ఆర్డీఓకు నయీమ్ బాధితురాలి ఫిర్యాదు
భువనగిరి
న యీమ్ అనుచరులు తన భూమిని ఆక్రమించుకున్నారని మండలంలోని హన్మాపురం గ్రామానికి చెందిన సాధినేని మంజు సోమవారం భువనగిరి ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వివరాలు ఆమె మాటల్లోనే.. మంజు ఆమె భర్త సాధునేని హరినాథ్‌కు హన్మాపురంలో 2.21 ఎకరాల భూమి ఉంది. ఆమె భర్త సాధినేని హరినాథ్ 26–06–2015న అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన బతికి ఉన్న సమయంలో (2.21) ఎకరాల భూమిని ప్రేమ్‌కుమార్ అనే వ్యాపారి కొనుగోలు చేశారు. అ వ్యాపారి పూర్తిగా డబ్బులు ఇవ్వకుండా వాయిదాల వారీగా కొన్ని ఇచ్చాడు. పూర్తిగా డబ్బులు ఇవ్వలేదు. ఇంకా రావాల్సిన డబ్బు గురించి ప్రేమ్‌కుమార్‌ను అడిగితే ఇంకా అతను రూ. 10,50,000 లక్షలు బకాయి ఉన్నట్లు చెప్పాడు.. మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తావని అడిగితే ఒక వారం తరువాత ఇస్తానని చెప్పాడు. మళ్లీ ఒత్తిడి చేస్తే ఢిల్లీ Ðð ళ్లి గిరిష్‌జాజు అనే వ్యక్తి నుంచి తీసుకవస్తానని వివరించాడు. ఈ సమయంలో మా బావ రఘు అనే వ్యక్తి మాకు డబ్బులు ఇవ్వకూడదు అని చెప్పాడు. దీంతో వ్యాపారి మీకు డబ్బులు కావాలంటే మీ బావను కూడా తీసుకుని రావాలని వ్యాపారి చెప్పాడు. ఈ క్రమంలో రఘు కోర్టులో పిటిషన్ వేశాడు. నేను నీకు డబ్బులు ఇవ్వను కోర్టులోనే చెల్లిస్తాను అని వ్యాపారి చెప్పాడు. కానీ ఇంత వరకు ఇవ్వలేదు. అనంతరం వాయిదాలు వేస్తూనే ఓ రోజు భువనగిరిలో డబ్బు చెల్లిస్తానని చెప్పిన ప్రేమ్‌కుమార్ తన వద్ద పనిచేసే కంచుకుంట్ల లక్ష్మయ్యను పంపించాడు. ఆయన నేరుగా తనను నÄæూమ్ అనుచరుడు షకీల్ వద్దకు తీసుకెళ్లాడు. షకీల్ చంపుతానని బెదిరించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని తెలిపింది. దీంతో ప్రాణభయంతో పుట్టింటికి వెళ్లి అక్కడే జీవనం సాగిస్తున్నానని తెలిపింది. అయితే ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో నÄæూమ్ బాధితులను ఆదుకుంటామని ప్రభుత్వ ప్రకటన చూసి న్యాయం చేయాలని అధికారులకు ఫిర్యాదు చేసినట్టు వివరించింది.