భువనయాదాద్రి జిల్లాగా పేరు మార్చాలి
భువనయాదాద్రి జిల్లాగా పేరు మార్చాలి
Published Tue, Oct 4 2016 10:27 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
భువనగిరి టౌన్ : యాదాద్రి జిల్లా పేరును భువనయాదాద్రిగా ఖరారు చేయాలని మాజీమంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి ప్రభుత్వ కోరారు. మంగళవారం పట్టణంలోని రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమె మాట్లాడారు. భువనగిరి పెద్ద చరిత్ర గల ప్రాంతమని తెలంగాణ మలిదశ పోరాటంలో ఈ ప్రాంతానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉందని గుర్తుచేశారు. ఇటీవల వర్షంతో పటనష్టపోయిన రైతులు ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. భువనగిరి ఖిలాను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మార్చాలన్నారు. ఈ సమావేశంలో టీడీడీపీ ఉపాధ్యక్షుడు కుందారపు కృష్ణచారి, వైస్ ఎంపీపీ మోడపు శ్రీనివాస్‌గౌడ్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎక్బాల్‌చౌదరి, కౌన్సిల్ తాడూరి బిక్షపతి, నాయిని జయరాములు, భువనగిరి శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement