Bhongir
-
600 ఏళ్ల మెట్లబావికి మహర్దశ
ఆదరణ కోల్పోతున్న వారసత్వ సంపదకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మెట్ల బావులు, కోటలు ఇతర చారిత్రక ప్రదేశాలను పునరుద్ధరిస్తోంది. ఇదే క్రమంలో భువనగిరి జిల్లా రాయగిరి పరిధిలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న 600 ఏళ్ల నాటి మెట్ల బావిని పునరుద్ధరించే సమమయం అసన్నమైందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సైతం షేర్ చేశారు. మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ జిల్లాలో వైరల్‌గా మారడంతో రాయగిరి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ సమేలా సత్పతి రాయగిరిలోని మెట్ల బావిని సందర్శించి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. స్థానికులతో పాటు యాదాద్రి క్షేత్రానికి వచ్చిన భక్తులు పురాతన మెట్ల బావిని సందర్శించేలా పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. తాజాగా కేటీఆర్ చేసిన ట్వీట్ మెట్లబావి పునరుద్ధరణపై ఆశలు రేకిత్తిస్తోంది. -
పార్టీ మారడం లేదు.. వారి నాయకత్వంలోనే ఉంటా
సాక్షి, యాదాద్రి: టీఆర్ఎస్ పార్టీని వీడేదిలేదని, అధినేత కేసీఆర్ నాయకత్వంలోనే కడ వరకూ పనిచేస్తానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి స్పష్టంచేశారు. ఆదివారం ఆయన భువనగిరిలో విలేకరులతో మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. కొందరు తన ఎదుగుదలను చూసి ఓర్వలేక పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీన్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు. కేసీఆర్, కేటీఆర్‌ల నాయకత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని శేఖర్‌రెడ్డి తెలిపారు. (క్లిక్: మునుగోడులో బెట్టింగ్‌ల జోరు.. ఆయనపైనే అత్యధికంగా..!) 19న బీజేపీలో చేరనున్న బూర నర్సయ్య? సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్కు రాజీనామా చేసిన మాజీ ఎంపీ డా. బూర నర్సయ్యగౌడ్ ఈ నెల 19న బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. ఈ చేరికకు సంబంధించిన అంశాలు, నిర్వహించాల్సిన కార్యక్రమంపై చర్చించేందుకు బూర నర్సయ్యతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం భేటీ కానున్నారు. బూర నర్సయ్య నివాసానికి సంజయ్, ఇతర ముఖ్య నేతలు వెళ్లనున్నారు. మునుగోడు పరిధిలో లేదా భువనగిరిలో చేరికల కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. దీనికి పార్టీ జాతీయ నేతలు హాజరుకానున్నట్టు పార్టీవర్గాల సమాచారం. ఇదిలా ఉంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఢిల్లీలో నర్సయ్యగౌడ్ కలుసుకున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్లో చాలా మంది అసంతృప్తితో ఉన్నారని, రాజకీయంగా ఎలాంటి అవకాశాలు వచ్చినా పార్టీ మారేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత నర్సయ్య మాట్లాడారు. ఏ పార్టీలో చేరాలన్న దానిపై కార్యకర్తలు, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ ప్రజలతో సమావేశం అయ్యాకే నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. -
అసంఘిక కార్యక్రమాలకు అడ్డాగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
-
నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: తనను రాజకీయాల్లోకి లాగవద్దని, రాజకీయపరమైన విషయాలపై ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ప్రజాసమస్యలు తీర్చేందుకు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని సోమవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. తాను ఎంపీగా ఎన్నికైన తర్వాత తన నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించలేకపోయానని, ఇక నుంచి భువనగిరి, నల్లగొండ పార్లమెంటు స్థానాల పరిధిలోని గ్రామాల్లో పర్యటించి అక్కడి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడి నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తానని, సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా వీలైనన్ని ఎక్కువ కార్యక్రమాలు చేపడతానని చెప్పారు. ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టులు, గంధమళ్ల, బస్వాపురం రిజర్వాయర్లను ప్రజలకు అందుబాటులో తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడతానన్నారు. -
భువనగిరి వద్ద ఏజీఐ కొత్త ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంటెయినర్ గ్లాస్ బాటిళ్ల తయారీ సంస్థ ఏజీఐ గ్లాస్‌ప్యాక్ హైదరాబాద్ సమీపంలోని భువనగిరి వద్ద కొత్త ప్లాంటును నెలకొల్పుతోంది. ఇందుకోసం కంపెనీ మాతృ సంస్థ అయిన హెచ్ఎస్ఐఎల్ రూ.220 కోట్లు పెట్టుబడి చేస్తోంది. 15 ఎకరాల్లో స్థాపిస్తున్న ఈ నూతన కేంద్రం 2022 సెప్టెంబర్ చివరికి కార్యరూపం దాల్చనుందని హెచ్ఎస్ఐఎల్ వైస్ చైర్మన్ సందీప్ సొమానీ తెలిపారు. రోజుకు 150 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. ఔషధాలు, సుగంధ పరిమళాలు, సౌందర్య సాధనాలు, ఖరీదైన మద్యం ప్యాకింగ్ కోసం హై ఎండ్ స్పెషాలిటీ గ్లాస్ బాటిళ్లను ఇక్కడ తయారు చేస్తారు. ఫర్నేస్‌తోపాటు అయిదు తయారీ లైన్లు ఏర్పాటు కానున్నాయి. యూఎస్ఏ, ఆ స్ట్రేలియా, యూరప్ దేశాలకు సైతం ఎగుమతి చేయ నున్నారు. 1972లో ప్రారంభమైన ఏజీఐ గ్లాస్‌ప్యాక్.. ముడి సరుకు లభ్యత దృష్ట్యా హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌తోపాటు భవనగిరిలో ప్లాంట్లను నిర్వహిస్తోంది. వీటి సామర్థ్యం రోజుకు 1,600 టన్నులు. కంపెనీ వార్షికాదాయం రూ.1,300 కోట్లు. సుమారు 3,000 మంది ఉద్యోగులున్నారు. 5 నుంచి 4,000 మిల్లీలీటర్ల సామర్థ్యం గల బాటిళ్లను ఉత్పత్తి చేస్తోంది. -
కేంద్రమంత్రి హామీ ఇచ్చారు: కోమటిరెడ్డి
న్యూఢిల్లీ : శాతవాహన, పద్మావతి, గోదావరి, మచిలీపట్నం రైళ్లను భువనగిరి, జనగామ, ఆలేరు రైల్వేస్టేషన్లలో ఆపాలని రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైల్వే సమస్యలపై ఆయనకు వినతి పత్రం అందించారు. అనంతరం వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ...‘ ప్రతిరోజు దాదాపు ముప్పై వేలకు మందికి పైగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో పనిచేసే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులకు, రోజూవారీ కూలీలు అనునిత్యం భువనగిరి, జనగామ, ఆలేరు నుంచి హైదరాబాద్‌కు ప్రయాణిస్తుంటారు. అదే విధంగా రాష్ట్ర నలుమూల నుంచి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దర్శనార్థం యాదగిరిగుట్టకు రోజూ యాభై వేల మంది పైచిలుకు భక్తులు వస్తూంటారు. ఈ క్రమంలో సరైన రైల్వే సౌకర్యాలు అనేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’ అని మంత్రికి వివరించినట్లు పేర్కొన్నారు. కాగా తన విఙ్ఞాపనపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు కోమటిరెడ్డి తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సర్వేలు చేయించి.. సమస్యలకు పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి ఆయనకు కృతఙ్ఞతలు తెలియజేశారు. -
గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తా..
సాక్షి, యాదగిరిగుట్ట (ఆలేరు) : కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లను నింపి గోదావరి జలాలు తీసుకొచ్చి ఆలేరు నియోజకవర్గాన్ని ససశ్యామలం చేస్తానని టీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. బుధవారం యాదగిరిగుట్ట పట్టణంతో పాటు వంగపల్లిలో రోడ్ షోతో పాటు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్న ఐదేళ్ల కాలంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని తెలిపారు. బీబీనగర్‌లో నిమ్స్‌ను రూ.1,028కోట్లతో ఏయిమ్స్‌గా మార్చానని, కేంద్రీయ విద్యాలయానికి రూ.18కోట్లు, దండుమల్కాపుర్‌లో రూ.1,000 కోట్లతో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్, జనగామ, సూర్యాపేట, నల్లగొండ, సిద్దిపేట, ఇబ్రహీం పట్నంలలో రూ.500కోట్లతో మెడికల్ కాలేజీలు, చిట్యాలలో డ్రైపోర్టుకు రూ.1,000కోట్లు, పెంబర్తి, మోత్కూరు, పోచంపల్లిలో కులవృత్తులు, తాటి పరిశోధన కేంద్రాలలను కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సాధించానని వెల్లడించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ గతంలో ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఉండి తమ ప్రాంతాలను ఎంత అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభంజనం వీస్తుందని, 16 మంది ఎంపీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజ లంతా ముందుకొస్తున్నారని.. దేశానికి కేసీఆర్ నాయకత్వం వహించాలని ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరె యాదగిరిగౌడ్, ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మండల ప్రధాన కార్యదర్శి మిట్ట వెంకటయ్యగౌడ్, పట్టణ అధ్యక్షుడు కాటబత్తిని ఆంజనేయులు, యువజన విభాగం కన్వీనర్ గడ్డమీది రవీందర్‌గౌడ్, ఎంపీటీసీ సీస కృష్ణగౌడ్, మధర్‌డైరీ డైరెక్టర్ కల్లెపల్లి శ్రీశైలం, వంగపల్లి ఉపసర్పంచ్ రేపాక స్వామి, మాజీ సర్పంచ్ చంద్రగాని నిరోష జహంగీర్, బూడిద స్వామి, కైరంకొండ శ్రీదేవి, నాయకులు అంకం నర్సింహ, నువ్వుల రమేష్, కాంటేకార్ పవన్‌కుమార్, చిత్తర్ల బాలయ్య, గోపగాని ప్రసాద్, సయ్యద్ సలీం, మిట్ట అనిల్‌గౌడ్, మిట అరుణ్గౌడ్, కోల వెంకటేష్‌గౌడ్, సయ్యద్ బాబా, గునగంటి బాబురావుగౌడ్ తదితరులున్నారు. -
‘ఆయన పార్టీ మారడం బాధకు గురిచేసింది’
సాక్షి, భునవనగిరి: కేంద్రంలోని బీజేపీకి అండగా నిలుస్తోన్న టీఆర్ఎస్కు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కోట్ల రుపాయలు ఖర్చుపెట్టి సీఎం కేసీఆర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం భువనగిరిలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ.700 కోట్లు విలువ చేసే బ్రాహ్మణ వెళ్లాంల ప్రాజెక్టుని తెచ్చినట్లు గుర్తుచేశారు. కానీ ఐదేళ్లు గడిచిన కేసీఆర్ మాత్రం పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు. నల్గొండను దత్తత తీసుకుంటా అని గత ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రకటించారని, నాలుగు నెలలు గడిచినా దాని ఊసే లేదని విమర్శించారు. చదవండి: నల్లగొండ పార్లమెంట్ పరిధిలో ఎవరి బలమెంత..? గత అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్‌లో తాము పోరాడి గెలచామని, అనంతరం చిరమర్తి లింగయ్య పార్టీ మారడం తనను ఎంతో బాధకు గురిచేసిందని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను కేవలం అభివృద్ధి కోసమే పార్టీ మారని చెప్తున్నారని, 15 రోజుల్లోనే ఆరుకోట్ల ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. నకిరేకల్ కోసం అన్నదమ్ములిద్దరం ప్రాణాలైన ఇస్తాం కానీ.. ఇక్కడి ప్రజలను మాత్రం వదిలివెళ్లమని స్పష్టం చేశారు. స్వలాభం కోసం పార్టీ మారిన వారికి ఈ ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనెల 22న భువనగిరి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రభుత్వానికి సరిపడా ఎమ్మెల్యేలు ఉన్నా తమను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలని సీఎం కేసీఆర్ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పార్టీలోకి తీసుకున్నారని కాంగ్రెస్ ఎమెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి విమర్శించారు. తమ సొంతమనిషి అయిన చిరుమర్తి లింగయ్యను తీసుకెళ్లి.. తమ కుటుంబంలో చిచ్చులు పెట్టిన కేసీఆర్‌కు రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. పదవులకు ఆశపడ్డి కొంతమంది నాయకులు పార్టీని విడిచి పోవచ్చని, కేసీఆర్‌ను ఓడించడానికి ప్రజలు మాత్రం సిద్ధంగా ఉన్నారని అన్నారు. -
సీసీఎంబీ ప్రాజెక్టుపై నీలి నీడలు
సాక్షి, యాదాద్రి: అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఏడాదిన్నర క్రితం ఈ ప్రాజెక్టులో కదలిక మొదలైనా పనులు మాత్రం ముందుకు సాగలేదు. ఈ పరిశోధనా కేంద్రం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించడంలో జరుగుతున్న జాప్యం వల్ల ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సంబంధిత కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు సీసీఎంబీ కేంద్రాన్ని ప్రారంభించాలని విజ్ఞప్తి చేయడంతో ఈ ప్రాజెక్టు ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో బీబీనగర్ పక్కనే గల రంగాపురంలోని 180 ఎకరాల్లో సీసీఎంబీని ఏర్పాటు చేయడానికి 11వ ప్రణాళిక కాలంలో కేంద్రం అనుమతినిచ్చింది. రూ.1,200 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించాలనుకున్నారు. ఈ నిధులకు జాతీయ ప్రణాళిక సంఘం, ఆర్థిక సంఘం ఆమోదం కూడా లభించింది. అయితే స్థలం విషయంలో ఏర్పడిన వివాదంతో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా భువనగిరి మండలం పగిడిపల్లి వద్ద మరో స్థలాన్ని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్‌మిశ్రా, కలెక్టర్ అనితారామచంద్రన్, ఆర్డీఓ ఎంవీ భూపాల్‌రెడ్డి తదితరులు పరిశీలించారు. ప్రాజెక్టు స్వరూపం... 180 ఎకరాల స్థలం, రూ.1,200 కోట్ల వ్యయం.. మానవ మూలకణాలతోపాటు పలు అంశాలపై నిరంతర పరిశోధనలు చేసే అవకాశం.. వందలాది మందికి ఉపాధి కల్పన.. ఇదీ సీసీఎంబీ పరిశోధన కేంద్రం స్వరూపం. అయితే స్థలాన్ని ఎంపిక చేయడంలో జరిగిన జాప్యం వల్ల మొత్తం నిధుల్లో రూ. 300 కోట్లను పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి మళ్లించారు. సీసీఎంబీలో ఏం చేస్తారంటే.. మానవుల మూల కణాలపై పరిశోధనలు చేస్తారు. మనుషుల్లో వచ్చే రుగ్మతలు, ప్రధానంగా కేన్సర్ వ్యాధి గురించి ముందే తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ పరిశోధనల కోసమే సీసీఎంబీని ఇక్కడ ఏర్పాటు చేయడానికి కేంద్రం ముందుకొచ్చింది. తార్నాకలోని ప్రాజెక్టు కేంద్ర కార్యాలయానికి చేరువలో ఉండటం, జాతీయ రహదారి 163తో పాటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులో ఉండటంతో ఇక్కడ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. -
35 ఏళ్ల తర్వాత గెలవబోతున్నాం : జైరాం రమేష్
సాక్షి, యాదాద్రి భువనగిరి : నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని దివాలా తెలంగాణగా మార్చారని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ మండిపడ్డారు. కేవలం ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని, కేసీఆర్ కుటుంబం కోసం కాదని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన భువనగిరిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ లేకుండా తెలంగాణ ఏర్పడలేదని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. విభజన హామీలను అమలు చేయడంలో, చేయించుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. మొట్టమొదటిసారిగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి లేకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు సముచిత స్థానం కల్పిస్తుందని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తెలంగాణ మహిళను హోం మంత్రి చేశామని గుర్తు చేశారు. తెలంగాణలో ఇకపై టీఆర్ఎస్ పాత అంబాసిడర్ కారుకు చోటు లేదని ఎద్దేవా చేశారు. సంజీవని దొరికింది కాబట్టి.. 35 ఏళ్ల తర్వాత భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ఆయన జోస్యం చెప్పారు. -
రైల్వే ప్రయాణికులను కర్రతో కొట్టి..
నల్లగొండ క్రైం : జల్సాలకు అలవాటు పడి అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనుకున్నారు.. సెల్ఫోన్లు చోరీలు చేయడం మొదలు పెట్టారు. అందుకు రైల్వేస్టేషన్‌ను ఎంపిక చేసుకున్నారు. ఎవరైన ప్రయాణికులు నడుస్తున్న రైలు ఎక్కుతూ సెల్‌ఫోన్ మాట్లాడుతుంటే వారి చేతిని కర్రతో కొట్టి.. ఫోన్ కిందపడగానే లాక్కెళ్తున్నారు. ఇలా రెండేళ్లుగా చోరీ చేస్తున్నారు. శుక్రవారం భువనగిరి రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతూ చోరీ చేస్తున్న ఇద్దరి యువకులతో పాటు వాటిని కొనుగోలు చేస్తున్న మరో నలుగురిని నల్లగొండ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2,80,000 విలువైన 24 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రైల్వే ఎస్పీ అశోక్‌కుమార్ సీఐ వెంకటరమణ, ఎస్ఐ అచ్యుత్‌తో కలిసి నల్లగొండ రైల్వేస్టేషన్లో వివరాలు వెల్లడించారు. భువనగిరి పట్టణంలోని తాతానగర్‌కు చెందిన విద్యార్థి ముదరకోల శ్రీధర్, ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న కామసాని శేఖర్లు రైలు ప్రయాణికుల నుంచి చాకచక్యంగా సెల్ఫోన్లు కొట్టేస్తూ తాతానగర్‌కు చెందిన భానుప్రకాశ్, తిమ్మపూర్‌కు చెం ది న దాసరపు గణేశ్, జహంగీర్, దాసరి రవీందర్‌ల కు విక్రయిస్తున్నారు. ప్రయా ణికుల ఫిర్యాదు మే రకు రైల్వే పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. చోరీ చేసేది ఇలా.. రైలు నిదానంగా వెళ్తున్న సమయంలో ప్రయాణికులు సెల్‌ఫోన్ మాట్లాడడం, వాట్సప్, ఫేస్బుక్ చూస్తున్నప్పుడు శ్రీధర్, శేఖర్లు కర్రతో చేతిపై కొడతారు. ఫోన్ కిందపడగానే తీసుకుపోయి ఇతరులకు విక్రయిస్తుంటారు. -
భువనగిరిలో కేంద్రీయ విద్యాలయం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని భువనగిరిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ ఆమోదం తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా 50 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు సోమవారం అంగీకరిం చింది. ఈ విద్యాసంవత్సరం (2017–18) నుంచే భువనగిరిలోని ఏఎల్‌ఎన్‌రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కేంద్రీయ విద్యాలయం కార్యకలాపాలు కొనసాగుతాయని, ఒక్కో తరగతికి ఒక్కో సెక్షన్ చొప్పున ఒకటి నుంచి ఐదో తరగతి వరకు తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపింది. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుపై భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశారు. ఇప్పటికి కేంద్రం స్పందించి కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. -
నిబంధనలు కచ్చితంగా పాటించాలి
భువనగిరి అర్బన్ : వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని రాచకొండ కమిషనరేట్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ఎన్.దివ్యచరణ్రావు అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్‌భగవత్ ఆదేశాల మేరకు యాదాద్రి జిల్లా భువనగిరి మండలం హన్మాపురం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాచకొండ పరిధిలో ఉన్న భువనగిరిలో ఇప్పటివరకు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ లేన్నందున్న స్టేషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ ఒక ఎస్ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, 10 మంది కానిస్టేబుళ్లను, భువనగిరిలో ప్రస్తుతం ఉన్న ఒకట్రాఫిక్ ఎస్ఐ, 5 కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తారని చెప్పారు. ముందుగా ఒక వారం రోజులపాటు ప్రజలకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పిస్తామని తెలిపారు. భవిష్యత్ ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రధానంగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఎదురుగా వచ్చే వారికి ఇబ్బంది కలిగించ వద్దని సూచించారు. రికార్డుల ప్రకారం వారానికి రెండుసార్లు డీడీని కండెక్ట్ చేయడంతోపాటు త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, పార్కింగ్ సమస్య, డేంజరస్ డ్రైవింగ్ నివారించడం జరుగుతుందన్నారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. భువనగిరితో పాటు చౌటుప్పల్‌లో కూడా ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చే సినట్లు ఆయన తెలిపారు. అనంతరం యాదాద్రి జిల్లా డీసీపీ పి.యాదగిరి మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా భువనగిరిలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ జీవీ. శ్యాంసుందర్‌రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ ఎం.శంకర్‌గౌడ్, ఉప్పల్ ట్రాఫిక్ సీఐ ఇ.జంగయ్య, ట్రాఫిక్ ఎస్ఐలు లాచ్చిరాం, హన్మంత్‌లాల్, సిబ్బంది ఉన్నారు. -
ముగిసిన జాతీయ స్థాయి క్రీడా పోటీలు
భువనగిరి టౌన్: ఈ నెల 3వ తేదీ నుంచి భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన అండర్–19 జాతీయ స్థాయి బాల్‌బ్యాడ్మింటన్, షూటింగ్ బాల్ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో 18 రాష్ట్రాలకు చెందిన 44 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్స్ అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు ఓటమితో నిరాశ చెందకుండా మరింత మెరుగ్గా రాణిస్తే గెలుపు సొంతం అవుతుందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న వారిని ఆదర్శంగా తీసుకొని దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ సుర్వి లావణ్య మాట్లాడుతూ భువనగిరిలో జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించడం గర్వకారణమన్నారు. భువనగిరి ఆర్డీఓ ఎంవీ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతాయన్నారు. అనంతరం విజేతలకు కప్, మెడల్స్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐఓ ఎన్. ప్రకాశ్‌బాబు, టీఎన్జీఓ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు మందడి ఉపేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జడల అమరేందర్, భువనగిరి ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపాల్, పీఈటీ జిల్లా కార్యదర్శి టి. విజయసాగర్, ఎస్జీఎఫ్ జిల్లా అర్గనైజింగ్ కార్యదర్శి జి. దయాకర్‌రెడ్డి, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి జి. సోమనర్సయ్య, డివిజన్ అధ్యక్షుడు కె.గోపాల్ పాల్గొన్నారు. విజేతలు వీరే – జాతీయ స్థాయి బాల్‌బాడ్మింటన్ బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్ మెుదటి స్థానంలో నిలువగా, కర్నాటక ద్వితీయ, తమిళనాడు తృతీయ స్థానాల్లో నిలిచాయి. – బాల్‌బాడ్మింటన్ బాలికల విభాగంలో తమిళనాడు ప్రథమ స్థానం సాధించగా, కేరళ ద్వితీయ, కర్నాటక తృతీయ బహుమతులు సాధించాయి. – షూటింగ్ బాల్ బాలుర విభాగంలో మహారాష్ట్ర మెుదటి, పంజాబ్ ద్వితీయ, ఢిల్లీ తృతీయ బహుమతులు సాధించాయి. – షూటింగ్ బాల్ బాలికల విభాగంలో మహారాష్ట్ర మెుదటి, ఢిల్లీ ద్వితీయ, తెలంగాణ తృతీయ బహుమతులు సాధించాయి. -
కొనసాగుతున్న జాతీయ స్థాయి క్రీడలు
భువనగిరి టౌన్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరుగుతున్న అండర్ –19 జాతీయ స్థాయి క్రీడలు గురువారం కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ సుర్వి లావణ్య, బాల్‌బ్యాడ్మింటన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌లు క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాకౌట్, సెమీఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి. కాగా బాలుర విభాగం సెమీ ఫైనల్లో తమిళనాడుతో 35–33, 27–35, 35–20 పాయింట్లతో విజయం సాధించిన ఏపీ, కేరళపై 35–20, 35–31తో విజయం సాధించిన కర్నాటక జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. అలాగే బాలికల విభాగంలో ఏపీపై 35–17, 35–20 పాయింట్లతో విజయం సాధించిన తమిళనాడు, కర్నాటకపై 31–35, 35–25, 28–35 పాయింట్ల తేడాతో విజయం సాధించిన కేరళ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. కాగా ఫైనల్ పోటీలను శుక్రవారం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
కార్యాలయాలను పరిశీలించిన రాచకొండ కమిషనర్
భువనగిరి అర్బన్ : యాదాద్రి జిల్లా కేంద్రమైన భువనగిరిలో ఏర్పాటు చేయనున్న పలు జిల్లా కార్యాలయాలను గురువారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్‌భగవత్ పరిశీలించారు. ఇందులో భాగంగా భువనగిరి మండలంలోని పగిడిపల్లి గ్రామంలో ఉన్న యాదాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనాన్ని చూశారు. అనంతరం అక్కడి నుంచి హన్మాపురం గ్రామ శివారులో ఉన్న జిల్లా పోలీస్ కార్యాలయం, భువనగిరిలో ఏర్పాటు అవుతున్న ఎస్పీ క్యాంపు, రాయగిరి గ్రామంలో ఉన్న పోలీస్ ఔట్ పోస్టు కార్యాలయాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా పండగ రోజున కార్యాలయాలు ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. భువనగిరి, చౌటుప్పల్‌లో ఏసీపీ కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాకు సంబంధించిన అన్ని అంశాలపై ఎస్పీ, డీఎస్పీని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి, డీఎస్పీ ఎస్.మోహన్‌రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ ఎం. శంకర్‌గౌడ్, రూరల్ సీఐ అర్జునయ్య, యాదగిరిగుట్ట సీఐ రఘువీర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
భువనగిరిలో డీఐఈఓ కార్యాలయం
భువనగిరి అర్బన్ : యాదాద్రి జిల్లా కేంద్రమైన భువనగిరిలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయం(డీఐఈఓ) ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ఐఓ ఎన్.ప్రకాష్‌బాబు అన్నారు. బుధవారం భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న వృత్తి విద్యా సముదాయ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృత్తి విద్యా సముదాయ భవనంలో అక్టోబర్ 11 నుంచి డీఐఈఓ విధులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యాలయానికి కావాల్సిన రికార్డులు, ఫర్నిచర్, కార్యాలయం పేరుతో ఉన్న బోర్డును కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సిబ్బంది నియామకం కూడా త్వరంలోనే జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ విభాగంలో ఉన్న ఆర్ఐఓ, డీవీఈఓ పోస్టులు రద్దవుతాయని, ఈ పోస్టుల్లో డీఐఈఓ ఏర్పడుతుందని చెప్పారు. నూతన యాదాద్రి జిల్లాలో 69 జూనియర్ కళాశాలలు ఉండగా అందులో 11 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 4 టీఎస్డబ్ల్యూఆర్సీ, 1 టీఎస్ఆర్జేసీ, 6 మోడల్ స్కూల్స్, 48 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయన్నారు. ఆయన వెంట పలువురు అధ్యాపకులు ఉన్నారు. -
కొనసాగుతున్న జాతీయ స్థాయి క్రీడలు
భువనగిరి టౌన్: భువనగిరి పట్టణంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్–19 జాతీయ స్థాయి క్రీడా పోటీలను మంగళవారం ఆర్డీఓ ఎంవీ. భూపాల్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు కల్పించిన సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఎస్సీఓ మాక్బుల్ అహ్మద్, జిల్లా క్రీడల ఆర్గనైజింగ్ కార్యదర్శి గువ్వ దయాకర్‌రెడ్డి, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి జి. సోమనర్సయ్యలు ఉన్నారు. రెండవ రోజు బాల్‌బాడ్మింటన్ బాలుర విభాగంలో 13 జట్లు, బాలికల విభాగంలో 12 జట్లు పోటీ పడ్డాయి. అదే విధంగా షూటింగ్ బాల్ బాలుర విభాగంలో 6 జట్లు తలపడ్డాయి. షూటింగ్ బాల్ ఫైనల్ విజేతలు వీరే జాతీయ స్థాయి షూటింగ్ బాల్ ఫైనల్ బాలికల విభాగంలో మహారాష్ట్ర ప్రథమ స్థానం సాధించగా, ఢిల్లీ రెండోస్థానం, తెలంగాణ తృతీయ స్థానాలు సాధించాయి. అదే విధంగా బాలుర విభాగంలో మహారాష్ట్ర మెుదటి స్థానం, పంజాబ్ ద్వితీయ స్థానంలో నిలిచాయి. బాల్‌బ్యాడ్మింటన్ విజేతలు బాలుర విభాగంలో... ఒడిశా, సీబీఎస్ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 35–19, 35–19తో ఒడిశా జట్టు విజయం సాధించింది. అదే విధంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 35–23, 35–22తో కర్నాటక, గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 35–14, 35–21 తేడాతో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 35–15, 35–19 తేడాతో గుజరాత్, మధ్యప్రదేశ్‌తో 35–22, 32–35, 35–21 తేడాతో విద్యాభారతి, సీబీఎస్ఈతో 35–12, 35–12 తో తమిళనాడు, పాండిచ్ఛేరితో 35–30, 35–33తో తెలంగాణ జట్లు విజయం సాధించాయి. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 35–19, 35–19తో ఏపీ, ఉత్తరప్రదేశ్‌తో 35–12, 35–19తో ఛత్తీస్‌గఢ్, పాండిచ్ఛేరితో 35–25, 35–23తో కేరళ, ఒడిశాతో జరిగిన మ్యాచ్‌లో 35–25, 35–31 తేడాతో ఛండీగఢ్‌లు విజయం సాధించాయి. బాలికల విభాగంలో.... తెలంగాణ, పంజాబ్ జట్లు మధ్యన జరిగిన మ్యాచ్‌లో 35–21,35–25తో తెలంగాణ జట్టు విజయం సాధించింది. అదే విధంగా ఒడిశాతో 35–24, 35–25తో మహారాష్ట్ర, గుజరాత్‌తో 35–20, 35–28తో ఛత్తీస్‌గఢ్, సీబీఎస్ఈతో 35–8, 35–14తో కర్నాటక, ఢిల్లీతో 35–18, 35–25తో కేరళ జట్లు విజయం సాధించాయి. అలాగే మధ్యప్రదేశ్‌తో 35–20, 35–22తో ఏపీ, ఛత్తీస్‌గఢ్‌తో 35–19, 35–18తో కేరళ, పంజాబ్‌తో 35–15స 35–13తో కర్నాటక, ఉత్తరప్రదేశ్‌తో 35–16, 35–12తో ఒడిశా, విద్యాభారతితో 35–14, 35–11తో చంఢీగడ్, గుజరాత్‌తో 35–33, 21–35, 35–23తో ఢిల్లీ జట్లు విజయం సాధించాయి. -
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలి
భువనగిరి అర్బన్ : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా వైద్యసిబ్బంది స్పందించి గ్రామాల్లో వైద్యశిబిరాలను నిర్వహించాలని డీఎంహెచ్ఓ కె.భానుప్రసాద్‌నాయక్ అన్నారు. భువనగిరిలో జిల్లా వైద్యశాఖ కార్యాలయ భవనం ఏర్పాటు కోసం మంగళవారం స్థానిక ఏరియా ఆస్పత్రి సమీపంలో ఉన్న భవనాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మల్లేరియా వ్యాధి సోకకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఆ వ్యాధిపై అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే డెంగీ లక్షణాలు గుర్చి గ్రామీణ ప్రజలు తెలుసుకోవాలని, మనుషులు నల్లగా మారడం, తరుచు జ్వరాలు రావడం వంటి లక్షణాలు ఉంటే చికిత్స చేయించుకోవాలని కోరారు. ఈ నెల 10వ తేదీ వరకు భువనగిరిలో జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. కొత్తగా డీఎంహెచ్ఓ–1, ఏడీఎంహెచ్ఓ–1, డీఐఓ–1. డీటీసీఓ–1, డీఎల్ఓ–1, మల్లేరియా డీఎంఓ–2, ఎస్ఓ–1, ఐడీఎస్పీ మేడికల్ అధికారి–1, సూపరింటెండెంట్–1, సీనియర్ అసిస్టెంటు–3, జూనియర్–5, డ్రైవర్లు–5, అంటెండర్లు–5 పోస్టులలో అధికారులు, సిబ్బంది రానున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఎండీ.అన్వర్‌హుస్సేన్, శ్రీనివాస్, సుబ్రమణ్యం, శ్రీకాంత్ ఉన్నారు. -
భువనయాదాద్రి జిల్లాగా పేరు మార్చాలి
భువనగిరి టౌన్ : యాదాద్రి జిల్లా పేరును భువనయాదాద్రిగా ఖరారు చేయాలని మాజీమంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి ప్రభుత్వ కోరారు. మంగళవారం పట్టణంలోని రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమె మాట్లాడారు. భువనగిరి పెద్ద చరిత్ర గల ప్రాంతమని తెలంగాణ మలిదశ పోరాటంలో ఈ ప్రాంతానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉందని గుర్తుచేశారు. ఇటీవల వర్షంతో పటనష్టపోయిన రైతులు ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. భువనగిరి ఖిలాను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మార్చాలన్నారు. ఈ సమావేశంలో టీడీడీపీ ఉపాధ్యక్షుడు కుందారపు కృష్ణచారి, వైస్ ఎంపీపీ మోడపు శ్రీనివాస్‌గౌడ్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎక్బాల్చౌదరి, కౌన్సిల్ తాడూరి బిక్షపతి, నాయిని జయరాములు, భువనగిరి శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
భువనగిరి ఖిలాను సందర్శించిన విదేశీయులు
భువనగిరి టౌన్ : అమెరికాకు చెందిన ఆరుగురు ప్రతినిధుల బృందంతో పాటు మిషనరి పాఠశాల విద్యార్థులు 52 మంది సోమవారం భువనగిరి ఖిలాను సందర్శించారు. ఖిలాపై కట్టడాలు, నిర్మాణాలు, శిల్పకళను వారు పరిశీలించారు. భారతీయ కళానైపుణ్యం అద్భుతంగా ఉందని, చారిత్రక కట్టడాల్లో భువనగిరి ఖిలా ఒకటిగా ఉందన్నారు. -
భువనగిరిలో జాతీయ స్థాయి క్రీడాపోటీలు ప్రారంభం
భువనగిరి టౌన్ : క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సూచించారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో అండర్ – 19 ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్‌లో క్రీడాకారులు అతితక్కువగా ఉన్నారన్నారు. ఒలంపిక్స్‌లో పతకాలు సాధించిన సాక్షి మాలిక్, పీవీ సింధులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తీసుకువచ్చేందుకు నిర్వహిస్తున్న పోటీలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకుముందు టోర్నమెంట్‌కు సంబంధించిన ఎస్జీఎఫ్ జాతీయ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించి, క్రీడాజ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా 18 రాష్ట్రాల నుంచి వచ్చిన 44 జట్లు మార్చ్ఫాస్ట్ నిర్వహించాయి. అనంతరం షూటింగ్‌బాల్ బాలికల విభాగంలో తెలంగాణ, తమిళనాడు జట్ల మధ్య పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఇంటర్‌బోర్డు కమిషనర్ ఏ.అశోక్, ఎస్జీఎఫ్ నల్లగొండ జిల్లా కన్వీనర్ ఎం.ప్రకాష్‌బాబు, నేషనల్ టోర్నమెంట్ పర్యవేక్షకులు దినేష్‌సింగ్, మున్సిపల్ చైర్పర్సన్ సుర్వి లావణ్య, ఆర్డీఓ ఎం. వెంకట్‌భూపాల్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, తహసీల్దార్ కె.వెంకట్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మందడి ఉపేందర్‌రెడ్డి, డిప్యూటీ ఈఓ పి.మదన్మోహన్, ఇన్స్పెక్టర్ ఎం.శంకర్‌గౌడ్, జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ ఉమామహేశ్వర్, నాయకులు గోలి ప్రణీత, జడల అమరేందర్‌గౌడ్, నాగారం అంజయ్య, మారగోని రాముగౌడ్, కొలుపుల అమరేందర్, జి.దయాకర్‌రెడ్డి, సోమనర్సయ్య పాల్గొన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు జాతీయస్థాయి క్రీడాపోటీల సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మిర్యాలగూడలోని ప్రకాష్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు, భువనగిరి పట్టణంలోని విజ్ఞాన్, శ్రీవాణి పాఠశాల విద్యార్ధులు లె లంగాణ చరిత్రకు సంబంధించిన పాటలతో డ్యాన్సులు చేశారు. -
భువనగిరిలో జాతీయ స్థాయి క్రీడాపోటీలు
భువనగిరి టౌన్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భువనగిరిలో నిర్వహించనున్న జాతీయ స్థాయి క్రీడా పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని భువనగిరి ఆర్డీఓ ఎంవీ భూపాల్‌రెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న క్రీడా మైదానాన్ని ఆదివారం ఆర్డీఓ పరిశీలించి మాట్లాడారు. క్రీడల నిర్వహణకు ఎలాంటి లోటుపాట్లు జరుగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. క్రీడాకారులకు కల్పించనున్న వసతి, భోజనం ఏర్పాట్ల గురించి అధికారులు అడిగితెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, నీటి సరఫరా, లైటింగ్ సిస్టం ఏర్పాట్లపై మున్సిపాలిటీ అధికారుల ద్వారా ఆరా తీశారు. అనంతరం క్రీడల్లో పాల్గొనే 18 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పరియం చేసుకుని ఉత్తమ ప్రతిభ కనబర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాల్ చైర్పర్సన్ సుర్వి లావణ్య, తహసీల్దార్ కె.వెంకట్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మందడి ఉపేందర్‌రెడ్డి, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి గువ్వా దయాకర్‌రెడ్డి, ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సోమ నర్సింహారెడ్డి, మున్సిపల్ డీఈ ఇ.ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
భువనగిరిలో జాతీయ స్థాయి క్రీడలు
భువనగిరి టౌన్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం నుంచి జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్– 19 విభాగంలో జరిగే బాల్ బ్యాడ్మింటన్, షూటింగ్‌బాల్ క్రీడల కోసం మైదానాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ క్రీడలకు దేశంలోని 18 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు రానున్నారు. బాల్ బాడ్మింటన్ బాలురు, బాలికలు, షూటింగ్ బాల్ బాలురు, బాలికల విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. క్రీడాకారులతో పాటు, కోచ్‌లు, రీఫరీలతో కలిపి మెుత్తం 700 మంది ఈ పోటీలకు హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్రీడలకు వచ్చే వారికి కోశం స్థానిక శ్రీచైతన్య, శ్రీ ప్రతిభా, యునిటీ జూనియర్ కళాశాలలో బాలురు, ఎస్ఎస్ఆర్, శ్రీవైష్ణవి, టైమ్స్ జూనియర్ కళాశాలలో బాలికలకు వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. క్రీడాకారులకు కళాశాల పక్కనే ఉన్న శ్రీవాణి విద్యాలయంలో భోజన వసతి కల్పించనున్నారు. క్రీడల సందర్భంగా రోజువారీ సాంస్కృతిక కార్యక్రమాలు సైతం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని శాఖల ఆధ్వర్యంలో ఇప్పటికే సమీక్షా సమావేశాలు సైతం నిర్వహించారు. -
ప్రణాళికలో మార్పులపై నివేదిక ఇవ్వాలి
భువనగిరి : హెచ్ఎండీఏ ప్రణాళికలో మార్పులు, చేర్పులు కావాలనుకుంటే చెప్పాలని హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్ విద్యాధర్ కోరారు. మంగళవారం భువనగిరిలోని ఆర్డీఓ కార్యాలయంలో హెచ్ఎండీఏ పరిధిలోని భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, బొమ్మలరామారం, చౌటుప్పల్ మండలాల తహసీల్దార్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. హెచ్ఎండీఏలో రూపొందించిన ప్రణాళికకు కొత్తగా ఏమైనా మార్పులు, చేర్పులు సూచించాలనుకుంటే చెప్పాలన్నారు. కార్యక్రమంలో జేసీ సత్యనారాయణ, ఆర్డీఓ ఎం.వి భూపాల్‌రెడ్డి, తహసీల్దార్ కె.వెంకట్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జి.వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.