతం వ్యక్తిగత చట్టాలు జోక్యం చేసుకుని వారిని ఒప్పించాలని ధర్మాసనం సూచించింది. అవసరమయితే అయిదుగురు న్యాయమూర్తులతో సుదీర్ఘ బెంచ్ ను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపింది. అలాగే విచారణ సందర్భంగా మీడియాను నిరోధించాలంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేసిన సుప్రీం తదుపరి విచారణకు సెప్టెంబర్ 6కు వాయిదా వేసింది. కాగా ముస్లిం సంప్రదాయంలో వివాహ రద్దు (విడాకుల) కోసం ఆచరణలో ఉన్న తలాక్ (ట్రిపుల్ తలాక్) విధానాన్ని తీవ్రంగా ముస్లిం మహిళలు ఆన్ లైన్ పోరాటానికి దిగారు. ఈ అనైతిక విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ యాభైవేల మంది ముస్లింలు సంతకాలు కూడా చేశారు. ఈ విధానానికి వ్యతిరేకంగా భారతీయ ముస్లిం మహిళా ఆందోళన సంస్థ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టింది. తమకు న్యాయం జరగాలంటే ముస్లిం పర్సనల్ లా బోర్డులో సంస్కరణలు తేవాలని, తమకు న్యాయం చేయాలని కోరుతూ సుప్రీం గడప తొక్కారు.