మహబూబాబాద్, సాక్షి: తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలోని ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలోని పెద్ద మోరీ వద్ద వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పూర్తి అయింది. ఈ పట్టాల పునరుద్ధరణ నిర్మాణ మరమ్మతు పనులను రైల్వే శాఖ అధికారులు యుద్ద ప్రాతిపదికన కేవలం 36 గంటల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించారు.
తాజాగా నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో రైల్వే అధికారులు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా ట్రాక్ కొట్టుకుపోవటంతో వందలాది రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. కొన్ని రైళ్లను దారిమళ్లించి విషయం తెలిసిందే. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పూర్తి కావటంతో రేపటి(బుధవారం) నుంచి యాధావిధిగా రైళ్ల రాకపోకలు కొసాగుతాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment