Restoration
-
శతాబ్దాల ఖ్యాతి.. సమున్నతం
ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో 861 సంవత్సరాల చరిత్ర కలిగిన నోట్రే డామ్ చర్చి మళ్లీ పునరుజ్జీవనం చెందింది. ఐదేళ్ల క్రితం భారీ అగ్నిప్రమాదంలో పాక్షిక్షంగా ధ్వంసమై కోట్లాది క్రైస్తవ భక్తుల్లో ఆవేదన మిగిల్చిన ఈ చర్చి మళ్లీ ప్రార్థనలకు సిద్ధమైంది. అప్పట్లో దీని పూర్తి నిర్మాణానికి ఏకంగా 200 ఏళ్లు పట్టిందని చెబుతారు. విభిన్నమైన డిజైన్, విశిష్ట నిర్మాణ శైలికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ చర్చికి మళ్లీ ఆ రూపం తేవడం చాలా కష్టమని నిర్మాణ రంగ నిపుణులే పెదవి విరిచారు. అయినా ఫ్రాన్స్ ప్రభుత్వం వెరవకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని యుద్ధ ప్రాతిపదికన చర్చికి ప్రాణప్రతిష్ట చేసింది. కేవలం ఐదేళ్లలో ఏకంగా రూ.6,350 కోట్ల భారీ వ్యయంతో నాణ్యతో రాజీ పడకుండా అదే స్థాయిలో పునరుద్ధరించింది. శనివారం చర్చి పునఃప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, బ్రిటన్ యువరాజు విలియంసహా దాదాపు 50 దేశాలకు చెందిన అధి పతులు, రాజులు, సెలబ్రిటీలు, వివిధ దేశాల నుంచి 170 మంది బిషప్‌లు, ప్రముఖులు వేడుకల్లో పాల్గొన్నారు. రికార్డు సమయంలో చర్చిని అందుబాటులోకి తేవడంలో కార్మికుల అంకితభావం దాగుందని మేక్రాన్ జాతి నుద్దేశించి ప్రసంగంలో చెప్పారు. కోర్సియా పర్యటనలో ఉన్న పోప్ ఫ్రాన్సిస్ ఈ కార్యక్రమంలో పాల్గొన లేదు. 2,000 మంది నిపుణులతో.. 2019 ఏప్రిల్ 15న ఘోర అగ్నిప్రమాదంలో చర్చి పై కప్పు, శిఖరం, అంతర్గత దారు నిర్మాణాలన్నీ కాలి బూడిదయ్యాయి. షాట్ సర్క్యూటో, కాల్చేసిన సిగరెట్ పీకో ఇందుకు కారణమంటారు. చర్చి పునఃనిర్మాణ వ్యయాన్ని భరిస్తామంటూ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ముందుకొచ్చారు. వేలాది కోట్ల విరాళాలిచ్చారు. చర్చి నిర్మాణ ఖర్చంతా ఇలా సమకూరిందే! పునర్నిర్మాణ క్రతువులో ఏకంగా 2,000 మంది నిపుణులు భాగస్వాములయ్యారు. అత్యంత నాణ్యమైన కలపను ఇచ్చే 2,000 ఓక్ చెట్ల నుంచి సేకరించిన కలపను ఈ నిర్మాణంలో వాడారు. భారీ సంగీత విభావరితో.. చర్చి ప్రారంభోత్సవంలో భాగంగా ప్రముఖ సంగీతకళాకారులతో భారీ సంగీత విభావరి నిర్వహించారు. ఒపెరా గాయకులు ప్రెటీ యేండీ, జూలీ ఫచ్, పియానిస్ట్ లాంగ్ లాంగ్ తదితరుల ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. పారిస్‌లోని సీన్ నదీ తీరం వెంట ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ తెరల్లో కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారంచేశారు. ప్రత్యక్షంగా 40,000 మంది, పరోక్షంగా కోట్లాది మంది వాటిని వీక్షించనున్నారు. ఆరుబయట కార్యక్రమం నిర్వహిద్దామనుకున్నా భారీ ఈదురుగాలుల వల్ల లోనికి మార్చారు. ఆదివారం నుంచి చర్చిలో ప్రార్థనలను అనుమతిస్తారు.సామ్యవాదంతో సంబంధం మతసంబంధ ప్రదేశంగా మాత్రమే గాక ఫ్రాన్స్ రాజకీయాలతోనూ నోట్రేడామ్ చర్చి ముడిపడి ఉంది. ఫ్రెంచ్ విప్లవానికి, రెండు ప్రపంచయుద్ధాలకు ఇది సజీవ సాక్షి. 1302లో రాజు నాలుగో ఫిలిప్ ఎస్టేట్ చట్టాన్ని ఈ చర్చిలోనే చర్చించి ఖరారు చేశారు. పన్నులు, రాజ్య పరిపాలనపై ఇక్కడే నిర్ణయాలు జరిగాయి. రోడ్లన్నీ రోమ్‌కే దారి తీస్తాయి (ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్) అనే సామెతకూ ఈ చర్చే మూలం. రోమన్ సామ్రాజ్యంలో రోడ్లన్నీ ఈ చర్చి సమీపంగా వెళ్లాలని చక్రవర్తి అగస్టస్ ఆదేశించారు. ప్రత్యేకతలెన్నో..→ పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాల్లో నోట్రేడామ్ చర్చి ఒకటి. → ఫ్రాన్స్ చరిత్ర, సాంస్కృతిక వైభవంలో ఈ చర్చిది కీలక పాత్ర. → దీన్ని ఏటా ఏకంగా 1.3 కోట్ల మంది విదేశీ పర్యాటకులు సందర్శిస్తుంటారు. → ఈఫిల్ టవర్ కంటే ఈ చర్చిని చూడ్డానికి పారిస్‌లో అడుగుపెట్టేవాళ్లే ఎక్కువ. → సీన్ నదిలో అత్యంత చిన్న ద్వీపమైన ‘ ది లే డీ లా సిట్’లో ఈ అద్భుత చర్చి నిర్మాణాన్ని నాటి బిషప్ మారీస్ డి సలీ ఆదేశాల మేరకు 1163లో పూర్తి చేశారు. → 64 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ చర్చి 12వ శతాబ్దం దాకా యూరప్ ఖండంలో అతి పెద్ద మానవ నిర్మాణం. → మేరోవియన్, కారోవియన్, రోమన్ల, గోథిక్ నిర్మాణ శైలిలో దీనిని కట్టారు. → మన తల కంటే ముంజేయి పొడవు సరిగ్గా 1.61803399 రెట్లు పెద్దగా ఉంటుందని గణిత సూత్రం. దీన్నే గోల్డెన్ రేషియో అంటారు. → చర్చి నిర్మాణంలో ఈ గణిత సూత్రాన్ని అణువణువునా వాడారు. చర్చిలో అంతర్నిర్మాణాల మధ్య కూడా ఇవే కొలతలను పాటించడంతో ఏ వైపు నుంచి చూసినా చర్చి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Jammu & Kashmir: రాష్ట్ర హోదా పునరుద్దరణకు తీర్మానం ఆమోదం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ నూతన సీఎం ఓమర్ అబ్దుల్లా నేతృత్వంలోని కేబినెట్ రాష్ట్ర హోదా పునరుద్దరణకు తీర్మానాన్ని ఆమోదించింది. గురువారం జరిగిన మొదటి సమావేశంలో జమ్ముకశ్మీర్ మంత్రివర్గం రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి, మంత్రులు సకీనా మసూద్ ఇటూ, జావేద్ అహ్మద్ రాణా, జావైద్ అహ్మద్ దార్, సతీష్ శర్మ హాజరయ్యారు.‘తీర్మానం ముసాయిదా సిద్ధం అయ్యింది. జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరుతూ తీర్మానం ముసాయిదాను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేయడానికి ముఖ్యమంత్రి రెండు రోజుల్లో న్యూఢిల్లీకి వెళతారు’ అంటూ సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.కాంగ్రెస్ జమ్ముకశ్మీర్ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర హోదాను పునరుద్ధరించకపోతే తమ పార్టీ కేబినెట్లో భాగం అవ్వదని వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదాను కేంద్రం పునరుద్ధరిస్తుందని ఆశిస్తున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విశ్వాసం వ్యక్తం చేశారు."మేము రాజ్యాధికారం గురించి ఇంతకు ముందు కూడా మాట్లాడాము. ఇప్పుడు కూడా అదే కోరుతున్నాం. రెండు నెలల్లో రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషిన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం త్వరలోదీనిని ఖచ్చితంగా పునరుద్ధరిస్తుందని భావిస్తున్నాను’ అని అబ్దుల్లా తెలిపారు. ఇదిలా ఉండగా 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. కాశ్మీర్‌కు మంజూరు చేసిన ప్రత్యేక హోదా, స్వయంప్రతిపత్తి నికూడా రద్దు చేసింది. దాంతో పాటు, జమ్మూ కాశ్మీరు రాష్ట్ర హోదాను తొలగిస్తూ జమ్ము కశ్మీర్. అలాగే లడఖ్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.. -
హైడ్రా బాస్‌తో భేటీ.. ఎవరీ ఆనంద్ మల్లిగవాడ్
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్‌లోని చెరువుల పునరుద్ధరణ, పునరుజ్జీవం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) దీనికోసం నిపుణుల సాయాన్ని తీసుకోనుంది. ఇందులో భాగంగా లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ఆనంద్ మల్లిగవాడ్‌తో శుక్రవారం కమిషనర్ ఏవీ రంగనాథ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైడ్రా కార్యాలయం నుంచి బెంగళూరులో చెరువుల పునరుద్ధరణ జరిగిన తీరును పరిశీలించారు. సమావేశంలో భాగంగా ఆనంద్.. మురుగుతో నిండిన, నీళ్లు లేకున్న చెరువులను ఏ విధంగా తీర్చిదిద్దారో వివరించారు. బెంగళూరు నగరంలోని మొత్తం 35 చెరువులను పునరుద్ధరించిన విధానాన్ని ఆయన రంగనాథ్‌కు వివరించారు. అతి తక్కువ ఖర్చుతో చెరువులకు పునరుజ్జీవనం కల్పించడానికి ఉన్న అవకాశాలను హైడ్రా అధికారులు పరిశీలించారు.చెరువుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి, స్వచ్ఛమైన నీరు చేరేందుకు తీసుకోవాల్సిన చర్యల్ని పరిశీలించారు. మురుగు నీటి శుద్ధి చేసే ప్రక్రియను ప్రారంభించి.. చెరువులోకి చేరే ముందే మూడు నాలుగు దశల్లో ఫిల్టర్ చేసే తీరును హైడ్రా యోచిస్తోంది. మురుగు నీటి కాలువలకు రెండు వైపులా మొక్కలు నాటడం ద్వారా చెరువుకు చేరేలోపే ఆ నీరు కొంతమేర శుద్ధి అయ్యేలా బెంగళూరులో ఏర్పాటు చేసిన విధానంపై హైడ్రా అధ్యయనం చేస్తోంది. త్వరలోనే బెంగళూరు వెళ్లి అక్కడ చెరువులను పునరుద్ధరించిన తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించాలని హైడ్రా అధికారులు యోచిస్తున్నారు. అలాగే ఆనంద్ మల్లిగవాడ్‌ను హైదరాబాద్‌కు పిలిపించి ఇక్కడ చెరువుల పునరుద్ధరణపై సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. కూల్చివేతల వ్యర్థాలను తొలగించి తొలిదశలో సున్నం చెరువు, అప్పా చెరువు, ప్రగతినగర్ వద్ద ఉన్న ఎర్రకుంట, కూకట్పల్లి చెరువులకు పునరుజ్జీవనం కల్పించాలని హైడ్రా నిర్ణయించింది. అయితే మల్లిగవాడ్‌తో కేవలం చెరువుల పునరుద్ధరణపై సలహాలు, సూచనలు మాత్రమే తీసుకుంటారా? లేదా ఆయనకు హైడ్రాలో ఏమైనా కీలక పదవిని అప్పగిస్తారా? అనే చర్చ అధికారుల్లో జరుగుతోంది. ఎవరీ ఆనంద్ మల్లిగవాడ్హైడ్రా కమిషనర్‌తో శుక్రవారం ఆనంద్ మల్లిగవాడ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం ఆనంద్ మల్లిగవాడ్ గురించి చర్చ మొదలైంది. సోషల్‌మీడియాలో సైతం ఆయన ఎవరనీ సెర్చ్ చేస్తున్నారు. ఆనంద్ మల్లిగవాడడ్ను ‘లేక్‌మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు. ఆయన కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుకు నీటి సంరక్షణ, పర్యావరణవేత్తగా కృషి చేస్తున్నారు. బెంగళూరులో క్షీణించిపోతున్న దశలో ఉన్న సమారు 23 చెరువులను పునరుద్ధరించటంలోకి కీలక పాత్ర పోషించారు. 1981లో కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో జన్మించిన ఆనంద్.. 2017లో అనేకల్ సమీపంలోని క్యాలసనహళ్లి సరస్సు పునరుద్ధరించేందుకు బి.ముత్తురామన్ ‘సన్సెరా’ ఫౌండేషన్‌తో కలిసి పని చేశారు. ఇక.. అప్పటి నుంచి బెంగళూరులో చెరువుల పరిరక్షణకు సంబంధించి పలు సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టారు. 2019లో తన ఇంజనీరంగ్ ప్రొఫెషన్‌ను వదిలేసి.. బెంగళూరులో చెరువుల పుణరుద్ధరణ, నీటి సంరక్షణే లక్ష్యంగా ఆయనే స్వయంగా ‘మల్లిగవాడ్’ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఆయన సేవలు గుర్తించిన రోటరీ ఫౌండేషన్ ఆయనకు కమ్యూనిటీ సర్వీస్ అవార్డు ప్రధానం చేసింది. ఇక.. ఏప్రిల్ 2024లో ఆయన, ఆయన ఫౌండేషన్‌పై కర్ణాటక లేక్ కన్జర్వేషన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్-2014లోని సెక్షన్ 430 కింద కేసు నమోదైంది.‘ నీటిపారుదల పనులు ఇబ్బందులు కలిగించటం. నీటిని తప్పుగా మళ్లించడం’ వంటి ఆరోపణలు రావటంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయటం గమనార్హం. బెంగుళూరు అర్బన్ జిల్లాలోని హీలలిగే అనే గ్రామంలోని రైతు సంఘం ఈ విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేసింది. హీలలిగే వద్ద నీటి వనరులను పునరుద్ధరించడానికి మల్లిగవాడ్ చేపట్టిన పునరుజ్జీవన ప్రక్రియ అశాస్త్రీయ ఉందని ఆరోపించారు. -
Omar Abdullah: బీజేపీ నుంచి ఆశించడం మూర్ఖత్వం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ప్రజల ప్రత్యేక హక్కులను లాక్కున్న బీజేపీ నుంచి ఆర్టికల్ 370 పునరుద్ధరణను ఆశించడం మూర్ఖత్వమని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. అయితే బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంపై తమ పార్టీ వైఖరి మారబోదన్నారు. ఆర్టికల్ 370పై మాట్లాడబోమని కానీ, అదిప్పుడు సమస్య కాదని తామెప్పుడూ చెప్పలేదని అబ్దుల్లా స్పష్టం చేశారు. భవిష్యత్‌లో దేశంలో ప్రభుత్వం మారుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఒమర్... అప్పుడు జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించే కొత్త వ్యవస్థ ఏర్పడుతుందని ఆశిస్తున్నామన్నారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కోరుతూ ఎన్సీ–కాంగ్రెస్ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలో తీర్మానం చేస్తుందని తెలిపారు. ఢిల్లీ తరహాలో కాకుండా జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం సజావుగా నడుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీకి జమ్మూకశ్మీర్‌కు చాలా తేడా ఉందని, 2019కు ముందు జమ్మూకశ్మీర్ ఒక రాష్ట్రమని గుర్తు చేశారు. జమ్మూకశ్మీర్‌లో మూడు చర్యలు తీసుకుంటామని చెప్పిన ప్రధాని, హోంమంత్రి, సీనియర్ మంత్రులు చెప్పారని, డీలిమిటేషన్, ఎన్నికలు జరిగాయని, రాష్ట్ర హోదా మాత్రమే మిగిలి ఉందని, దానిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో ఘర్షణ పడటం వల్ల సమస్యలను పరిష్కరించలేమన్నారు. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడానికి ఎన్సీ గురువారం శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తుందని అబ్దుల్లా చెప్పారు. ఆ తర్వాత కూటమి సమావేశంలో నాయకుడిని ఎన్నుకుంటారని, ఆ తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు హక్కును కోరుతామని తెలిపారు. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో పీడీపీ భాగస్వామ్యం అవుతుందా అన్న ప్రశ్నకు ఎన్సీ నేత సమాధానమిస్తూ ప్రస్తుతానికి దానిపై ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు.హిందువుల్లో విశ్వాసాన్నిపెంచుతాం: ఫరూక్జమ్మూకశ్మీర్ మధ్య బీజేపీ సృష్టించిన విభేదాలను తగ్గించి, హిందువుల్లో విశ్వాసాన్ని పెంపొందించడమే ఎన్సీ–కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. రెండు ప్రాంతాల మధ్య భేదం చూపబోమని తెలిపారు. కొత్త ప్రభుత్వం ముందు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అతిపెద్ద సవాళ్లున్నాయన్నారు. యువతకు అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అయితే ముఖ్యమంత్రి ఎవరనేది కూటమి నిర్ణయిస్తుందని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించడంపై ఫరూక్ స్పందిస్తూ.. తాను నిర్ణయించిందే జరుగుతుందని స్పష్టం చేశారు. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అభ్యర్థని ఫరూక్ అబ్దుల్లా మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. -
జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి వ్యాఖ్యల దుమారం
ఢిల్లీ: జమ్ము కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్టికల్ 370 అంశంపై పాకిస్తాన్ జోక్యం చేసుకుంది. జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణపై పాక్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఒకే విధమైన ఆలోచనతో ఉన్నాయని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ మట్లాడుతూ.. ‘‘జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కూటమి ఆర్టికల్ 370 పునరుద్ధరణను ఎన్నికల అంశంగా మార్చారు. ఆర్టికల్ 370, 35A పునరుద్ధరణ కోసం జమ్ము కశ్మీర్లో పాకిస్తాన్ , నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి ఒకే అభిప్రాయంతో ఉన్నాయి’’ అని అన్నారు. ఎన్నికల జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తిపై పాక్ జోక్యం చేసుకొని ఇటువంటి వ్యాఖ్యలు చేయటం దుమారం రేపుతున్నాయి. ఇక.. ఇప్పటి వరకు పాక్ మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు.Pakistan’s Defence Minister @KhawajaMAsif on Hamid Mir’s Capital Talk on Geo News says, “Pakistan and @JKNC_ - @INCIndia alliance are on the same page in Jammu & Kashmir to restore Article 370 and 35A”. Will @RahulGandhi & @OmarAbdullah react. pic.twitter.com/x9dYev2PHM— RP Singh National Spokesperson BJP (@rpsinghkhalsa) September 19, 2024 ఇప్పటికే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ తాము అధికారంలోకి వస్తే.. ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అయితే, ఈ విషయంపై కాంగ్రెస్ పూర్తిగా మౌనంగా ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఈ అంశం ప్రస్తావన లేకపోవటం గమనార్హం. కానీ, ముందు నుంచి జమ్ము కశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని హామీ ఇస్తూ వస్తోంది. ఆర్టికల్ 370 పునరుద్ధరణ హామీ విషయంలో నేషనల్ కాన్ఫరెన్స్‌తో పాటు మెహబూబా ముఫ్తీ పీడీపీ తన మేనిఫెస్టోలలో పెట్టింది.పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలు బీజేపీ.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ భారత ప్రయోజనాలకు విఘాతం కలిగించే వారి వైపే ఉంటుందని ఆరోపణలు చేసింది. ‘‘ఉగ్రవాద రాజ్యమైన పాకిస్తాన్, కశ్మీర్ విషయంలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి వైఖరిని సమర్థిస్తుంది. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎల్లప్పుడూ భారతదేశ ప్రయోజనాలకు విరుద్ధమైన వారి వైపు కనిపిస్తారు’ అని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఎక్స్‌లో విమర్శించారు. -
ఇదిగో కూజా..!
ఇదేమిటో గుర్తు పట్టారా? దాదాపు మూడు వారాల క్రితం ఇజ్రాయెల్‌లోని హెక్ట్ మ్యూజియంలో ఏరియల్ గెలర్ అనే నాలుగేళ్ల చిన్నారి పొరపాటున తాకడంతో కింద పడి ముక్కలైపోయిన 3,500 ఏళ్ల నాటి అరుదైన కూజా ఇది. పట్టి చూస్తే తప్ప పగిలిన ఆనవాళ్లు కని్పంచకుండా రిస్టొరేషన్ నిపుణుడు రో షెఫర్ సారథ్యంలోని బృందం దాన్ని అత్యంత నైపుణ్యంతో ఇలా తిరిగి అతికించింది. బుధవారం నుంచి కూజాను మ్యూజియంలో మళ్లీ ప్రదర్శనకు ఉంచారు. ఇంతటి అరుదైన కూజా పగిలిపోయినా మ్యూజియం సిబ్బంది హుందాగా స్పందించిన తీరు అందరి మనసులూ గెలుచుకుంది. బాలున్ని గానీ, అతని తల్లిదండ్రులను గానీ వాళ్లు ఏమాత్రమూ నిందించలేదు. పైగా ‘పిల్లలన్నాక ఇలా చేస్తుంటారు, మరేం పర్లే’దంటూ ఊరడించారు. జరిమానా చెల్లిస్తామన్నా అలాంటిదేమీ అక్కర్లేదన్నారు. మ్యూజియం చీఫ్ దగ్గరుండి మరీ వారికి మ్యూజియం అంతా తిప్పి చూపించారు. గిల్టీ ఫీలింగ్ నడుమ సరిగా చూశారో లేదోనని పది రోజులు పోయాక మరోసారి మ్యూజియం సందర్శనకు ఆహా్వనించారు. ఆ సందర్భంగా చిన్నారి గెలర్ ఒక మట్టి కూజా తీసుకెళ్లి బహూకరించడంతో సిబ్బంది తెగ ఆనందపడిపోయారు. బాలునితో చాలాసేపు గడపడమే గాక పగిలిన కూజాలను ఎలా అతికిస్తారో ప్రత్యక్షంగా చూపించారు. ‘‘పురాతత్వ వస్తువులను తాకి చూస్తే వాటిపై అనురక్తి కలుగుతుంది. వాటిని తాకి చూస్తే చరిత్ర, పురాతత్వ శా్రస్తాల పట్ల పిల్లల లేత మనసుల్లో గొప్ప ఆస్తకి పుట్టవచ్చు. ఎవరికి తెలుసు?! అందుకే అవి సందర్శకులకు చేతికందే సమీపంలోనే ఉండాలి తప్ప అద్దాల అరల్లో కాదన్నదే ఇప్పటికీ మా అభిప్రాయం’’ అని మ్యూజియం చీఫ్ చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే అతికించిన కూజాను రక్షణ వలయం వంటివేవీ లేకుండా తాజాగా మళ్లీ సందర్శకులకు అందుబాటులోనే ఉంచడం విశేషం! -
36 గంటల్లో మహబూబాబాద్ రైల్వే ట్రాక్ పునరుద్ధరణ
మహబూబాబాద్, సాక్షి: తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలోని ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలోని పెద్ద మోరీ వద్ద వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పూర్తి అయింది. ఈ పట్టాల పునరుద్ధరణ నిర్మాణ మరమ్మతు పనులను రైల్వే శాఖ అధికారులు యుద్ద ప్రాతిపదికన కేవలం 36 గంటల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించారు.తాజాగా నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో రైల్వే అధికారులు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా ట్రాక్ కొట్టుకుపోవటంతో వందలాది రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. కొన్ని రైళ్లను దారిమళ్లించి విషయం తెలిసిందే. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పూర్తి కావటంతో రేపటి(బుధవారం) నుంచి యాధావిధిగా రైళ్ల రాకపోకలు కొసాగుతాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. -
Anantha Nageswaran: ఆర్థిక వ్యవస్థపై విశ్వాస పునరుద్ధరణ
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ పట్ల ఇన్వెస్టర్లో విశ్వాస పునరుద్ధరణ నెలకొందని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఇందుకుగాను ఆయన ‘యానిమల్ స్పిరిట్స్’ అనే పదాలను వినియోగించారు. పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాల్లో ఇన్వెస్టర్ విశ్వాస పునరుద్ధరణ భావాన్ని వ్యక్తీకరించడానికి ప్రముఖ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ ‘యానిమల్ స్పిరిట్స్’ అనే పదాలను వినియోగించారు. ప్రైవేటు రంగంలో పెట్టుబడుల పురోగతి స్పష్టంగా ప్రతిబింబిస్తున్నట్లు నాగేశ్వరన్ వెల్లడించారు. ‘‘ఆర్థిక వ్యవస్థపై విశ్వాస పునరుద్ధరణ జరిగింది. లేకపోతే, భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతం వద్ద ఎలా వృద్ధి చెందుతుంది? అలాగే మీరు పర్చేజింగ్ మేనేజర్ల ఇండెక్స్, తయారీ, సేవల సూచీల పురోగతి స్టాక్ మార్కెట్ పనితీరును చూడండి. స్థూల దేశీయోత్పత్తి అంకెల్లో సానుకూలంగా కనిపిస్తున్నాయి’’ అని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఇంకా ఆయన ఏమి చెప్పారంటే... ► ప్రైవేట్ రంగంలో లిస్టెడ్ కంపెనీలు తమ మూలధన వ్యయాలను ప్రారంభించాయని, కొత్త ప్రాజెక్ట్ ప్రకటనలనూ చేస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డేటా పేర్కొంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా తన మధ్యంతర బడ్జెట్లో ఇదే విషయాన్ని వెల్లడించారు. ► ఇక స్థూల, నికర మార్కెట్ రుణాలు 2024–25లో వరుసగా రూ.14.13 లక్షల కోట్లు, రూ.11.75 లక్షల కోట్లుగా ఉంటాయని బడ్జెట్ తెలిపింది. ఈ రెండు సంఖ్యలూ 2023–24 తో పోలి్చతే తక్కువే కావడం గమనార్హం. ప్రభుత్వం తక్కువ రుణాలను తీసుకోవడం వల్ల ప్రైవేట్ రంగానికి పెద్ద ఎత్తున రుణాల లభ్యత సులభతరం అవుతుందని ఆర్థికమంత్రి తన మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో విశ్లేషించారు. ► ఆర్థిక వ్యవస్థలో వృద్ధి నేపథ్యంలో స్టీల్, సిమెంట్, పెట్రోలియం వంటి కొన్ని రంగాలలో ఇటీ వలి కాలంలో ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకున్నాయి. ► 2024–25 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి అంచనాల నేపథ్యంలో రుణాలకు సంబంధించి అటు కార్పొరేట్, ఇటు బ్యాంకింగ్ రంగాల బ్యాలెన్స్ షీట్లు రెండూ కొంత ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ► కోవిడ్ నేపథ్యంలో రుణ భారాలను తగ్గించుకోడానికి తమ అసెట్స్‌ను సైతం విక్రయించిన కంపెనీలు, తాజా సానుకూల ఆర్థిక వాతావరణం నేపథ్యంలో రుణ సమీకరణ, వ్యాపార విస్తరణలపై దృష్టి సారించాయి. బ్యాంకింగ్ మూలధన నిష్పత్తి పటిష్టం.. చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ తెలిపిన సమాచారం ప్రకారం, 15 శాతం సగటు మూలధన నిష్పత్తి (క్యాపిటల్ అడిక్వసీ రేషియో)తో బ్యాంకుల ఫైనాన్షియల్ పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ముగిసే సమయానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) 16.85 శాతంతో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర క్యాపిటల్ అడిక్వసీ రేషియో అత్యధికంగా ఉంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 16.80 శాతం, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 16.13 క్యాపిటల్ అడిక్వసీ రేషియోను కలిగిఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభం 253 శాతం వృద్ధితో (రూ. 2,223 కోట్లు) అత్యధిక త్రైమాసిక నికర లాభం వృద్ధిని సాధించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 62 శాతం వృద్ధితో (రూ. 1,870 కోట్లు), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 60 శాతం పెరుగుదలతో (రూ. 3,590 కోట్లు) తరువాతి స్థానాల్లో నిలుస్తున్నాయి. -
అక్కడ ఇళ్లు ఎన్నో.. గుడులు అన్ని!
అయోధ్య నుంచి ‘సాక్షి’ప్రతినిధి గౌరీభట్ల నరసింహమూర్తి :దేశంలో ఎన్నో ఆధ్యాత్మిక పట్టణాలున్నా వాటిలో అయోధ్య తీరే వేరు. రామ జన్మభూమిగా భావించే అయోధ్యలో ఇళ్లు, చెట్టు, పుట్ట సర్వం రామమయమే. రామనామ సంకీర్తనతో సూర్యోదయాన్ని చూసే అయోధ్య.. రామ భజన తర్వాతే నిద్రకు ఉపక్రమిస్తుంది. ఇలా ఆధ్యాత్మక పట్టణాల్లో స్థానికంగా దైవ సంకీర్తనలు సహజమే.. కానీ ఆ ఊరిలో ఎన్ని ఇళ్లుంటాయో అన్ని గుడులు ఉండటం మాత్రం అయోధ్యకే చెల్లింది. ఆ పట్టణంలో 8 వేలకుపైగా ఆలయాలు ఉన్నాయని అయోధ్యవాసులు చెప్తున్నారు. మహమ్మదీయ రాజుల కాలంలో ధ్వంసంగా కాగా మిగిలిన వాటి సంఖ్య ఇదని అంటున్నారు. ప్రతి ఇల్లూ ఓ ఆలయమే.. అయోధ్యలో ప్రతి హిందువు ఇంట్లో ఓ చిన్నపాటి దేవాలయం ఉంటుంది. మన ఇళ్లలో పూజా మందిరం ఉన్నట్టుగా కాకుండా పెద్ద పరిమాణంలోని విగ్రహాలతో ఓ చిన్న గుడి ఉంటుంది. నిత్య పూజలు, నైవేద్యాలు, గుడిని తలపించే పూజాదికాలు జరుగుతుంటాయి. అందుకే అయోధ్యలో ప్రతి ఇల్లూ ఓ ఆలయమే అంటారు. అయోధ్య పట్టణంలో ఉన్న ఇళ్ల సంఖ్య 10,026. అంటే అక్కడ ఇళ్లు ఎన్నో.. గుడులు కూడా అన్ని ఉన్నట్టు. ముఖ్యమైన ఆలయాల పునరుద్ధరణ కొత్త రామాలయం ప్రతిష్టాపన ఉత్సవాలు ముగిశాక అయోధ్యలోని ఇతర ప్రధాన దేవాలయాలను కూడా పునరుద్ధరించాలని యూపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎనిమిది వేల గుడులున్నా వాటిలో ముఖ్యమైనవి వంద వరకు ఉంటాయని అంచనా. ఇవన్నీ చారిత్రక ప్రాధాన్యమున్నవే. వందల ఏళ్లుగా పూజాదికాలు జరుగుతున్నవే. వాటిలో కొన్ని ఆలయాలు చాలా పురాతనమైనవి కూడా. శ్రీరాముడి జీవిత ఘట్టాలు, వ్యక్తులతో ముడిపడిన ఆలయాలు ఉన్నాయి. హనుమంతుడు, లక్ష్మణుడు, భరత–శత్రుజు్ఞలు, సుగ్రీవుడు, జాంబవంతుడు, విశ్వామిత్రుడు, వశిషు్టడు, జనకమహారాజు, దశరథుడు.. ఇలా ఎన్నో గుడులు ఉన్నాయి. ► సీతమ్మ వంట చేసినట్టుగా పేర్కొనే సీతా రసో యీ, దశరథుడు నివసించినట్టు చెప్పే రాజభవనం, మణిమాణిక్యాలను కానుకలుగా తెచి్చన జనక మహారాజు పేరుతో ఏర్పడ్డ మణి పర్వత, సుగ్రీవ ఖిలా.. ఇలాంటి నిర్మాణాలు కూడా ఎన్నో ఉన్నాయి. వీటిలో నిర్వహణ లోపాలు, వాతావరణ ప్రభావంతో కొన్ని శిథిలమయ్యా యి. ఇప్పటికీ సలక్షణంగా ఉన్న గుడులు, నిర్మాణాలను గుర్తించి అభివృద్ధి చేయనున్నారు. అయోధ్యకు వచ్చే భక్తులు ప్రధానాలయ దర్శనానికే పరిమితం కాకుండా.. ఇవన్నీ చూసేలా ఏర్పాట్లు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కోనేరులకూ యోగం.. అయోధ్యలో చాలా చోట్ల ఆలయాలతోపాటు అనుసంధానంగా కోనేరులు ఉన్నాయి. వాటికి కూడా రామాయణ గాథలతో ముడిపడిన చరిత్ర ఉంది. వీటిలో ముఖ్యమైన 35 కోనేరులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే సరయూ నది రివర్‌ఫ్రంట్‌ను అహ్మదాబాద్ సబర్మతీ తీరం తరహాలో అభివృద్ధి చేశారు. లైట్ అండ్ మ్యూజిక్ షో, లేజర్ షో ఏర్పాటు చేశారు. సాయంత్రం నదీ హారతి ఇస్తున్నారు. -
ప్రాణహిత–చేవెళ్ల పునరుద్ధరణ
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి తెలిపారు. గతంలో కాంగ్రెస్ హయాంలో రూ.38 వేల కోట్లతో 16.40 లక్షల ఎకరాల ఆయ కట్టుకు నీరందించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని చెప్పారు. రూ.11 వేల కోట్లు ఖర్చు చేసి కాల్వలు కూడా తవ్వించామని, అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం ప్రాజెక్టును మేడిగడ్డ వద్దకు మార్చిందని విమర్శించారు. ఎన్ని కల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జ్యుడీషియల్ విచారణ చేపడతామని తెలిపారు. గత ప్రభుత్వం కాళేశ్వరానికి జాతీయ హోదా సాధించడంలో విఫల మైందని విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని శుక్రవారం ఐదుగురు మంత్రుల బృందం పరిశీలించింది. ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్ది ళ్ల శ్రీధర్ బాబు, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ వీరిలో ఉన్నారు. కాగా ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మంత్రులు మాట్లాడారు. ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పటి నుంచే ఎన్నో అనుమానాలు ఉన్నాయని, తాము చెబుతూ వచ్చిన విషయాలే ఇప్పుడు నిజమయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు పేరొస్తుందనే: కోమటిరెడ్డి ‘ప్రాణహిత పూర్తయితే కాంగ్రెస్ పార్టీకి పేరొస్తుందనే సగం వరకు పనులు జరిగిన ప్రాజెక్టును వదిలేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరాన్ని చేపట్టింది. తుమ్మిడిహెట్టి వద్ద 3 వేల ఎకరాలు సేకరించి ఉంటే గ్రావిటీతో నీళ్లు వచ్చేవి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ చర్యలన్నీ తుగ్లక్ చర్యల్లా ఉన్నాయి. కొండపోచమ్మ ఎప్పుడూ నిండుగా ఉంటుంది. కానీ కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు తప్ప ఇతర పొలాలకు నీరు పోదు. ఇక ఈ ప్రాజెక్టు పంపు హౌస్‌లలో నాణ్యత లేని మోటార్లు బిగించారు. ఇవన్నీ అసెంబుల్డ్ మోటార్లు. మోటార్లకు రూ.1,000 కోట్లకు బదులు రూ.4 వేల కోట్లు చెల్లించారు. నల్లగొండ జిల్లాకు సాగు నీరందించే ప్రాజెక్టులను చిన్నచూపు చూశారు..’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలారు.. పొంగులేటి: ‘కేసీఆర్ ప్రతిచోటా తన మార్కు ఉండాలనే తాపత్రయంతో ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేశారు. కాళేశ్వరం విషయంలో మొదటి నుంచి హెచ్చరిస్తున్నా పట్టించుకోకపోవడం వల్లే ఇంత పెద్ద నష్టం జరిగింది. డయా ఫ్రం వాల్ ఆర్సీసీతో కట్టి ఉంటే ప్రమాదం జరిగేదా? సీకెండ్ ఫైల్ ఫెయిల్ అయినందుకే మేడిగడ్డ పియర్స్ రోజురోజుకూ కుంగిపోయాయి. ప్రొటెక్షన్ పనులు ఒక్క వరదకే పోయాయంటే ఎంత నాసిరకంగా చేశారో అర్థమవుతోంది. ప్రమాదం ఉందని 2022లోనే ఈఈ పై అధికారులకు లేఖ రాసినా చర్యలు తీసుకోలేదు. కుంగుబాటు కొన్ని పిల్లర్లతో ఆగుతుందని నేను అనుకోవడం లేదు...’ అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రజలకు వివరించేందుకే..: శ్రీధర్‌బాబు ‘కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం, జరిగిన నష్టం ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర సంపద సక్రమంగా వినియోగించాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం పనిచేస్తోంది. గోదావరి జలాలతో భూపాలపల్లి, పెద్దపల్లికి సాగునీరు, తాగునీరు అందించాలని, ప్రత్యేక ప్రణాళిక ద్వారా మంథని ముంపు ప్రాంతాలను ఆదుకోవాలని సహచర మంత్రులను కోరుతున్నా..’ అని శ్రీధర్‌బాబు అన్నారు. గత ప్రభుత్వ మానస పుత్రిక: పొన్నం ‘కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వం మానస పుత్రిక. దీని కోసం ఎంత విద్యుత్ వాడారో చెప్పాలి. రైతులకు స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది..’ అని పొన్నం ప్రభాకర్ అన్నారు. అనంతరం మంత్రుల బృందం మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ప్రదేశాన్ని పరిశీలించింది. అన్నారం బ్యారేజీని సందర్శన తర్వాత హైదరాబాద్ బయలుదేరి వెళ్లింది. ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ కిరణ్ ఖరే, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. రూ. లక్ష కోట్లకు లక్ష ఎకరాల ఆయకట్టా?: ఉత్తమ్ ‘కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.95,000 కోట్లు ఖర్చు చేసినట్లు గత పాలకులు చెబుతున్నారు. కానీ దానివల్ల ఏర్పడిన కొత్త ఆయకట్టు లక్ష ఎకరాలే. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు అని చెప్పారు. అద్భుతం అన్నారు. కానీ మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ కావడం దురదృష్టకరం. బ్యారేజీ కుంగిపోయినా ఆనాటి ముఖ్యమంత్రి కానీ, ఇరిగేషన్ మంత్రి కానీ నోరు మెదపలేదు. మేడిగడ్డ ఒక్కటే కాదు.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు కూడా నష్టం జరిగింది. వాటిని పరిశీలించి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జ్యుడీషియల్ విచారణ చేపడతాం..’అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. -
రీజెన్సీ సిరామిక్స్ పునరుద్ధరణ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలోని రీజెన్సీ సిరామిక్స్ గురువారం పునఃప్రారంభమైంది. కార్మికుల వివాదాల నేపథ్యంలో దశాబ్దంన్నర క్రితం యానాం రీజెన్సీ లాకౌట్ ప్రకటించింది. అప్పటి నుంచి ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు కొలిక్కివచ్చాయి. ప్రయోగాత్మకంగా ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. రీజెన్సీ సిరామిక్స్‌ను తిరిగి పూర్తిస్థాయిలో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు యాజమాన్యం ఏర్పాట్లు పూర్తిచేసింది. సంక్లిష్టమైన డిజైన్లకు మారుపేరుగా నిలిచిన రీజెన్సీ సిరామిక్స్ తొలిసారి రీజెన్సీ నేచురల్ టైల్స్‌ను చెన్నయ్‌లో విడుదల చేసింది. రూ.70 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కంపెనీ నాలుగు టైల్స్ తయారీ లైన్లలో మొదటి దానిని ప్రారంభించేందుకు సిద్ధం చేసింది. కంపెనీ మొదటి లైన్ రోజుకు 7 వేల చదరపు మీటర్లను ఉత్పత్తి చేయనుంది. దీనిని రోజుకు 25 వేల చదరపు మీటర్ల సామర్థ్యానికి విస్తరించనున్నారు. అన్ని పరిమాణాలు, రకాలు, గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్, ఫుల్ బాడీ విట్రిఫైడ్ టైల్స్, పాలి‹Ù్డ విట్రిఫైడ్ టైల్స్, డబుల్ చార్జ్డ్ టైల్స్, వాల్ టైల్స్, ఎక్స్టీరియర్ టైల్స్, స్టెప్స్, రైజర్లలో ఉత్పత్తి చేయడానికి నిర్ణయించారు. రీజెన్సీ ఉత్పత్తులను దేశంలోనే దక్షిణాది, తూర్పు ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రీజన్సీ డైరెక్టర్ నరాల సత్యేంద్రప్రసాద్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో వ్యాపారాన్ని విస్తరించనున్నట్టు చెప్పారు. వచ్చే మూడేళ్లలో రూ.100 కోట్లు ఆదాయం లక్ష్యంగా ఉత్పత్తిపై దృష్టి పెట్టామన్నారు. రాజధాని నగరాలతోపాటు మిగిలిన నగరాల్లో షోరూంలు ఏర్పాటు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. యానాంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో ఆరి్థక వ్యవస్థ బలోపేతంలో రీజెన్సీ భాగస్వామ్యం వహిస్తుందని ఆయన చెప్పారు. -
రాహుల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ.. సుప్రీంకోర్టులో పిల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. లక్నోకు చెందిన న్యాయవాది అశోక్ పాండే ఈ పిటిషన్ వేశారు. వయనాడ్ ఎంపీగా రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. కాగా మోదీ ఇంటి పేరు వ్యాఖ్యల పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆగస్టు 4న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం తీర్పుతో రాహుల్‌పై లోక్‌సభ అనర్హత వేటు తొలిగిస్తున్నట్లు ఆగస్టు 7న లోక్‌సభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది.. ఆయన ఎంపీ సభ్యత్వాన్ని పునురుద్దరించడంతో ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాలకు రాహుల్ హాజరయ్యారు. చదవండి: ఇండియా పేరు మార్పుపై సోషల్ మీడియాలో రచ్చ.. బిగ్‌బీ, సెహ్వాగ్, మమతా ట్వీట్లు అసలేం జరిగిందంటే కర్ణాటకలో జరిగిన ఓ ఎన్నికల సభలో రాహుల్ మాట్లాడుతూ..‘దొంగలందరికీ మోదీ ఇంటి పేరే ఎందుకుంటుందని వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారించిన సూరత్ కోర్టు మార్చి 23న రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష విధించింది. ఫలితంగా ప్రాతినిధ్య చట్టం కింద మార్చి 24న లోక్‌సభలో అనర్హుడిగా ప్రకటించడంతో వయనాడ్ ఎంపీ పదవి కోల్పోయారు. సూరత్ కోర్టు విధించిన శిక్షపై రాహుల్ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో ఊరట దక్కపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తాను నిర్దోషినని. తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం ట్రయల్ కోర్టు తీర్పును నిలిపివేస్తున్నామని తెలిపింది -
శాంతి స్థాపనలో భారత్ ముఖ్యపాత్ర?
ఉక్రెయిన్–రష్యా యుద్ధం కారణంగా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. శాశ్వత కాల్పుల విరమణను, స్థిరమైన శాంతిని సాధించడానికి దీర్ఘకాలిక అంకితభావం, పట్టుదలతో పాటు అంతర్జాతీయ ఒత్తిడి అవసరం. ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణ ప్రభావిత ప్రాంతాలలో శాంతి భద్రతలను నిర్వహించడంలో భారత్ ముఖ్యమైన పాత్రను పోషించింది. పుతిన్‌తో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తోనూ భారత్ నాయకత్వం సన్నిహితంగా ఉండటంతో శాంతిని నెలకొల్పేందుకు భారత ప్రధాని మధ్యవర్తిత్వం వహించవచ్చని కొన్ని దేశాలు అభిప్రాయపడుతున్నాయి. సమస్యను పరిష్కరించడంలో అగ్రదేశాలు విఫలమవుతున్న నేపథ్యంలో భారత్ గురుతర బాధ్యత పోషించాల్సి ఉంది. మెజారిటీ దేశాల ఆర్థిక వ్యవస్థలను అధమ స్థాయికి చేర్చిన 15 నెలల రష్యా–ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది. ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా ఇంధనం, ఆహార మార్కెట్లకు భారీ షాక్ ఇచ్చింది. సరఫరాను తగ్గించి, నిత్యావసరాల ధరలను మునుపెన్నడూ లేని స్థాయికి పెంచింది. ఇతర ఆర్థిక ప్రాంతా లతో పోలిస్తే, ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర రేపే ఆర్థిక పరిణామా లకు యూరో ప్రాంతానికి ప్రత్యేకించి హాని కలుగుతుంది. అణ్వాయుధాలను ఆశ్రయించవచ్చని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ పదేపదే హెచ్చరించినప్పటికీ, అణుయుద్ధం జరిగే అవకాశాలు పెద్దగా లేవు. తనను బెదిరించినట్లయితే రష్యా ‘ప్రాదేశిక సమగ్రతను’ రక్షించడానికి ‘అందుబాటులో ఉన్న అన్ని ఆయుధ వ్యవస్థలను’ ఉపయోగిస్తానని పుతిన్ 2022 సెప్టెంబరు 21న తేల్చిచెప్పారు. భారత్ స్పందనేమిటి? భారతదేశం సాంప్రదాయకంగా అంతర్జాతీయ సంఘర్షణలలో అలీన విధానాన్ని, తటస్థ విధానాన్ని అనుసరిస్తోంది. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూ, సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పిలుపు నిచ్చింది. పుతిన్‌తో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సన్నిహితంగా ఉండటంతో శాంతి నెల కొల్పేందుకు ప్రధాని మోదీ మధ్యవర్తిత్వం వహించవచ్చని కొన్ని దేశాలు అభిప్రాయపడుతున్నాయి. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని భారత్ నిల కడగా సమర్థిస్తోంది. అయితే ఉక్రెయిన్‌లో ‘సమగ్రమైన, న్యాయమైన, శాశ్వత శాంతి’ ఆవశ్యకతను నొక్కిచెప్పే తీర్మానంపై ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఓటింగుకు మాత్రం భారత్ దూరంగా ఉండి పోయింది. 2015లో, క్రిమియాను రష్యా విలీనం చేసుకోవడాన్ని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ చేసిన తీర్మానానికి... ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదనే విధానాన్ని పేర్కొంటూ భారతదేశం దూరంగా ఉంది. అయితే దౌత్య మార్గాల ద్వారా వివా దానికి శాంతియుత పరిష్కారం కోసం భారతదేశం పిలుపునిచ్చింది. అలాగే మిన్స్క్ ఒప్పందం అమలు జరగాలని సూచించింది. భారత్ వైఖరిని ఉక్రెయిన్‌తో సహా కొన్ని దేశాలు విమర్శించాయి, రష్యా చర్యలపై న్యూఢిల్లీ మరింత బలమైన వైఖరిని తీసుకోవాలని ఉక్రెయిన్ వాదించింది. అంతర్జాతీయ శాంతి పరిరక్షక ప్రయత్నాలలో, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి మిషన్లలో పాల్గొనడం ద్వారా భారత దేశం నిర్మాణాత్మక పాత్ర పోషిస్తూ వస్తోంది. ఐరాస శాంతి పరిరక్షక కార్యకలాపాలకు దళాలను స్థిరంగా అందించిన సుదీర్ఘ చరిత్ర భార త్‌కు ఉంది. పైగా ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణ ప్రభావిత ప్రాంతాలలో శాంతి భద్రతలను నిర్వహించడంలో భారత్ ముఖ్య పాత్రను పోషించింది. విశ్వసనీయ దేశం దేశాల సఖ్యత విషయంలో భారతదేశం విశ్వసనీయతను పొందు తోంది. ఇండో–పసిఫిక్ ఫోరమ్ దేశాలు భారత టీకా దౌత్యం, అవస రమైన సమయంలో మానవతా సహాయం తర్వాత భారతదేశంతో సహకారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయి. ఆస్ట్రేలి యాతో ద్వైపాక్షిక సంబంధాలు కూడా గణనీయమైన పురోగతిని చూపుతున్నాయి. ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బ నీస్ మధ్య సమావేశాలు పరస్పర విశ్వాసంతో గౌరవంతో జరిగాయి. సంబంధాలను మెరుగుపరిచేందుకు తీవ్రంగా కృషి చేసిన తర్వాత, ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీల కోసం భారత్‌కు లిథియం సరఫరా చేసేందుకు ఆస్ట్రేలియా సిద్ధంగా ఉండటంతో ఇరుపక్షాల సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి. హిరోషిమాలో ఇటీవల జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్స్కీ రష్యాతో యుద్ధాన్ని ముగించే శాంతి ప్రణాళికను ప్రధాని మోదీకి అందించారు. దానికి భారతదేశం ఆమోదం కోరారు. ఉక్రెయిన్‌లో పర్యటించాల్సిందిగా మోదీని ఆహ్వానించారు కూడా. అధికారిక సోర్సుల ప్రకారం, అనేక దేశాలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత్ వైపు చూస్తున్నాయని భావించినందున, తన శాంతి ప్రతిపాదనకు మద్దతు కోరడం మినహా జెలెన్స్కీ భారతదేశంపై ఎటువంటి డిమాండ్ మోపలేదు. ఈ ప్రతి పాదనను మోదీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. శాంతి స్థాపన చర్యలు ఉక్రెయిన్ యుద్ధంలో కాల్పుల విరమణను అమలు చేయడం అనేది బహుళ పార్టీలతో, భౌగోళిక రాజకీయ పరిగణనలతో కూడిన సంక్లిష్ట సమస్య. కాల్పుల విరమణ కోసం తీసుకోవాల్సిన కొన్ని చర్యలు: ఉక్రెయిన్, రష్యా, తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద సమూహాలతో సహా వివాదాస్పద పక్షాల మధ్య చర్చలను సులభ తరం చేయడానికిగానూ దౌత్య ప్రయత్నాలను ప్రోత్సహించడం; సంభాషణను, శాంతి చర్చలను సులభతరం చేయడానికి ఐక్యరాజ్య సమితి లేదా ఐరోపాలో భద్రత, సహకార సంస్థ (ఓఎస్‌సీఈ) వంటి అంతర్జాతీయ మధ్యవర్తులు లేదా సంస్థలను నిమగ్నం చేయడం; విరుద్ధమైన పార్టీలు శత్రుత్వాలను విరమించుకోవడానికి తగిన దౌత్య పరమైన ఒత్తిడి తీసుకురావాలని యూఎస్, యూరోపియన్ యూని యన్, పొరుగుదేశాల వంటి అంతర్జాతీయ పాత్రధారులను కోరడం; కాల్పుల విరమణకు అనుగుణంగా ఆర్థిక ఆంక్షలు విధించడం; దౌత్య పరంగా ఒంటరయ్యేట్టు చూడటం; ఇంకా ఇతర రాజకీయ చర్యలను ఉపయోగించవచ్చు. ప్రమేయం ఉన్న పక్షాల మధ్య సంభాషణ, నమ్మ కాన్ని పెంపొందించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేలా పరస్పర విశ్వాసాన్ని పాదుగొలిపే చర్యలు తప్పనిసరి. ఇందులో ఖైదీల మార్పిడి, భారీ ఆయుధాల ఉపసంహరణ, నిర్దిష్ట స్థానికప్రాంతాల్లో కాల్పుల విరమణల అమలు వంటివి ఉంటాయి. అంతేకాకుండా, సంఘర్షణలో చిక్కుకున్న పౌరులకు వైద్య సామగ్రి, ఆహారం, ఆశ్రయంతో సహా ప్రభావిత ప్రాంతాల్లో మాన వతా సహాయానికి, తోడ్పాటుకు అనియంత్రిత ప్రాప్యతను ఏర్పరచా ల్సిన అవసరం ఉంది. జనాల బాధలను తగ్గించడానికి, సద్భావనను పెంపొందించడానికి రెండు వైపులా మానవతా సాయాన్ని అందించాలి. దీనితో పాటు కాల్పుల విరమణ అమలును పర్యవేక్షించడానికి, ధృవీకరించడానికి సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఇందులో అంతర్జాతీయ పరిశీలకులు, శాంతి పరిరక్షక దళాలకు ప్రమేయం ఉండాలి. ఈ సంస్థలు కాల్పుల విరమణ ఉల్లంఘనలను నివేదించడంలో సహాయపడతాయి. అలాగే అంగీకరించిన నిబంధ నలకు అనుగుణంగా ఉండేలా చూడటం ద్వారా పార్టీల మధ్య విశ్వా సాన్ని పెంపొందించవచ్చు. రాజకీయ, ఆర్థిక, జాతిపరమైన మనోవేద నలతో సహా సంఘర్షణ మూల కారణాలను పరిష్కరించడానికి రాజ కీయ సంభాషణలను, సయోధ్యను ప్రోత్సహించాలి. సంఘర్షణ– ప్రభావిత ప్రాంతాల ప్రతినిధులతో సహా మొత్తం వాటాదారులను నిమగ్నం చేయడం అనేది, అంతర్లీన సమస్యలను పరిష్కరించడంలో, స్థిరమైన శాంతి ఒప్పందం కోసం పని చేయడంలో సహాయపడుతుంది. ఈ పరిమాణంలో ఉన్న సంఘర్షణను పరిష్కరించడానికి అన్ని పార్టీల నిబద్ధత, సహకారం అవసరం. శాశ్వత కాల్పుల విరమణను, సుస్థిరమైన శాంతిని సాధించడానికి దీర్ఘకాలిక అంకితభావం, పట్టుదల, అంతర్జాతీయ ఒత్తిడి అవసరం. వ్యాసకర్త అంతర్జాతీయ వాణిజ్య విశ్లేషకులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఇరాన్, సౌదీ అరేబియా స్నేహగీతం
దుబాయ్: ప్రత్యర్థి దేశాలుగా ఇన్నాళ్లూ కత్తులు దూసుకున్న ఇరాన్, సౌదీ అరేబియా ఇప్పుడు స్నేహగీతం ఆలపిస్తున్నాయి. దౌత్యపరమైన సంబంధాలను పునరుద్ధరించుకొనేందుకు, రాయబార కార్యాలయాలను తెరిచేందుకు ఇరు దేశాలు శుక్రవారం అంగీకారానికొచ్చాయి. ఇరాన్, సౌదీ అరేబియా మధ్య ఏడేళ్ల క్రితం సంబంధాలు తెగిపోయాయి. చైనా చొరవతో మళ్లీ సంబంధాలు మెరుగుపడుతున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య సాయుధ ఘర్షణ తలెత్తే ప్రమాదం ఇక తప్పినట్లేనని పరిశీలకులు చెబుతున్నారు. గల్ఫ్‌లోని అరబ్ దేశాలు అగ్రరాజ్యం అమెరికా వైపు మొగ్గుచూపకుండా చైనా ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో భాగంగా ఇరాన్, సౌదీ అరేబియా నడుమ ఇటీవలే సయోధ్య కుదిర్చింది. ఇది చైనాకు దౌత్యపరంగా అతిపెద్ద విజయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాతో కుదిరిన ఒప్పందంపై ఇరాన్, సౌదీ అరేబియా ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. అయితే, దీనిపై చైనా మీడియా ఇంకా స్పందించలేదు. యెమెన్‌లో ఇరాన్, సౌదీ అరేబియా ఘర్షణలు కూడా çసమసేలా కనిపిస్తున్నాయి. -
రైల్వేలో పురాతన బావుల పునరుద్ధరణపై ప్రధాని ప్రశంస
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: సికింద్రాబాద్ మౌలాలీలోని జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (జడ్‌ఆర్‌టీఐ)లో ఉన్న 200 ఏళ్ల నాటి వారసత్వ బావిని పునరుద్ధరించడం పట్ల ప్రధాని నరేంద్రమోదీ సంతోషం వ్యక్తంచేశారు. నీటి సంరక్షణ, నీటి వనరుల పునరుద్ధరణ కోసం దక్షిణ మధ్య రైల్వే చేసిన కృషి అభినందనీయమని ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. ‘హరిత కార్యక్రమాలు ప్రోత్సహిస్తూ సికింద్రాబాద్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోని 200 ఏళ్లనాటి వారసత్వ బావి పునరుద్ధరించారు. నీటి సంరక్షణ సులభతరం చేయడానికి దాని చుట్టూ రెయిన్వాటర్ హార్వెస్టింగ్ పిట్లను నిర్మించారు’ అన్న రైల్వేశాఖ ట్వీట్‌పై ప్రధాని మోదీ స్పందించారు. దీనివల్ల నీటివనరులను కాపాడుకునేందుకు, సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. రూ.6 లక్షలతో దక్షిణ మధ్య రైల్వే ఈ బావి పునరుద్ధరణ ప్రాజెక్టును చేపట్టింది. దీనివల్ల రూ.5 లక్షల వరకు ఆదా అవుతుందని అంచనా. సుమారు 50 అడుగుల లోతు ఉన్న ఈ హెరిటేజ్ బావి రోజుకు 1 లక్ష లీటర్ల నీటిని అందజేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ వారసత్వ మెట్ల బావి 200 ఏళ్ల నాటిది. నిజాం కాలంనాటి ఈ బావికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. సర్ మీర్ తురాబ్ అలీఖాన్, సాలార్జంగ్–1 (1829–1883) దీన్ని మామిడి తోటలకు కావాల్సిన నీటికోసం నిర్మించారు. నీటిపారుదల సిబ్బంది నివాసం కోసం బావికి ఉత్తరం వైపు ప్రత్యేకంగా 10 గదులను నిర్మించారు. 1966లో ఈ బావి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చింది. -
శ్రీశైలం ‘హైడల్’ పునరుద్ధరణ !
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల కిందట ప్రమాదంలో కాలిపోయిన శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం పునరుద్ధరణ ఎట్టకేలకు సంపూర్ణమైంది. 4వ యూనిట్‌కు సైతం తాజాగా మరమ్మతులు పూర్తయ్యాయి. అయితే ఈ యూనిట్‌కి సంబంధించిన సర్జ్‌పూల్‌లో పడిపోయిన భారీ గేటు.. ఇంకా బయటకు తీయకపోవడంతో విద్యుదుత్పత్తి ప్రారంభించేందుకు అడ్డంకిగా మారింది. గేటును బయటకు తీసిన తర్వాతే 4వ యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తి ప్రారంభించేందుకు వీలుంది. మరమ్మతులకు రూ.60 కోట్లకు పైగా వ్యయమైందని జెన్కో అధికారవర్గాలు తెలిపాయి. ఎట్టకేలకు కేరళ నుంచి వచ్చిన ట్రాన్స్ఫార్మర్ ! 900(6 ్ఠ150) మెగావాట్ల శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ఒక్కొక్కటి 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మొత్తం 6 యూనిట్లుండగా, 2020 ఆగస్టు 20న జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో అన్ని యూ నిట్లు కాలిపోయాయి. అందులో పనిచేస్తున్న ఇంజనీర్లు, ఇతర సిబ్బందితో సహా మొత్తం 9 మంది ఈ ప్రమాదానికి బలయ్యారు. 1, 2 వ యూనిట్లకు అదే ఏడాది మరమ్మతులు జరిపి వినియోగంలో తీసుకురాగా..3, 5, 6వ యూనిట్లను తర్వాతి కా లంలో వినియోగంలోకి తెచ్చారు. నాలుగో యూని ట్కి సంబంధించిన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ పూర్తి గా కాలిపోగా, అప్పటికప్పుడు అలాంటి ట్రాన్స్ఫార్మర్ మార్కెట్లో ఎక్కడా దొరకని పరిస్థితి నెలకొంది. శ్రీశైలం విద్యుత్ కేంద్రం నిర్మాణం సమయంలో ..ట్రాన్స్ఫార్మర్స్ అండ్ ఎలక్ట్రికల్స్ కేరళ లిమిటెడ్ (టెల్క్) తయారు చేసిన 190 ఎంవీఏ సామర్థ్యం కలిగిన 3 లింబ్ జనరేటర్ ట్రాన్స్ఫార్మర్లను వినియోగించారు. నాటి ట్రాన్స్ఫార్మర్ల డిజైన్, నమూనాలను పంపించి అలాంటిదే కొత్త ట్రాన్స్ఫార్మర్ తయారీ కోసం టెల్క్కి జెన్కో ఆర్డర్ పెట్టింది. భారీగా ఆర్డర్లు పెండింగ్‌లో ఉండడంతో ట్రాన్స్ఫార్మర్ తయారీకి టెల్క్ రెండేళ్లకు పైగా సమయం తీసుకుంది. ఎట్టకేలకు ఇటీవల కేరళ నుంచి ట్రాన్స్ఫార్మర్ రావడంతో 4వ యూనిట్‌కు మరమ్మతులు సైతం పూర్తయినట్టు జెన్కో వర్గాలు తెలిపాయి. కొలిక్కి రాని విచారణలు శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగి రెండున్నరేళ్లు గడుస్తున్నా సీఐడీ విచారణ ఇంకా కొలిక్కి రాలేదు. దక్షిణ డిస్కం సీఎండీ నేతృత్వంలోని టెక్నికల్ కమిటీ సైతం విచారణ నివేదికను సమర్పించలేదని సమాచారం. ఓ వైపు విద్యుదుత్పత్తి కొనసాగిస్తూ.. మరో వైపు విద్యుదుత్పత్తిని నియంత్రించే ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టంలోని ప్యానెల్ బోర్డులో బ్యాటరీలను మార్చే పనులను సమాంతరంగా చేపట్టడంతోనే షార్ట్ సర్యు్కట్ సంభవించి ఈ ఘోర ప్రమాదం జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ప్రమాదం జరిగిన వెంటనే విద్యుదుత్పత్తిని నిలుపుదల చేసి ఉంటే ప్యానెల్‌బోర్డు వద్దే మంటలను నియంత్రించే అవకాశం ఉండేదని నిపుణులు అంటున్నారు. అవగాహన లేక ఇంజనీర్లు, సిబ్బంది అగ్నిమాపక పరికరంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఉత్పత్తి నిలుపుదల చేసినా, గ్రిడ్ నుంచి సమీపంలోని సబ్‌స్టేషన్ ద్వారా శ్రీశైలం విద్యుత్ కేంద్రానికి రివర్స్ విద్యుత్ సరఫరా జరిగింది. మంటలు ప్యానెల్ బోర్డు నుంచి సమీపంలోని జనరేటర్ ట్రాన్స్ఫార్మర్కు వ్యాపించాయి. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ కాలిపోవడంతో సొరంగం తరహాలో ఉండే విద్యుత్ కేంద్రం అంతటా వేగంగా బూడిదతో కూడిన పొగ వ్యాపించింది. దీంతో సిబ్బంది ఊపిరాడక మృత్యువాతపడ్డారు. ప్రమాదం జరిగిన 15 నిమిషాల్లోగా ఉత్పత్తి నిలుపుదల చేసి, బయటి సబ్ స్టేషన్ నుంచి రివర్స్ సప్లై లేకుండా చేస్తే ప్రాణ, ఆస్తి నష్టం జరిగేది కాదని జెన్కో సీనియర్ ఇంజనీర్లు పేర్కొంటున్నారు. గేటు తీయాలంటే భయం ! శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం 4వ యూనిట్ సర్జ్‌పూల్ బయటి మార్గం నుంచి 75 మీటర్లు లోపలికి వెళ్లి నీళ్లలో మునిగి ఉన్న భారీ గేటును బయటికి తీసే సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో ఈ పని చేసేందుకు ఎవరూ సాహసించడం లేదని జెన్కో వర్గాలు తెలిపాయి. ప్రమాదకర రీతిలో కాకుండా సురక్షితమైన పద్ధతిలో ఈ గేటును బయటకు తీయాలనే ఆలోచనతో ఈ పనిని పెండింగ్‌లో పెట్టారు. జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసిన తర్వాత 4 యూనిట్ ప్రధాన మార్గం నుంచే ఈ గేటును బయటకు తీయాలని జెన్కో ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
Donald Trump: ట్రంప్ ఈజ్ బ్యాక్.. రెండేళ్ల తర్వాత..!
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం ఖాతాలను రెండేళ్ల తర్వాత పునరుద్ధరించింది మెటా. ఆయన వల్ల ఎలాంటి ముప్పు లేదని నిర్ధరించుకున్న తర్వాత ఈమేరకు నిర్ణయం తీసుకుంది. డొనాల్డ్ ట్రంప్ చివరిసారిగా 2021 జనవరి 6న సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించారు. క్యాపిటల్ హిల్స్ భవనంలో హింస చెలరేగేలా తన ఫాలోవర్లను ప్రేరేపించినందుకు మెటా ఆయన ఖాతాలను నిరవధికంగా బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఖాతాలను తిరిగి పునరుద్ధరిస్తామని ఈ ఏడాది జనవరిలోనే మెటా ప్రకటించింది. ట్రంప్‌కు ఇన్‌స్టాగ్రాంలో 23 మంది మిలియన్ల ఫాలోవర్లు, ఫేస్బుక్లో 34 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండేవారు. ఎన్నికల సమయంలో ప్రచారానికి కూడా సామాజిక మాధ్యమాల వేదికగానే ఆయన భారీగా ఫండ్స్ సమకూర్చుకున్నారు. వచ్చే ఏడాది అంటే 2024లో మళ్లీ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం ఖాతాలను పునరుద్ధరించడం ఊరటినిచ్చే అంశమే. అయితే ఖాతాలు పునురుద్ధరించిన తర్వాత ట్రంప్ ఇంకా ఒక్క పోస్టు కూడా పెట్టలేదు. తన సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం విధించిన తర్వాత ట్రంప్ తన సొంత సంస్థల ద్వారా 'ట్రుత్ సోషల్' అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫాంను ప్రారంభించారు. ఇతర సామాజిక మాధ్యమాలు తనకు అవసరం లేదని చెప్పారు. దీంతో గతేడాది నవంబర్లోనే ట్విట్టర్ తన ఖాతాను పునరుద్ధరించినప్పటికీ అందులో యాక్టివ్‌గా ఉండటం లేదు. మరి ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం ఖాతాలనైనా తిరిగి వినియోగిస్తారో లేదో చూడాలి. చదవండి: కిమ్ సైన్యంలో 'జాంబీలు'.. ఫొటో వైరల్..! -
600 ఏళ్ల మెట్లబావికి మహర్దశ
ఆదరణ కోల్పోతున్న వారసత్వ సంపదకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మెట్ల బావులు, కోటలు ఇతర చారిత్రక ప్రదేశాలను పునరుద్ధరిస్తోంది. ఇదే క్రమంలో భువనగిరి జిల్లా రాయగిరి పరిధిలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న 600 ఏళ్ల నాటి మెట్ల బావిని పునరుద్ధరించే సమమయం అసన్నమైందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సైతం షేర్ చేశారు. మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ జిల్లాలో వైరల్‌గా మారడంతో రాయగిరి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ సమేలా సత్పతి రాయగిరిలోని మెట్ల బావిని సందర్శించి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. స్థానికులతో పాటు యాదాద్రి క్షేత్రానికి వచ్చిన భక్తులు పురాతన మెట్ల బావిని సందర్శించేలా పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. తాజాగా కేటీఆర్ చేసిన ట్వీట్ మెట్లబావి పునరుద్ధరణపై ఆశలు రేకిత్తిస్తోంది. -
పరిశ్రమలకు ఊరట.. ఏపీఈఆర్సీ కీలక ఆదేశాలు..
సాక్షి, అమరావతి: పరిశ్రమల నిర్వాహకులకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఊరట కలిగించింది. రాష్ట్రంలో నిర్వహణ భారమై మూతపడ్డ పరిశ్రమలకు విద్యుత్ సర్వీసును తిరిగి ఇచ్చేందుకు కనిష్ట చార్జీలను వసూలు చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను ఏపీఈఆర్సీ ఆదేశించింది. ఈ నిబంధన వచ్చే మార్చి 31 వరకు అమలులో ఉంటుందంది. ఖాయిలా పడ్డ పరిశ్రమలకు విద్యుత్ పునరుద్ధరణ విధానం అమలుపై మూడు నెలలకోసారి సమాచారం ఇవ్వాలని నిర్దేశించింది. చదవండి: AP: ‘అంగన్వాడీ’ల ఆధునికీకరణ ఓ పరిశ్రమ విద్యుత్ బిల్లులు చెల్లించకుండా కొంతకాలం నడిచి, మూతపడితే మూడు నెలల పాటు కనీస చార్జీల రూపంలో బిల్లు జారీ అవుతుంది. తరువాత ఆ బిల్లూ నిలిపేస్తారు. కొన్నేళ్ల తరువాత పరిస్థితులు చక్కబడి పరిశ్రమను తిరిగి తెరవాలనుకున్నప్పుడు విద్యుత్ సర్వీసును పునరుద్ధరించాల్సి ఉంటుంది. అప్పుడు మూతపడ్డ రోజులన్నిటికీ కనీస చార్జీలు వసూలు చేయాల్సి ఉన్నా అలా చేయరు. తొలి మూడునెలలకు మాత్రమే కట్టించుకుని మళ్లీ సర్వీసును ఇచ్చేస్తారు. అయితే పరిశ్రమ మూతపడే సమయానికి ఉన్న విద్యుత్ బిల్లు బకాయిలను మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. కోవిడ్ 19 కారణంగా దెబ్బతిన్న పరిశ్రమలు వైరస్ ప్రభావం తగ్గడంతో మళ్లీ తెరుచుకుంటున్నాయి. అటువంటి పరిశ్రమలకు ఏపీఈఆర్సీ ద్వారా డిస్కంలు అందిస్తున్న ఈ వెసులుబాటు ప్రయోజనం కలిగించనుంది. -
ప్యాసింజర్ రైళ్ల పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: పలు మార్గాల్లో ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్–రేపల్లె–సికింద్రాబాద్ రైలు (17645/17646)ఈ నెల 27 నుంచి రాకపోకలు సాగించనుంది. ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం 7.45కు రేపల్లెకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 7.50 గంటలకు రేపల్లె నుంచి బయలుదేరి సాయంత్రం 4.55 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. కాచిగూడ–నిజామాబాద్ రైలు (07594/07595)ఈ నెల 29 నుంచి రాకపోకలు సాగించనుంది. సాయంత్రం 6.50 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి రాత్రి 11.50కి నిజామాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 5.05 గంటలకు బయలుదేరి ఉదయం 9.40గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. రాయచూర్–గద్వాల్ (07496/07495) ఈ నెల 27నుంచి అందుబాటులోకి రానుంది. మధ్యాహ్నం 1.10 కి బయలుదేరి 2.30 కు గద్వాల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.20 కి రాయచూర్ చేరుకుంటుంది. -
బన్సీలాల్‌పేట్ కోనేరు బావిపై మోదీ ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్/బన్సీలాల్‌పేట: సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట్‌లోని పురాతన బావి పునరుద్ధరణపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. నిజాం కాలం నాటి ఈ బావికి పూర్వవైభవాన్ని తెచ్చారని ఆయన కొనియాడారు. నీటిసంరక్షణ, భూగర్భ జలాలను కాపాడుకొనేందుకు స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు చేస్తున్న కృషిని ప్రధాని అభినందించారు. ఆదివారం మన్ కీ బాత్‌లో బన్సీలాల్‌పేట్‌లోని బావి గురించి ఆయన ప్రస్తావించారు. చెత్తా చెదారం, మట్టితో నిండిన ఈ బావిని వాననీటి సంరక్షణ కేంద్రంగా అభివృద్ధి చేయడం సంతోషదాయకమన్నారు. ఇవీ ప్రత్యేకతలు.. ► సుమారు 1830 కాలానికి చెందిన బన్సీలాల్‌పేట్ బావి అద్భుతమైన శిల్పకళా సంపదను కలిగి ఉంది. బావి ప్రవేశ ద్వారం ఆర్చ్‌లాగా ఉంటుంది. చుట్టూ ఏర్పాటు చేసిన రాతి కట్టడం, సింహాలు, పాములు, గుర్రాల బొమ్మలు అలనాటి కళాత్మకతను సమున్నతంగా ఆవిష్కరిస్తాయి. 35 మీటర్ల వెడల్పు 53 అడుగుల లోతు ఉన్న ఈ బావి చాలా కాలం వరకు ఉనికిని చాటుకుంది. ► 40 ఏళ్ల క్రితం దీనిని పూర్తిగా మూసివేశారు. మట్టి, చెత్తా చెదారంతో నిండిపోయింది. వాహనాలకు పార్కింగ్ అడ్డాగా మారింది. వాననీటి సంరక్షణ కోసం ఉద్యమాన్ని చేపట్టిన ‘ది రెయిన్ వాటర్ ప్రాజెక్టు’ సంస్థ జీహెచ్ఎంసీ సహకారంతో బావి పునరుద్ధరణకు నడుం కట్టింది. చెత్తా చెదారం తొలగించారు. సుమారు 2 వేల టన్నుల మట్టిని సైతం తొలగించి బావికి పూర్వ ఆకృతిని తెచ్చారు. ప్రస్తుతం ఈ బావి నీటితో తళతళలాడుతోంది. ► దీని చుట్టూ ఏర్పాటు చేసిన రాతి కట్టడాలు, కళాకృతులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి ఆగస్టు నాటికి ఈ ప్రాంగణాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్లు ‘ది రెయిన్ వాటర్ ప్రాజెక్టు’ వ్యవస్థాపకులు కల్పన రమేష్ లోకనాథన్ తెలిపారు. ఇప్పటి వరకు పూడికతీత కోసం రూ.30 లక్షల వరకు ఖర్చు చేశారు. అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో బావిని కళాత్మకంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. (క్లిక్: నల్సార్ సాహసోపేతమైన నిర్ణయం) పాతబావులకు పూర్వవైభవం... ఇప్పటి వరకు నగరంలో గచ్చిబౌలి, కొండాపూర్, నార్సింగి. కోకాపేట్, బన్సీలాల్‌పేట్ బావులను పునరుద్ధరించారు. బాపూఘాట్ బావి పునరుద్ధరణకు ప్రణాళికలను సిద్ధం చేశారు. నిజాం కాలం నాటి సిటీ కాలేజీ చుట్టూ ఒకప్పుడు 87 బావులు ఉండేవని వాటిలో చాలా వరకు శిథిలమయ్యాయని కల్పన తెలిపారు. ఆ ప్రాంతంలో ఉన్న రెండు బావులను మాత్రం పునరుద్ధరించేందుకు అవకాశం ఉంది. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందితో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ బావికి పూర్వవైభవంపై ప్రధాని అభినందించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. (క్లిక్: హైదరాబాద్‌లో ఈ ఏరియాలో అద్దె ఇళ్లకు ఫుల్ డిమాండ్) -
పునర్నిర్మాణంతో పునరుజ్జీవం!
సాక్షి, హైదరాబాద్: దేవునిగుట్ట ఆలయం.. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఆంగ్‌కోర్‌వాట్ (ఆంకోర్‌వాట్) కంటే ముందు ఆ తరహా నిర్మాణ శైలితో రూపుదిద్దుకున్న దేవాలయం. ఇసుక రాతి బిల్లలపై ముందుగానే దేవతామూర్తుల భాగాలను చెక్కి పూర్తిరూపం వచ్చేలా క్రమపద్ధతిలో పేర్చిన గొప్ప నిర్మాణం. ఈ తరహా నిర్మాణం దేశంలో ఇదొక్కటే అనే అభిప్రాయం ఉంది. దాదాపు 1,500 ఏళ్ల క్రితం నిర్మితమైనట్లు భావిస్తున్న ఈ ఆలయం ఎప్పు డు కూలుతుందో తెలియని పరిస్థితి. ఇంతకాలం తర్వాత దీని పునరుద్ధరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఆలయాన్ని పూర్తిగా విప్పదీసి తిరిగి నిర్మించబోతున్నారు. త్వరలో టెండర్లు పిలిచి ఏడాదిలో పునర్నిర్మాణాన్ని పూర్తి చేయా లని లక్ష్యంగా పెట్టుకున్నారు. ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణాదిత్య చొరవతో కాకతీయ హెరిటేజ్ ట్రస్టు ఆధ్వర్యంలో, తెలంగాణ వారసత్వ శాఖ పర్యవేక్షణలో పనులు జరగనున్నాయి. జిల్లా కేంద్రం నుంచి 20 కి.మీ. దూరంలోని కొత్తూరు గ్రామ శివారులోని దట్టమైన అడవిలో దేవునిగుట్టపై ఈ ఆలయం ఉంది. ఆరో శతాబ్దంలో వాకాట రాజు హరిసేన హయాంలో మందిరాన్ని నిర్మించి ఉంటారని అంచనా. పద్మపాణిగా భావిస్తున్న శిల్పం ఏం చేస్తారు? దేవునిగుట్ట ఆలయం దాదాపు 24 అడుగుల ఎత్తుంది. దేవతామూర్తుల ఆకృతులను ఒకే రాయిపై కాకుండా, చిన్నచిన్న రాళ్లపై చెక్కి, వాటిని క్రమపద్ధతిలో పేర్చటం ద్వారా మూర్తు లకు పూర్తి రూపమిచ్చారు. ముందుగా ఈ రాళ్లపై నంబర్లు రాసి విప్పదీస్తారు. నిర్మాణాన్ని పూర్తిగా విప్పిన తర్వాత పునాదిని పరిశీలిస్తారు. ఇప్పటివరకు ఉన్న ఆలోచన ప్రకారం.. డంగు సున్నంతో పునాదిని నిర్మిస్తారు. దానిమీద, నంబర్ల ప్రకారం రాళ్లను పేర్చి పాత రూపమిస్తారు. రాయిరాయికి మధ్య డంగుసున్నం, కరక్కాయ, నల్లబెల్లం, రాతిపొడి తదితర మిశ్రమంతో బైండింగ్ పొర ఏర్పాటు చేస్తారు. ఇలా పిరమిడ్ తరహాలో పైకి పేర్చుకుంటూ వెళ్తారు. పైభాగంలో ప్రస్తుతం పెద్ద రంధ్రం ఉంది. అం దులోంచి వాననీరు లోనికి చేరుతోంది. కొత్త నిర్మాణంలో ఇలాంటి లోపాలను సరిదిద్దుతా రు. రాళ్లు మళ్లీ కదిలిపోకుండా స్టెయిన్లెస్ స్టీల్ పట్టీలను బిగించే యోచనలో ఉన్నారు. రూ.2 కోట్లతోనే పనులు.. ములుగు జిల్లా కలెక్టర్ అందజేసిన రూ.1.8 కోట్ల నిధులకు కాస్త జోడించి రూ.2 కోట్లలోనే పనులు పూర్తయ్యేలా చూడాలని భావిస్తున్నారు. ఈ మేరకే టెండర్లు పిలువబోతున్నారు. కాకతీయ నిర్మాణాల పునరుద్ధరణ పనుల్లో అనుభవం ఉన్న కాంట్రాక్టర్లకే అవకాశం ఇవ్వనున్నారు. 6 నెలల నుంచి ఏడాదిలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్రేన్ లేకుండా.. ఈ ఆలయం గుట్టపైన ఉంది. రోడ్డు మార్గం లేకపోవడంతో క్రేన్‌ను పైభాగానికి తరలించే వీలు లేదు. క్రేన్ లేకుండా గొలుసులు ఏర్పాటు చేసి వాటితో రాళ్లను ఎత్తే ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆలయానికి వినియోగించిన రాళ్లు కదిలాయే తప్ప, విరగలేదని గుర్తించారు. ఇటీవల డాక్యుమెంటేషన్ చేసే క్రమంలో త్రీడీ పరిజ్ఞానాన్ని వినియోగించి లేజర్ చిత్రాలు తీసి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎక్కడెక్కడ పగుళ్లున్నాయి.. బేస్మెట్ ఎలా ఉంది.. తదితర వివరాలు గుర్తించారు. ప్రత్యేకంగా కొత్తగా రాళ్లను చెక్కాల్సిన అవసరం లేదని గుర్తించారు. -
వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్బుక్ సేవలు పునరుద్ధరణ
వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7 గంటల పాటు స్తంభించిన వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు పునరుద్ధరణ అయ్యాయి. మంగళవారం తెల్లవారు జామున 4 గంటల తర్వాత ఈ సేవలు పునరుద్ధరించారు. సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలకు భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో సోమవారం అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల ప్రాంతంలో భారత్ సహా వివిధ దేశాల్లో వీటి సేవలు స్తంభించాయి. ఫేస్బుక్ సంస్థకు చెందిన ఈ సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌లు వెళ్లకపోవడం, రాకపోవడం, కొత్త పోస్టులు కనబడకపోవడంతో నెటిజన్లు ఇతర వేదికల్లో ఈ సమాచారాన్ని పంచుకున్నారు. సాంకేతిక కారణాలతో సేవలు నిలిచిపోయినట్లు ఫేస్బుక్ తన వెబ్సైట్లో స్పందించింది. సేవలు నిలిచిపోవడంతో కొన్ని గంటల పాటు యూజర్లు ఇబ్బందులు పడ్డారు. -
Kalpana Ramesh: జల కల్పనకు ఊతం!
‘‘75వ స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకొని బన్సిలాల్‌పేట్ మెట్లబావిని పునరుద్ధరించేందుకు 75 మందికి పైగా స్థానిక జనం పాల్గొనడం చాలా సంతోషంగా అనిపించింది’’ అంటూ ఆకాశం నుంచి రాలే ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టేందుకు కృషి చేస్తున్న కల్పనా రమేష్ ఆనందంగా వివరించారు. హైదరాబాద్‌లో పాడుబడిన బావులను పునరుద్ధరిస్తూ, చెరువులు–కుంటలను సంరక్షిస్తూ, వాన నీటితో భూగర్భజలాలను పెంచడానికి కృషి చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒంగోలులో పుట్టి పెరిగిన కల్పన వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్. ఇంటీరియర్ ఆర్కిటెక్ట్ స్టూడియో కూడా నిర్విహిస్తున్న కల్పనా రమేష్ నీటి వైపుగా వేసిన అడుగుల గురించి వివరించారు. ‘‘ఐదేళ్ల క్రితం కుటుంబంతో అమెరికా నుండి భారత్‌కు వచ్చాను. హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు చుట్టూ పచ్చదనం కావాలనుకున్నాను. కానీ, అప్పటికి ట్యాంకర్లతోనే నీటిని తెప్పించుకునే పరిస్థితి. ఆ నీళ్లలో హానికారకాలున్నాయని గుర్తించాను. ఈ పరిస్థితి ని ఎలాగైనా మార్చాలనుకున్నాను. మా డాబా మీద వర్షపు నీటిని నిల్వ ఉంచేలా జాగ్రత్తలు తీసుకున్నాను. వాడిన నీళ్లు వృథాపోకుండా రీఛార్జ్, రీయూజ్, రీసైకిల్ పద్ధతిని అనుసరించాను. ఏడాదిలోనే మా ఇల్లు, మా ఇంటి చుట్టుపక్కల వాతావరణం చల్లదనం, పచ్చదనం తో ఆహ్లాదకరంగా మారిపోయింది. బడి పిల్లలకు అవగాహన తరగతులు ఎప్పుడైతే ఈ ఆనందం మేం చవి చూస్తున్నామో, నాటి నుంచి మా కాలనీవాసులూ ఇదే పద్ధతిని అనుసరించారు. దీంతో సమాజానికి నా వంతు సాయం చేయాలని, వాటర్ రీసైక్లింగ్ పై జనాల్లో అవగాహన పెంచుతూ వస్తున్నాను. ఇందుకు స్కూళ్లు, కాలేజీల్లోనూ దాదాపు 70 వేల మంది పిల్లలకు అవగాహన క్లాసులు తీసుకున్నాను. పాఠశాలల నుంచి పిల్లలే స్వచ్ఛందంగా ఈ నీటి యజ్ఞంలో పాల్గొనేలా చేశాను. చెరువుల సంరక్షణ నగరంలో రియల్ ఎస్టేట్ కారణంగా వందల చెరువులు కాంక్రీట్ వనంలో కలిసిపోయాయి. ఇంకొన్ని ఇరుకైపోయాయి. కొన్ని మురుగు కు కేంద్రాలయ్యాయి. గోపీనగర్ చెరువు ఇందుకు ఉదాహరణ. దీనికోసం స్త్రీలనే బృందాలుగా ఏర్పాటు చేయడంతో, వారంతా చెరువు చెత్తను ఆటోల్లో డంప్‌యార్డ్ కు తరలించడం మొదలుపెట్టారు. పది రోజుల్లోనే ఆ చెరువును పరిశుభ్రంగా మార్చేశారు. పాత బావులను తిరిగి వాడుకునేలా.. గచ్చిబౌలిలో మసీద్ వద్ద ఉన్న పాత బావి కొన్నేళ్లుగా చెత్తకు డంప్‌యార్డ్‌గా మారింది. పూర్తిగా చెత్త తొలగించి, ఆ చుట్టుపక్కల ఇళ్ల రూఫ్ నుంచి వర్షపు నీళ్లు బావిలో పడేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పుడు మసీదుకు వచ్చేవారు కూడా బావి నీళ్లు వాడుతున్నామని చెబుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇలాగే.. కోకాపేట్, కొండాపూర్, గచ్చిబౌలి, బన్సీలాల్‌పేట్.. ప్రాంతాల్లోని ప్రాచీన బావులను వాడుకలోకి తీసుకొచ్చే ప్రయత్నాలను చేశాం. ఇంకుడు గుంతలు, పాత బావులు... ఇతరత్రా విధానాల ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకుంటే నీటి ఎద్దడి రాదు. అంతా ప్రభుత్వమే చేయాలనుకోకుండా ఎవరికి వారు ఈ పనులు చేపడితే ఎంతో మంచిది. ప్రతి ఒక్కరూ ఒక వాటర్ వారియర్ ప్రజల్లో ఉండే నిర్లక్ష్యం ఎలా ఉంటుందో, దానిని ఎలా దూరం చేయాలో ఒక ఉదాహరణ కుడికుంట చెరువు. ఆ చెరువును బాగు చేయడానికి ముందు స్థానికులతో చర్చించాను. ప్రతి ఒక్కరూ ఒక వాటర్ వారియర్ కావాలని కోరాను. అందరం కలిసి చెరువు నుంచి వంద టన్నులకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాం. చెరువులను, బావులను శుభ్రం చేయాలనుకున్నప్పుడు దీని వల్ల నాకేదో ప్రయోజనం ఉందన్నారు కొందరు. అపుడు బాధేసింది. కానీ నా భర్త రమేష్ ఇచ్చిన సలహాలు, మద్దతు నన్ను బలవంతురాలిని చేశాయి. అలా ‘లివ్ ది లేక్స్ ఇనిషియేటివ్’ను ప్రారంభించా. నీరు మనిషి ప్రాథమిక హక్కు. నీటి నిల్వపై అవగాహనతో పాటు అపార్ట్మెంట్స్, ఆఫీసులకు అండగా నిలుస్తున్నా. పాడైన బోర్లను బాగు చేసేందుకు 10కె బోర్స్ కార్యక్రమాన్ని చేపట్టా. ఇంటి ఆవరణలోనే రీ చార్జ్ పిట్లు ఏర్పాటు చేస్తున్నాను. జీహెచ్ఎంసీ, కొన్ని ఎన్జీవోలతో కలిసి పనిచేస్తున్నాను. నగరంలోని చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన సిటీ లేక్ యాక్షన్ కమిటీ టు కన్సర్వ్ లేక్స్’లో ఉన్నాను’ అని వివరించారు ఈ వాటర్ వారియర్. కల్పన జల సంరక్షణ మంత్రం ‘రీసైకిల్, రీఛార్జ్, రీయూజ్.’ చెప్పడమే కాదు ఆచరణలో చేసి చూపుతున్నారు. మొదటి అడుగు ఒంటరిదే అయినా సంకల్పం బలంగా ఉంటే వేల అడుగులు జతకలుస్తాయి అంటున్న కల్పనారమేష్ అందుకు అసలైన ఉదాహరణ. ఇది వర్షాకాలం. నీటి నిల్వలు పెంచుకోవడానికి సరైన కాలం అంటున్నారు కల్పన. -
లాక్డౌన్ దశలవారీగా సడలింపు!
ముంబై/న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్లో శనివారంతో సగం రోజులు పూర్తయ్యాయి. 21 రోజులు పూర్తయ్యాక లాక్డౌన్ ఉంటుందా లేదా అనే దానిపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఏప్రిల్ 15వ తేదీ తర్వాత లాక్‌డౌన్‌ను దశల వారీగా సడలిస్తామని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రైలు, విమానయాన సంస్థలు సంకేతాలిస్తున్నాయి. దేశంలో రైల్వే సర్వీసుల పునరుద్ధరణపై ఇప్పటికైతే తుది నిర్ణయం తీసుకోలేదని, కొన్ని రోజుల తర్వాత తీసుకునే అవకాశముందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఏప్రిల్ 14న లాక్డౌన్ ఎత్తివేస్తే రైళ్లను నడిపేందుకు రైల్వే జోనల్ ఆఫీస్‌లు సిద్ధమవుతున్న వేళ ఈ ప్రకటన వచ్చింది. ‘రైల్వే బోర్డు ఒక్కో రైలుకు నిర్దిష్టంగా అనుమతి ఇచ్చాకే సర్వీసుల్ని నడుపుతాం. దశలవారీగా రైల్వే సర్వీసులను ఎలా పునరుద్ధరించాలన్న అంశంపై రైల్వే బోర్డుకు సూచనలిచ్చాం’ అని అధికారులు తెలిపారు. లాక్డౌన్ పర్యవేక్షణకు ఏర్పాటైన మంత్రుల బృందం ఓకే చెప్పాకే రైల్వే సర్వీసుల పునరుద్ధరణ ఉంటుందన్నారు. దేశంలోని 17 రైల్వేజోన్లలో అందుబాటులో ఉన్న బోగీల ఆధారంగా ఎలాంటి సర్వీసుల్ని ముందుగా పునరుద్ధరించాలన్న అంశంపై సమాలోచనలు జరుగుతున్నాయి. ఒకవేళ సర్వీసులను పునరుద్ధరించినా ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. తమ విమానాల బుకింగ్‌లు ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఎయిర్ ఆసియా ఇండియా సంస్థ ప్రకటించింది. అయితే, డీజీసీఏ మార్గదర్శకాలను బట్టి ఇందులో మార్పులు ఉండవచ్చని పేర్కొంది. ఏప్రిల్ 15 నుంచి తమ కార్యకలాపాలను పున:ప్రారంభిస్తామని పలు విమానయాన సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. దేశీయ విమాన సర్వీసులకు గాను ఏప్రిల్ 15 నుంచి బుకింగ్‌లకు శ్రీకారం చుట్టనున్నట్లు ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్ సంస్థలు వెల్లడించాయి. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణానికి మే 1 నుంచి టిక్కెట్లు విక్రయిస్తామని స్పైస్‌జెట్, గోఎయిర్ స్పష్టం చేశాయి. ప్రజలు సహకరించే విధానాన్ని బట్టి లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. లాక్డౌన్ ముగిశాక ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలన్న దానిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన అధికారులతో చర్చించారు.