సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని భువనగిరిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ ఆమోదం తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా 50 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు సోమవారం అంగీకరిం చింది. ఈ విద్యాసంవత్సరం (2017–18) నుంచే భువనగిరిలోని ఏఎల్‌ఎన్‌రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కేంద్రీయ విద్యాలయం కార్యకలాపాలు కొనసాగుతాయని, ఒక్కో తరగతికి ఒక్కో సెక్షన్ చొప్పున ఒకటి నుంచి ఐదో తరగతి వరకు తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపింది.
కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుపై భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశారు. ఇప్పటికి కేంద్రం స్పందించి కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు.