చేనేత హెల్త్ కార్డులు పునరుద్ధరించండి | Renewal of Weaver health cards | Sakshi
Sakshi News home page

చేనేత హెల్త్ కార్డులు పునరుద్ధరించండి

Published Wed, Nov 19 2014 3:53 AM | Last Updated on Sat, Aug 18 2018 4:18 PM

Renewal of Weaver health cards

కట్టా హేమసుందరరావు
పెడన : చేనేత హెల్త్ కార్డులను పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  కట్టా హేమ సుందరరావు డిమాండ్ చే శారు. మంగళవారం ఆయన పెడనలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2012 ఆగ ష్టు15వ తేదీన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్  రాష్ట్రీయ స్వస్థత బీమా యోజన  పథకం ద్వారా చేనేత కార్మికులకు ఏడాదికి రూ. 37,500 వరకు వైద్యం చేయించుకునేందుకు అవకాశం కల్పించారని చెప్పారు.  

2012లో హెల్త్ కార్డు ప్రిమీయం కట్టి హెల్త్ కార్డు తీసుకున్న కార్మికులకు 2014 సెప్టెంబర్ మాసం వరకు అవకాశం కల్పించారని తెలిపారు. అయితే గత రెండు నెలల నుంచి చేనేత కార్మికులకు హెల్త్ కార్డు లేనందున వైద్య సేవలుఅందక మంచాన పడతున్నారని, దీనినిపై  రెండు నెలల క్రితమే రాష్ట్ర చేనేత మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకుని వెళ్లామన్నారు. మంత్రి కొల్లు రవీంధ్ర స్పందించి చేనేత హెల్త్ కార్డులను పునరుద్ధరించాలని ఆయన కోరారు.  కొసనం పానకాలరావు, బళ్లా మల్లిఖార్జునరావు, కుర్మా కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement