తినుబండారాల దుకాణాలపై దాడులు | attacks in eating item shops | Sakshi
Sakshi News home page

తినుబండారాల దుకాణాలపై దాడులు

Published Mon, Sep 12 2016 10:21 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

తినుబండారాల దుకాణాలపై దాడులు

తినుబండారాల దుకాణాలపై దాడులు

భువనగిరి 
భువనగిరి బస్టాండ్‌లోని దుకాణాలల్లో అనధికారికంగా అమ్ముతున్నతినుబండారాలను అర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఎం కిషన్‌రావు అధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. బస్టాండ్‌ ఆవరణలో ఉన్న 8 దుకాణాల్లో అగ్రిమెంట్‌లో ఉన్న తినుబండారాలను కాకుండా ఇతర వస్తువులు అమ్ముతున్న విషయాన్ని గుర్తించారు. ఆయా దుకాణాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న తినుబండారాలను స్వాధీనం చేసుకున్నారు. మరో సారి ఇలా అక్రమంగా అమ్మితే నిబంధనల ప్రకారం లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. కాగా బస్టాండ్‌లో హాకర్‌లను అమ్మకుండా చూడాలని స్టేషన్‌ మేనేజర్‌కు డీఎం చార్జిషీట్‌ ఇచ్చారు. కాగా తామే కాదు బస్టాండ్‌ వ్యాపార సముదాయాలన్నింటిలో అగ్రిమెంట్‌లో ఉన్న విధంగా కాకుండా ఇతర వ్యాపారాలు సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక వ్యాపారం పేరుతో టెండర్‌ సంపాదించి వేరే వ్యాపారం చేస్తున్న వారందరిపైన చర్యలు తీసుకోవావాలని కోరుతున్నారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement