రాయగిరి మెట్ల బావి చిత్రాలు
ఆదరణ కోల్పోతున్న వారసత్వ సంపదకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మెట్ల బావులు, కోటలు ఇతర చారిత్రక ప్రదేశాలను పునరుద్ధరిస్తోంది.
ఇదే క్రమంలో భువనగిరి జిల్లా రాయగిరి పరిధిలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న 600 ఏళ్ల నాటి మెట్ల బావిని పునరుద్ధరించే సమమయం అసన్నమైందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సైతం షేర్ చేశారు. మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ జిల్లాలో వైరల్‌గా మారడంతో రాయగిరి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే కలెక్టర్ సమేలా సత్పతి రాయగిరిలోని మెట్ల బావిని సందర్శించి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. స్థానికులతో పాటు యాదాద్రి క్షేత్రానికి వచ్చిన భక్తులు పురాతన మెట్ల బావిని సందర్శించేలా పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. తాజాగా కేటీఆర్ చేసిన ట్వీట్ మెట్లబావి పునరుద్ధరణపై ఆశలు రేకిత్తిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment